ఈ ఏడాది వచ్చిన హిట్ చిత్రాల్లో ద గోట్ లైఫ్ ఒకటి. ఈ మలయాళ మూవీ తెలుగులో ఆడుజీవితం పేరిట విడుదలైంది. పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన ఈ చిత్రానికి బ్లెస్సీ దర్శకత్వం వహించాడు. కేరళకు చెందిన నజీబ్ మహ్మద్ డబ్బు సంపాదించేందుకు సౌదీ అరేబియాకు వలస వెళ్లి అక్కడ ఎన్నో కష్టాలు పడ్డాడు. వీటన్నింటినీ బెన్యమిన్ అనే రచయిత గోట్ లైఫ్ అనే నవలలో రాసుకొచ్చాడు. దీన్ని ఆధారంగా చేసుకుని ఆడు జీవితం మూవీ తెరకెక్కింది.
మార్చిలో రిలీజ్
ఈ మూవీ కోసం పృథ్వీరాజ్ ఏడు నెలల్లో 31 కిలోలు బరువు తగ్గాడు. ఓ సన్నివేశం కోసం మూడురోజుల పాటు ఏమీ తినకుండా కఠిన ఉపవాసం చేశాడు. అంతటి అంకితభావంతో ఈ మూవీ కోసం పని చేశాడు. మార్చి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లు రాబట్టింది. కానీ సుమారు నాలుగు నెలలు కావస్తున్నా ఇంతవరకు ఓటీటీలోకి రానేలేదు.
ఓటీటీలో
ఈ క్రమంలో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 19 నుంచి మలయాళ, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. ఎట్టకేలకు ఓటీటీలోకి వస్తుండటంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
చదవండి: Thanksgiving Movie: వయొలెన్స్.. వయొలెన్స్.. ధైర్యం ఉంటే చూసేయండి
Comments
Please login to add a commentAdd a comment