అభిప్రాయం
‘ఆడు జీవితం’ అనే మలయాళ పదం గత కొన్ని నెలల నుండి ప్రపంచమంతా తెలిసిపోతూ ఉంది. మలయాళీ భాషలో మొదటిసారి 2008లో ఈ పేరుతో వచ్చిన నవల ఎంతో ప్రజాదరణ పొంది రెండు వందల యాభైకి పైగానే ముద్ర ణలను పొందింది. ఇది భార తీయ సాహితీ ప్రపంచంలో ఒక గొప్ప విషయం. వలస వెళ్ళిన నజీబ్ అనే ఒక మలయాళీ దుర్భరమైన జీవితా నుభవాలను ఆధారంగా... ‘బెన్యా మిన్’ అనే మలయాళ రచయిత ‘ఆడు జీవితం’ నవల రాశారు. కేరళ సాహిత్య అకాడెమీ 2009లో ఈ పుస్తకానికి పురస్కారాన్నిచ్చి గౌరవించింది.
అత్యంత పేరు ప్రఖ్యాతులను సంపాదించిన ఈ నవల కేరళ చలనచిత్ర రంగాన్నీ వదలలేదు. ఫలితంగా ‘ఆడు జీవితం (ది గోట్ లైఫ్)’ అనే సినిమా తయారై ఈ సంవత్సరం మార్చిలో విడుదలైంది. ప్రింట్ రూపంలో వచ్చిన పుస్తకానికి ఎంత మన్నన దొరికిందో అంతకి మించి సినిమాకీ పేరు వచ్చింది. అవార్డులతో పాటు, వందకోట్లు వసూళ్లని దాటేసి చరిత్రపై చరిత్రను లిఖిస్తూ ముందుకు దూసుకుపోతోంది. ముందు ముందు ఇంకా ఏయే రూపాల్లో పేరు ప్రఖ్యాతులను సంపాదించు కొంటుదో కాలమే చెబుతుంది.
ఆడు జీవితం పలు భారతీయ బాషల్లోకి అను వాదమైంది. కొన్ని ఇతర దేశాల బాష (థాయ్, నేపాలీ, అరబిక్)ల్లో కూడా వచ్చింది. మన రెండు తెలుగు రాష్ట్రాల నుండి లక్షలమంది గల్ఫ్ దేశాల్లో ఉన్నారు. నలభై యాభై ఏళ్లుగా వలస వెళుతున్నారు. తిరిగొస్తు న్నారు. మూడు తరాల నుండి వెళుతూ వస్తున్నారు. వీరిలో ఎందరో నజీబ్ మాదిరిగా ఎన్నో అవస్థలు పడ్డారు. హింసలకు గురయ్యారు.
ఎడారుల్లో దుర్భర మైన జీవితాలను గడిపారు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల్ని మెరుగు పరచడానికి నానా కష్టాలు పడి ఎంతో కొంత సంపాదించుకొని ప్రాణాల్ని చేతిలో పెట్టుకొని తిరిగొ స్తున్నారు. వెళ్ళినవారికి సంబంధించిన ఎన్నో వైవిధ్య మైన నేపథ్యాలు దొరుకుతాయి. నైపుణ్యం లేని వారు, చదువు కొన్నవారు, ఒంటరి మహిళలు, యువ సము దాయాలకు చెందిన వారు ఎన్నోరకాల పనులు చేసి జీవితా నుభవాలను జీర్ణించుకొన్నారు. ఇవి అక్షర రూపంలో తెలుగు సాహిత్యలోకంలోకి అడుగుపెట్టాలి.
మా పక్క ఊళ్ళో ఉండే భీమన్న తన కష్టాల్ని చెబితే కళ్ళల్లో నీళ్లొస్తాయి. ఎక్కడో తనకు ఏమాత్రం తెలియని ఎడారిలో ఒంటెల్ని చూసుకొనే పని. ఒంటెల పాలు పితకడం కూడా రోజువారీ పనుల్లో ఒకటి. అయితే ఒంటెల ఎత్తు గేదెలు, ఆవుల కన్నా ఎంతో ఎక్కువ. కాబట్టి పాలు పితికే వారు కూర్చోలేరు, నిల్చోనూలేరు. మధ్యలో కాళ్లని కొంచెం వంచి పాలని పితకాలి.
ఈ విషయాన్ని భీమన్న చెబుతుంటే ఆయన కళ్ళలో తడి, మాటల్లో వేదన! గల్ఫ్ దేశాల్లో పనిచేసి వచ్చిన వారి జీవితాల్లోకి రచయితలు, రచయిత్రులు తొంగిచూడాలి. ఓపిగ్గా కూర్చుని వారి జీవితానుభవాల్ని విని కథలు, నవలలు, కవితలుగా రాయాలి. ఒక విహంగ దృష్టితో చూస్తే ఇలాంటి కథా వస్తువులపై రావ లసినంతగా రచనలు రాలేదని పిస్తుంది.
ఈ మధ్య పత్రికల ద్వారా చాలా కథలు, నవలల పోటీల నిర్వహణ జరుగుతోంది. గల్ఫ్ వలస ప్రజలపైనే ప్రత్యేక పోటీలు నిర్వహిస్తే ఎన్నో వైవిధ్య జీవన రేఖలు, చిత్రాలు అక్షరాల్లో రూపం పోసుకొని పాఠకులకు అందించవచ్చు. ఎంతో విలువైన జీవన పార్శా్వలు దొరుకుతాయి. పత్రికలు ఈ విషయాన్ని ఆలోచించి కొన్ని పోటీలు వీటినే అక్షరబద్ధం చేయడానికి పెడితే తెలుగు సాహిత్య సంపద వైవి«ధ్యాన్ని సంతరించుకుంటుంది. ఒక సముదాయపు జీవితానుభవాలను తెలుసుకొన్న వారమవుతాము.
డా‘‘ టి. సంపత్ కుమార్
వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు
Comments
Please login to add a commentAdd a comment