మరో సోమవారం వచ్చేసింది. గత వారం థియేటర్లలో రిలీజైన 'భారతీయుడు 2' ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. దీంతో కొత్త సినిమా కోసం మూవీ లవర్స్ తెగ ఎదురుచూస్తున్నారు. ఇందుకు తగ్గట్లే ఈ శుక్రవారం డార్లింగ్, పేకమేడలు, బ్యాడ్ న్యూజ్ (హిందీ) చిత్రాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. వీటిపై అంతగా బజ్ లేదు. దీంతో ఆటోమేటిక్‌గా అందరి దృష్టి ఓటీటీ రిలీజుల మీద పడుతుంది. ఈ క్రమంలోనే 26 వరకు సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి.
(ఇదీ చదవండి: హీరో కిరణ్ అబ్బవరంతో పెళ్లి... తేదీ రివీల్ చేసిన హీరోయిన్)
ఓటీటీలో ఈ వారం రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే 'ఆడు జీవితం' సినిమా ఆసక్తి రేపుతుండగా.. బహిష్కరణ, నాగేంద్రన్స్ హనీమూన్ అనే వెబ్ సిరీసులు ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాయి. ఇవి కాకుండా 'హాట్ స్పాట్' అనే మరో డబ్బింగ్ మూవీ కూడా ఉన్నంతలో బెటర్ ఆప్షన్‌గా కనిపిస్తోంది. ఇవి కాకుండా ఇంకా ఏమేం మూవీస్-వెబ్ సిరీసులు ఓటీటీల్లోకి రాబోతున్నాయనేది దిగువన లిస్ట్ ఉంది చూసేయండి.
ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ జాబితా (జూలై 15 నుంచి 21 వరకు)
హాట్‌స్టార్
నాగేంద్రన్స్ హనీమూన్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూలై 19
జీ5
బహిష్కరణ (తెలుగు వెబ్ సిరీస్) - జూలై 19
బర్జాక్ (హిందీ సిరీస్) - జూలై 19
ఆహా
హాట్ స్పాట్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - జూలై 17
నెట్‌ఫ్లిక్స్
భారతీయుడు (తెలుగు సినిమా) - జూలై 15
వాండరుస్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 15
టీ పీ బన్ సీజన్ 2 (జపనీస్ సిరీస్) - జూలై 17
ద గ్రీన్ గ్లోవ్ గ్యాంగ్ సీజన్ 2 (పోలిష్ సిరీస్) - జూలై 17
కోబ్లా కాయ్ సీజన్ 6 పార్ట్ 1 (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 18
మాస్టర్ ఆఫ్ ద హౌస్ (థాయ్ సిరీస్) - జూలై 18
త్రిభువన్ మిశ్రా సీఏ టాపర్ (హిందీ సిరీస్) - జూలై 18
ఆడు జీవితం (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూలై 19
ఫైండ్ మీ ఫాలింగ్ (ఇంగ్లీష్ మూవీ) - జూలై 19
స్కై వాకర్స్: ఏ లవ్ స్టోరీ (ఇంగ్లీష్ చిత్రం) - జూలై 19
స్వీట్ హోమ్ సీజన్ 3 (కొరియన్ సిరీస్) - జూలై 19
అమెజాన్ ప్రైమ్
మై స్పై: ద ఎటర్నల్ సిటీ (ఇంగ్లీష్ మూవీ) - జూలై 18
బెట్టీ లా ఫీ (స్పానిష్ సిరీస్) - జూలై 19
జియో సినిమా
కుంగ్ ఫూ పాండా 4 (ఇంగ్లీష్ సినిమా) - జూలై 15
మిస్టర్ బిగ్ స్టఫ్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 18
ఐఎస్ఎస్ (ఇంగ్లీష్ మూవీ) - జూలై 19
బుక్ మై షో
జస్టిస్ లీగ్: క్రైసిస్ ఆఫ్ ఇన్ఫినిటీ ఎర్త్స్, పార్ట్ 3 (ఇంగ్లీష్ మూవీ) - జూలై 16
ద డీప్ డార్క్ (ఫ్రెంచ్ సినిమా) - జూలై 19
డిస్కవరీ ప్లస్
ద బ్లాక్ విడోవర్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 18
లయన్స్ గేట్ ప్లే
అర్కాడియన్ (ఇంగ్లీష్ మూవీ) - జూలై 19
ఆపిల్ ప్లస్ టీవీ
లేడీ ఇన్ ద లేక్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 19
హోయ్ చోయ్ టీవీ
ధర్మజుద్దా (బెంగాలీ సినిమా) - జూలై 19
(ఇదీ చదవండి: 'కల్కి' ల్యాగ్ అనిపించింది.. ప్రభాస్‌ని అలా చూపించాల్సింది!)
Comments
Please login to add a commentAdd a comment