క్రికెట్‌లో వరల్డ్ కప్ ఎలాంటిదో సినిమా రంగంలో ఆస్కార్ అవార్డు అలాంటిది. ప్రపంచ వ్యాప్తంగా సినీ నటులు తమ జీవితంలో ఒక్కసారైనా ఆస్కార్ అవార్డు పొందాలని కల కంటారు. గతేడాది రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్ మూవీ ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకొని తెలుగు సినిమా ఖ్యాతీని ప్రపంచానికి చాటి చెప్పింది. ప్రపంచ వ్యాప్తంగా చాలా సినిమాలు పోటీలో ఉన్నా ఒక దక్షిణాది చిత్రం అస్కార్ గెలిచి.. భారత ఖ్యాతీని పెంచేసింది.
ఇక ఇప్పుడు 97వ ఆస్కార్ బరిలోను సౌత్ నుంచి పలు సినిమాలు పోటీలో దిగేందుకు సిద్దమయ్యాయి. అయితే వాటిల్లో సూర్య ‘కంగువా’(Kanguva Movie ) ఆస్కార్ బరిలోకి నిలిచింది. దీంతో పాటు పృథ్వి రాజ్ సుకుమారన్ హీరోగా నటించిన ‘ది గోట్ లైఫ్’(Aadujeevitham: The Goat Life) కూడా ఆస్కార్‌లోకి ఎంట్రీ దక్కించుకుంది. ఇండియా నుంచి ప్రస్తుతం ఆస్కార్ 2025 కోసం షార్ట్ లిస్ట్ చేసిన సినిమాల్లో ‘ఆడు జీవితం’, ‘కంగువా’ సంతోష్ , స్వాతంత్ర్య వీర సావర్కర్ ,'ఆల్ వుయ్ ఇమాజిన్ యాజ్ లైట్(మలయాళం) చిత్రాలు ఉన్నాయి. షార్ట్ లిస్ట్ అయినా సినిమా నుంచి ఆస్కార్ ఫైనల్ నామినేషన్లను ఎంపిక చేస్తారు. ఈ ప్రక్రియ జనవరి 8 నుంచి 12 వరకు జరుగుతుంది. జనవరి 17న నామినేషన్లను అనౌన్స్ చేస్తారు.
‘లాపతా లేడీస్’ నో ఎంట్రీ
ఇండియా నుంచి మొదటగా కిరణ్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘లాపతా లేడీస్’(Laapataa Ladies ) ఆస్కార్‌కు ఎంపికైంది. అయితే ఈ చిత్రం ఆస్కార్ షార్ట్ లిస్ట్‌లో చోటు దక్కించుకోలేకపోయింది. డిసెంబర్ 17న ఆస్కార్ షార్ట్ లిస్ట్ చిత్రాలను అకాడమీ ప్రకటించింది. వాటిలో లాపతా లేడీస్ కు చోటు దక్కలేదు. కానీ భారతీయ నటి షహనా గోస్వామి ప్రధాన పాత్రలో నటించిన ‘సంతోష్’ చిత్రం ఆస్కార్‌కు షార్ట్ లిస్ట్‌కి ఎంపికైంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘సంతోష్’ హిందీ చిత్రం యూకే నుంచి ఆస్కార్ షార్ట్ లిస్ట్‌లో స్థానం సొంతం చేసుకుంది. ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ జాబితాలో షార్ట్ లిస్ట్‌లో అధికారికంగా చోటు సాధించింది.
ఆస్కార్ బరిలో ఫ్లాప్ చిత్రాలు
ఉత్తమ చిత్రం విభాగంలో ఇండియా నుంచి కంగువా, ఆడు జీవితం(ది గోట్ లైఫ్) సినిమాలు ఆస్కార్ బరిలో నిలిచాయి. ఆయితే ఈ రెండు చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. బ్లెస్సీ దర్శకత్వంలో పృథ్విరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన చిత్రం ఆడు జీవితం. ది గోట్ లైప్ పేరుతో ఈ చిత్రం తెలుగులోనూ విడుదలైంది.అయితే ఈ సర్వైవల్ థ్రిల్లర్ సినిమాకు విమర్శకుల ప్రశంసలు వచ్చాయి కానీ కలెక్షన్స్ మాత్రం అంతగా రాలేదు. ఇక భారీ అంచనాలతో వచ్చిన సూర్య కంగువా చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. దాదాపు రూ. 2000 కోట్లను కొల్లగొట్టే సినిమా ఇది అని చిత్ర బృందం మొదటి నుంచి ప్రచారం చేసింది. కానీ ప్రేక్షకులు మాత్రం ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ హిట్ అందించలేదు. నటన, మేకింగ్ పరంగా మాత్రం మంచి మార్కులు సంపాదించుకుంది.
BREAKING: Kanguva ENTERS oscars 2025🏆 pic.twitter.com/VoclfVtLBL
— Manobala Vijayabalan (@ManobalaV) January 7, 2025
Comments
Please login to add a commentAdd a comment