వారు చెబితే నటనకు గుడ్‌బై | Is Samantha planning to say goodbye to acting? | Sakshi
Sakshi News home page

వారు చెబితే నటనకు గుడ్‌బై

Published Mon, Nov 17 2014 2:11 AM | Last Updated on Fri, Aug 17 2018 2:24 PM

వారు చెబితే నటనకు గుడ్‌బై - Sakshi

వారు చెబితే నటనకు గుడ్‌బై

 తన చిత్రాల జయాపజయాలతో తనకు సంబంధం లేదంటోంది నటి సమంత. టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా వెలుగొందుతున్నా, కోలీవుడ్‌లో ఒక్క హిట్ కూడా లేదే అనుకుంటున్న ఈ అమ్మడి బాధను కత్తి చిత్రం తీర్చేసింది. దీంతో సంబరపడిపోతున్న సమంత ప్రవర్తనలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. తన చిత్రాల జయాపజయాలతో తనకెలాంటి సంబంధం లేదని కుండబద్దలు కొట్టినట్టు అంటోంది. ఒక చిత్రం అపజయం పాలయ్యిందంటే దానికి దర్శకుడు, నిర్మాత, కథ వంటి పలు కారణాలుంటాయని పేర్కొంది. కాబట్టి తన చిత్రాలు విజయం సాధిస్తే సంతోషమే కానీ, అపజయం పాలైనా తానేమీ బాధపడను అని సెలవిచ్చింది. ఈ విషయంలో తనను స్వార్థపరురాలు అన్నా లెక్క చేయనని చెప్పింది. తాను నటించి ప్లాప్ అయిన చిత్రాల్లోనూ తన నటన బాగుందని పలువురు ప్రశంసించారని చెప్పింది. దీంతో పాటు నటన బాగలేదని ఏ ఒక్క అభిమాని చెప్పినా వెంటనే నటనకు గుడ్‌బై చెప్పి ఇంట్లో కూర్చొంటానని సమంత అంటోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement