
తమిళ నటి పార్వతి నాయర్‌పై సంచలన ఆరోపణలు చేశారు ఆమె పనిమనిషి సుభాశ్. తనపై లైంగిక వేధింపుల కేసు పెడతానని పార్వతి నాయర్ బెదిరించినట్లు ఆరోపించారు. ఆమె ఇంట్లో చోరీ జరగడంతో తనను మానసిక వేధింపులకు గురి చేస్తోందని సుభాశ్ పోలీసులకు తెలిపారు. అంతే కాకుండా తనను రెండుసార్లు చెంపదెబ్బ కొట్టి, ముఖంపై ఉమ్మి వేసిందని వివరించారు. ఆమె తనను కావాలనే దొంగతనం కేసులో ఇరికించారని అతను ఆరోపిస్తున్నారు. రాత్రిపూట ఆమె ఇంటికి గుర్తు తెలియని వ్యక్తులు రావడం చూసినందుకే నటి తనను మానసికంగా వేధిస్తోందని వాపోయారు.
(చదవండి: ఓటీటీలో కార్తీ బ్లాక్ బస్టర్ 'సర్దార్'.. స్ట్రీమింగ్ ఆ రోజు నుంచే..!)
అసలేమైందంటే: 2022 అక్టోబర్‌లో చెన్నైలోని నుంగంబాక్కంలో పార్వతి ఇంట్లో రూ.9 లక్షల విలువైన రెండు వాచీలు, రూ.1.5 లక్షల విలువైన ఐఫోన్, రూ.2 లక్షల విలువైన ల్యాప్‌టాప్ చోరీకి గురైనట్లు పోలీసుల సమాచారం. పార్వతి నాయర్ తన ఇంట్లో చోరీ పాల్పడినట్లు పనిమనిషి సుభాష్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. నటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతని ఇంటికి వెళ్లి ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు. కాగా.. పార్వతి నాయర్ తమిళంలో యెన్నై అరిందాల్, నిమిర్ చిత్రాల్లో నటించింది.
Comments
Please login to add a commentAdd a comment