దసరా రేస్‌లో నిలిచిన భారీ బడ్జెట్‌ చిత్రం.. రిలీజ్‌ ఎప్పుడంటే? Kollywood Star Suriya latest Movie Release on This Date | Sakshi
Sakshi News home page

Kanguva: దసరా బరిలో సూర్య 'కంగువా'.. రిలీజ్‌ డేట్‌ ఇదే!

Published Thu, Jun 27 2024 8:39 PM | Last Updated on Thu, Jun 27 2024 8:39 PM

Kollywood Star Suriya latest Movie Release on This Date

కోలీవుడ్ స్టార్‌ సూర్య నటిస్తోన్న భారీ బడ్జెట్‌ చిత్రం 'కంగువా'. ఈ సినిమాను శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్‌ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఫుల్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న ఈ చిత్ర షూటింగ్ దాదాపు చివరిదశకు చేరుకుంది.

తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్‌ 10న విడుదల చేయనున్నట్లు సూర్య ట్వీట్ చేశారు. కాగా.. ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు బాబీ డియోల్‌ కీలక పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఒక వార్ సీన్ ఏకంగా 10 వేల మందితో తీసినట్లు టాక్ వినిపించింది. సూర్య, బాబీ డియోల్ మధ్య ఓ భారీ యుద్ధ సీక్వెన్స్‌ను తెరకెక్కించారు. ఫుల్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా కంగువా ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయంగా కనిపిస్తోంది.

కాగా.. సినిమాలో సూర్య డ్యుయల్ రోల్ పోషిస్తున్నాడు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ సినిమా ద్వారానే తమిళ ఇండస్ట్రీకి పరిచయమవుతున్నాడు. మరో బాలీవుడ్ నటి దిశా పటానీ కోలీవుడ్ ఎంట్రీ ఇస్తుండగా.. జగపతి బాబు, యోగి బాబు, నటరాజన్ సుబ్రమణ్యం, కేఎస్ రవికుమార్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement