తమిళసినిమా: సినీ తారలు అప్పుడప్పుడు మీడియాపై ఫైర్ అవుతుంటారు. వారి వ్యక్తిగత విషయాల్లోకి తొంగి చూసినప్పుడో, తమ ఇమేజ్‌ను డామేజ్ చేసే చర్యలకు పాల్పడినప్పుడో అలా రియాక్ట్ అవుతూ ఉంటారు. ఈ మధ్యనే నటి రష్మిక మందన్నా కొన్ని మీడియా సంస్థల ధోరణిపై ఆవేదనను వ్యక్తం చేసింది. తాజాగా నటి పార్వతి నాయర్ ఏకంగా హెచ్చరికలే చేసింది. తమిళంలో ఎన్నై అరిందాల్, నిమిర్నిందు నిల్, ఉత్తమ విలన్, సీత క్కాతి తదితర త్రాల్లో ముఖ్య పాత్ర పోషింన మలయాళి నటి పార్వతి నాయర్.
చెన్నై నుంగంబాక్కంలో నివసిస్తున్న ఈమె ఇటీవల తన ఇంట్లో రూ.9 లక్షల విలువైన రెండు వాచీలు, లాప్ టాప్, సెల్ ఫోన్ వంటి వస్తువులు చోరీకి గురైనట్లు, తన ఇంట్లో పని చేసే వ్యక్తి కూడా కనిపించకుండా పోయాడని నుంగంబాక్కం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ వార్త మీడియా ప్రసారం చేసింది. ఈక్రమంలో ఆమె ఇంట్లో పని చేసి మానేసిన చంద్రబోస్ అనే వ్యక్తి ఇటీవల మీడియా ముందుకు వచ్చి పార్వతి నాయర్‌పై తీవ్ర విమర్శలు చేశాడు.
ఆమె ఇంట్లో రాత్రి వరకు మగ స్నేహితులతో మందు పార్టీలు చేసుకునేదని ఆరోపించారు. ఈ విషయాన్ని తాను గమనించడంతో అవవనిస్తే, కించపరిచే విధంగా ప్రవర్తించిందని విమర్శించారు. ఈ వార్తా పలు చానళ్లలో ప్రసారమైంది. దీంతో ఆగ్రహానికి గురైన నటి పార్వతి నాయర్ మీడియా తన గురించి తప్పుడు ప్రచారం చేస్త తన ఇమేజ్ డామేజ్ చేసే చర్యలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇష్టానుసారం వార్తలు ప్రసారం చేసే వారిపై తగిన చర్యలు తీసుకుంటానంటూ హెచ్చరిస్తూ శనివారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేసింది. అందులో తనకు కళంకం ఆపాదించే చర్యలకు పాల్పడే కొన్ని మీడియా సంస్థలపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించింది.
— Parvati (@paro_nair) November 12, 2022
Comments
Please login to add a commentAdd a comment