
సౌత్ ఇండస్ట్రీలో సూర్య, జ్యోతిక దంపతులకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో తమదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ముంబైలో ఉంటున్న జ్యోతిక ఇటీవలే బాలీవుడ్ మూవీ సైతాన్‌లో నటించింది. ఇటీవలే థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అజయ్ దేవగణ్ హీరోగా నటించిన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం సైతాన్ సక్సెస్ ఎంజాయ్ చేస్తోన్న జ్యోతిక తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ఈ సందర్భంగా తన భర్త సూర్యపై ప్రశంసలు కురిపించింది.
సూర్య మహిళా పాత్రలకు ప్రాధాన్యం ఉండే స్క్రిప్టులను ఎక్కువగా ఎంపిక చేసుకుంటారని తెలిపింది. ఆ విషయంలో తాను గర్వపడతానని అన్నారు. ఆయన సినిమాల్లో మహిళలను కించపరిచేలా పాత్రలు ఉండవని.. వారి క్యారెక్టర్ మరింత ఉన్నతంగా ఉండేలా చూసుకుంటారని వెల్లడించింది. స్టోరీ డిమాండ్ చేస్తే తన పాత్ర కన్నా.. ఆమె రోల్‌కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్నా పట్టించుకోరని.. అందుకు జై భీమ్ చిత్రమే సాక్ష్యమని పేర్కొన్నారు.
కాగా.. సైతాన్ మూవీతో జ్యోతిక దాదాపు రెండు దశాబ్దాల తర్వాత బాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాకు వికాస్ భల్ దర్శకత్వం వహించారు. మరోవైపు సూర్య ప్రస్తుతం కంగువా సినిమాతో బిజీగా ఉన్నారు. శివ దర్శకుడిగా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో దిశా పటానీ హీరోయిన్‌గా నటించింది. ఇటీవలే టీజర్ రిలీజ్ కాగా.. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment