ఆ తర్వాతే సినిమాలకు గుడ్‌ బై: యంగ్ హీరోయిన్ | Kollywood Actress Dushara Vijayan Comments On Her Career In Films | Sakshi
Sakshi News home page

Dushara Vijayan: 'అప్పటి నుంచే సినిమాలకు గుడ్ బై'

Published Fri, Jul 12 2024 3:59 PM | Last Updated on Fri, Jul 12 2024 4:34 PM

Kollywood Actress Dushara Vijayan Comments On Her Career In Films

బోదై ఏరి బుద్ధి మారి చిత్రం ద్వారా 2019లో సినీ రంగప్రవేశం చేసిన నటి దుషారా విజయన్‌. ఆ తరువాత పా.రంజిత్‌ దర్శకత్వం వహించిన సార్పట్టా పరంబరై చిత్రంతో హీరోయిన్‌గా మంచి గుర్తింపుపొందారు. దిండుగల్‌లోని రాజకీయ కుటుంబానికి చెందిన దుషారా విజయన్‌.. నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలో ప్రవేశించారు. సార్పట్టా పరంబరై చిత్రంతో నటిగా మంచి పేరు తెచ్చుకోవడంతో  అవకాశాలు క్యూ కడుతున్నాయి.

అలానే నక్షత్రం నగర్గిరదు, కళువేత్తి మూర్కన్, అనీతి వంటి చిత్రాల్లో దుషారా విజయన్ నటించారు. ప్రస్తుతం రజనీకాంత్‌ కథానాయకుడిగా నటించిన వేట్టైయాన్, ధనుష్‌ హీరోగా వస్తోన్న రాయన్‌ చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ రెండు చిత్రాలు త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతున్నాయి. ప్రస్తుతం విక్రమ్‌ సరసన వీర ధీర శూరన్‌ చిత్రంలో నటిస్తున్నారు.

మంచి అభినయం, నటనతో గుర్తింపు తెచ్చుకున్న దుషారా విజయన్‌ అందాలారబోతకు వెనుకాడేది లేదని దుషారా ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. రాయన్‌ చిత్రంలో నటించడం సాధనగా భావిస్తున్నానన్నారు. తాను ధనుష్‌కు వీరాభిమానినని తెలిపారు. ఆయనతో కలసి నటించాలన్న చిరకాల కోరిక రాయన్‌ చిత్రంతో నెరవేరిందని చెప్పారు. ఈ చిత్రంలో తాను ఉత్తర చెన్నై యువతిగా నటించినట్లు చెప్పారు. తాను 35 ఏళ్ల వయసు తరువాత నటనకు గుడ్‌బై చెబుతానని అన్నారు. ఆ తరువాత  విదేశీయానం చేస్తానని చెప్పారు. అలా తాను పయనించని దేశం ఉండదని దుషారా విజయన్‌ పేర్కొన్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement