'సలార్' విలన్ పాన్ ఇండియా మూవీ.. ట్రైలర్ ఓ విజువల్ వండర్‌ | Prithviraj's Aadujeevitham (The Goat Life) Movie Trailer Out | Sakshi
Sakshi News home page

Aadujeevitham Trailer: కేక పుట్టిస్తున్న ట్రైలర్.. సినిమా రిలీజ్ ఎప్పుడంటే?

Published Sat, Mar 9 2024 3:05 PM | Last Updated on Sat, Mar 9 2024 3:25 PM

Prithviraj Aadujeevitham The Goat Life Movie Trailer Latest - Sakshi

ఈసారి వేసవిలో ప్రభాస్ 'కల్కి' తప్పితే స్టార్ హీరోల సినిమాలేం రావట్లేదు. ఏప్రిల్‌లో 'దేవర' రావాల్సింది కానీ వాయిదా పడింది. అయితే ఇప్పుడు సినీ ప్రేమికుల్ని మెస్మరైజ్ చేసేందుకు క్రేజీ పాన్ ఇండియా మూవీ వచ్చేస్తోంది. 'సలార్'లో ప్రభాస్ ఫ్రెండ్‌, విలన్‌గా చేసిన పృథ్వీరాజ్ సుకుమారన్.. ఈ మూవీ సర్వైవర్ డ్రామాలో హీరోగా నటించాడు. మార్చి 28న సినిమా థియేటర్లలోకి రాబోతున్న సందర్భంగా రిలీజ్ ట్రైలర్‌ని తాజాగా విడుదల చేశారు.

(ఇదీ చదవండి: 'గామి' సినిమా రివ్యూ)

పృథ్వీరాజ్ సుకుమారన్ లేటెస్ట్ మూవీ 'ఆడు జీవితం'. పొట్టకూటి కోసం సౌదీకి వలస వెళ్లిన నజీబ్ మహమ్మద్ అనే మలయాళీ కుర్రాడు ఎన్ని కష్టాలు పడ్డాడు? అక్కడ బానిస బతుకు నుంచి బయటపడేందుకు ఎడారి బాట పట్టిన ఇతడు.. ఎలా బతికి బట్టకట్టాడు అనేదే స్టోరీ. పాత ట్రైలర్ సంగతి పక్కనబెడితే తాజా ట్రైలర్ మాత్రం విజువల్ వండర్‌లా అనిపించింది. లాంగ్ ఫ్రేమ్స్, క్లోజ్ ఫ్రేమ్స్‌ సీన్స్ మాత్రమే చూపించారు. ఒకే ఒక్క డైలాగ్‌తో అద్భుతమైన సినిమా చూడబోతున్నామనే ఫీలింగ్ కలిగించారు.

హీరోగా చేసిన పృథ్వీరాజ్ లుక్ ట్రైలర్‌లో చూస్తుంటే షాకింగ్‌గా అనిపించింది. ఏఆర్ రెహమన్ సంగీతం కూడా సమ్‌థింగ్ డిఫరెంట్ అనేలా ఉంది. ఈ సినిమా దర్శకుడు బ్లెస్సీ, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్, సౌండ్ డిజైనర్ రసూల్ పూకుట్టి.. ఇలా జాతీయ స్థాయిలో అవార్డు గ్రహీతలు అందరూ ఈ చిత్రం కోసం పనిచేయడం విశేషం. 

(ఇదీ చదవండి:ఓటీటీలోకి వచ్చేసిన మూడు క్రేజీ సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement