The Goat Life Movie
-
గల్ఫ్ వలసజీవిత సారం
‘ఆడు జీవితం’ అనే మలయాళ పదం గత కొన్ని నెలల నుండి ప్రపంచమంతా తెలిసిపోతూ ఉంది. మలయాళీ భాషలో మొదటిసారి 2008లో ఈ పేరుతో వచ్చిన నవల ఎంతో ప్రజాదరణ పొంది రెండు వందల యాభైకి పైగానే ముద్ర ణలను పొందింది. ఇది భార తీయ సాహితీ ప్రపంచంలో ఒక గొప్ప విషయం. వలస వెళ్ళిన నజీబ్ అనే ఒక మలయాళీ దుర్భరమైన జీవితా నుభవాలను ఆధారంగా... ‘బెన్యా మిన్’ అనే మలయాళ రచయిత ‘ఆడు జీవితం’ నవల రాశారు. కేరళ సాహిత్య అకాడెమీ 2009లో ఈ పుస్తకానికి పురస్కారాన్నిచ్చి గౌరవించింది. అత్యంత పేరు ప్రఖ్యాతులను సంపాదించిన ఈ నవల కేరళ చలనచిత్ర రంగాన్నీ వదలలేదు. ఫలితంగా ‘ఆడు జీవితం (ది గోట్ లైఫ్)’ అనే సినిమా తయారై ఈ సంవత్సరం మార్చిలో విడుదలైంది. ప్రింట్ రూపంలో వచ్చిన పుస్తకానికి ఎంత మన్నన దొరికిందో అంతకి మించి సినిమాకీ పేరు వచ్చింది. అవార్డులతో పాటు, వందకోట్లు వసూళ్లని దాటేసి చరిత్రపై చరిత్రను లిఖిస్తూ ముందుకు దూసుకుపోతోంది. ముందు ముందు ఇంకా ఏయే రూపాల్లో పేరు ప్రఖ్యాతులను సంపాదించు కొంటుదో కాలమే చెబుతుంది. ఆడు జీవితం పలు భారతీయ బాషల్లోకి అను వాదమైంది. కొన్ని ఇతర దేశాల బాష (థాయ్, నేపాలీ, అరబిక్)ల్లో కూడా వచ్చింది. మన రెండు తెలుగు రాష్ట్రాల నుండి లక్షలమంది గల్ఫ్ దేశాల్లో ఉన్నారు. నలభై యాభై ఏళ్లుగా వలస వెళుతున్నారు. తిరిగొస్తు న్నారు. మూడు తరాల నుండి వెళుతూ వస్తున్నారు. వీరిలో ఎందరో నజీబ్ మాదిరిగా ఎన్నో అవస్థలు పడ్డారు. హింసలకు గురయ్యారు. ఎడారుల్లో దుర్భర మైన జీవితాలను గడిపారు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల్ని మెరుగు పరచడానికి నానా కష్టాలు పడి ఎంతో కొంత సంపాదించుకొని ప్రాణాల్ని చేతిలో పెట్టుకొని తిరిగొ స్తున్నారు. వెళ్ళినవారికి సంబంధించిన ఎన్నో వైవిధ్య మైన నేపథ్యాలు దొరుకుతాయి. నైపుణ్యం లేని వారు, చదువు కొన్నవారు, ఒంటరి మహిళలు, యువ సము దాయాలకు చెందిన వారు ఎన్నోరకాల పనులు చేసి జీవితా నుభవాలను జీర్ణించుకొన్నారు. ఇవి అక్షర రూపంలో తెలుగు సాహిత్యలోకంలోకి అడుగుపెట్టాలి. మా పక్క ఊళ్ళో ఉండే భీమన్న తన కష్టాల్ని చెబితే కళ్ళల్లో నీళ్లొస్తాయి. ఎక్కడో తనకు ఏమాత్రం తెలియని ఎడారిలో ఒంటెల్ని చూసుకొనే పని. ఒంటెల పాలు పితకడం కూడా రోజువారీ పనుల్లో ఒకటి. అయితే ఒంటెల ఎత్తు గేదెలు, ఆవుల కన్నా ఎంతో ఎక్కువ. కాబట్టి పాలు పితికే వారు కూర్చోలేరు, నిల్చోనూలేరు. మధ్యలో కాళ్లని కొంచెం వంచి పాలని పితకాలి. ఈ విషయాన్ని భీమన్న చెబుతుంటే ఆయన కళ్ళలో తడి, మాటల్లో వేదన! గల్ఫ్ దేశాల్లో పనిచేసి వచ్చిన వారి జీవితాల్లోకి రచయితలు, రచయిత్రులు తొంగిచూడాలి. ఓపిగ్గా కూర్చుని వారి జీవితానుభవాల్ని విని కథలు, నవలలు, కవితలుగా రాయాలి. ఒక విహంగ దృష్టితో చూస్తే ఇలాంటి కథా వస్తువులపై రావ లసినంతగా రచనలు రాలేదని పిస్తుంది.ఈ మధ్య పత్రికల ద్వారా చాలా కథలు, నవలల పోటీల నిర్వహణ జరుగుతోంది. గల్ఫ్ వలస ప్రజలపైనే ప్రత్యేక పోటీలు నిర్వహిస్తే ఎన్నో వైవిధ్య జీవన రేఖలు, చిత్రాలు అక్షరాల్లో రూపం పోసుకొని పాఠకులకు అందించవచ్చు. ఎంతో విలువైన జీవన పార్శా్వలు దొరుకుతాయి. పత్రికలు ఈ విషయాన్ని ఆలోచించి కొన్ని పోటీలు వీటినే అక్షరబద్ధం చేయడానికి పెడితే తెలుగు సాహిత్య సంపద వైవి«ధ్యాన్ని సంతరించుకుంటుంది. ఒక సముదాయపు జీవితానుభవాలను తెలుసుకొన్న వారమవుతాము. డా‘‘ టి. సంపత్ కుమార్ వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు -
జీవితాన్ని చూపిస్తుంది
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే చిత్రాలు చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతున్న వాటిలో మలయాళ చిత్రం ‘ఆడుజీవితం’ (ది గోట్ లైఫ్) ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.సినిమాలకు కథలు ఎలా వస్తాయి అనుకుంటే మనలో నుండే. సాధారణ మనుషుల నుండి అసా ధారణ చరిత్రకారుల జీవన విధానమే మన సినిమా కథలకు మూలం. ముఖ్యంగా నేటి సమాజంలో జరుగుతున్న వాస్తవ విషయాలను కూడా వెండితెర మీద అసాధారణ రీతిలో ప్రతిబింబిస్తున్నారు మన వర్ధమాన దర్శకులు. ఆ కోవలో రిలీజైన సినిమానే బ్లెస్సీ దర్శకత్వం వహించిన ‘ఆడుజీవితం’. ప్రముఖ మలయాళ నటుడు పృథ్వీరాజ్ నటించిన ఈ సినిమా ఓ కళాఖండమనే చెప్పాలి.కథ కన్నా ముందు కథానాయకుడి గురించి మాట్లాడుకోవడం చాలా ముఖ్యం. ఎవరైనా సినిమాపాత్రలో ఒదిగిపోవడానికి సాధ్యమైనంత వరకు ఆపాత్రను ఆపాదించుకుంటారు. కాని ఈ సినిమా కథానాయకుడు పృథ్వీరాజ్ ఈపాత్రకు ప్రా ణం పోశాడు. కథాపరంగా కథానాయకుడు తన స్నేహితుడితో గల్ఫ్ ఎయిర్‌పోర్టులో దిగుతాడు. వాళ్ళిద్దరూ జీవనోపాధి కోసం ఓ ఏజెంట్ ద్వారా విదేశాలకు వెళతారు.అక్కడి భాష రాకపోవడం వల్ల ఒకడి మోసంతో ఇద్దరూ విడిపోయి ఎడారిలో పని వాళ్ళుగా మారి దుర్భర స్థితిలో మిగిలిపోతారు. తినడానికి తిండి లేక అతి హీన స్థితిలో అక్కడి నుండి తిరిగి ఎలా ఇండియా వస్తారు అన్నదే సినిమా. ముఖ్యంగా పృథ్వీరాజ్ ఈ సినిమాలో చూపించిన బాడీ ట్రాన్సఫర్మేషన్ సినిమా మొత్తానికి హైలైట్. కాస్త నిడివి ఎక్కువున్నా పృథ్వీరాజ్ తన నటనతో తనతోపాటు మనల్ని తీసుకువెళతాడు.సినిమా అంటే వినోదమే కాదు, వాస్తవానికి ప్రతీక అనేదానికి ఇదో మచ్చు తునక. సినిమాకి కథే కాదు సరైన కథానాయకుడు... ఇంకా సరిగ్గా చెప్పాలంటేపాత్రకి ప్రాణం పోసేపాత్రధారి దొరికినప్పుడు సినిమాని చూసినట్లుండదు, జీవితాన్ని చూసినట్లుంటుంది. మరి ఆ జీవితం చూడాలంటే హాట్ స్టార్‌లో స్ట్రీమ్ అవుతున్న ‘ఆడుజీవితం’ చూసేయండి. – ఇంటూరు హరికృష్ణ -
ఈ శుక్రవారం ఓటీటీల్లో 16 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?
మరో వీకెండ్ వచ్చేసింది. ఇందులో భాగంగానే శుక్రవారం పలు సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతున్నప్పటికీ ప్రియదర్శి 'డార్లింగ్' మూవీపై మాత్రం కాస్త హైప్ ఉంది. మరోవైపు ఓటీటీలో మాత్రం ఈ శుక్రవారం ఏకంగా 16 కొత్త మూవీస్-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఓవరాల్‌గా చూసుకుంటే ఈ వీకెండ్లో 27 మూవీస్ ప్లస్ సిరీసులు అలరించనున్నాయి. ఇంతకీ ఏ సినిమా ఏ ఓటీటీలో ఉందనేది ఇప్పుడు చూసేద్దాం.(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన డిఫరెంట్ తెలుగు సినిమా)ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చే మూవీస్ జాబితా (జూలై 19)నెట్ఫ్లిక్స్ఆడు జీవితం - తెలుగు డబ్బింగ్ మూవీఫైండ్ మీ ఫాలింగ్ - ఇంగ్లీష్ మూవీస్కై వాకర్స్: ఏ లవ్ స్టోరీ - ఇంగ్లీష్ చిత్రంస్వీట్ హోమ్ సీజన్ 3 - కొరియన్ సిరీస్కోబ్లా కాయ్ సీజన్ 6 పార్ట్ 1 - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్)మాస్టర్ ఆఫ్ ద హౌస్ - థాయ్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది)త్రిభువన్ మిశ్రా సీఏ టాపర్ - హిందీ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)కోబ్రా కోయ్ సీజన్ 6 పార్ట్ 1 - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్)మాస్టర్ ఆఫ్ ద హౌస్ - థాయ్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)పసుత్రి గాజే - ఇండోనేసియన్ సినిమా (స్ట్రీమింగ్)ఆహాద అకాలీ - తమిళ సినిమాబూమర్ అంకుల్ - తెలుగు డబ్బింగ్ మూవీ (జూలై 20)హాట్స్టార్నాగేంద్రన్స్ హనీమూన్ - తెలుగు డబ్బింగ్ సిరీస్యంగ్ ఉమెన్ అండ్ ద సీ - ఇంగ్లీష్ సినిమాజీ5బహిష్కరణ - తెలుగు వెబ్ సిరీస్బర్జాక్ - హిందీ సిరీస్అమెజాన్ ప్రైమ్బెట్టీ లా ఫీ - స్పానిష్ సిరీస్మ్యూజిక్ షాప్ మూర్తి - తెలుగు సినిమా (స్ట్రీమింగ్)అన్ ఇంటరప్టెడ్ టాప్ క్లాస్ టెన్నిస్ - ఇంగ్లీష్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)జియో సినిమాఐఎస్ఎస్ - ఇంగ్లీష్ మూవీమిస్టర్ బిగ్ స్టఫ్ - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది)ఆపిల్ ప్లస్ టీవీలేడీ ఇన్ ద లేక్ - ఇంగ్లీష్ సిరీస్హోయ్ చోయ్ టీవీధర్మజుద్దా - బెంగాలీ సినిమాబుక్ మై షోద డీప్ డార్క్ - ఫ్రెంచ్ సినిమాద వాచర్స్ - ఇంగ్లీష్ మూవీలయన్స్ గేట్ ప్లేఅర్కాడియన్ - ఇంగ్లీష్ మూవీడిస్కవరీ ప్లస్ద బ్లాక్ విడోవర్ - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్)(ఇదీ చదవండి: రెండో పెళ్లికి రెడీ అయిన స్టార్ హీరో హృతిక్ రోషన్.. హింట్ ఇచ్చేశాడా?) -
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 26 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్
మరో సోమవారం వచ్చేసింది. గత వారం థియేటర్లలో రిలీజైన 'భారతీయుడు 2' ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. దీంతో కొత్త సినిమా కోసం మూవీ లవర్స్ తెగ ఎదురుచూస్తున్నారు. ఇందుకు తగ్గట్లే ఈ శుక్రవారం డార్లింగ్, పేకమేడలు, బ్యాడ్ న్యూజ్ (హిందీ) చిత్రాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. వీటిపై అంతగా బజ్ లేదు. దీంతో ఆటోమేటిక్‌గా అందరి దృష్టి ఓటీటీ రిలీజుల మీద పడుతుంది. ఈ క్రమంలోనే 26 వరకు సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి.(ఇదీ చదవండి: హీరో కిరణ్ అబ్బవరంతో పెళ్లి... తేదీ రివీల్ చేసిన హీరోయిన్)ఓటీటీలో ఈ వారం రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే 'ఆడు జీవితం' సినిమా ఆసక్తి రేపుతుండగా.. బహిష్కరణ, నాగేంద్రన్స్ హనీమూన్ అనే వెబ్ సిరీసులు ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాయి. ఇవి కాకుండా 'హాట్ స్పాట్' అనే మరో డబ్బింగ్ మూవీ కూడా ఉన్నంతలో బెటర్ ఆప్షన్‌గా కనిపిస్తోంది. ఇవి కాకుండా ఇంకా ఏమేం మూవీస్-వెబ్ సిరీసులు ఓటీటీల్లోకి రాబోతున్నాయనేది దిగువన లిస్ట్ ఉంది చూసేయండి.ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ జాబితా (జూలై 15 నుంచి 21 వరకు)హాట్స్టార్నాగేంద్రన్స్ హనీమూన్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూలై 19జీ5బహిష్కరణ (తెలుగు వెబ్ సిరీస్) - జూలై 19బర్జాక్ (హిందీ సిరీస్) - జూలై 19ఆహాహాట్ స్పాట్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - జూలై 17నెట్ఫ్లిక్స్భారతీయుడు (తెలుగు సినిమా) - జూలై 15వాండరుస్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 15టీ పీ బన్ సీజన్ 2 (జపనీస్ సిరీస్) - జూలై 17ద గ్రీన్ గ్లోవ్ గ్యాంగ్ సీజన్ 2 (పోలిష్ సిరీస్) - జూలై 17కోబ్లా కాయ్ సీజన్ 6 పార్ట్ 1 (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 18మాస్టర్ ఆఫ్ ద హౌస్ (థాయ్ సిరీస్) - జూలై 18త్రిభువన్ మిశ్రా సీఏ టాపర్ (హిందీ సిరీస్) - జూలై 18ఆడు జీవితం (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూలై 19ఫైండ్ మీ ఫాలింగ్ (ఇంగ్లీష్ మూవీ) - జూలై 19స్కై వాకర్స్: ఏ లవ్ స్టోరీ (ఇంగ్లీష్ చిత్రం) - జూలై 19స్వీట్ హోమ్ సీజన్ 3 (కొరియన్ సిరీస్) - జూలై 19అమెజాన్ ప్రైమ్మై స్పై: ద ఎటర్నల్ సిటీ (ఇంగ్లీష్ మూవీ) - జూలై 18బెట్టీ లా ఫీ (స్పానిష్ సిరీస్) - జూలై 19జియో సినిమాకుంగ్ ఫూ పాండా 4 (ఇంగ్లీష్ సినిమా) - జూలై 15మిస్టర్ బిగ్ స్టఫ్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 18ఐఎస్ఎస్ (ఇంగ్లీష్ మూవీ) - జూలై 19బుక్ మై షోజస్టిస్ లీగ్: క్రైసిస్ ఆఫ్ ఇన్ఫినిటీ ఎర్త్స్, పార్ట్ 3 (ఇంగ్లీష్ మూవీ) - జూలై 16ద డీప్ డార్క్ (ఫ్రెంచ్ సినిమా) - జూలై 19డిస్కవరీ ప్లస్ద బ్లాక్ విడోవర్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 18లయన్స్ గేట్ ప్లేఅర్కాడియన్ (ఇంగ్లీష్ మూవీ) - జూలై 19ఆపిల్ ప్లస్ టీవీలేడీ ఇన్ ద లేక్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 19హోయ్ చోయ్ టీవీధర్మజుద్దా (బెంగాలీ సినిమా) - జూలై 19(ఇదీ చదవండి: 'కల్కి' ల్యాగ్ అనిపించింది.. ప్రభాస్‌ని అలా చూపించాల్సింది!) -
ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న 'ఆడు జీవితం'
ఈ ఏడాది వచ్చిన హిట్ చిత్రాల్లో ద గోట్ లైఫ్ ఒకటి. ఈ మలయాళ మూవీ తెలుగులో ఆడుజీవితం పేరిట విడుదలైంది. పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన ఈ చిత్రానికి బ్లెస్సీ దర్శకత్వం వహించాడు. కేరళకు చెందిన నజీబ్ మహ్మద్ డబ్బు సంపాదించేందుకు సౌదీ అరేబియాకు వలస వెళ్లి అక్కడ ఎన్నో కష్టాలు పడ్డాడు. వీటన్నింటినీ బెన్యమిన్ అనే రచయిత గోట్ లైఫ్ అనే నవలలో రాసుకొచ్చాడు. దీన్ని ఆధారంగా చేసుకుని ఆడు జీవితం మూవీ తెరకెక్కింది.మార్చిలో రిలీజ్ఈ మూవీ కోసం పృథ్వీరాజ్ ఏడు నెలల్లో 31 కిలోలు బరువు తగ్గాడు. ఓ సన్నివేశం కోసం మూడురోజుల పాటు ఏమీ తినకుండా కఠిన ఉపవాసం చేశాడు. అంతటి అంకితభావంతో ఈ మూవీ కోసం పని చేశాడు. మార్చి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లు రాబట్టింది. కానీ సుమారు నాలుగు నెలలు కావస్తున్నా ఇంతవరకు ఓటీటీలోకి రానేలేదు.ఓటీటీలోఈ క్రమంలో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 19 నుంచి మలయాళ, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. ఎట్టకేలకు ఓటీటీలోకి వస్తుండటంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) చదవండి: Thanksgiving Movie: వయొలెన్స్.. వయొలెన్స్.. ధైర్యం ఉంటే చూసేయండి -
ఓటీటీకి రూ.150 కోట్ల చిత్రం.. ఈ సారైనా?
పృథ్వీరాజ్ సుకుమార్, అమలాపాల్ జంటగా నటించిన చిత్రం ఆడుజీవితం(ది గోట్ లైఫ్). మార్చి 28న రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. సర్వైవల్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రం కేవల 25 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ చిత్రాల జాబితాలో చోటు సంపాదించుకుంది.అయితే ఈ సినిమా రిలీజై రెండు నెలల కావొస్తున్నా ఇప్పటి వరకు ఓటీటీకి రాలేదు. గతంలో చాలాసార్లు ఓటీటీ స్ట్రీమింగ్పై రానుందని వార్తలొచ్చాయి. కానీ మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. తాజాగా మరోసారి ఓటీటీకి సంబంధించిన నెట్టింట వైరలవుతోంది. ఈనెల 26 నుంచి స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ తేదీపై కూడా చిత్రబృందం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. మరోవైపు ఈ మూవీ హక్కులను సొంతం చేసుకున్న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు. దీంతో ఈ సారైనా ఓటీటీకి వస్తుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.అసలు కథేంటంటే..?కేరళకు చెందిన నజీబ్ అనే వ్యక్తి కథే ఈ చిత్రం. వాస్తవ సంఘటనలను ఆధారం చేసుకుని ఆడు జీవితం చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు. ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన నజీబ్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడో తెలియజేస్తూ బెన్యామిన్ ‘గోట్ డేస్’ అనే నవలను రచించారు. దీని ఆధారంగానే ఈ సినిమాను మేకర్స్ నిర్మించారు. నజీబ్ పాత్ర కోసం పృథ్వీరాజ్ సుకుమారన్ 31 కిలోల బరువు తగ్గారు. అంతే కాకుండా కొన్ని సీన్స్ కోసం 72 గంటలపాటు భోజనం లేకుండా మంచి నీళ్ల సాయంతోనే ఆయన ఉన్నారు. ఈ సినిమా కోసం ఆయన పడిన శ్రమకు తగిన ఫలితం దక్కిందని చెప్పవచ్చు. ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచింది. -
ఓటీటీలోకి రియల్ లైఫ్ ట్రాజెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
సరైన సినిమాల్లేక బాక్సాఫీస్ డల్ అయిపోయింది. అల్లరి నరేశ్ 'ఆ ఒక్కటి అడక్కు' మూవీపై గంపెడాశలు పెట్టుకుని గతవారం థియేటర్లలో రిలీజ్ చేశాడు. పెద్దగా లాభం లేకుండా పోయింది. దీంతో ప్రేక్షకుల దృష్టి ఓటీటీలపై పడింది. ప్రస్తుతానికైతే ఓటీటీలో 'మంజుమ్మల్ బాయ్స్' మూవీ బాగానే ఆకట్టుకుంటోంది. త్వరలో 'ఆవేశం' స్ట్రీమింగ్ కానుండగా.. ఇప్పుడు ఈ లిస్టులోకి మరో రియల్ లైఫ్ సినిమా వచ్చేందుకు రెడీ అయిపోయింది.(ఇదీ చదవండి: This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?)మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ గురించి తెలుగు ప్రేక్షకులకు తెలుసు. ఎందుకంటే 'సలార్'లో రాజమన్నార్ అనే విలన్ పాత్రలో మెప్పించాడు. ఇతడు మెయిన్ రోల్లో నటించిన 'ద గోట్ లైఫ్' అనే సినిమా మార్చి చివర్లో రిలీజైంది. పనికోసం దుబాయి వెళ్లిన ఓ వ్యక్తి.. అక్కడ ఎలా చిక్కుకుపోయాడు? అక్కడి నుంచి స్వదేశానికి ఎలా తిరిగొచ్చాడు? అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తీశారు. మలయాళంలో హిట్ టాక్ తెచ్చుకుంది. కానీ తెలుగులో మాత్రం సీరియస్ కాన్సెప్ట్ కావడంతో మనోళ్లు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు.ఇకపోతే 'ద గోట్ లైఫ్' సినిమా ఓటీటీ స్ట్రీమింగ్కి సిద్ధమైందని తెలుస్తోంది. మే 26 నుంచి హాట్‌స్టార్‌లో అందుబాటులోకి రానుందని అంటున్నారు. మరోవైపు చెప్పిన టైమ్ కంటే ముందే మే 10నే ఓటీటీలో రిలీజ్ కానుందని టాక్ వినిపిస్తోంది. ఆసక్తికర విషయం ఏంటంటే ఈ సినిమా తీయడానికి దాదాపు 16 ఏళ్లు పట్టింది. ఆరేళ్ల క్రితం షూటింగ్ మొదలుపెట్టి, పలు కష్టాలతో పూర్తి చేశారు. ఈ ఏడాది రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: స్టార్ ప్రొడ్యూసర్ పరువు తీసిన కామెడీ షో.. ఇన్ స్టా పోస్ట్ వైరల్) -
ఓటీటీలో 'ఆడు జీవితం'.. స్ట్రీమింగ్ డేట్ ఇదేనా..?
మలయాళం హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన సర్వైవల్ థ్రిల్లర్ చిత్రం 'ఆడు జీవితం'. ట్రైలర్‌తోనే భారీ అంచనాలను పెంచేసిన ఈ సినిమా విడుదలైన 25 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. మలయాళంలో ఇప్పటి వరకూ అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ చిత్రాల జాబితాలో చేరిపోయిన ఆడు జీవితం ఓటీటీ విడుదలకు రెడీగా ఉంది.ఉత్తమ దర్శకుడిగా జాతీయ అవార్డు అందుకున్న బ్లెస్సీ 'ఆడు జీవితం' చిత్రానికి దర్శకత్వం వహించారు. మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం మే 10 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని వార్తలు వస్తున్నాయి. డిస్నీ+హాట్‌స్టార్ ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను భారీ ధరకు దక్కించుకుంది. అగ్రిమెంట్లో పేర్కొన్న నిబంధనల ప్రకారం, సినిమా విడుదలైన సమయం నుంచి 40 రోజుల తర్వాత OTT స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో విడుదలచేయవచ్చు. దీని ప్రకారం మే 10న ఓటీటీలో ఆడు జీవితం విడుదల కానుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. త్వరలో అధికారికంగా ప్రకటన రానుంది. కథ ఏంటి..?కేరళకు చెందిన నజీబ్ అనే వ్యక్తి కథే ఈ చిత్రం. వాస్తవ సంఘటనలను ఆధారం చేసుకుని ఆడు జీవితం చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు. ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన నజీబ్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడో తెలియజేస్తూ బెన్యామిన్ ‘గోట్ డేస్’ అనే నవలను రచించారు. దీని ఆధారంగానే ఈ సినిమాను మేకర్స్ నిర్మించారు. నజీబ్ పాత్ర కోసం పృథ్వీరాజ్ సుకుమారన్ 31 కిలోల బరువు తగ్గారు. అంతే కాకుండా కొన్ని సీన్స్ కోసం 72 గంటలపాటు భోజనం లేకుండా మంచి నీళ్ల సాయంతోనే ఆయన ఉన్నారు. ఈ సినిమా కోసం ఆయన పడిన శ్రమకు తగిన ఫలితం దక్కిందని చెప్పవచ్చు. ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలం. -
సలార్ హీరో సాహసం.. ఆ సీన్ కోసం ఏకంగా మూడు రోజులు!
సలార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన తాజా చిత్రం ఆడుజీవితం(ది గోట్ లైఫ్). ఈ చిత్రంలో అమలాపాల్ హీరోయిన్గా నటించింది. బ్లెస్సీ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా ఇటీవల థియేటర్లలో రిలీజైంది. బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. యథార్థ సంఘటనలపై బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ ఈ చిత్రాన్ని రూపొందించాడుకేరళకు చెందిన ఓ యువకుడు విదేశాలకు వెళ్లి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడనేది ఈ సినిమాలో చూపించారు. అయితే ఈ చిత్రం కోసం పృథ్వీరాజ్ సుకుమారన్ తీవ్రంగా శ్రమించారు. ఈ సినిమాలో పాత్ర కోసం ఏడు నెలల్లో 31 కిలోల బరువు తగ్గినట్లు వెల్లడించారు. తాజాగా ఈ మూవీ సినిమాటోగ్రాఫర్ సునీల్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ చిత్రంలోని నగ్నంగా కనిపించే సన్నివేశం కోసం కఠినమైన ఉపవాసం చేశారని తెలిపారు. దాదాపు మూడు రోజుల పాటు కనీసం నీళ్లు కూడా తీసుకోకుండా ఉపవాసం ఉన్నారని వెల్లడించారు. ఈ సినిమాపై పృథ్వీరాజ్ అంకితభావం చూపడాన్ని ఆయన కొనియాడారు. పృథ్వీరాజ్‌ను షూట్ జరిగే ప్రదేశానికి కుర్చీలో తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. అంతే కాకుండా నగ్న సన్నివేశాన్ని చిత్రీకరించే ముందు కేవలం 30 ఎంఎల్ వోడ్కా ఎందుకు తాగాడనే విషయాన్ని కూడా సునీల్ వెల్లడించారు. షూట్‌కు ముందు అతని శరీరంలో మిగిలి ఉన్న నీటి నీటి శాతాన్ని బయటకు పంపేందుకు 30 ఎంఎల్ వోడ్కా తీసుకున్నారని తెలిపారు. ఈ సీన్ షాట్‌కు ముందు మేము ఆయనను కుర్చీలో నుంచి లేపాల్సి వచ్చిందని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో నజీబ్ అనే వలస కార్మికుడి పాత్రలో పృథ్వీరాజ్ కనిపించారు. మార్చి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్లకు పైగానే వసూళ్లు రాబట్టింది. Wow 👏 For d Naked Scene, Prithviraj was fasting for 3 Days, not even water in last day; before shoot he took 30ML Vodka to drain remaining water frm body. He was carried in a chair to d location. We needed to lift him from the chair before the shot😯 pic.twitter.com/UjY3Kq0Ti9 — Christopher Kanagaraj (@Chrissuccess) April 2, 2024 -
Aadujeevitham Review: ది గోట్ లైఫ్ (ఆడు జీవితం) మూవీ రివ్యూ
టైటిల్: ది గోట్ లైఫ్ నటీనటులు: పృథ్వీరాజ్ సుకుమారన్, జిమ్మీ జీన్ లూయిస్, అమలాపాల్, కేఆర్ గోకుల్, తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబే తదితరులు నిర్మాణం:జువల్ రొమాన్స్ దర్శకత్వం: బ్లెస్సీ సంగీతం: ఏఆర్ రెహమాన్ సినిమాటోగ్రఫీ: సునీల్ కేఎస్ ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్ విడుదల తేది: మార్చి 28, 2024 నజీబ్(పృథ్వీరాజ్ సుకుమారన్) ఊర్లో ఇసుక పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. భార్య సైను(అమలాపాల్) గర్భవతి. పుట్టబోయే బిడ్డకు మంచి భవిష్యత్ ఇవ్వాలని, అలాగే సొంత ఇంటిని కట్టుకోవాలనే ఉద్దేశంతో సౌదీ వెళ్లాలనుకుంటాడు. అక్కడ భారీగా డబ్బు సంపాదించి ఫ్యామిలీని సంతోషంగా చూసుకోవాలనుకుంటాడు. ఇంటిని తాకట్టు పెట్టి రూ. 30 వేలు అప్పు తెచ్చి మరీ సౌదీకి వెళ్లాడు. అతనితో పాటు హకీమ్(కేఆర్ గోకుల్) కూడా వెళ్తాడు. వీరిద్దరిని ఏజెంట్ మోసం చేస్తాడు. సౌదీకి వెళ్లిన తర్వాత వీరికి ఎవరూ ఉద్యోగం చూపించరు. అక్కడ కఫీల్ చేతిలో ఇరుక్కుంటారు. అతను వీరిద్దరి బలవంతంగా తీసుకెళ్లి వేరు వేరు చోట్ల పనిలో పెడతాడు. నజీబ్‌ని ఏడారిలో గొర్రెలు, మేకలు, ఒంటెలు కాసే పనిలో పెడతారు. అక్కడ నజీబ్‌కి ఎదురైన సమస్యలు ఏంటి? ఏడారి నుంచి బయటపడేందుకు నజీబ్ ఎన్ని కష్టాలు పడ్డాడు? ఆఫ్రికన్ ఇబ్రహం ఖాదిరి (జిమ్మీ జీన్ లూయిస్) నజీబ్‌కి అందించిన సహాయం ఏంటి? చివరకు నజీబ్ తిరిగి ఇండియాకు వెళ్లాడా లేదా? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. 90వ దశకంలో పొట్టకూటి కోసం చాలామంది భారతీయులు గల్ఫ్ దేశాలకు వెళ్లేవారు. అక్కడి వెళ్తే బాగా డబ్బు సంపాదించొచ్చని, దాంతో తమ కష్టాలన్నీ తీరుపోతాయనే ఆశతో అప్పు చేసి మరీ గల్ఫ్ దేశాలకు వెళ్లేవారు. అలాంటివారిలో చాలా మంది ఏజెంట్ చేతిలో మోసపోయేవారు. మంచి ఉద్యోగం ఇప్పిస్తామంటూ భారీగా డబ్బులు వసూలు చేసి.. అక్కడికి వెళ్లిన తర్వాత రెస్పాన్స్ అయ్యేవారు కాదు. మళ్లీ తిరిగి ఇండియాకు వచ్చే స్థోమత లేక చాలా మంది అక్కడ యాచకులుగా.. గొర్రెలు, ఒంటెల కాపరిగా పని చేసేవారు. కొంతమంది అయితే అక్కడే చనిపోయేవారు కూడా. అలా ఏజెంట్ చేతిలో మోసపోయిన ఓ వ్యక్తి కథే ‘ది గోట్ లైఫ్’. చదువు, అవగాహన లేకుండా, ఏజెంట్ చేతిలో మోసపోయి.. దొంగ వీసాలపై గల్ఫ్ దేశాలకు వెళ్లేవారి జీవితాలు ఎలా ఉంటాయి? అక్కడ వారు పడే కష్టాలు ఏంటి? అనేవి కళ్లకు కట్టినట్లు చూపించాడు దర్శకుడు బ్లెస్పీ. ఇది వాస్తవంగా జరిగిన కథే. 90వ దశకంలో కేరళకు చెందిన నజీబ్ అనే వ్యక్తి జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు చాలా కష్టాలు పడ్డాడు. నజీబ్ ఎడారిలో సాగించిన ప్రయాణంలో ఎదుర్కొన్న కష్టాలను వివరిస్తూ ప్రముఖ రచయిత బెన్యామిక్ గోట్ డేస్ అనే పుస్తకాన్ని రాశారు. కేరళలో ఈ పుస్తకం అనూహ్య పాఠక ఆదరణ పొందింది. ఆ పుస్తకం ఆధారంగానే దర్శకుడు బ్లెస్సీ ఈ చిత్రాన్ని రూపొందించాడు. పుస్తకంలోని ప్రతి అక్షరానికి తెర రూపం ఇచ్చాడు దర్శకుడు. సినిమా చూస్తున్నంతసేపు మనసులో ఏదో తెలియని బాధ కలుగుతుంది. ప్రధాన పాత్రకు ఎదురయ్యే సమస్యలు చూసి తట్టుకోలేం. ‘అయ్యో.. ఇంకెంత సేపు ఈ వేదన’ అనే ఫీలింగ్ కలుగులుతుంది. ఓ సాధారణ ప్రేక్షకుడు కోరుకునే ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రంలో ఉండదు. కానీ హీరో పాత్రకు కనెక్ట్ అయితే మాత్రం సీటులో నుంచి కదలరు. హీరో ఏజెంట్ చేతిలో మోసపోయి సౌదీలో బానిసగా మారే సీన్‌తో కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత హీరో గతాన్ని, వర్తమానాన్ని చూపిస్తూ కథనాన్ని ముందుకు నడిపించాడు. అద్భుతమైన స్క్రీన్‌ప్లేతో కథనాన్ని ఆసక్తికరంగా మలిచాడు. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లు ప్రేక్షకుల మనసును మెలిపెట్టేస్తుంది. ఎడారిలో నీళ్ల కోసం అతను పడే బాధను చూపిస్తూనే.. వెంటనే గతంలో నది ఒడ్డున అతను ఎలా బతికాడనేది చూపించారు. ఈ రెండింటిని పోల్చకనే పోలుస్తూ ప్రేక్షకులను ఎమోషనల్‌కు గురి చేశాడు. గొర్రెల మందతో కలిసి హీరో నీళ్లు తాగే సీన్ పెట్టి.. గల్ఫ్ వెళ్లిన తర్వాత అతని పరిస్థితి కూడా ఓ గొర్రెలాగే అయిందని చెప్పే ప్రయత్నం చేశాడు. అద్దంలో తన ముఖం తాను చూసుకొని హీరో పడే బాధను చూస్తుంటే మన గుండె బరువెక్కుతుంది. ఇలాంటి ఎమోషనల్ సీన్స్ ఫస్టాఫ్‌లో చాలానే ఉన్నాయి. ద్వితియార్థంలో కథ కాస్త సాగదీతగా అనిపిస్తుంది. ఏడారి నుంచి బయటపడేందుకు మరో ఇద్దరితో కలిసి హీరో చేసే ప్రయత్నాలు.. ఈ క్రమంలో వారికి ఎదురైన కష్టాల నేపథ్యంలో సెకండాఫ్ సాగుతుంది. దర్శకుడు ప్రతి విషయాన్ని డీటెయిల్డ్‌గా చెప్పే ప్రయత్నం చేశాడు. సెకండాఫ్‌లో వచ్చే కొన్ని సన్నివేశాలు కన్నీళ్లను తెప్పిస్తాయి. ముగింపు ఆకట్టుకుంటుంది. అయితే ఈ కథ అందరికి నచ్చకపోవచు. నిడివి కూడా ఇబ్బంది పెట్టొచ్చు. కానీ హీరో క్యారెక్టర్‌తో కనెక్ట్ అయి చూసేవాళ్లకి మాత్రం ‘ది గోట్ లైఫ్’ అద్భుతమైన సినిమా. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాకు ప్రధాన బలం పృథ్వీరాజ్ సుకుమారన్ నటన. నజీబ్ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. ఈ సినిమా కోసం పృథ్వీరాజ్ పడిన కష్టమంతా తెర పై కనిపించింది. నటనపై ఎంతో ఫ్యాషన్ ఉంటే తప్ప ఇలాంటి పాత్రలు చేయలేరు. పృథ్వీరాజ్ నట జీవితంలో ‘ది గోట్ లైఫ్’ కచ్చితంగా ఒక బెంచ్ మార్క్ మూవీ అనొచ్చు. ఖాదిరి పాత్రకు జిమ్మిజీన్ లూయీస్ న్యాయం చేశాడు. అమలాపాల్ పాత్ర నిడివి తక్కువే అయినా..ఉన్నంతలో చక్కగా నటించింది. హీరోహీరోయిన్ల ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ బాగుంది. మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. టెక్నికల్‌గా సినిమా చాలా బాగుంది. ఏఆర్ రెహమాన్ సంగీతం సినిమా కు ప్లస్ అయింది. తనదైన బిజియం తో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. పాటలు కథకు అనుగుణంగా సాగుతుంది. సినిమాటోగ్రఫీ చాలా అద్భుతంగా ఉంది. ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నతంగా ఉన్నాయి. చివరిగా.. ఈ సినిమా కమర్షియల్‌గా ఏ మేరకు వర్కౌట్ అవుతుందో తెలియదు కానీ.. ఇదొక అవార్డు విన్నింగ్ మూవీ. ఆస్వాదించేవారికి ‘ది గోట్ లైఫ్’ అద్భుతమైన సినిమా. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
ఏడు నెలల్లో 31 కిలోల బరువు తగ్గాను: పృథ్వీరాజ్ సుకుమారన్
‘ఏ నటుడు కూడా తనకు వచ్చిన ప్రతి అవకాశాన్నీ అందుకోలేడు. కొన్ని వదిలేయాల్సి వస్తుంటుంది. ‘ది గోట్ లైఫ్’ (ఆడు జీవితం) సినిమాలో నటిస్తున్నప్పుడు నాకు చాలా సినిమా ఆఫర్స్ వచ్చాయి. కానీ కొన్ని సినిమాల్లో నటించలేకపోయాను. ఇలాంటి అరుదైన సినిమాకు పనిచేస్తున్నప్పుడు మిగతా ఆఫర్స్ వదులుకోవడం తప్పదు’ అన్నారు హీరో పృథ్వీరాజ్ సుకుమారన్. ఆయన ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం). బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ ఈ చిత్రాన్ని రూపొందించాడు. మార్చి 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ► వాస్తవ కథతో "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) సినిమాను తెరకెక్కించారు దర్శకుడు బ్లెస్సీ. 90వ దశకంలో జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన నజీబ్ అనే వ్యక్తి జీవిత కథ ఈ సినిమాకు ఆధారం. రచయిత బెన్యామిన్.. నజీబ్ జీవితానికి అక్షర రూపమిచ్చారు. నజీబ్ ఎడారిలో సాగించిన ప్రయాణంలో ఎదుర్కొన్న కష్టాలను వివరిస్తూ గోట్ డేస్ అనే పుస్తకాన్ని బెన్యామిన్ రాశారు. కేరళలో అనూహ్య పాఠక ఆదరణ పొందిన ఈ పుస్తకం రైట్స్ కోసం మలయాళం సినీ పరిశ్రమలో ప్రతి స్టార్ హీరో, దర్శక నిర్మాతలు పోటీ పడ్డారు. ఆ హక్కులను మా డైరెక్టర్ బ్లెస్సీ దక్కించుకున్నారు. అప్పుడు ఈ ప్రాజెక్ట్ తో 2008లో బ్లెస్సీ నన్ను సంప్రదించారు. అలా "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) తో నా జర్నీ మొదలైంది. ► 2018లో "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) సినిమా షూటింగ్ మొదలుపెట్టాం. ముందుగా రాజస్తాన్ ఎడారిలో షూటింగ్ చేయాలని అనుకున్నా..అక్కడ అరబ్ దేశాల ఎడారుల వాతావరణం కనిపించలేదు. దాంతో జోర్డాన్ వెళ్లి చిత్రీకరణ జరిపాం. నేను బరువు తగ్గేందుకు ఒక షెడ్యూల్ షూటింగ్ తర్వాత 7 నెలల గ్యాప్ తీసుకున్నాం. షూటింగ్ ప్రాసెస్ లో ఉండగానే లాక్ డౌన్ వచ్చింది. అప్పుడు జోర్డాన్ షూటింగ్ లో ఉన్నాం. ప్రయాణాలు మొత్తం ఆపేశారు. అక్కడి నుంచి బయటపడే వీలు లేదు. వందేభారత్ ఫ్లైట్ తో కేరళ చేరుకున్నాం. ఏడాదిన్నర తర్వాత అల్జీరియా సహారా ఎడారిలో చిత్రీకరణ తిరిగి ప్రారంభించాం. ఇలా ఎన్నో కష్టాలు పడి, అరుదైన లొకేషన్స్ లో "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) సినిమా షూటింగ్ కంప్లీట్ చేశాం. పోస్ట్ ప్రొడక్షన్ లోనూ రాజీ లేకుండా వరల్డ్ క్లాస్ క్వాలిటీతో వర్క్ చేశాం. వాస్తవంగా రెండేళ్లలో పూర్తి చేయాల్సిన సినిమా ఇది. కోవిడ్ వల్ల ఆలస్యమైంది. ► ఈ సినిమా ఒప్పుకున్నప్పుడే షూటింగ్ కోసం కష్టపడాల్సి వస్తుందని తెలుసు. రోజుల పాటు డైట్ చేశాను. నజీబ్ పాత్రలా మారేందుకు ప్రయత్నించాను. ఎందుకంటే నా క్యారెక్టర్ శరీరాకృతి ద్వారా ప్రేక్షకులు ఆ కథను, క్యారెక్టర్ ను అనుభూతి చెందుతారు. క్యారెక్టర్ కోసం నేను కఠినమైన ఆహార నియమాలు పాటించాను. 31 కిలోల బరువు తగ్గాను. ఈ క్రమంలో నా ఆరోగ్యం గురించి మా కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందారు. నా భార్య, మా పాప సినిమా కోసం నేను చేస్తున్న ప్రయత్నాన్ని అర్థం చేసుకుని సపోర్ట్ గా నిలిచారు. నజీబ్ ఎడారిలో ఎలాంటి కష్టాలు ఎదుర్కొని ఉంటాడని ఊహించుకుంటూ ఈ క్యారెక్టర్ లో నటించాను. కష్టపడినా నజీబ్ క్యారెక్టర్ ను విజయవంతంగా పోషించినందుకు సంతోషంగా ఉంది. ► "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) సినిమా కోసం మేము చేసిన సుదీర్ఘ ప్రయాణంలో మమ్మల్ని నడిపించిన విషయం మేమొక గొప్ప సినిమా చేస్తున్నామనే నమ్మకమే. ప్రేక్షకులకు ఒక స్పెషల్ మూవీ ఇవ్వబోతున్నామనే విశ్వాసంతోనే 16 ఏళ్లు సినిమాతో ముందుకు సాగాం. నజీబ్ అనే వ్యక్తి ఇప్పటికీ మన మధ్యే ఉన్నాడు. అతను తన జీవితం ద్వారా మనకు అందించిన స్ఫూర్తి ఎంతో గొప్పది. ► "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) సినిమా కోసం తీవ్రమైన చలిలో, వేడి వాతావారణంలో, బలమైన గాలులు వీచే వాతావరణంలో షూటింగ్ చేశాం. ఏడారి జీవితాన్ని సజీవంగా తెరపై చూపించాలంటే అక్కడి వాతావరణాన్ని క్యాప్చర్ చేయాలి. ఇందుకోసం మా మూవీ టీమ్ ప్రతిభావంతంగా పనిచేసింది. ► డైరెక్టర్ బ్లెస్సీ నేను "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) సినిమా రిలీజ్ కాబోతున్న రోజుకోసం ఎంతో కాలంగా వేచి చూస్తున్నాం. ఇది మా కల. ఆ కల నిజమవుతుందంటే చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా రూపకల్పనలో ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి, ఎన్నో కష్టాలు పడ్డాం. ఇప్పుడు అవన్నీ దాటుకుని ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. ఇంత కష్టపడిన సినిమా ప్రేక్షకుల దగ్గరకు చేరాలి. ఇందుకు పేరున్న దేశవ్యాప్తంగా డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ను సెలెక్ట్ చేసుకున్నా. ► లాస్ట్ ఇయర్ సలార్ లో నన్ను ప్రేక్షకులు రాజమన్నార్ గా ఆదరించారు. ఇప్పుడు "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) సినిమాలో సలార్ కు పూర్తి భిన్నమైన క్యారెక్టర్ చేశాను. ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని ఆశిస్తున్నా. సర్వైవల్ థ్రిల్లర్స్ ప్రేక్షకులకు తప్పకుండా ఆసక్తి కలిగిస్తాయి. నజీబ్ క్యారెక్టర్ లో నా పర్ ఫార్మెన్స్ ఎలా ఉందో ప్రేక్షకుల స్పందనతో తెలుసుకోవాలని అనుకుంటున్నా. ► నా కెరీర్ విషయానికి వస్తే అనుకోకుండానే నటుడిని అయ్యాను. మనం సినిమాలను కమర్షియల్, కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ అంటూ విభజన చేస్తాం. కానీ నా దృష్టిలో మంచి సినిమాకు మంచి స్క్రిప్ట్ ఉండాలి. కమర్షియల్ మూవీస్ లోనూ బలమైన కథా కథనాలు ఉంటాయి. మంచి నటులు తమకొచ్చే అరుదైన అవకాశాలు వదులుకోరని భావిస్తా. -
ఫ్యాన్స్ అత్యుత్సాహం.. స్టార్ హీరో కారు అద్దాలు ధ్వంసం!
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ ఫ్యాన్స్ వీరంగం సృష్టించారు. అది కూడా కేరళలో తమ అభిమాన హీరో కారుపైనే. ప్రస్తుతం ఈ విషయం కాస్త చర్చనీయాంశంగా మారింది. అలానే సదరు ఘటనకు సంబంధించిన కొన్ని వీడియోలు బయటకొచ్చాయి. దీంతో ఇది కాస్త ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది. ఇంతకీ అసలేం జరిగింది? విజయ్ కేరళలో ఏం చేస్తున్నాడు? (ఇదీ చదవండి: మంచు లక్ష్మి కాళ్ల మీద పడి ఏడ్చేసిన అభిమాని.. వీడియో వైరల్) 'లియో' సినిమాతో ప్రేక్షకుల్ని గతేడాది పలకరించిన విజయ్.. ప్రస్తుతం 'ద గోట్' (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) అనే మూవీ చేస్తున్నాడు. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ కథతో ఈ చిత్ర షూటింగ్ కోసం వారం రోజుల పాటు టీమ్ అంతా కేరళ వెళ్లారు. దాదాపు 14 ఏళ్ల తర్వాత తమ దగ్గరకు వస్తున్నాడని తెలిసి, కేరళలోని విజయ్ ఫ్యాన్స్ ఒక్కచోటకు చేరారు. ఈ క్రమంలోనే తోపులాట జరిగింది. విజయ్ వస్తున్నాడని తెలిసి వందలాది మంది ఫ్యాన్స్ ఎయిర్పోర్ట్ దగ్గరకు చేరుకున్నారు. అయితే అక్కడి నుంచి విజయ్ కారులో ప్రయాణిస్తున్న సమయంలో తోపులాట ఎక్కువ కావడంతో కారు డ్రైవర్ దగ్గర ఉండే అద్దం పగిలిపోయింది. అలానే చాలా చోట్ల కారుకి సొట్టలు కూడా పడ్డాయి. కాకపోతే ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు ఆ కారుకి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. (ఇదీ చదవండి: 'గుంటూరు కారం' విషయంలో బాధంతా వాళ్లదే: నిర్మాత నాగవంశీ) Video: Thalapathy Vijay's car damaged after massive fan turnout in Kerala #VIJAYStormHitsKerala pic.twitter.com/5gUceexTSI — Webdunia Telugu (@WebduniaTelugu) March 19, 2024 -
'సలార్' విలన్ పాన్ ఇండియా మూవీ.. ట్రైలర్ ఓ విజువల్ వండర్
ఈసారి వేసవిలో ప్రభాస్ 'కల్కి' తప్పితే స్టార్ హీరోల సినిమాలేం రావట్లేదు. ఏప్రిల్‌లో 'దేవర' రావాల్సింది కానీ వాయిదా పడింది. అయితే ఇప్పుడు సినీ ప్రేమికుల్ని మెస్మరైజ్ చేసేందుకు క్రేజీ పాన్ ఇండియా మూవీ వచ్చేస్తోంది. 'సలార్'లో ప్రభాస్ ఫ్రెండ్, విలన్‌గా చేసిన పృథ్వీరాజ్ సుకుమారన్.. ఈ మూవీ సర్వైవర్ డ్రామాలో హీరోగా నటించాడు. మార్చి 28న సినిమా థియేటర్లలోకి రాబోతున్న సందర్భంగా రిలీజ్ ట్రైలర్‌ని తాజాగా విడుదల చేశారు. (ఇదీ చదవండి: 'గామి' సినిమా రివ్యూ) పృథ్వీరాజ్ సుకుమారన్ లేటెస్ట్ మూవీ 'ఆడు జీవితం'. పొట్టకూటి కోసం సౌదీకి వలస వెళ్లిన నజీబ్ మహమ్మద్ అనే మలయాళీ కుర్రాడు ఎన్ని కష్టాలు పడ్డాడు? అక్కడ బానిస బతుకు నుంచి బయటపడేందుకు ఎడారి బాట పట్టిన ఇతడు.. ఎలా బతికి బట్టకట్టాడు అనేదే స్టోరీ. పాత ట్రైలర్ సంగతి పక్కనబెడితే తాజా ట్రైలర్ మాత్రం విజువల్ వండర్లా అనిపించింది. లాంగ్ ఫ్రేమ్స్, క్లోజ్ ఫ్రేమ్స్ సీన్స్ మాత్రమే చూపించారు. ఒకే ఒక్క డైలాగ్‌తో అద్భుతమైన సినిమా చూడబోతున్నామనే ఫీలింగ్ కలిగించారు. హీరోగా చేసిన పృథ్వీరాజ్ లుక్ ట్రైలర్లో చూస్తుంటే షాకింగ్‌గా అనిపించింది. ఏఆర్ రెహమన్ సంగీతం కూడా సమ్‌థింగ్ డిఫరెంట్ అనేలా ఉంది. ఈ సినిమా దర్శకుడు బ్లెస్సీ, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్, సౌండ్ డిజైనర్ రసూల్ పూకుట్టి.. ఇలా జాతీయ స్థాయిలో అవార్డు గ్రహీతలు అందరూ ఈ చిత్రం కోసం పనిచేయడం విశేషం. (ఇదీ చదవండి:ఓటీటీలోకి వచ్చేసిన మూడు క్రేజీ సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) -
‘ది గోట్ లైఫ్’ తప్పకుండా చూడాల్సిన సినిమా: రణ్వీర్ సింగ్
మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న తాజా చిత్రం "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం). హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, అమలాపాల్, కేఆర్ గోకుల్, అరబ్ ఫేమస్ యాక్టర్స్ తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబే ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా ఈ సినిమాను అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ రూపొందించారు. ఏప్రిల్ 10న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ప్రభాస్ చేతుల మీదుగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌కు ప్రేక్షకుల నంచి మంచి స్పందన లభించింది. తాజాగా ఈ మూవీ సెకండ్ పోస్టర్ని బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. 'ఇది తప్పకుండా చూడాల్సిన సినిమా..' అంటూ ఆయన పోస్టర్ రిలీజ్ సందర్భంగా క్యాప్షన్ రాశారు. ఈ సెకండ్ లుక్ పోస్టర్ ఎమోషనల్ గా ఉంది. ఒక ఆశతో సుదీర్ఘ ప్రయాణం సాగిస్తున్న కథానాయకుడి భావోద్వేగం అంతా ఆయన మొహంలో కనిపిస్తోంది. నజీర్ క్యారెక్టర్ లో పృథ్వీరాజ్ సుకుమారన్ ఎంతగా ఒదిగిపోయారో ఈ పోస్టర్ చూపిస్తోంది. 90వ దశకంలో జీవనోపాధి వెతుక్కుంటూ కేరళను వదిలి విదేశాలకు వలస వెళ్లిన నజీబ్ అనే యువకుడి జీవిత కథను వాస్తవ ఘటనల ఆధారంగా "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం)లో చూపించబోతున్నారు. ఇది పూర్తిస్థాయిలో ఎడారిలో రూపొందుతున్న తొలి భారతీయ సినిమా కావడం విశేషం. View this post on Instagram A post shared by Ranveer Singh (@ranveersingh)