పనిమనిషి ఆరోపణల్ని తీవ్రంగా ఖండించిన నటి పార్వతీనాయర్‌ | Actress Parvati Nair Says She Will Fight Legally For Harassing Case | Sakshi
Sakshi News home page

Parvati Nair: పనిమనిషి ఆరోపణల్ని తీవ్రంగా ఖండించిన నటి పార్వతీనాయర్‌

Published Sat, Nov 19 2022 12:05 PM | Last Updated on Sat, Nov 19 2022 12:16 PM

Actress Parvati Nair Says She Will Fight Legally For Harassing Case - Sakshi

తమిళసినిమా: నటి పార్వతీనాయర్‌ తన ఇంట్లో పని చేసే సుభాష్‌ చంద్రబోస్‌ అనే వ్యక్తి చోరీకి పాల్పడినట్లు ఇటీవల స్థానిక నుంగంపాక్కం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆ వ్యక్తి నటి పార్వతి నాయర్‌పై పలు ఆరోపణలు చేస్తూ మీడియా ముందుకు వచ్చాడు. అనంతరం ఆమె మేకప్‌ మాన్‌ షెల్డన్‌ జార్జ్‌ కూడా పార్వతి నాయర్‌ పరువుకు భంగం కలిగేలా ఒక వీడియోను విడుదల చేశాడు. ఈ విషయాలను నటి పార్వతి నాయర్‌ తీవ్రంగా ఖండించారు. ఆమె శుక్రవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంటూ ఇంటి పనిమనిషి సుభాష్‌ చంద్రబోస్, మేకప్‌ మాన్‌ షెల్డన్‌ జార్జ్‌ దురుద్దేశంతో తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

సుభాష్‌ చంద్రబోస్‌ అనే వ్యక్తి తన వద్ద పార్ట్‌ టైంగా పనిచేసేవాడని, అతను తన కుక్కల సంరక్షణ బాధ్యతను నిర్వహించేవాడని చెప్పారు. తాను తన ఇంట్లో వస్తువులు పోయినప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేసే ముందే పనిమనిషి సుభాష్‌ చంద్రబోస్‌ని అడిగానన్నారు. అందుకు అతను సూటిగా సమాధానం చెప్పకుండా తప్పించుకున్నాడన్నారు. దీంతో తాను పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. అలాగే కొట్టినట్టు, దుర్భాషలాడినట్లు చేసిన ఆరోపణలు నిజం లేదన్నారు. తన వద్ద మెకప్‌మెన్‌గా పని చేసిన షెల్డన్‌ జార్జ్‌ తనపై దుష్ప్రచారం చేస్తున్నాడని ఆరోపించారు.

2022వ మే తొమ్మిదో తారీఖున చిత్ర షూటింగ్‌లో జరిగిన సంఘటన వక్రీకరించి, వీడియోలో చిత్రీకరించాడని, అది తాను వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించే చర్యని పేర్కొన్నారు. దీంతో వారిద్దరిపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక ఎగ్మోర్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసినట్లు తెలిపారు. అలాగే జాతీయ మహిళా కమిషన్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. తనకు చట్టంపైనా, న్యాయస్థానంపైనా నమ్మకం ఉందన్నారు. అందుకే ఈ వ్యవహారంలో చట్టపరంగా పోరాటం చేస్తానని నటి పార్వతి నాయర్‌ పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement