దసరా బాక్సాఫీస్‌.. రజినీకాంత్‌ - సూర్య ఫ్యాన్స్ మధ్య వార్! | Suriya Latest Action Movie Kanguva Postponed, Fans Fire On Studio Green Trending In Twitter | Sakshi
Sakshi News home page

Kollywood Boxoffice: తలైనా వర్సెస్‌ సూర్య.. నిర్మాణసంస్థపై ఫ్యాన్స్‌ ఆగ్రహం!

Published Mon, Aug 26 2024 10:04 AM | Last Updated on Mon, Aug 26 2024 11:41 AM

Suriya latest Action Movie Kanguva PostPone Fans Fire On Studio Green

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తోన్న భారీ యాక్షన్ చిత్రం కంగువా.  శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై అభిమానుల్లో పెద్దఎత్తున అంచనాలు నెలకొన్నాయి.  యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్‌ సంస్థలు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ మూవీ అక్టోబర్ 10న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే అనుకున్నట్లుగానే జరుగుతుందన్న తరుణంలో కంగువా వాయిదా పడుతుందన్న టాక్ వినిపిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న సూర్య ఫ్యాన్స్‌ సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు.

అయితే అదే రోజు రజినీకాంత్ మూవీ వెట్టైయాన్‌ విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే లైకా ప్రొడక్షన్స్‌ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. టీజీ జ్ఞానవేల్ డైరెక్షన్‌లో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే కంగువా మూవీ వాయిదా పడుతోందన్న వార్తలు ఊపందుకున్నాయి. ఇది కాస్తా సూర్య, తలైవా ఫ్యాన్స్ మధ్య వార్‌గా మారింది. ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా తమ ‍ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

కంగువా వాయిదా.. ట్విటర్‌లో ట్రెండింగ్‌?

సూర్య నటిస్తోన్న కంగువా భారీ బడ్జెట్ చిత్రం కావడంతో నిర్మాతలు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అక్టోబర్‌ 10 రజినీకాంత్‌తో పోటీపై సమాలోచనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్టోబర్‌ 31కి వాయిదా వేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. కంగువా రిలీజ్ డేట్‌ ముందుగానే ప్రకటించినప్పటికీ పోటీలో రజినీకాంత్ రావడంతో వాయిదా పడినట్టేనని టాక్ వినిపిస్తోంది. ఈ వార్త విన్న సూర్య ఫ్యాన్స్‌ ట్విటర్‌ వేదికగా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. 'షేమ్ ఆన్‌ యూ స్టూడియోగ్రీన్‌' అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్విటర్‌లో ట్రెండ్‌ చేస్తున్నారు. కంగువా మేకర్స్‌ క్లారిటీ ఇస్తేనే ఫ్యాన్స్ మధ్య వార్‌కు చెక్‌ పడుతుంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement