కంగువా చిత్రంపై గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తనే నిజమైంది. సినిమా విడుదల వాయిదా పడింది. సూర్య హీరోగా నటించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘కంగువా’. శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్ 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. అయితే సీజీ వర్క్ ఇంకా పూర్తి కాకపోవడంతో రిలీజ్‌ని వాయిదా వేశారు మేకర్స్. నవంబర్ 14న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తామని ప్రకటించారు.
వేట్టయాన్ కోసమే వాయిదా?
రజనీకాంత్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘వేట్టయాన్’. టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సుభాస్కరన్ నిర్మించారు. ఇందులో అమితాబ్ బచ్చన్, రానా, ఫాహద్ ఫాజిల్, మంజు వారియర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ‘వేట్టయాన్’ చిత్రం దసరా సందర్భంగా అక్టోబరు 10న రిలీజ్ కానుంది. అదే తేదిన కంగువా రిలీజ్ కావాల్సింది. మేకర్స్ ముందే ప్రకటించారు. అయితే బరిలోని రజనీకాంత్ సినిమా రావడంతో సూర్య వెనక్కి తగ్గారు. తనకంటే సీనియర్ హీరో సినిమాతో పోటీ వద్దని సూర్య చెప్పారట. దీంతో అక్టోబర్ 10న కాకుండా నవంబర్ 14న విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయం తీసుకున్నారు.
(చదవండి: అటు ప్రభాస్.. ఇటు మహేశ్.. కరీనాకి డబుల్ చాన్స్!)
మూడు విభిన్న పాత్రల్లో సూర్య
కంగువా చిత్రం కోసం సూర్య చాలా కష్టపడ్డాడు. ఇందులో మూడు విభిన్నమైన పాత్రల్లో సూర్య కనిపించబోతున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు భారతీయ తెరపై రాని కొత్త కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారట. రెండున్నరేళ్ల పాటు సుమారు 1000 మందికి పైగా ‘కంగువా’ కోసం శ్రమించారని ఓ ఇంటర్వ్యూలో సూర్య చెప్పారు. ఇక ఈ చిత్రానికి బడ్జెట్ కూడా భారీగానే అయిందట. దాదాపు రూ.350 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. విజువల్స్ పరంగా ఈ చిత్రం సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుందని మేకర్స్ ముందు నుంచి చెబుతున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.
The Battle of Pride and Glory, for the World to Witness ⚔🔥#Kanguva's mighty reign storms screens from 14-11-24 🤎#KanguvaFromNov14 🦅 @Suriya_offl @thedeol @directorsiva @DishPatani @ThisIsDSP #StudioGreen @GnanavelrajaKe @vetrivisuals @supremesundar @UV_Creations… pic.twitter.com/de3yYAL0BI
— Studio Green (@StudioGreen2) September 19, 2024
Comments
Please login to add a commentAdd a comment