ఓటీటీలోకి రియల్ లైఫ్ ట్రాజెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? | The Goat Life Ott Release Date Latest | Sakshi
Sakshi News home page

The Goat Life OTT: మలయాళ హిట్ సినిమా.. ఓటీటీలోకి అప్పుడేనా?

Published Mon, May 6 2024 2:28 PM | Last Updated on Mon, May 6 2024 2:59 PM

The Goat Life Ott Release Date Latest

సరైన సినిమాల్లేక బాక్సాఫీస్ డల్ అయిపోయింది. అల్లరి నరేశ్ 'ఆ ఒక్కటి అడక్కు' మూవీపై గంపెడాశలు పెట్టుకుని గతవారం థియేటర్లలో రిలీజ్ చేశాడు. పెద్దగా లాభం లేకుండా పోయింది. దీంతో ప్రేక్షకుల దృష్టి ఓటీటీలపై పడింది. ప్రస్తుతానికైతే ఓటీటీలో 'మంజుమ్మల్ బాయ్స్' మూవీ బాగానే ఆకట్టుకుంటోంది. త్వరలో 'ఆవేశం' స్ట్రీమింగ్ కానుండగా.. ఇప్పుడు ఈ లిస్టులోకి మరో రియల్ లైఫ్ సినిమా వచ్చేందుకు రెడీ అయిపోయింది.

(ఇదీ చదవండి: This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?)

మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ గురించి తెలుగు ప్రేక్షకులకు తెలుసు. ఎందుకంటే 'సలార్'లో రాజమన్నార్ అనే విలన్‌ పాత్రలో మెప్పించాడు. ఇతడు మెయిన్ రోల్‌లో నటించిన 'ద గోట్ లైఫ్' అనే సినిమా మార్చి చివర్లో రిలీజైంది. పనికోసం దుబాయి వెళ్లిన ఓ వ్యక్తి.. అ‍క్కడ ఎలా చిక్కుకుపోయాడు? అక్కడి నుంచి స్వదేశానికి ఎలా తిరిగొచ్చాడు? అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తీశారు. మలయాళంలో హిట్ టాక్ తెచ్చుకుంది. కానీ తెలుగులో మాత్రం సీరియస్ కాన్సెప్ట్ కావడంతో మనోళ్లు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు.

ఇకపోతే 'ద గోట్ లైఫ్' సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కి సిద్ధమైందని తెలుస్తోంది. మే 26 నుంచి హాట్‍‌స్టార్‌లో అందుబాటులోకి రానుందని అంటున్నారు. మరోవైపు చెప్పిన టైమ్ కంటే ముందే మే 10నే ఓటీటీలో రిలీజ్ కానుందని టాక్ వినిపిస్తోంది. ఆసక్తికర విషయం ఏంటంటే ఈ సినిమా తీయడానికి దాదాపు 16 ఏళ్లు పట్టింది. ఆరేళ్ల క్రితం షూటింగ్ మొదలుపెట్టి, పలు కష్టాలతో పూర్తి చేశారు. ఈ ఏడాది రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: స్టార్ ప్రొడ్యూసర్ పరువు తీసిన కామెడీ షో.. ఇన్ స్టా పోస్ట్ వైరల్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement