
సలార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన తాజా చిత్రం ఆడుజీవితం(ది గోట్ లైఫ్). ఈ చిత్రంలో అమలాపాల్ హీరోయిన్‌గా నటించింది. బ్లెస్సీ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా ఇటీవల థియేటర్లలో రిలీజైంది. బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. యథార్థ సంఘటనలపై బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ ఈ చిత్రాన్ని రూపొందించాడుకేరళకు చెందిన ఓ యువకుడు విదేశాలకు వెళ్లి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడనేది ఈ సినిమాలో చూపించారు.
అయితే ఈ చిత్రం కోసం పృథ్వీరాజ్ సుకుమారన్ తీవ్రంగా శ్రమించారు. ఈ సినిమాలో పాత్ర కోసం ఏడు నెలల్లో 31 కిలోల బరువు తగ్గినట్లు వెల్లడించారు. తాజాగా ఈ మూవీ సినిమాటోగ్రాఫర్ సునీల్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ చిత్రంలోని నగ్నంగా కనిపించే సన్నివేశం కోసం కఠినమైన ఉపవాసం చేశారని తెలిపారు. దాదాపు మూడు రోజుల పాటు కనీసం నీళ్లు కూడా తీసుకోకుండా ఉపవాసం ఉన్నారని వెల్లడించారు. ఈ సినిమాపై పృథ్వీరాజ్ అంకితభావం చూపడాన్ని ఆయన కొనియాడారు. పృథ్వీరాజ్‌ను షూట్ జరిగే ప్రదేశానికి కుర్చీలో తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు.
అంతే కాకుండా నగ్న సన్నివేశాన్ని చిత్రీకరించే ముందు కేవలం 30 ఎంఎల్ వోడ్కా ఎందుకు తాగాడనే విషయాన్ని కూడా సునీల్ వెల్లడించారు. షూట్‌కు ముందు అతని శరీరంలో మిగిలి ఉన్న నీటి నీటి శాతాన్ని బయటకు పంపేందుకు 30 ఎంఎల్ వోడ్కా తీసుకున్నారని తెలిపారు. ఈ సీన్ షాట్‌కు ముందు మేము ఆయనను కుర్చీలో నుంచి లేపాల్సి వచ్చిందని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో నజీబ్ అనే వలస కార్మికుడి పాత్రలో పృథ్వీరాజ్ కనిపించారు. మార్చి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్లకు పైగానే వసూళ్లు రాబట్టింది.
Wow 👏
For d Naked Scene, Prithviraj was fasting for 3 Days, not even water in last day; before shoot he took 30ML Vodka to drain remaining water frm body. He was carried in a chair to d location. We needed to lift him from the chair before the shot😯
pic.twitter.com/UjY3Kq0Ti9— Christopher Kanagaraj (@Chrissuccess) April 2, 2024