
టొరంటో: కెరీర్‌కు త్వరలోనే గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమైన అమెరికా టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ ఆ ప్రకటన తర్వాత ఆడిన మొదటి టోర్నీలోనే పేలవ ప్రదర్శన కనబర్చింది. కెనడియన్ ఓపెన్‌లో ఆమె ఆట తొలి రౌండ్లోనే ముగిసింది. మహిళల సింగిల్స్ పోరులో 2–6, 4–6తో బెలిండా బెన్సిక్ (స్విట్జర్లాండ్) చేతిలో సెరెనా పరాజయం చవిచూసింది.
ఇక్కడ మూడు సార్లు చాంపియన్‌గా నిలిచిన సెరెనా ఓటమితో ఈవెంట్‌కు గుడ్‌బై చెప్పింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ‘భావోద్వేగం వల్లే మాటరాని మౌనంతో బరువెక్కిన హృదయంతో నిష్క్రమించాను. నిజానికి ఈ మ్యాచ్‌లో నేను బాగా ఆడాలని సన్నద్ధమై వచ్చాను. కానీ నాకంటే బెలిండా చాలా బాగా ఆడింది. ఇంత మంది అభిమానుల మధ్య నా సుదీర్ఘ కెరీర్ సాగింది. ఇది ఎప్పటికీ ప్రత్యేకం’ అని సెరెనా ఉద్వేగంతో తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment