పృథ్వీరాజ్ సుకుమార్, అమలాపాల్ జంటగా నటించిన చిత్రం ఆడుజీవితం(ది గోట్ లైఫ్). మార్చి 28న రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. సర్వైవల్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రం కేవల 25 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ చిత్రాల జాబితాలో చోటు సంపాదించుకుంది.
అయితే ఈ సినిమా రిలీజై రెండు నెలల కావొస్తున్నా ఇప్పటి వరకు ఓటీటీకి రాలేదు. గతంలో చాలాసార్లు ఓటీటీ స్ట్రీమింగ్‌పై రానుందని వార్తలొచ్చాయి. కానీ మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. తాజాగా మరోసారి ఓటీటీకి సంబంధించిన నెట్టింట వైరలవుతోంది. ఈనెల 26 నుంచి స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ తేదీపై కూడా చిత్రబృందం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. మరోవైపు ఈ మూవీ హక్కులను సొంతం చేసుకున్న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఎలాంటి అప్‌డేట్ ఇవ్వడం లేదు. దీంతో ఈ సారైనా ఓటీటీకి వస్తుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
అసలు కథేంటంటే..?
కేరళకు చెందిన నజీబ్ అనే వ్యక్తి కథే ఈ చిత్రం. వాస్తవ సంఘటనలను ఆధారం చేసుకుని ఆడు జీవితం చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు. ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన నజీబ్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడో తెలియజేస్తూ బెన్యామిన్ ‘గోట్ డేస్’ అనే నవలను రచించారు. దీని ఆధారంగానే ఈ సినిమాను మేకర్స్ నిర్మించారు. నజీబ్ పాత్ర కోసం పృథ్వీరాజ్ సుకుమారన్ 31 కిలోల బరువు తగ్గారు. అంతే కాకుండా కొన్ని సీన్స్ కోసం 72 గంటలపాటు భోజనం లేకుండా మంచి నీళ్ల సాయంతోనే ఆయన ఉన్నారు. ఈ సినిమా కోసం ఆయన పడిన శ్రమకు తగిన ఫలితం దక్కిందని చెప్పవచ్చు. ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment