good bye
-
ఆ తర్వాతే సినిమాలకు గుడ్ బై: యంగ్ హీరోయిన్
బోదై ఏరి బుద్ధి మారి చిత్రం ద్వారా 2019లో సినీ రంగప్రవేశం చేసిన నటి దుషారా విజయన్. ఆ తరువాత పా.రంజిత్ దర్శకత్వం వహించిన సార్పట్టా పరంబరై చిత్రంతో హీరోయిన్గా మంచి గుర్తింపుపొందారు. దిండుగల్‌లోని రాజకీయ కుటుంబానికి చెందిన దుషారా విజయన్.. నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలో ప్రవేశించారు. సార్పట్టా పరంబరై చిత్రంతో నటిగా మంచి పేరు తెచ్చుకోవడంతో అవకాశాలు క్యూ కడుతున్నాయి.అలానే నక్షత్రం నగర్గిరదు, కళువేత్తి మూర్కన్, అనీతి వంటి చిత్రాల్లో దుషారా విజయన్ నటించారు. ప్రస్తుతం రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన వేట్టైయాన్, ధనుష్ హీరోగా వస్తోన్న రాయన్ చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ రెండు చిత్రాలు త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతున్నాయి. ప్రస్తుతం విక్రమ్ సరసన వీర ధీర శూరన్ చిత్రంలో నటిస్తున్నారు.మంచి అభినయం, నటనతో గుర్తింపు తెచ్చుకున్న దుషారా విజయన్ అందాలారబోతకు వెనుకాడేది లేదని దుషారా ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. రాయన్ చిత్రంలో నటించడం సాధనగా భావిస్తున్నానన్నారు. తాను ధనుష్‌కు వీరాభిమానినని తెలిపారు. ఆయనతో కలసి నటించాలన్న చిరకాల కోరిక రాయన్ చిత్రంతో నెరవేరిందని చెప్పారు. ఈ చిత్రంలో తాను ఉత్తర చెన్నై యువతిగా నటించినట్లు చెప్పారు. తాను 35 ఏళ్ల వయసు తరువాత నటనకు గుడ్‌బై చెబుతానని అన్నారు. ఆ తరువాత విదేశీయానం చేస్తానని చెప్పారు. అలా తాను పయనించని దేశం ఉండదని దుషారా విజయన్ పేర్కొన్నారు. -
రాజకీయాలకు గుడ్‌బై బీజేపీ ఎంపీ హర్షవర్ధన్
న్యూఢిల్లీ: రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బరిలోకి దిగనున్న అభ్యర్థుల తొలిజాబితాను బీజేపీ ప్రకటించిన మరుసటి రోజే రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్లు ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి డాక్టర్.హర్షవర్ధన్ ప్రకటించారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీ పరిధిలోని చాంద్‌నీచౌక్ స్థానం నుంచి సిట్టింగ్ బీజేపీ ఎంపీగా కొనసాగుతున్నారు. శనివారం బీజేపీ విడుదలచేసిన తొలి జాబితాలో ఈయన పేరు లేదు. అందుకే ఈయన రాజకీయాలను వదిలేస్తున్నట్లు వార్తలొచ్చాయి. ఈ సందర్భంగా ఆయన ‘ఎక్స్’లో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. ‘‘ 50 ఏళ్ల క్రితం కాన్పూర్‌లో ఎంబీబీఎస్‌లో చేరా. పేదలకు సేవచేశా. 30 ఏళ్ల పైబడిన రాజకీయ జీవితంలో ఐదు సార్లు శాసనసభ, రెండు సార్లు పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచా. మళ్లీ ఇన్నాళ్లకు నా మూలాల్లోకి వెళ్లిపోతా’’ అన్నారు. ఢిల్లీ పరిధిలో నలుగురు సిట్టింగ్ ఎంపీలు పర్వేశ్ శర్మ, రమేశ్ బిధూరి, మీనాక్షి లేఖీ, హర్‡్షవర్ధన్లను కాదని కొత్త వారికి బీజేపీ అవకాశమిస్తూ వారి పేర్లను తొలి అభ్యర్థుల జాబితాల చేర్చడం తెల్సిందే. నేను పోటీచేయలేను: పవన్ సింగ్ పశ్చిమబెంగాల్లోని అసన్సోల్ ఎంపీ స్థానం నుంచి తనను బీజేపీ అభ్యరి్థగా నిలబెట్టినప్పటికీ తాను మాత్రం పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు బీజేపీ నేత పవన్ సింగ్ ప్రకటించడం చర్చనీయాంశమైంది. ‘‘ నేనైతే పోటీ నుంచి వైదొలగుతున్నా. ఎందుకు పోటీ చేయట్లేను అనే కారణాలను వెల్లడించలేను’ అని భోజ్‌పురీ గాయకుడు, నటుడు అయిన పవన్ సింగ్ స్పష్టంచేశారు. అసన్సోల్లో బీజేపీ ముందే ఓడిందంటూ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎద్దేవాచేసింది. -
నమ్రతా బాటలోనే మహేశ్ బాబు హీరోయిన్.. ఏంటా నిర్ణయం!
చాలామంది హీరోయిన్స్ పలు కారణాలతో కెరీర్‌కు గుడ్‌బై చెప్పేస్తుంటారు. కొందరు అవకాశాలు తగ్గిపోయి.. మరికొందరేమో ఫేమ్ రాక మధ్యలోనే ఈ ఫీల్డ్‌ను వదిలేసిన వారు కూడా ఉన్నారు. కానీ సూపర్ హిట్ సినిమాల్లో నటించినప్పటికీ కొందరు అర్ధాంతరందా కెరీర్‌ను ముగిస్తుంటారు. అలాంటి వారిలో టాలీవుడ్లో మహేశ్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ ఒకరు. పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాకు బైబై చెప్పేసింది. ఇక అలాంటి షాకింగ్ నిర్ణయం తీసుకున్న హీరోయిన్ మరొకరు ఉన్నారు. ఆమెనే బాలీవుడ్ హీరోయిన్ అమృత రావు. (ఇది చదవండి: జవాన్ డైరెక్టర్‌పై నయన్ అసంతృప్తి.. కారణం అదేనా..!!) 2002లో అబ్ కే బరాస్‌తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన బాలీవుడ్ హీరోయిన్ అమృత రావు. 2003లో అమృతారావు షాహిద్ కపూర్ సరసన ఇష్క్ విష్క్‌లో నటించింది. ఆ మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది. షాహిద్ కపూర్‌తో మూడు చిత్రాల్లో నటించగా.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టాయి. ఆ తర్వాత షారుఖ్ ఖాన్‌తో మై హూనా, సన్నీ డియోల్‌తో సింగ్ సాహెబ్ ది గ్రేట్, అజయ్ దేవగన్‌తో ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ నటించారు. అంతే కాకుండా ప్యారే మోహన్, మస్తీ, జాలీ ఎల్ఎల్బి చిత్రాల్లో నటించారు. టాలీవుడ్‌లోనూ అరంగేట్రం చేసిన భామ మహేశ్ బాబు సరసన అతిథి చిత్రంలో హీరోయిన్గా అలరించింది. అయితే కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే అనూహ్యంగా సినిమాల నుంచి తప్పుకున్నారు. కారణం ఆమెకు పెళ్లి కావడమే. (ఇది చదవండి: సైమా వేడుక.. మంచు లక్ష్మికే కోపం తెప్పించాడు..!!) మే 15న 2016లో రేడియో జాకీ అన్మోల్ అనే వ్యక్తిని పెళ్లాడిన అమృత రావు సినిమాలను పూర్తిగా వదిలేశారు. ఈ జంటకు ఓ కుమారుడు కూడా జన్మించారు. పెళ్లి తర్వాత నటనకు స్వస్తి పలికిన అమృతారావు.. ప్రస్తుతం కుటుంబ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ముంబయిలో పుట్టి పెరిగిన అమృతరావు మోడలింగ్‌లో అడుగుపెట్టింది. కాగా.. ఆమె చెల్లెలు ప్రీతికా రావు కూడా నటిగా రాణిస్తోంది. -
షాకింగ్: ఓలా ఎస్1 స్కూటర్‌కు గుడ్ బై, కస్టమర్లు ఏం చేయాలి?
బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ తన అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. 2021లో విడుదల చేసిన తన ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ ఉత్పత్తిని నిలిపివేసినట్లు ప్రకటించింది. కంపెనీ తన అధికారిక వెబ్సైట్ నుండి ఎస్1 వేరియంట్‌ను తొలగించి ఎస్1 ప్రోపై, ఎస్ 1 ఎయిర్ మోడల్స్ ఫోకస్ పెట్టనుంది. ఓలా ఎస్ 1 ఎయిర్ లాంచింగ్ సందర్బంగా ఎస్1 స్కూటర్ అమ్మకాలను నిలిపివేస్తున్నట్టు ఓలా ఎలక్ట్రిక్ ప్రకటించింది. ఈ నిర్ణయానికి కారణంపై స్పష్టతలేదు. అయితే పరిమిత ఉత్పత్తి సామర్థ్యం ,ఇతర వేరియంట్లకు అధిక డిమాండ్ కారణంగా కావచ్చని అంచనా. దీని ప్రకారం ఇకపై ఓలా పోర్ట్‌ఫోలియోలో ఎస్1 ఎయిర్, ఎస్1 ప్రో మోడల్స్ మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఫీచర్ల పరంగా ఎస్ 1 ఎయిర్, ఎస్1 ప్రొ దాదాపు ఒకే రకంగా ఉన్న కారణంగా ఎస్ 1 వేరియంట్ అమ్మకాలను నిలిపి వేసిందే మోననేది అంచనా. అలాగే రెండింటీ మధ్య పేర్లలో భిన్నం తప్ప పెద్దగా తేడా ఏమీ లేదని భావిస్తున్నారు. (ఢిల్లీలో అత్యంత సంపన్న మహిళ ఎవరో తెలుసా? నిర్మాత కూడా!) ఎస్1 బుక్ చేసుకున్న వారు ఏంచేయాలి? ఎస్1 వేరియంట్‌ను బుక్ చేసిన కస్టమర్లు ప్లాన్లలో మార్పు గురించి తెలియజేస్తూ కంపెనీ ఇమెయిల్‌ను పంపింది. ఈక్రమంలో వారికి మూడు ఆప్షన్లు ఇచ్చింది. S1 ప్రో వేరియంట్‌కి అప్‌గ్రేడ్ కావడం, 2022 చివరిలో ఎస్1 ప్రొడక్షన్ పునఃప్రారంభమయ్యే వరకు వేచి ఉండటం లేదా వారి బుకింగ్‌ను రద్దు చేసి మనీ రీఫండ్ పొందడం. ఎస్ 1 ప్రొ ధర రూ. 1,29,999, ఎక్స్-షోరూమ్ (FAME 2 సబ్సిడీతో సహా). ఓలా యాప్‌లో జనవరి 21న సాయంత్రం 6 గంటలకు తుది చెల్లింపు విండో తెరిచినప్పుడు అప్‌గ్రేడ్‌ని ఎంచుకున్న కస్టమర్లు రూ. 30,000 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు రానున్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఓల్ ఎస్1 ఎయిర్ ఇప్పటికే ఉన్న కస్లమర్లకోసం ముందస్తు బుకింగ్‌లను మొదలు పెట్టింది. విండోను తెరిచిన మొదలు పెట్టిన గంటలోపు 1,000 యూనిట్ల ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించిందని సీఈఓ భవిష్ అగర్వాల్ ట్విటర్లో ప్రకటించారు. సామాన్య ప్రజానీకం ప్రజల ఈ నెల 31నుంచి సేల్ షురూ అవుతుంది. ఎస్1 ఎయిర్ డెలివరీలు ఆగస్టు 2023లో ప్రారంభమవుతాయి. ఓలా ఎలక్ట్రిక్ ఎస్1 ఎయిర్ ధర రూ. 85,099-1.1లక్షల మధ్యలో ఉంటుందని భావిస్తున్నారు. After S1 Air, buying an ICE scooter means losing money every month. BUY EV and save money!! pic.twitter.com/GkBVThEyN1 — Bhavish Aggarwal (@bhash) July 28, 2023 ఫ్యూచర్ ప్లాన్స్ అలాగే ఓలా OS4పై పని చేస్తోందట. త్వరలో సాఫ్ట్‌వేర్‌ను ప్రారంభించనుందని మార్కెట్ వర్గాల అంచనా. అంతేకాదు .ఓలా ఎలక్ట్రిక్ బైక్‌లపై కూడా పని చేస్తోంది. తమ ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోను విస్తరింపజేయనున్నామని భవిష్ హింట్ కూడా ఇచ్చిన నేపథ్యంలో ఓలా బైకులు కూడా రంగంలోకి దిగనున్నాయనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. 3000! I’m also heading to the factory now 😳 https://t.co/q89piwCOfA — Bhavish Aggarwal (@bhash) July 27, 2023 -
పెళ్లైన ఐదేళ్లకు ప్రెగ్నెన్సీ.. నటి షాకింగ్ నిర్ణయం!
బుల్లితెర నటి దీపికా కక్కర్ యాక్టింగ్‌కు గుడ్‌బై చెప్పింది. ఇక మీదట తన కుటుంబానికి, పుట్టబోయే బిడ్డకు పూర్తి సమయాన్ని కేటాయించాలని భావిస్తున్నట్లు పేర్కొంది. ఈ క్రమంలోనే నటనకు స్వస్తి పలకనున్నట్లు వెల్లడించింది. (ఇది చదవండి: Adipurush: అదిరిపోయిన రామ్ సీతారామ్ సాంగ్..) దీపికా కక్కర్ మాట్లాడుతూ..'ప్రస్తుతం నేను ప్రెగ్నెన్సీని ఎంజాయ్ చేస్తున్నాను. తల్లి కాబోతున్నానన్న ఫీలింగ్ ఎంతో బాగుంది. పెళ్లైన ఐదేళ్ల తర్వాత మేము పేరెంట్స్ కాబోతున్నాం. ఆ ఎగ్జయిట్మెంట్ మరో లెవల్లో ఉంది. చిన్నవయసులోనే నేను కెమెరా ముందు మేకప్ వేసుకోవడం ప్రారంభించాను. 10-15 ఏళ్ల పాటు ఇండస్ట్రీలో కొనసాగాను. నా ప్రెగ్నెన్సీ జర్నీ మొదలవగానే షోయబ్‌కి చెప్పా. నాకు పని చేయడం ఇష్టం లేదని.. నటనకు స్వస్తి చెప్పి.. గృహిణిగా, తల్లిగా జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నా.' అని అన్నారు. (ఇది చదవండి: ఇంటికి పిలిచి మరీ అభిమాని ఆఖరి కోరిక తీర్చిన ప్రభాస్!) కాగా... దీపికా కక్కర్ 2018లో సహనటుడు షోయబ్ ఇబ్రహీంను పెళ్లాడింది. గతేడాది చివర్లో ఆమె ప్రెగ్నెంట్ అయిన విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించింది. -
రీమేక్ లకు గుడ్ బై చెప్పిన మెగా బ్రదర్స్..!
-
సినిమాలకు సాయి పల్లవి గుడ్ బై ..?
-
రన్‌మెషీన్ విరాట్ కోహ్లి పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌బై చెబుతాడా ..?
-
Canadian Open: తొలి రౌండ్లోనే సెరెనా అవుట్
టొరంటో: కెరీర్‌కు త్వరలోనే గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమైన అమెరికా టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ ఆ ప్రకటన తర్వాత ఆడిన మొదటి టోర్నీలోనే పేలవ ప్రదర్శన కనబర్చింది. కెనడియన్ ఓపెన్‌లో ఆమె ఆట తొలి రౌండ్లోనే ముగిసింది. మహిళల సింగిల్స్ పోరులో 2–6, 4–6తో బెలిండా బెన్సిక్ (స్విట్జర్లాండ్) చేతిలో సెరెనా పరాజయం చవిచూసింది. ఇక్కడ మూడు సార్లు చాంపియన్‌గా నిలిచిన సెరెనా ఓటమితో ఈవెంట్‌కు గుడ్‌బై చెప్పింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ‘భావోద్వేగం వల్లే మాటరాని మౌనంతో బరువెక్కిన హృదయంతో నిష్క్రమించాను. నిజానికి ఈ మ్యాచ్‌లో నేను బాగా ఆడాలని సన్నద్ధమై వచ్చాను. కానీ నాకంటే బెలిండా చాలా బాగా ఆడింది. ఇంత మంది అభిమానుల మధ్య నా సుదీర్ఘ కెరీర్ సాగింది. ఇది ఎప్పటికీ ప్రత్యేకం’ అని సెరెనా ఉద్వేగంతో తెలిపింది. -
ఆ హీరోయిన్ సినిమాలకు గుడ్‌బై చెప్పనుందట!
సినీ పరిశ్రమలో అడుగుపెట్టి సక్సెస్ పుల్గా రాణించడం అంత సులువు కాదు. కొన్ని సందర్భాల్లో ఆరంగ్రేటం అదిరినా, అది కొనసాగించలేక మధ్యలోనే కెరీర్ ముగించేసిని వాళ్లు ఉన్నారు. ఇక సినిమాల్లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ తర్వాత సరైన గుర్తింపు, ఆఫర్లు రాకపోవడంతో వెండితెరను వదులుకున్న సెలబ్రిటీల పిల్లలు చాలా మందే ఉన్నారు. తాజాగా ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాధ కూతురు కార్తీక నాయర్ ఈ జాబితాలోకి చేరనుందనే వార్త ప్రస్తుతం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారి చక్కర్లు కొడుతోంది. ఈ అమ్మడు.. తొలి సినిమాగా ‘జోష్’ లో నాగచైతన్య సరసన నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తర్వాత జీవా హీరోగా తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ‘రంగం’ సినిమాలో నటించింది. ఈ సినిమా రెండు భాషల్లో హిట్ కావడంతో మంచి గుర్తింపుతో పాటు ఆఫర్లును అందుకుంది. ఫలితంగా ఎన్టీఆర్ సరసన ‘దమ్ము’ లో నటించగా, ఆ అవకాశం తన కెరీర్‌కు ఉపయోగపడలేదనే చెప్పాలి. గత కొంత కాలంగా కార్తీక ఆఫర్లు లేకపోవడంతో ఇక నటనకు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు ఈ వార్త కోలీవుడ్ సర్కిల్లో జోరుగా వినిపిస్తోంది. సినిమాలకు స్వస్తి పలికి వ్యాపారం వైపు శ్రద్ధ పెట్టాలని కార్తీక నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. చదవండి: salaar movie: ఇది నిజమైతే ఫ్యాన్స్‌కు పూనకాలే! -
ఆ వార్తలు సంతోషాన్నిస్తున్నాయి : బిగ్‌బి
కోవిడ్ సెకండ్ వేవ్ వల్ల ఏర్పడ్డ పరిస్థితులు కంట్రోల్లోకి వచ్చాయని, మళ్ళీ మేకప్ వేసుకుని షూటింగ్లో పాల్గొనే తరుణం దగ్గర్లోనే ఉందని ఆనందపడుతున్నారు అమితాబ్ బచ్చన్. తాజా కోవిడ్ పరిస్థితులపై అమితాబ్ స్పందిస్తూ – ‘‘ఢిల్లీ, మహారాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గాయని వస్తున్న వార్తలు సంతోషాన్నిస్తున్నాయి. కానీ మాస్కులు ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం, తరచూ చేతులను శుభ్రపరచుకోవడం వంటి కరోనా నియంత్రణ చర్యల్లో నిర్లక్ష్యం ప్రదర్శించకండి. వ్యాక్సిన్ వేయించుకోండి’’ అన్నారు. ఇక తాను నటిస్తున్న తాజా హిందీ చిత్రం ‘గుడ్ బై’ గురించి మాట్లాడుతూ– ‘‘గుడ్ బై’ షూటింగ్లో పాల్గొనడానికి మా టీమ్‌కి వెల్కమ్ చెప్పడానికి ఉత్సాహంగా ఉన్నాను. ఆల్రెడీ మా యూనిట్‌లోని అందరికీ నిర్మాతలు వ్యాక్సిన్ వేయించారు. అలాగే షూటింగ్లో పాల్గొనేవారికి కోవిడ్ పరీక్షలు చేయాలని నిర్ణయించుకున్నారు’’ అన్నారు. వికాస్ బాల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మికా మందన్నా, నీనా గుప్తా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. -
ఆరోజు నా పేరెంట్సే నన్ను నమ్మలేదు : రష్మిక
ఛలో సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్నా.. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. చేసింది కొన్ని సినిమాలే అయినా ఈ అమ్మడి పాపులారిటీ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయింది. బాలీవుడ్లో డెబ్యూ కోసం హీరోయిన్లు తహతహలాడుతుంటే..రష్మిక మాత్రం ఏకకాలంలో బాలీవుడ్లో రెండు సినిమాలు చేసేస్తోంది. సిద్దార్థ్ మల్హోత్రాతో మిషన్ మజ్నులో నటిస్తూనే, బిగ్‌బి అమితాబ్‌తో కలిసి గుడ్ బాయ్ అనే సినిమాలో నటిస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రష్మిక ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. అమితాబ్ బచ్చన్ సినిమాలో నటించే అవకాశం వచ్చిందని చెబితే తన పేరేంట్స్ తనను నమ్మలేదని చెప్పింది. తన తల్లిదండ్రులిద్దరూ బిగ్‌బికి పెద్ద ఫ్యాన్స్ అని, ఆయన సినిమాలన్నీ తప్పకుండా చూస్తారని చెప్పుకొచ్చింది. ఇటీవలె గుడ్ బై సెట్లో బర్త్‌డే సెలబబ్రేట్ చేసుకున్న రష్మిక..ఇది ఎప్పటికీ మర్చిపోలేనని పేర్కొన్న సంగతి తెలిసిందే. వికాశ్ బల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ కూతురిగా రష్మిక కనిపించనుంది. ఇక కోలీవుడ్‌లో ఆమె నటించిన డెబ్యూ చిత్రం సుల్తాన్ ఇటీవలె విడుదలయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన పాన్ఇండియా మూవీ పుష్పలో నటిస్తుంది. చదవండి : రష్మిక కోరిక త్వరలోనే నెరవేరుస్తానన్న బన్నీ డిజప్పాయింట్ అయిన రష్మిక.. ఎందుకిలా? -
అమితాబ్‌కి భార్యగా..'నా కల నెరవేరింది'
‘‘నా కల నెరవేరింది. ఎంతో ఉద్వేగంగా ఉంది. ఈ అనుభూతిని మాటల్లో చెప్పలేను’’ అంటున్నారు నటి నీనా గుప్తా. ఈ ఉద్వేగానికి, ఆనందానికి కారణం అమితాబ్ బచ్చన్ సరసన నటించే అవకాశం ఆమెకు దక్కడమే. తొలిసారి బచ్చన్‌తో నీనా స్క్రీన్ షేర్ చేసుకుంటున్న సినిమా ‘గుడ్ బై’. ఇందులో అమితాబ్ భార్యగా నటిస్తున్నారామె. వీరి కూతురిగా రష్మికా మందన్నా నటిస్తున్నారు. ఈ సినిమా గురించి నీనా గుప్తా మాట్లాడుతూ – ‘‘దర్శకుడు వికాశ్ బహల్ ఈ కథ గురించి చెప్పినప్పుడు థ్రిల్ అయ్యాను. అంత అద్భుతంగా ఉంది. నా పాత్రను బాగా రాశారు. మంచి కథ, అమితాబ్‌తో నటించాలనే నా కల నెరవేర్చిన చిత్రంగా ‘గుడ్ బై’కి నా మనసులో ప్రత్యేక స్థానం ఉంటుంది’’ అన్నారు. ఇదిలా ఉంటే.. నీనా గుప్తా నటించిన ‘బధాయీ హో’ (2018)ని అమితాబ్ చూశారు. చూడడమే కాదు.. ‘అద్భుతంగా నటించావ్ నీనా..’ అంటూ స్వహస్తాలతో ఓ లేఖ రాసి, ఆమెకు పంపారు కూడా! బిగ్ బి ప్రశంసలు అందుకున్న నీనా చాలా ఆనందపడ్డారు. ఇప్పుడు ఆయన సరసన నటిస్తున్నందుకు డబుల్ ఆనందంలో ఉన్నారు. -
'నన్ను పావుగా వాడుకోడానికే ఆహ్వానించారు'
మీరు ఇటీవలే ఈమె ఫొటోను మన ‘ఫ్యామిలీ’లో చూసి ఉంటారు. ఈమె కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న తొలి ట్రాన్స్ ఉమన్ అని, ఎమ్మెల్యేగా గెలిస్తే మహిళలు, ట్రాన్స్జెండర్ల సంక్షేమం కోసం కృషి చేస్తానని ఈమె అనినట్లు చదివిన జ్ఞాపకం కూడా మీకు ఉండి ఉంటుంది. ఈమె పేరు అనన్యా అలెక్స్. వెంగర్ నియోజకవర్గం నుంచి ‘డెమోక్రాటిక్ సోషల్ జస్టిస్ పార్టీ’ అభ్యర్థిగా మార్చి 19 న నామినేషన్ వేశారు. నామినేషన్ ఉపసంహరణ గడువు మార్చి 22 కూడా దాటì పోయింది. ఏప్రిల్ 6న పోలింగ్‌కి అన్ని పార్టీల అభ్యర్థులూ ముగింపు ప్రచార కార్యక్రమాల్లో ఉండగా అనన్య అకస్మాత్తుగా.. తను పోటీ నుంచి తప్పుకుంటున్నానని ఏప్రిల్ 3 న ప్రకటించారు!! ఎందుకలా ఈమె అర్ధంతరంగా తన ప్రచార వేదికను, రాజకీయ రంగాన్ని దిగి వెళ్లిపోయారు?! అనన్యా అలెక్స్ ఆఖరి నిముషంలో మనసు మార్చుకోడానికి కారణం ఆ మనసు పడిన ఆవేదన! రాజకీయాల్లోకి వచ్చాక ఈ వేదనలు, ఆవేదనలు ఉంటాయా అనే ప్రశ్న వేసే ముందు ఆమేం చెబుతున్నారో వినవలసిన బాధ్యత ఉంటుంది ఎవరికైనా. అనన్య ఏదో అయిపోదామని పాలిటిక్స్‌లోకి రాలేదు. ఏదో చేద్దామని వచ్చారు. ఆమె ఏ పార్టీ అభ్యర్థిగా అయితే పోటీ చేస్తున్నారో ఆ ‘డెమోక్రాటిక్ సోషల్ జస్టిస్ పార్టీ’ (డి.ఎస్.జె.పి.) కూడా నిన్నమొన్నటి పార్టీనే. రాజకీయాల్ని ప్రక్షాళన చేయబోతున్నాం అంటూ 2019లో ఆవిర్భవించిన ఆ పార్టీ ఇప్పుడు తనని తనే ప్రక్షాళన చేసుకోవలసిన అవసరాన్ని తెచ్చుకున్నట్లు అనన్య మాటల వల్ల స్పష్టం అవుతోంది. ‘‘నన్ను ఒక పావుగా వాడుకోడానికి మాత్రమే రాజకీయాల్లోకి ఆహ్వానించారు’’ అంటున్నారు అనన్య. సొంత పార్టీవాళ్లే ఆమెను మానసికంగా వేధిస్తూ, అసభ్యంగా దూషిస్తూ ప్రత్యర్థులపై వ్యక్తిగత దుష్ప్రచారం చెయ్యాలని ఆమెను బలవంత పెడుతున్నారట! ఇప్పుడిక హత్యచేస్తామన్న బెదరింపులు కూడా వస్తున్నాయని ఆమె చెబుతున్నారు. ఎందుకంటే.. చెప్పినట్లు వినడం లేదని! వాళ్లేం చెబుతున్నారంటే.. అనన్యను ఎన్నికల ప్రచారంలో బురఖా వేసుకొమ్మని బలవంతం చేస్తున్నారు. వెంగర్ నియోజకవర్గంలో ముస్లిం మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండటమే అందుకు కారణం. ‘నేనలా చేయలేను’ అన్నారు అనన్య. ఆమె ప్రత్యర్థి, ముస్లిం లీగ్ పార్టీ సీనియర్ నాయకుడు పీకె కున్హలికుట్టి చెడ్డవాడని; మరొక ప్రత్యర్థి, లెఫ్ట్ డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి పి.జీజీ ఒక తెలివి లేని మనిషి అని ప్రచారం చెయ్యమని ఒత్తిడి తెస్తున్నారు. ‘‘నేనలా చేయలేను’’ అన్నారు అనన్య. అంతే.. ట్రాన్స్ ఉమెన్‌గా ఆమెపై వేధింపులు, లైంగిక హింస మొదలయ్యాయి. పార్టీలోని పైవాళ్లకు ఫిర్యాదు చేస్తే వాళ్లు కూడా అనన్యతో అదే విధంగా, గౌరవం లేకుండా ప్రవర్తించారు! దాంతో మనస్తాపం చెంది, తన ఆత్మగౌరవాన్ని నిలుపుకునే ప్రయత్నంలో భాగంగా ఆఖరి నిముషంలో ప్రచారం నుంచి తప్పుకున్నారు అనన్య. ‘‘నా వ్యక్తిత్వాన్ని చంపేసే ఏ పనినీ నేను చేయలేను’’ అని ఆమె అంటున్నారు. మంచి చేద్దామని రాజకీయాల్లోకి వచ్చేందుకు ఉత్సాహం కనబరిచిన అనన్యకు... అభివృద్ధి పనుల గురించి చెప్పకుండా తన ప్రత్యర్థుల వ్యక్తిగత బలహీనతల గురించి మాట్లాడమని పార్టీ ఆదేశించడం ఆగ్రహం తెప్పించింది. కేరళ తొలి ట్రాన్స్ ఉమన్ రేడియో జాకీ అయిన అనన్య.. జీవితంలోని మంచి చెడుల గురించి రోజూ రేడియో శ్రోతలకు తనదైన ఆకట్టుకునే శైలిలో వినిపిస్తూ ఉంటారు. ‘‘ఇప్పుడు కనుక పార్టీ చెప్పినట్లు చేస్తే ఇప్పటì వరకు నువ్వు సంపాదించుకున్న మంచి పేరుతో పాటు రేడియో జాకీ ఉద్యోగం కూడా పోతుంది’’ అని సన్నిహితులు చేసిన హెచ్చరికలకు కూడా విలువ ఇచ్చి ఆమె బరి నుంచి బయటికి నడిచారు. అనన్య రేడియో జాకీ మాత్రమే కాదు. ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్, న్యూస్ యాంకర్ కూడా. శుక్రవారం నాడు అర్థంతరంగా ప్రచారాన్ని వదిలేసి వచ్చాక కూడా తన వెంటపడి ఎంత హీనంగా తనను ఎన్ని మాటలు అన్నారో అవన్నీ రాసి తన పార్టీ పెద్దలపై పోలీస్ కంప్లయింట్ ఇచ్చారు అనన్య. అంతేకాదు.. మహిళలు, ట్రాన్స్జెండర్లంటే మర్యాద లేని డి.ఎస్.జె.పి.కి ఓటు వేయొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నిర్ణీత వేళలంటూ లేకుండా ఆమె చేత ప్రచారం చేయించడంతో అనన్య ఆరోగ్యం క్షీణించింది. కొల్లం జిల్లా పెరుమన్ గ్రామంలో పుట్టి తనకంటూ కేరళ వ్యాప్తంగా ఒక గుర్తింపు తెచ్చుకున్న అనన్య పాఠశాల విద్యతోనే చదువు మానేశారు. ఇక ఏ రాజకీయ గొడవలూ లేకుండా, చేస్తున్న ఉద్యోగాలలోనే కొనసాగుతూ ఉన్నత విద్యను పూర్తి చేయాలని ఇప్పుడు ఆశిస్తున్నారు. జెండర్‌కు అతీతంగా చదువు గౌరవాన్ని ఇస్తుందని ఆమె నమ్ముతున్నారు. -
హాకీకి సునీత వీడ్కోలు
న్యూఢిల్లీ: మోకాలి గాయంతో బాధపడుతోన్న భారత మహిళల హాకీ జట్టు సీనియర్ డిఫెండర్, మాజీ సారథి సునీతా లక్రా గురువారం ఆటకు గుడ్‌బై చెప్పింది. ఈ ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్ కోసం సిద్ధమవుతున్న తరుణంలో గత గాయం తిరగబెట్టడంతో తాను రిటైర్ అవుతున్నట్లు ఆమె వెల్లడించింది. ‘ఈ రోజు నాకు చాలా భావోద్వేగమైన రోజు. అంతర్జాతీయ హాకీ నుంచి తప్పుకొంటున్నా. టోక్యో ఒలింపిక్స్‌లో ఆడాలని భావించా. అందుకోసం సన్నద్ధం కూడా అవుతున్నా. అయితే నా మోకాలికి మరొకసారి సర్జరీ అవసరం అవుతుంది. సర్జరీ చేయించుకున్నా ఒలింపిక్స్ లోపు పూర్తి స్థాయిలో కోలుకుంటానన్న నమ్మకం లేదు’ అంటూ తన రిటైర్మెంట్ ప్రకటనలో పేర్కొంది. 2008లో అరంగేట్రం చేసిన సునీత భారత్ తరఫున 139 మ్యాచ్‌లు ఆడింది. ఆమె నాయకత్వంలోని జట్టు 2018 ఆసియా చాంపియన్‌షిప్ ట్రోఫీలో రెండో స్థానంలో నిలిచింది. ఒలింపిక్స్‌లో కూడా భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన సునీత 2014 ఆసియా గేమ్స్‌లో కాంస్య పతకం సాధించిన జట్టులో సభ్యురాలు. -
సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు గుడ్‌బై
గ్రేటర్ నోయిడా: ప్రపంచదేశాలన్నీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ (ఎస్యూపీ)కి ఇక గుడ్ బై చెప్పే సమయం వచ్చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బీడు భూముల్ని సాగులోకి తీసుకురావాల్సిన ఆవశ్యకత గురించి కూడా ఆయన వివరించారు. ఎడారీకరణను ఎదుర్కోవడానికి ఐక్యరాజ్య సమితి (యూఎన్‌సీసీడీ) కాప్14 సదస్సుకి ఈ సారి భారత్ ఆతిథ్యం ఇస్తోంది. గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న ఈ సదస్సులో 200 దేశాలకు చెందిన ప్రతినిధులనుద్దేశించి సోమవారం ప్రధాని ప్రసంగించారు. ఒకసారి మాత్రమే వినియోగించాల్సిన ప్లాస్టిక్‌ను వచ్చే కొద్ది సంవత్సరాల్లో భారత్‌లో పూర్తిగా నిర్మూలిస్తామని ప్రధాని చెప్పారు. ‘ప్లాస్టిక్ వినియోగం పెరిగే కొద్దీ పచ్చని భూములు కూడా ఎడారులుగా మారిపోతున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు మన భూముల్ని ఎందుకూ పనికిరాకుండా చేస్తున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి వెలువడే కాలుష్యం మనుషుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఎటుచూసినా కుప్పులు తెప్పలుగా పేర్కొంటున్న ప్లాస్టిక్ భూముల్ని నాశనం చేసి వ్యవసాయాన్ని దెబ్బ తీస్తోంది‘‘ అని మోదీ చెప్పారు. ప్రపంచదేశాలన్నీ కూడా ప్లాస్టిక్ వాడకంపై నిషేధం విధించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. భూముల క్షీణతపై ఆందోళన పర్యావరణంలో వస్తున్న మార్పులు ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తున్నాయని ప్రధాని అన్నారు. వాతావరణం వేడెక్కడంతో కాలం కాని కాలంలో వర్షాలు కురవడం, తుపాన్లు ముంచెత్తడం, సముద్ర మట్టాలు పెరిగిపోవడం వంటి వాటితో భూముల్ని కోల్పోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘భూమిలో సారాన్ని పెంచాలంటే, వ్యవసాయానికి అనుగుణంగా వాటిని మార్చాలంటే నీటి సరఫరాలో పక్కా వ్యూహాలను అనుసరించాలి. బీడు భూములకి నీటి వసతిని కల్పించాల్సిన అవసరం ఉంది‘ అని మోదీ అన్నారు. 2015–17 మధ్య కాలంలో భారత్‌లో పచ్చదనం, అటవీ విస్తీర్ణం 8 లక్షల హెక్టార్లకు పెరిగిందని వెల్లడించారు. 2030 నాటికి 2.1 కోట్ల హెక్టార్ల నుంచి 2.6 కోట్ల హెక్టార్ల భూముల్ని పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. భూముల్ని పునరుద్ధరించడానికి రిమోట్ సెన్సింగ్, స్పేస్ టెక్నాలజీని వినియోగిస్తోందన్నారు. ఎడారీకరణను ఎదుర్కోవడానికి ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన ఈ సదస్సు ఈనెల 2 నుంచి 13 వ తేదీ వరకు జరగనుంది. -
మృదుస్పర్శ ఎరిగినవాడు
గ్రేట్ రైటర్ మనిషి స్వతహాగా బలహీనుడని నమ్ముతాడు డాజై ఒసాము (1909–1948). ఎదుటివాడి బలహీనతను ఎరిగి, మృదువుగా స్పందించడం ద్వారా వారికి సాంత్వన అందించగలమని చెబుతాడు. దీనికోసం ఆయన ఎన్నుకున్న ఒక మార్గం, జీవితపు కర్కశత్వానికి బలైపోయిన బలహీన పాత్రలను సృష్టించి, వాటిపట్ల పాఠకుల్లో ప్రగాఢమైన సానుభూతిని రేకెత్తించడం. ఈ మృదుస్పర్శ లేనివాడే ఆయన ఉద్దేశంలో దుష్టుడు. ఈ స్పర్శ లేదనిపించినప్పుడు ఆయన ఇతరుల రచనలను తిరగరాయడానికి కూడా వెనుకాడలేదు. అలాగే, రాయడం అంటే నిజాయితీ అని కూడా డాజై విశ్వాసం. వ్యక్తిగత జీవితాన్ని అత్యంత పారదర్శకంగా కనబరిచే ఆత్మకథాత్మక నవలలుగా ఆయన ‘ద సెట్టింగ్ సన్’, ‘నో లాంగర్ హ్యూమన్’ జపాన్‌లో కొనియాడబడుతున్నాయి. అప్రయత్నంగా రాసే రచయితగా, అతి చిన్న విషయాలను గురించి పట్టించుకునే రచయితగా కూడా ఆయనకు పేరు. అయితే, కేవలం వాస్తవాన్ని ప్రతిబింబించడం పట్ల కూడా డాజైకి అభ్యంతరాలున్నాయి. ఎదుటివారిలో ఆర్ద్రతను మేల్కొల్పని వాస్తవికవాదాన్ని నిరసించాడు. వాస్తవం కన్నా సత్యం వైపు మొగ్గుచూపాడు. మనిషిగా బతకడంలో సంఘర్షణ ఎదుర్కొని, మద్యానికి బానిసై, అనారోగ్యం పాలై, సంబంధాలను చెడగొట్టుకుని, 39వ పుట్టినరోజు ఇంకా ఆరు రోజులుందనగా సహచరితో కలిసి కాలువలో మునిగి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటికి ఆయన తలపెట్టి పూర్తిచేయకుండా వదిలేసిన నవలిక పేరు ‘గుడ్‌బై’. -
సినిమాలకు సమంత గుడ్ బై!
సౌత్ టాప్ హీరోయిన్ సమంత అక్కినేని సినిమాలకు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు ఓ వార్త జోరుగా షికార్లు కొడుతోంది. కొన్నాళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో ‘సినిమాలు చేయటం ఇప్పట్లో ఆపబోనని’ స్వయంగా ఆమె ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వచ్చే ఏడాది నుంచి మాత్రం ఆమె సినిమాలకు దూరం కాబోతున్నారన్నది ఆ కథనం సారాంశం. అక్కినేని హీరో నాగచైతన్యతో వివాహం అయ్యాక.. కెరీర్‌ను కొనసాగిస్తున్న సామ్ మంచి హిట్లు అందుకున్నారు. ప్రస్తుతం తెలుగులో యూటర్న్ రీమేక్, తమిళంలో సెమ్మ రాజా, సూపర్ డీలక్స్ చిత్రాల్లో ఆమె నటిస్తున్నారు. వీటితోపాటు నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ డైరెక్షన్లో నాగ చైతన్య హీరోగా తెరకెక్కించబోయే ఓ ప్రాజెక్టులోనూ ఆమె నటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇవికాకుండా కొత్త ప్రాజెక్టులను ఆమె ఒప్పుకోవటం లేదు. దీంతో 2019 మార్చి కల్లా ఆయా ప్రాజెక్టులను పూర్తి చేసేసి.. తర్వాత ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పనున్నారని ఆ కథనం పేర్కొంది. అయితే అది శాశ్వతంగానా? లేక తాత్కాలికమా? అన్నది మాత్రం పేర్కొనలేదు. ఈ వార్తపై సమంత ఎలా స్పందిస్తుందో చూడాలి. ఒక్కసారి తల్లిగా మారితే...: సమంత -
టెన్నిస్ కు సెర్బియా బ్యూటీ గుడ్ బై
బెల్గ్రేడ్: సెర్బియా బ్యూటీ, మాజీ ప్రపంచ నంబర్ వన్ అనా ఇవనోవిచ్ తన టెన్నిస్ జీవితానికి గుబ్ బై చెప్పేసింది. ఇటీవల కాలంలో అత్యున్నత స్థాయిలో రాణించలేకపోతున్న అనా ఇవనోవిచ్ 29 ఏళ్లకే అంతర్జాతీయ టెన్నిస్‌కు వీడ్కోలు చెప్పింది. ఈ విషయాన్నిబాధాతప్త హృదయంతో ప్రకటించిన ఇవనోవిచ్.. ఇప్పటివరకూ తనకు మద్దతుగా నిలిచిన అందరీకి ధన్యవాదాలు తెలియజేసింది. 2008లో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ ను సాధించడం ద్వారా గ్రాండ్ స్లామ్ సాధించిన తొలి సెర్బియా మహిళగా రికార్డులెక్కిన ఇవనోవిచ్.. బుధవారం తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించింది. 'నేను రిటైర్మెంట్ నిర్ణయం ప్రకటించడానికి పెద్దగా కారణం ఏమీ లేదు. నేను అత్యున్నత స్థాయిలో రాణించలేనని కారణంతోనే ప్రొఫెషనల్ టెన్నిస్ కెరీర్ నుంచి వీడ్కోలు తీసుకుంటున్నాను. ఇది చాలా కఠిన నిర్ణయం. కానీ ఆనందంగానే టెన్నిస్ కు గుడ్ బై చెబుతున్నా. నా వయసు ఐదేళ్లు ఉన్నప్పుడే టెన్నిస్ ఆటపై మక్కువ పుట్టింది. ఇందుకు నా తల్లి దండ్రులు ఎంతో సహకరించారు. నా స్థాయిని పెంచుకుంటూ నంబవన్ వరకూ ఎదిగా. నా కెరీర్లో చాలా ఎత్తులు చూశా. మళ్లీ ఆ స్థాయిని చూస్తానని అనుకోవడం లేదు.అందుకే ఈ వీడ్కోలు నిర్ణయం'అని అనా ఇవనోవిచ్ స్పష్టం చేసింది. -
తెలుగుదేశం పార్టీని వీడుతున్నాం
పార్టీకి వెలమల కళ్లాల వాసులు గుడ్‌బై అధికార పార్టీ నేతల తీరుపై నిప్పులు చెరిగిన గ్రామస్తులు శృంగవరపుకోట: ముప్పై సంవత్సరాలు జెండా మోశాం. తెలుగుదేశం పార్టీకి తప్ప మరో పార్టీకి ఏనాడూ ఏ ఒక్క ఓటు వేసిన పాపాన పోలేదు. గ్రామమంతా ఒక్కటే మాటగా గంపగుత్తగా ఓట్లు వేశాం. ఏనాడూ మాకు ఇది కావాలని నాయకుల్ని అడగలేదు. వాళ్లు మాకు చేసింది లేదు సరికదా..ఇప్పుడు మమ్మల్ని ఇరుకున పెట్టి ఇబ్బందుల పాలు చేశారు. పోలీసులు ఈడ్చుకెళ్లి అక్రమంగా అరెస్టు చేస్తే కనీసం మమ్మల్ని పరామర్శించేందుకు పార్టీ నాయకుడు ఒక్కరూ రాలేదు. ఇదీ మాకు పార్టీలో దక్కిన గౌరవం’’’ అంటూ ఎస్.కోటలోని వెలమల కళ్లాల వాసులు మూకుమ్మడిగా తమ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం వెలమల కళ్లాల వద్ద డంపింగ్‌యార్డు ప్రారంభం సందర్భంగా జరిగిన ఘటనలో పోలీసులు ఏడుగురు వ్యక్తుల్ని అరెస్టు చేయడం, ఈ ఘటనలో పలువురు మహిళల్ని ఈడ్చేయడం చేశారు. ఈ ఘటనలతో కలత చెందిన వెలమలకళ్లాల వాసులు బుధవారం మీడియాను తమ కళ్లాలకు పిలిచి సమావేశం నిర్వహించారు. మాకు అన్యాయం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 30ఏళ్లుగా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాం. పార్టీకి సేవ చేశాం. అభ్యర్థి ఎవరైనా, ఎలక్షన్ ఏదైనా వెలమల కళ్లాలు అంటే తెలుగుదేశం అనేలా పనిచేశామన్నారు. తెలుగుదేశం ఎమ్మెల్యే, ఎంపీపీ, సర్పంచ్‌లు ఉన్నా ఏనాడూ డంపింగ్‌యార్డు ఇక్కడ పెడతామన్న మాట చెప్పలేదన్నారు. మా బతుకులు పాడవుతాయని అడిగితే పోలీసులతో తన్నించి, కేసులు పెట్టించారని, ఓట్లేసినందుకు మంచి న్యాయం చేశారని వాపోయారు. పోలీసులు అరెస్టులు చేస్తే కనీసం వారికి నచ్చచెప్పేందుకు ఒక్క నేత మా వెంట రాలేదు. పార్టీవల్ల మాకు న్యాయం జరగలేదు సరికదా..ఎమ్మెల్యే, ఎంపీపీ, సర్పంచ్ల తీరు వల్ల అన్యాయం జరిగింది. అందుకే మూకుమ్మడిగా 40కుటుంబాల వారం తెలుగుదేశం పార్టీని వీడుతున్నాం అంటూ గ్రామానికి చెందిన పురుషులు, యువకులు ఎడ్ల రామారావు, ఎడ్ల సంతోష్‌కుమార్, నాగిరెడ్డి గణేష్, వేచలపు సత్తిబాబు, ఎడ్ల గోవింద, రామారావు, బోజంకి ఎర్నాయుడు, అప్పలనాయుడు, రాపేటి నాగేశ్వరరావు, వంటాకు గౌరినాయుడులతో పలువురు మహిళలు మూకుమ్మడిగా ప్రకటించారు. అనంతరం వారంతా ఎమ్మెల్యే, ఎంపీపీ, సర్పంచ్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
డాక్టర్ రెడ్డీస్‌కు ఉమాంగ్ గుడ్‌బై
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ తయారీ సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్‌కు... ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఉమాంగ్ వోరా గుడ్ బై చెప్పారు. ఇప్పటి వరకు ఆయన ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ హోదాలో ఉత్తర అమెరికా జనరిక్స్ విభాగానికి నేతృత్వం వహిస్తున్నారు. గతంలో కంపెనీ సీఎఫ్‌వోగా కూడా పనిచేశారు. 13 ఏళ్ళుగా డాక్టర్ రెడ్డీస్‌లో పనిచేసిన వోరా... కంపెనీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. సిప్లాలో కీలక పదవిలో చేరుతున్నట్టు ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇక ఆయన రాజీనామాతో కీలక హోదాల్లో డాక్టర్ రెడ్డీస్ పలు మార్పులను చేసింది. వోరా స్థానంలో అలోక్ సోనిగ్ను నియమించింది. ఇప్పటి వరకు ఆయన ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ హోదాలో ఇండియా జనరిక్స్ హెడ్‌గా ఉన్నారు. కంపెనీ మేనేజ్మెంట్ కౌన్సిల్లోనూ ఆయన సభ్యుడిగా పనిచేస్తున్నారు. 2012లో డాక్టర్ రెడ్డీస్‌లో చేరారు. అంతకు ముందు వరకు ఆయన 2007 నుంచి బ్రిస్టల్ మేయర్స్ స్క్విబ్(బీఎంఎస్) ఇండియా చీఫ్‌గా విధులు నిర్వర్తించారు. బీఎంఎస్‌లో ఉన్న సమయంలో యూఎస్ మార్కెట్లోనూ పనిచేశారు. ఎమర్జింగ్ మార్కెట్స్ బిజినెస్‌ను పర్యవేక్షిస్తున్న ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఎం.వి.రమణకు ఇండియా, ఎమర్జింగ్ దేశాల బ్రాండెడ్ మార్కెట్స్ హెడ్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. -
డేవిస్ గుడ్‌బై
ఆస్ట్రేలియా అంపైర్ స్టీవ్ డేవిస్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు. ఇంగ్లండ్, న్యూజిలాండ్‌ల మధ్య నాలుగో వన్డేలో చివరిసారి ఆయన మైదానంలో బాధ్యతలు నిర్వర్తించారు. 25 ఏళ్ల పాటు డేవిస్ 57 టెస్టులు, 137 వన్డేలు, 26 టి20 మ్యాచ్‌లలో అంపైర్‌గా వ్యవహరించారు. -
టీడీపీకి తేరా గుడ్‌బై
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : తెలుగుదేశం పార్టీకి జిల్లాకు చెందిన కీలక నేత తేరా చిన్నపరెడ్డి గుడ్ బై చెప్పారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆయన బుధవారం ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ అధినేత చంద్రబాబుకు పంపారు. గతంలో నిర్ణయించుకున్న విధంగా ఈయన ఈనెల 16వ తేదీన టీఆర్ఎస్లో చేరనున్నారు. సీఎం కేసీఆర్ సమక్షంలో హైదరాబాద్‌లో ఆయన పార్టీలో చేరుతారని టీఆర్ఎస్ వర్గాలు ధ్రువీకరించాయి. తెలుగుదేశం పార్టీని వీడాలని తేరా నిర్ణయించుకున్నారని, ఆయన త్వరలోనే టీఆర్ఎస్లో చేరతారని గతంలోనే వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని ఆయన సన్నిహితులు కూడా ధ్రువీకరించారు. అయితే, ఇప్పుడు చిన్నపరెడ్డే అధికారికంగా తన రాజీనామా లేఖను పార్టీకి పంపించారు. ఈయన టీఆర్ ఎస్ తీర్థం పుచ్చుకోకముందునుంచే సామాజిక మీడియా ఫేస్బుక్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫొటోతో హల్చల్ చేస్తున్నారు. తన ఫేస్బుక్ ఐడీ బ్యాక్‌గ్రౌండ్‌గా కేసీఆర్ ఫొటో పెట్టుకున్న ఆయన తెలంగాణకు సంబంధించిన అనేక అంశాలను షేర్ చేసుకుంటున్నారు. అయితే, టీఆర్ఎస్లో చేరనున్న చిన్నపరెడ్డి టీఆర్ఎస్ తరఫున స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా టికెట్ వస్తుందని, ఈ హామీ మేరకే ఆయన టీఆర్ఎస్లో చేరుతున్నారని ఆయన సన్నిహితులంటున్నారు. ఈ మేరకు కేసీఆర్ కూడా స్పష్టమైన హామీ ఇచ్చినట్టు తెలిసింది. చిన్నపరెడ్డిని టీఆర్ఎస్లోనికి తీసుకురావడంలో జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్‌రెడ్డి కీలకపాత్ర పోషించారు. అయితే, తన చేరిక అట్టహాసంగా ఉండేలా చిన్నపరెడ్డి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. టీడీపీ, కాంగ్రెస్‌ల నుంచి పెద్ద ఎత్తున స్థానిక సంస్థల ప్రతినిధులను తనతో పాటు టీఆర్ఎస్లో చేరేలా ఆయన ఇప్పటికే ప్రణాళికలు రచించుకున్నట్టు సమాచారం. -
వారు చెబితే నటనకు గుడ్‌బై
తన చిత్రాల జయాపజయాలతో తనకు సంబంధం లేదంటోంది నటి సమంత. టాలీవుడ్లో క్రేజీ హీరోయిన్గా వెలుగొందుతున్నా, కోలీవుడ్‌లో ఒక్క హిట్ కూడా లేదే అనుకుంటున్న ఈ అమ్మడి బాధను కత్తి చిత్రం తీర్చేసింది. దీంతో సంబరపడిపోతున్న సమంత ప్రవర్తనలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. తన చిత్రాల జయాపజయాలతో తనకెలాంటి సంబంధం లేదని కుండబద్దలు కొట్టినట్టు అంటోంది. ఒక చిత్రం అపజయం పాలయ్యిందంటే దానికి దర్శకుడు, నిర్మాత, కథ వంటి పలు కారణాలుంటాయని పేర్కొంది. కాబట్టి తన చిత్రాలు విజయం సాధిస్తే సంతోషమే కానీ, అపజయం పాలైనా తానేమీ బాధపడను అని సెలవిచ్చింది. ఈ విషయంలో తనను స్వార్థపరురాలు అన్నా లెక్క చేయనని చెప్పింది. తాను నటించి ప్లాప్ అయిన చిత్రాల్లోనూ తన నటన బాగుందని పలువురు ప్రశంసించారని చెప్పింది. దీంతో పాటు నటన బాగలేదని ఏ ఒక్క అభిమాని చెప్పినా వెంటనే నటనకు గుడ్‌బై చెప్పి ఇంట్లో కూర్చొంటానని సమంత అంటోంది. -
ఇక నిద్రలేని రాత్రులు
ఫుట్‌బాల్ ప్రపంచకప్, బ్రెజిల్ మరో 10 రోజుల్లో ఆకుపచ్చని అందమైన మైదానం... చుట్టూ హోరెత్తించే అభిమానులు.. ఎటూ చూసిన ఈలలు... కేరింతలు... యుద్ధానికి సిద్ధమైన ఓ సైన్యంలా ఆటగాళ్లు అలా నడుచుకుంటూ వస్తుంటే... ఎన్నడూ లేని ఉత్కంఠ... అలలా మొదలవుతూ... ప్రవాహంలా పెరుగుతూ... ఉప్పెనలా చుట్టిపడేస్తూ... యుద్ధంలా సాగే ‘సాకర్’ పండుగ వచ్చేసింది. క్షణక్షణం ఎదురుచూపులు... అనుక్షణం అప్రమత్తత... రెప్పపాటులో తారుమారయ్యే ఫలితాలు... ప్రతి జట్టుకో వ్యూహం... ప్రతి ఆటగాడికో ప్రత్యేక శైలి... పాదరసంలా కదం తొక్కుతూ... 90 నిమిషాల పాటు చేసే ఫుట్‌బాల్ విన్యాసాల కోసం భూగోళం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. 32 జట్లు... 32 రోజులు... 64 మ్యాచ్‌లు... వందల సంఖ్యలో ఆటగాళ్లు... వేల సంఖ్యలో నిర్వాహకులు... లక్షల్లో అభిమానులు... కోట్లల్లో ప్రేక్షకులు... నాలుగేళ్లకోసారి ప్రపంచాన్ని ఊపేసే ఫుట్‌బాల్ మాంత్రికుల మాయాజాలాన్ని చూడాలంటే నిద్రకు గుడ్‌బై చెప్పాల్సిందే. మరో 10 రోజుల్లో ‘ఫిఫా’ ప్రపంచకప్ బ్రెజిల్లో ప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం మ్యాచ్‌లన్నీ అర్ధరాత్రిపూటే ఉంటాయి. కాబట్టి భారత దేశంలో ఫుట్‌బాల్ అభిమానులకు రాబోయేవి నిద్రలేని రాత్రులే.