తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ ఫ్యాన్స్ వీరంగం సృష్టించారు. అది కూడా కేరళలో తమ అభిమాన హీరో కారుపైనే. ప్రస్తుతం ఈ విషయం కాస్త చర్చనీయాంశంగా మారింది. అలానే సదరు ఘటనకు సంబంధించిన కొన్ని వీడియోలు బయటకొచ్చాయి. దీంతో ఇది కాస్త ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది. ఇంతకీ అసలేం జరిగింది? విజయ్ కేరళలో ఏం చేస్తున్నాడు?
(ఇదీ చదవండి: మంచు లక్ష్మి కాళ్ల మీద పడి ఏడ్చేసిన అభిమాని.. వీడియో వైరల్)
'లియో' సినిమాతో ప్రేక్షకుల్ని గతేడాది పలకరించిన విజయ్.. ప్రస్తుతం 'ద గోట్' (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) అనే మూవీ చేస్తున్నాడు. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ కథతో ఈ చిత్ర షూటింగ్ కోసం వారం రోజుల పాటు టీమ్ అంతా కేరళ వెళ్లారు. దాదాపు 14 ఏళ్ల తర్వాత తమ దగ్గరకు వస్తున్నాడని తెలిసి, కేరళలోని విజయ్ ఫ్యాన్స్ ఒక్కచోటకు చేరారు. ఈ క్రమంలోనే తోపులాట జరిగింది.
విజయ్ వస్తున్నాడని తెలిసి వందలాది మంది ఫ్యాన్స్ ఎయిర్‌పోర్ట్ దగ్గరకు చేరుకున్నారు. అయితే అక్కడి నుంచి విజయ్ కారులో ప్రయాణిస్తున్న సమయంలో తోపులాట ఎక్కువ కావడంతో కారు డ్రైవర్ దగ్గర ఉండే అద్దం పగిలిపోయింది. అలానే చాలా చోట్ల కారుకి సొట్టలు కూడా పడ్డాయి. కాకపోతే ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు ఆ కారుకి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
(ఇదీ చదవండి: 'గుంటూరు కారం' విషయంలో బాధంతా వాళ్లదే: నిర్మాత నాగవంశీ)
Video: Thalapathy Vijay's car damaged after massive fan turnout in Kerala #VIJAYStormHitsKerala pic.twitter.com/5gUceexTSI
— Webdunia Telugu (@WebduniaTelugu) March 19, 2024
Comments
Please login to add a commentAdd a comment