bahiskarana
-
ఈ శుక్రవారం ఓటీటీల్లో 16 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?
మరో వీకెండ్ వచ్చేసింది. ఇందులో భాగంగానే శుక్రవారం పలు సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతున్నప్పటికీ ప్రియదర్శి 'డార్లింగ్' మూవీపై మాత్రం కాస్త హైప్ ఉంది. మరోవైపు ఓటీటీలో మాత్రం ఈ శుక్రవారం ఏకంగా 16 కొత్త మూవీస్-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఓవరాల్‌గా చూసుకుంటే ఈ వీకెండ్లో 27 మూవీస్ ప్లస్ సిరీసులు అలరించనున్నాయి. ఇంతకీ ఏ సినిమా ఏ ఓటీటీలో ఉందనేది ఇప్పుడు చూసేద్దాం.(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన డిఫరెంట్ తెలుగు సినిమా)ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చే మూవీస్ జాబితా (జూలై 19)నెట్ఫ్లిక్స్ఆడు జీవితం - తెలుగు డబ్బింగ్ మూవీఫైండ్ మీ ఫాలింగ్ - ఇంగ్లీష్ మూవీస్కై వాకర్స్: ఏ లవ్ స్టోరీ - ఇంగ్లీష్ చిత్రంస్వీట్ హోమ్ సీజన్ 3 - కొరియన్ సిరీస్కోబ్లా కాయ్ సీజన్ 6 పార్ట్ 1 - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్)మాస్టర్ ఆఫ్ ద హౌస్ - థాయ్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది)త్రిభువన్ మిశ్రా సీఏ టాపర్ - హిందీ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)కోబ్రా కోయ్ సీజన్ 6 పార్ట్ 1 - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్)మాస్టర్ ఆఫ్ ద హౌస్ - థాయ్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)పసుత్రి గాజే - ఇండోనేసియన్ సినిమా (స్ట్రీమింగ్)ఆహాద అకాలీ - తమిళ సినిమాబూమర్ అంకుల్ - తెలుగు డబ్బింగ్ మూవీ (జూలై 20)హాట్స్టార్నాగేంద్రన్స్ హనీమూన్ - తెలుగు డబ్బింగ్ సిరీస్యంగ్ ఉమెన్ అండ్ ద సీ - ఇంగ్లీష్ సినిమాజీ5బహిష్కరణ - తెలుగు వెబ్ సిరీస్బర్జాక్ - హిందీ సిరీస్అమెజాన్ ప్రైమ్బెట్టీ లా ఫీ - స్పానిష్ సిరీస్మ్యూజిక్ షాప్ మూర్తి - తెలుగు సినిమా (స్ట్రీమింగ్)అన్ ఇంటరప్టెడ్ టాప్ క్లాస్ టెన్నిస్ - ఇంగ్లీష్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)జియో సినిమాఐఎస్ఎస్ - ఇంగ్లీష్ మూవీమిస్టర్ బిగ్ స్టఫ్ - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది)ఆపిల్ ప్లస్ టీవీలేడీ ఇన్ ద లేక్ - ఇంగ్లీష్ సిరీస్హోయ్ చోయ్ టీవీధర్మజుద్దా - బెంగాలీ సినిమాబుక్ మై షోద డీప్ డార్క్ - ఫ్రెంచ్ సినిమాద వాచర్స్ - ఇంగ్లీష్ మూవీలయన్స్ గేట్ ప్లేఅర్కాడియన్ - ఇంగ్లీష్ మూవీడిస్కవరీ ప్లస్ద బ్లాక్ విడోవర్ - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్)(ఇదీ చదవండి: రెండో పెళ్లికి రెడీ అయిన స్టార్ హీరో హృతిక్ రోషన్.. హింట్ ఇచ్చేశాడా?) -
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 26 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్
మరో సోమవారం వచ్చేసింది. గత వారం థియేటర్లలో రిలీజైన 'భారతీయుడు 2' ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. దీంతో కొత్త సినిమా కోసం మూవీ లవర్స్ తెగ ఎదురుచూస్తున్నారు. ఇందుకు తగ్గట్లే ఈ శుక్రవారం డార్లింగ్, పేకమేడలు, బ్యాడ్ న్యూజ్ (హిందీ) చిత్రాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. వీటిపై అంతగా బజ్ లేదు. దీంతో ఆటోమేటిక్‌గా అందరి దృష్టి ఓటీటీ రిలీజుల మీద పడుతుంది. ఈ క్రమంలోనే 26 వరకు సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి.(ఇదీ చదవండి: హీరో కిరణ్ అబ్బవరంతో పెళ్లి... తేదీ రివీల్ చేసిన హీరోయిన్)ఓటీటీలో ఈ వారం రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే 'ఆడు జీవితం' సినిమా ఆసక్తి రేపుతుండగా.. బహిష్కరణ, నాగేంద్రన్స్ హనీమూన్ అనే వెబ్ సిరీసులు ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాయి. ఇవి కాకుండా 'హాట్ స్పాట్' అనే మరో డబ్బింగ్ మూవీ కూడా ఉన్నంతలో బెటర్ ఆప్షన్‌గా కనిపిస్తోంది. ఇవి కాకుండా ఇంకా ఏమేం మూవీస్-వెబ్ సిరీసులు ఓటీటీల్లోకి రాబోతున్నాయనేది దిగువన లిస్ట్ ఉంది చూసేయండి.ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ జాబితా (జూలై 15 నుంచి 21 వరకు)హాట్స్టార్నాగేంద్రన్స్ హనీమూన్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూలై 19జీ5బహిష్కరణ (తెలుగు వెబ్ సిరీస్) - జూలై 19బర్జాక్ (హిందీ సిరీస్) - జూలై 19ఆహాహాట్ స్పాట్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - జూలై 17నెట్ఫ్లిక్స్భారతీయుడు (తెలుగు సినిమా) - జూలై 15వాండరుస్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 15టీ పీ బన్ సీజన్ 2 (జపనీస్ సిరీస్) - జూలై 17ద గ్రీన్ గ్లోవ్ గ్యాంగ్ సీజన్ 2 (పోలిష్ సిరీస్) - జూలై 17కోబ్లా కాయ్ సీజన్ 6 పార్ట్ 1 (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 18మాస్టర్ ఆఫ్ ద హౌస్ (థాయ్ సిరీస్) - జూలై 18త్రిభువన్ మిశ్రా సీఏ టాపర్ (హిందీ సిరీస్) - జూలై 18ఆడు జీవితం (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూలై 19ఫైండ్ మీ ఫాలింగ్ (ఇంగ్లీష్ మూవీ) - జూలై 19స్కై వాకర్స్: ఏ లవ్ స్టోరీ (ఇంగ్లీష్ చిత్రం) - జూలై 19స్వీట్ హోమ్ సీజన్ 3 (కొరియన్ సిరీస్) - జూలై 19అమెజాన్ ప్రైమ్మై స్పై: ద ఎటర్నల్ సిటీ (ఇంగ్లీష్ మూవీ) - జూలై 18బెట్టీ లా ఫీ (స్పానిష్ సిరీస్) - జూలై 19జియో సినిమాకుంగ్ ఫూ పాండా 4 (ఇంగ్లీష్ సినిమా) - జూలై 15మిస్టర్ బిగ్ స్టఫ్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 18ఐఎస్ఎస్ (ఇంగ్లీష్ మూవీ) - జూలై 19బుక్ మై షోజస్టిస్ లీగ్: క్రైసిస్ ఆఫ్ ఇన్ఫినిటీ ఎర్త్స్, పార్ట్ 3 (ఇంగ్లీష్ మూవీ) - జూలై 16ద డీప్ డార్క్ (ఫ్రెంచ్ సినిమా) - జూలై 19డిస్కవరీ ప్లస్ద బ్లాక్ విడోవర్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 18లయన్స్ గేట్ ప్లేఅర్కాడియన్ (ఇంగ్లీష్ మూవీ) - జూలై 19ఆపిల్ ప్లస్ టీవీలేడీ ఇన్ ద లేక్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 19హోయ్ చోయ్ టీవీధర్మజుద్దా (బెంగాలీ సినిమా) - జూలై 19(ఇదీ చదవండి: 'కల్కి' ల్యాగ్ అనిపించింది.. ప్రభాస్‌ని అలా చూపించాల్సింది!) -
ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన మరో తెలుగు హీరోయిన్
ఓటీటీలు వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో చాలా మార్పులొచ్చాయి. థియేటర్లలో కంటే ఓటీటీల్లోనే సినిమాల్ని ఎక్కువగా చూస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురు స్టార్ హీరోహీరోయిన్లు సైతం డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ లిస్టులో వెంకటేశ్, రానా, నాగచైతన్య, అంజలి లాంటి వాళ్లు ఉన్నారు. ఇప్పుడు ఈ లిస్టులోకి మరో తెలుగు హీరోయిన్ చేరింది.(ఇదీ చదవండి: ఫాదర్స్ డే స్పెషల్.. కూతురితో రామ్ చరణ్ క్యూట్ ఫొటో)మల్లేశం, వకీల్ సాబ్ తదితర చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న అనన్య నాగళ్ల.. వీటితో పాటు ప్లే బ్యాక్, శాకుంతలం, మళ్లీ పెళ్లి, తంత్ర, అన్వేషి సినిమాలు చేసింది గానీ బ్రేక్ అందుకోలేకపోయింది. ఈ ఏడాది 'తంత్ర' అనే హారర్ మూవీతో వచ్చింది గానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. ప్రస్తుతం ఈమె చేతిలో 'పొట్టేల్' అనే మూవీ ఉంది.మరోవైపు ఓటీటీలోకి కూడా అనన్య నాగళ్ల ఎంట్రీ ఇస్తోంది. 'బహిష్కరణ' అనే వెబ్ సిరీస్‌లో కీలక పాత్ర చేస్తోంది. అంజలి ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తోంది. గత రెండేళ్ల నుంచి సెట్స్‌పై ఉన్న ఈ సిరీస్ నుంచి తాజాగా అప్డేట్ వచ్చింది. అంజలికి పుట్టినరోజు విషెస్ చెబుతూ చిన్న వీడియో రిలీజ్ చేశారు. అంజలి ఇప్పటికే ఓటీటీలో నవరస, ఫాల్, ఝాన్సీ సిరీస్ లు చేసింది. ఇకపోతే 'బహిష్కరణ' సిరీస్ ని త్వరలో సిరీస్ రిలీజ్ చేస్తామని నిర్మాతలు ప్రకటించారు.(ఇదీ చదవండి: ‘కార్తీక దీపం’నటికి చేదు అనుభవం.. డీఎస్పీ అంటూ ఫోన్ చేసి..) Happy Birthday @yoursanjaliWe cannot wait for the world to see your new avatar from #Bahishkarana#BahishkaranaOnZee5 Coming Soon!@PixelPicturesIN @Prashmalisetti @iamprajapathi @prasannadop@SidharthSadasi1 pic.twitter.com/YW4Stiidvy— ZEE5 Telugu (@ZEE5Telugu) June 16, 2024 -
దున్నవానిపేటలో సాంఘిక బహిష్కరణ
–పాఠశాలలో విద్యార్థులను చేర్పించలేదని ఓ కుటుంబంపై పెద్దల తీర్పు –ఆ కుటుంబంతో ఎవరు మాట్లాడినా రూ.500 ఫైన్ –పోలీసులు, తహశీల్దార్‌కు ఫిర్యాదుచేసిన బాధిత మహిళ దున్నవానిపేట (వజ్రపుకొత్తూరు): భర్త విదేశాలలో ఉన్నారు.. ఇద్దరు కుమార్తెలతో కలిసి దున్నవానిపేటలో నివసిస్తున్నాను.. గ్రామంలోని పాఠశాలలో పిల్లలను చేర్పించలేదని తమ కుటుంబాన్ని బహిష్కరించారంటూ గ్రామానికి చెందిన కె. సుజాత సోమవారం వజ్రపుకొత్తూరు పోలీసులు, తహశీల్దార్ కె.వెంకటేశ్వరరావు వద్ద వాపోయింది. ఆమె ఫిర్యాదులో తెలిపిన వివరాల ప్రకారం.. సుజాత తన పిల్లలిద్దరినీ పలాస మండలం చినబడాంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదివిస్తోంది. వారిని స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలంటూ గ్రామస్తులు ఒత్తిడి తెచ్చారు. విద్యాసంవత్సరం మధ్యలో చేర్పించలేనని, వచ్చే ఏడాది చేర్పిస్తానని విన్నవించింది. దీనిని గ్రామస్తులు పట్టించుకోకుండా కుటుంబాన్ని సాంఘిక బహిష్కరణ చేశారు. వారితో ఎవరు మాట్లాడినా రూ.500 ఫైన్ వేస్తామని ఆదేశాలు జారీచేశారు. ఇంటికి ఉన్న తాగునీటి కనెక్షన్‌ను కూడా గ్రామానికి చెందిన కేత కూర్మారావు, బి.శ్యామసుందరరావు, బి.భాస్కరరావు, కె.కూర్మారావులు వచ్చి తొలగించారు. ఇంటì æనుంచి వెళ్లిపోవాలని బెదిరిస్తున్నారు. తనకు రక్షణ కల్పించి, సాంఘిక బహిస్కరణ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సుజాత పోలీసులు, తహశీల్దార్‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తహశీల్దార్ తెలిపారు.