ఒకే వేదికపై ప్రభాస్‌,రజనీ,సూర్య.. ఎందుకో తెలుసా..? | Actor Suriya Kanguva Movie Pre Release Event Chief Guests Prabhas And Rajinikanth, Deets Inside | Sakshi
Sakshi News home page

Kanguva Pre Release Event: ఒకే వేదికపై ప్రభాస్‌,రజనీ,సూర్య.. ఎందుకో తెలుసా..?

Published Tue, Oct 15 2024 8:36 AM | Last Updated on Tue, Oct 15 2024 9:27 AM

Kanguva Movie Pre Release Event Chef Guest Prabhas And Rajinikanth

సూర్య హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్‌ సినిమా 'కంగువ'. ఈ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో సూర్యతో పాటు ప్రభాస్‌, రజనీకాంత్‌ వేదక పంచుకోనున్నారని ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అక్టోబరు 10న విడుదల కావాల్సిన ఈ చిత్రం రజనీకాంత్‌ వెట్టయాన్‌ కోసం వాయిదా పడింది. దిశా పటానీ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో బాబీ డియోల్, యోగిబాబు ఇతర కీలక పాత్రల్లో నటించారు. యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్‌ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించాయి. నవంబరు 14న సినిమా విడుదల కానుంది.

కంగువ కోసం ప్రభాస్‌, రజనీకాంత్‌

రజనీకాంత్‌ వేట్టయాన్‌ సినిమా అక్టోబర్‌ 10న విడుదల కావడంలో సూర్య పాత్ర ఎక్కువ ఉంది. తలైవా మీద ఉన్న గౌరవంతో అక్టోబర్‌ 10న విడుదల కావాల్సిన కంగువ చిత్రాన్ని సూర్య వాయిదా వేసుకున్నారు. దీంతో రజనీకాంత్​ కూడా కంగువ విజయం కోసం తన వంతుగా సపోర్ట్ ఇచ్చేందుకు ప్రీరిలీజ్‌ కార్యక్రమానికి వస్తున్నారట. ఇకపోతే  ఇదే కార్యక్రమానికి ప్రభాస్‌ కూడా రానున్నారని తెలుస్తోంది. దానికి ప్రధాన కారణం యూవీ క్రియేషన్స్ అని చెప్పవచ్చు. స్టూడియో గ్రీన్ సంస్థతో కలిసి కంగువ సినిమాను వారు నిర్మించారు.  యూవీ బ్యానర్ అధినేతలు​ వంశీ, ప్రమోద్‌లు ఇద్దరూ ప్రభాస్‌కు మంచి​ స్నేహితులు. దీంతో ఈ భారీ బడ్జెట్‌ చిత్రానికి మరింత ప్రమోషన్‌ కల్పించేందుకు   పెంచేలా ప్రభాస్‌ కూడా భాగం కానున్నారని సమాచారం.

రూ. 2000 కోట్లపై టార్గెట్‌

కంగువ సినిమాను  3,500 థియేటర్లలో ఎనిమిది భాషల్లో రిలీజ్ చేయనున్నట్టు నిర్మాత జ్ఞానవేల్ క్లారిటీ ఇచ్చేశారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, ఇంగ్లిష్, చైనీస్‌, స్పానిష్‍లోనూ ఈ మూవీ వస్తుందని వెల్లడించారు. ఏఐ సాయంతో ఇప్పటికే డబ్బింగ్‌ పనులు కూడా పూర్తి అయినట్లు ఆయన తెలిపారు. రూ. 1000 కోట్ల టార్గెట్‌తో దిగుతున్న ఈ సినిమా రూ. 2000 కోట్లు రాబడుతుందని నిర్మాత అంచనా వేశారు. పార్ట్ 2, పార్ట్‌ 3 కథలు సిద్ధంగా ఉన్నాయని.. పార్ట్‌ 1 విజయం ఆధారంగా వాటిని తెరకెక్కించేలా ప్లాన్ చేయనున్నట్లు తెలిపారు. నవంబరు 14న సినిమా విడుదల కానుంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement