retairement
-
అర్లీ రిటైర్మెంట్.. ఫరెవర్ ఎంజాయ్మెంట్!
ఉన్నది ఒకటే జీవితం! దాన్ని జీతానికి తాకట్టు పెడితే ఆర్జిస్తున్నామనే ఆనందం కూడా మిగలదు! ఉద్యోగం వేతనాన్నే కాదు చేస్తున్న పని పట్ల సంతృప్తినీ ఇవ్వాలి.. ఆస్వాదించే సమయాన్నుంచాలి.. మన జీవితాన్ని మనకు మిగల్చాలి! ఇది జెన్ జెడ్ ఫిలాసఫీ! అందుకే వాళ్లు రెజ్యుమే ప్రిపేర్ చేయట్లేదు. పోర్ట్‌ఫోలియో కోసం తాపత్రయపడుతున్నారు. వర్క్ స్టయిల్ని మార్చేస్తున్నారు. ఆఫీస్ డెకోరమ్ నుంచి ఫ్రేమ్ అవుట్ అవుతున్నారు. ముందుతరాల ఉద్యోగులను ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నారు. మేనేజ్మెంట్కి ఆప్షన్ లేకుండా చేస్తున్నారు.‘చూసేవాళ్లకు కేర్ఫ్రీగా కనిపిస్తున్నామేమో కానీ చేసే పని పట్ల, మా ఫ్యూచర్ పట్ల క్లారిటీతోనే ఉంటున్నాం. జాబ్ అండ్ జిందగీ, ప్యాకేజ్ అండ్ ఫ్యాషన్ల మధ్య ఉన్న డిఫరెన్స్ తెలుసు మాకు. అందుకే మేము మా స్కిల్‌ని నమ్ముకుంటున్నాం.. లాయల్టీని కాదు’ అంటోంది జెన్ జెడ్ ప్రతినిధి, బిజినెస్ అనలిస్ట్ చిలుకూరు సౌమ్య.నిజమే.. తమకేం కావాలి అన్నదాని పట్ల జెన్ జెడ్‌కి చాలా స్పష్టత ఉంది. వాళ్లు దేన్నీ దేనితో ముడిపెట్టట్లేదు. దేనికోసం దేన్నీ వదులుకోవట్లేదు. నైపుణ్యం కంటే విధేయతకే ప్రాధాన్యమిస్తున్న సంస్థల్లో పని వాతావరణాన్ని మార్చేస్తున్నారు. అపాయింట్మెంట్ ఆర్డర్ అందుకున్న నాటి నుంచి రిటైర్మెంట్ వరకు ఒకే సంస్థలో ఉద్యోగాన్నీడ్చే ముందు తరాల మనస్తత్వాన్ని ఔట్ డేటెడ్‌గా చూస్తున్నారు. తక్కువ సర్వీస్‌లో వీలైనన్ని జంప్‌లు, వీలైనంత ఎక్కువ ప్యాకెజ్ అనే ఐడియాను ఇంప్లిమెంట్ చేస్తున్నారు.వాళ్ల రూటే వేరు..సంప్రదాయ జీవన శైలినే కాదు ట్రెడిషనల్ వర్క్ స్టయిల్‌నూ ఇష్టపడట్లేదు జెన్ జెడ్. ‘పదహారు.. పద్దెనిమిదేళ్లు చదువు మీద పెట్టి, తర్వాత లైఫ్ అంతా 9 టు 5 పనిచేస్తూ, కార్పొరేట్ కూలీలుగా ఉండటం మావల్ల కాదు’ అంటున్నారు బెంగళూరుకు చెందిన కొందరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు. ‘జెన్ జెడ్.. మాలాగా కాదు. వాళ్లు సంస్థ ప్రయోజనాల కోసం చెమటోడ్చట్లేదు. అలాంటి షరతులు, డిమాండ్లకూ తలొగ్గట్లేదు. వాళ్లకు పనికొచ్చే, వాళ్ల సామర్థ్యాన్ని నిరూపించుకునే కంప్యూటర్ ప్రోగ్రామింగ్, రైటింగ్, డిజైన్ లాంటి టాస్క్స్నే తీసుకుంటున్నారు. అంతే నిర్మొహమాటంగా గుర్తింపును, కాంప్లిమెంట్స్నూ కోరుకుంటున్నారు. కొలీగ్స్‌తో మాట్లాడినంత క్యాజువల్‌గా సంస్థ డైరెక్టర్‌తో మాట్లాడేస్తున్నారు. సీనియర్స్, సుపీరియర్స్ని ‘సర్’ అనో, ‘మేడమ్’ అనో పిలవడం వాళ్ల దృష్టిలో ఫ్యూడల్, ఓల్డ్ ఫ్యాషన్డ్. పేరుతో పిలవడాన్ని అప్ డేటెడ్‌గా, ఈక్వల్‌గా ట్రీట్ చేస్తున్నారు’ అని చెబుతున్నారు మిలేనియల్ తరానికి చెందిన కొందరు బాస్‌లు. దీన్నిబట్టి జెన్ జెడ్‌కి ఆఫీస్ మర్యాదల మీదా స్పష్టమైన అభిప్రాయాలు ఉన్నట్లు తెలుస్తోంది. వాళ్లు యజమాని – ఉద్యోగి సంబంధాన్ని సింపుల్‌గా ‘మీకు అవసరమైన పని చేసిపెడుతున్నాం.. దానికి చార్జ్ చేసిన డబ్బును తీసుకుంటున్నాం’ అన్నట్లుగానే పరిగణిస్తున్నారు తప్ప ఎలాంటి అటాచ్మెంట్లు, సెంటిమెంట్లకు చోటివ్వట్లేదు.40 కల్లా..చేసే ఉద్యోగం, జీతం, పని వేళలు, ఆఫీస్ వాతావరణమే కాదు ఎన్నాళ్లు పనిచేయాలనే విషయంలోనూ జెన్ జెడ్‌కి ఒక అవగాహన ఉంది. తర్వాత ఏం చేయాలనేదాని పట్లా ఆలోచన ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే ‘జీవిక కోసం జీతం.. ప్యాషన్ కోసం జీవితం’ అని నమ్ముతున్నారు వాళ్లు. 35– 40 ఏళ్ల కల్లా రిటైర్మెంట్ అంటూ పెద్దవాళ్లు విస్తుపోయేలా చేస్తున్నారు. ‘మేము 60 ఏళ్లకు రిటైరైన తర్వాత కూడా ఏదో ఒక జాబ్ చేయాలని చూస్తుంటే మా పిల్లలేమో 35 – 40 ఏళ్ల వరకే ఈ ఉద్యోగాలు.. తర్వాత అంతా మాకు నచ్చినట్టు మేం ఉంటామని చెబుతున్నారు. ఆశ్చర్యమేస్తోంది వాళ్ల ధైర్యం, భరోసా, నమ్మకం చూస్తుంటే’ అంటున్నారు కొంతమంది తల్లిదండ్రులు. 40 ఏళ్ల కల్లా రిటైరైపోయి తమకు నచ్చిన రంగంలో సెకండ్ కెరీర్‌ని మొదలుపెట్టాలనుకుంటున్నారు. దీనికోసం ఉద్యోగంలో చేరిన తొలిరోజు నుంచే అన్నిరకాల ప్రణాళికలు వేసుకుంటున్నారు. పొదుపుతో జాగ్రత్తపడుతున్నారు. సిప్‌లు,షేర్లలో మదుపు చేస్తున్నారు. మార్కెట్ అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాలతో అప్డేట్ అవుతున్నారు. తమ లక్ష్యాలకు సరిపోయే ప్యాకేజ్ని కోట్ చేస్తూ అర్థిక సుస్థిరత కోసం ప్రయత్నిస్తున్నారు.రెజ్యుమే టు పోర్ట్‌ఫోలియో..ఒక వ్యక్తి కొన్నాళ్లు ఓడరేవులో పని చేస్తాడు. అక్కడి నుంచి చెరుకు తోటలకు కూలీగా వెళ్తాడు. ఇంకొన్నాళ్లు బడిలో పాఠాలు చెబుతాడు. ఆ తర్వాత ఎలక్ట్రీషియన్‌గా కనపడతాడు. మరికొన్నాళ్లకు ఇంకో కొలువును చేపడతాడు. ఆఖరికి ఏ సైంటిస్ట్గానో, రాజకీయవేత్తగానో, రచయితగానో తన మజిలీ చేరుకుంటాడు. ఇలాంటివన్నీ సాధారణంగా పాశ్చాత్య నవలలు, ఆటోబయోగ్రఫీలు, సినిమాల్లో కనపడతాయి. కానీ ఈ ధోరణిని ఇప్పుడు జెన్ జెడ్‌లోనూ కనపడుతోంది. 60 ఏళ్లకు రిటైర్మెంట్నే కాదు రిటైర్మెంట్ వరకు ఒకే కొలువు అనే కాన్సెప్ట్‌నూ ఇష్టపడట్లేదు వాళ్లు. కెరీర్లో రెండుమూడు జంప్ల తర్వాత ఆఫీస్‌లో కూర్చొని చేసే జాబ్ కన్నా ఫ్రీలాన్స్కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. దీనివల్ల ఆదాయం పెరగడమే కాక, మనసుకు నచ్చిన పనిచేసుకునే అవకాశమూ దొరుకుతోంది అంటున్నారు.వివిధ రంగాల్లోని చాలామంది జెన్ జెడ్ ఉద్యోగులు పలు స్టార్టప్స్‌కి పనిచేస్తున్నారు, స్టార్టప్స్ నడుపుతున్నారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కి కంట్రిబ్యూట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. వ్లాగర్స్, యూట్యూబర్స్‌గా కొనసాగుతున్నారు. అడ్వర్టయిజ్మెంట్ కాపీ రైటర్స్‌గా, ఆర్ట్ ఎగ్జిబిషన్స్‌కి క్యురేటర్స్గా సేవలందిస్తున్నారు. యోగా టీచర్స్‌గా, అనువాదకులుగా, కేర్ టేకర్స్‌గా పనిచేస్తున్నారు. వాయిస్ ఓవర్ చెబుతున్నారు. డిస్కవరీ, జాగ్రఫీ, యానిమల్ ప్లానెట్ లాంటి చానళ్ల కోసం పనిచేస్తున్నారు. డాక్యుమెంటరీలకు స్క్రిప్ట్స్ రాస్తున్నారు. ఎడిటింగ్ చేస్తున్నారు. గ్రాఫిక్స్ అందిస్తున్నారు. వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ, ఫ్యాషన్ డిజైన్, మోడలింగ్‌లో ఉన్నారు. ఐడియా బ్యాంక్‌ని నిర్వహిస్తున్నారు. ఇలా ఏ రంగంలో ఆసక్తి ఉంటే ఆ రంగంలో.. వైవిధ్యమైన పని అనుభవాలతో రెజ్యుమే ప్లేస్‌లో పోర్ట్‌ఫోలియో సిద్ధం చేసుకుంటున్నారు. డబ్బుతోపాటు జాబ్ శాటిస్ఫాక్షన్ను పొందుతున్నారు.ఫిన్‌ఫ్లుయెన్సర్స్..40 ఏళ్లకే రిటైరై.. సెకండ్ కెరీర్‌ను స్టార్ట్ చేసిన వాళ్లు, రకరకాల ఉద్యోగాలతో ఫ్రీలాన్స్ చేçస్తున్న వాళ్లు ఆర్థిక క్రమశిక్షణలోనూ ఆరితేరుతున్నారు. పలు స్టార్టప్స్‌లో, సేవల రంగంలో పెట్టుబడులు పెడుతూ ఫిన్ఫ్లుయెన్సర్స్గా మారుతున్నారు.ఈ ధోరణికి కారణం.. ఇంటర్నెట్, ఏఐ లాంటి ఫాస్ట్‌మూవింగ్ టెక్నాలజీ, కరోనా పరిస్థితులు .. కెరీర్, ఆఫీస్ వర్క్‌కి సంబంధించి ఎన్నో మార్పులను తెచ్చాయి. అవి జెన్ జెడ్‌ని ఎంతో ప్రభావితం చేస్తున్నాయి. వారి ఆలోచనా విధానాన్ని మారుస్తున్నాయి. ఈ మధ్య చోటుచేసుకున్న రష్యా– ఉక్రెయిన్ యుద్ధం, తత్ఫలితంగా ఏర్పడ్డ ఆర్థికమాంద్యం, ఉద్యోగాల కోత వంటి పరిణామాలు కూడా ఆ ధోరణిని కొనసాగేలా చేస్తున్నాయి. దీనికి పేరెంటింగ్నూ మరో కారణంగా చూపుతున్నారు సామాజిక విశ్లేషకులు. ఇంజినీరింగ్, మెడిసిన్ తప్ప ఇంకో చదువు లేదు, మరో కెరీర్ కెరీర్ కాదనే పెంపకమూ ఫ్రీలాన్సింగ్, అర్లీ రిటైర్మెంట్ ట్రెండ్‌కి ఊతమవుతోందని వాళ్లు అభిప్రాయపడుతున్నారు.జెన్ జెడ్ ఫ్రీలాన్స్ వర్కింగ్ ట్రెండ్ మీద అమెరికా, శాన్ఫ్రాన్సిస్కోకు చెందిన ‘అప్‌వర్క్ ఆన్లైన్ ఫ్రీలాన్స్ నెట్వర్కింగ్’ అనే సంస్థ ఇటీవల ఓ సర్వే నిర్వహించింది. అనుగుణమైన పనివేళలు, ఆదాయ భరోసా ఉండటం వల్లే వాళ్లు ఏ రంగంలోనైనా ఫ్రీలాన్స్ చేయడానికి సిద్ధపడుతున్నట్లు ఆ సర్వేలో వెల్లడైంది. ఎక్కువమంది కోవిడ్ చరమాంకం నుంచి ఈ ఫ్రీలాన్స్ వర్క్ కల్చర్‌లో కొనసాగుతున్నారట. వాళ్లంతా వారానికి 40 గంటలు, పలురకాల పనుల్లో ఫ్రీలాన్స్ చేస్తున్నారు. కొందరేమో పనిచోట సీనియర్స్– జూనియర్స్, కుల, మత, జాతి, లింగ వివక్షను భరించలేక, ఆ వాతావరణం నుంచి దూరంగా ఉండటానికి ఫ్రీలాన్స్ని ఎంచుకున్నట్లు చెప్పారు. మరికొందరు వ్యక్తిగత జీవితం తమ చేతుల్లోనే ఉంటుందని, సొంతంగా ఎదిగే వీలుంటుందని ఫ్రీలాన్స్ చేస్తున్నట్లు తెలిపారు. టిక్‌టాక్ నిషేధం తర్వాత చాలామంది క్రియేటర్స్‌కి ఇన్స్టాగ్రామ్ ఓ ప్రత్యామ్నాయ వేదికగా మారడంతో వాళ్లంతా మళ్లీ ఫ్రీలాన్స్కి మళ్లారు. మైక్రోసాఫ్ట్, లింక్డిన్ డేటా ప్రకారం జెన్ జెడ్ ఫ్రీలాన్సర్స్.. సంస్థలు ఇచ్చే శిక్షణ మీద ఆధారపడకుండా సొంతంగా శిక్షణ తీసుకుని ఏఐ వంటి అధునాతన సాంకేతిక సౌకర్యాలను చాలా చక్కగా వాడుకుంటున్నారు. మిలేనియల్స్ మాదిరి జెన్ జెడ్.. లాప్‌టాప్‌ను, కంప్యూటర్ను ఎక్స్ట్రా ఆర్గాన్‌గా మోయట్లేదు. ఆఫీస్‌ను మొదటి ఇల్లుగా చేసుకోవట్లేదు. ఉన్న చోటు నుంచే తమ దగ్గరున్న డివైస్లోంచే పనిచేసుకుంటున్నారు.. ఆడుతూ.. పాడుతూ.. హ్యాపీగా! పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్నీ జెన్ జెడ్‌కి ఫ్రీలాన్సింగ్ ఇచ్చేలా కొందరు బిజినెస్ లీడర్లు ముందుకు వస్తున్నారు. ఆ దిశగా కొన్ని సంస్థలూ ఆలోచిస్తున్నాయి.ఉరుకులు, పరుగులు నచ్చక..చదువైపోయిన వెంటనే అమెజాన్‌లో జాబ్ వచ్చింది. 9 టు 5 వర్క్ వల్ల పర్సనల్‌గా నేను బావుకుంటున్నదేమీ లేదని రియలైజ్ అయ్యాను. అందుకే లాస్టియర్ జాబ్ మానేసి ఫ్రీలాన్సర్‌గా మారాను. దీనివల్ల డబ్బుతో పాటు జాబ్ శాటిస్ఫాక్షన్ కూడా దొరుకుతోంది. అంతేకాదు చుట్టుపక్కలవాళ్లకు తోచిన సాయం చేయగలుగుతున్నాను. నాకు ట్రావెల్, మ్యూజిక్ అంటే ఇష్టం. ఇప్పుడు టైమ్ నా చేతిలో ఉంటోంది కాబట్టి, మ్యూజిక్ షోస్ చేసుకుంటున్నాను. నాకు నచ్చిన చోటికి వెళ్తున్నాను. – కార్తిక్ సిరిమల్ల, హైదరాబాద్డబ్బును కాదు టైమ్‌ని చేజ్ చేస్తోందిజర్మనీలో మాస్టర్స్ చేసి, అక్కడే మంచి జాబ్ కూడా సంపాదించుకున్నాను. అయినా హ్యాపీనెస్ లేదు. ఆఫీస్‌లో అన్నేసి గంటలు చేసిన వర్క్‌కి ఎండ్ ఆఫ్ ద డే అంతే ఔట్పుట్ కనిపించలేదు! అంతే శ్రమ నాకు నచ్చిన దాని మీద పెడితే ఆ శాటిస్ఫాక్షనే వేరు కదా అనిపించింది! అందుకే ఇండియాకు వచ్చేసి, థీమ్ రెస్టరెంట్ పెట్టాను. ఆన్లైన్లో జర్మన్ లాంగ్వేజ్ నేర్పిస్తున్నాను. ఫ్యూచర్లో కొంతమంది ఫ్రెండ్స్‌మి కలసి మాకు నచ్చిన ఓ పల్లెలో కొంచెం ల్యాండ్ కొనుక్కొని మినిమలిస్టిక్ లైఫ్‌ని లీడ్ చేయాలనుకుంటున్నాం. మా జెనరేషన్ డబ్బును చేజ్ చేయట్లేదు. టైమ్‌ని చేజ్ చేస్తోంది. – వుల్లి సృజన్, హైదరాబాద్టాక్సిక్ వాతావరణం..యూకేలో ఏంబీఏ చేశాను. కొన్ని రోజులు హెచ్ఆర్ జాబ్‌లో ఉన్నాను. కానీ ఆఫీస్‌లోని టాక్సిక్ వాతావరణం నచ్చక వదిలేశాను. నాకు ముందు నుంచీ ఫ్యాషన్, బ్యూటీ మీద ఇంట్రెస్ట్. అయితే జాబ్ వదిలేయగానే ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడ్డం మొదలుపెట్టారు. నాకు బ్యూటీపార్లర్ పెట్టాలనుందని చెప్పాను. పెళ్లి ఖర్చులకు ఎంతనుకున్నారో అందులో సగం నా బిజినెస్‌కి హెల్ప్ చేయమని అడిగాను. ఏడాదిలో పికప్ కాకపోతే పెళ్లికి ఓకే అనాలనే షరతు మీద డబ్బిచ్చారు నాన్న. ఇంకొంత లోన్ తీసుకుని పార్లర్ అండ్ స్పా పెట్టాను. ఏడాదిన్నర అవుతోంది. మంచిగా పికప్ అయింది. – ప్రత్యూష వావిలాల, కరీంనగర్. -
Canadian Open: తొలి రౌండ్లోనే సెరెనా అవుట్
టొరంటో: కెరీర్‌కు త్వరలోనే గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమైన అమెరికా టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ ఆ ప్రకటన తర్వాత ఆడిన మొదటి టోర్నీలోనే పేలవ ప్రదర్శన కనబర్చింది. కెనడియన్ ఓపెన్‌లో ఆమె ఆట తొలి రౌండ్లోనే ముగిసింది. మహిళల సింగిల్స్ పోరులో 2–6, 4–6తో బెలిండా బెన్సిక్ (స్విట్జర్లాండ్) చేతిలో సెరెనా పరాజయం చవిచూసింది. ఇక్కడ మూడు సార్లు చాంపియన్‌గా నిలిచిన సెరెనా ఓటమితో ఈవెంట్‌కు గుడ్‌బై చెప్పింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ‘భావోద్వేగం వల్లే మాటరాని మౌనంతో బరువెక్కిన హృదయంతో నిష్క్రమించాను. నిజానికి ఈ మ్యాచ్‌లో నేను బాగా ఆడాలని సన్నద్ధమై వచ్చాను. కానీ నాకంటే బెలిండా చాలా బాగా ఆడింది. ఇంత మంది అభిమానుల మధ్య నా సుదీర్ఘ కెరీర్ సాగింది. ఇది ఎప్పటికీ ప్రత్యేకం’ అని సెరెనా ఉద్వేగంతో తెలిపింది. -
Ashleigh Barty: శిఖరం నుంచే సాగిపోనీ...
సాక్షి క్రీడా విభాగం: ‘ప్రొఫెషనల్ క్రీడల్లో అనుకున్న లక్ష్యాలు చేరుకోకుండానే ఆట నుంచి తప్పుకునే వారు 99 శాతం మంది ఉంటారు. కానీ యాష్లే బార్టీ మిగిలిన ఆ 1 శాతం మందిలో ఉంటుంది’ 25 ఏళ్ల వయసుకే బార్టీ సాధించిన ఘనతలు చూస్తే ఈ వ్యాఖ్య ఆమెకు సరిగ్గా సరిపోతుంది. మూడు వేర్వేరు సర్ఫేస్‌లలో (హార్డ్, క్లే, గ్రాస్‌కోర్టు) మూడు సింగిల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్, ఒలింపిక్ పతకం, ఓవరాల్‌గా 121 వారాలు వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్, సంపాదనలో మేటి... ఇంకా సాధించడానికి ఏముంది! బార్టీ కూడా ఇలాగే ఆలోచించి ఉంటుంది. శిఖరాన చేరుకున్న తర్వాత ఇక ఎక్కడానికి ఎత్తులు లేవు అనిపించినప్పుడు ఆమె ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చు. ఎలా మొదలు పెట్టామనే దానికంటే ఎలా ముగించామన్నదే ముఖ్యం అని భావిస్తే బార్టీ తన ఘనమైన కెరీర్‌కు అద్భుత రీతిలో గుడ్‌బై పలికింది. సొంతగడ్డపై భారీ సంఖ్యలో ఉన్న ప్రేక్షకుల మధ్య ప్రతిష్టాత్మక ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన బార్టీ దానినే చివరి ఘట్టంగా మార్చుకుంది. నిజానికి కెరీర్ ఉచ్ఛ స్థితిలో ఉన్నప్పుడు దానికి ముగింపు పలకడం అంత సులువు కాదు. దానికి ఎంతో సాహసం, మానసిక దృఢత్వం కావాలి. బార్టీ తాజా ఫామ్, వయసును బట్టి చూస్తే రాబోయే కొన్నేళ్లు ఆమె మహిళల టెన్నిస్‌ను శాసించే స్థితిలో ఉంది. ఆర్జనపరంగా చూస్తే మహిళల వరల్డ్ నంబర్‌వన్‌తో ఒప్పందాల కోసం పెద్ద పెద్ద బ్రాండింగ్ సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఆమె ప్రచార కార్యక్రమాల ద్వారానే లెక్కలేనంత సంపదనను సొంతం చేసుకోవచ్చు. ఇలాంటివి ఊరిస్తున్నా, వెనక్కి లాగే అవకాశం ఉన్నా బార్టీ ‘ఇట్స్ జస్ట్ మై వే’ అంటూ తనదైన దారిని ఎం చుకుంది. తన ప్రస్తుత స్థాయి ఏమిటో ఆమె పట్టించుకోలేదు. టెన్నిస్ మాత్రమే తనకు ప్రపం చం కాదని, కొత్త కలలను సాకారం చేసుకోవా ల్సి ఉందంటూ ముందుకు వెళ్లేందుకు నిశ్చ యించుకుంది. తానేంటో, తనకు కావాల్సింది ఏమిటో, తాను ఎలా సంతోషంగా ఉండగలనో గుర్తించి దాని ప్రకారమే నిర్ణయం తీసుకుంది. బార్టీ కెరీర్ ఆసాంతం ఆసక్తికరం. నాలుగేళ్ల వయసులో రాకెట్ పట్టిన ఈ బ్రిస్బేన్ అమ్మాయి 14 ఏళ్ల వయసులో ఐటీఎఫ్ టోర్నీతో తొలిసారి ప్రొఫెషనల్ టెన్నిస్‌లోకి అడుగు పెట్టింది. తర్వాత సంవత్సరమే వింబుల్డన్ జూనియర్ టైటిల్ గెలవడంతో ఆమెకు గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత కెరీర్లో ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చింది. కేసీ డెలాక్వా తోడుగా మహిళల డబుల్స్‌లో మూడు గ్రాండ్‌స్లామ్‌లలో ఫైనల్ చేరగా, సింగిల్స్‌లోనూ మంచి ఫలితాలు వచ్చాయి. అయితే 2014లో అనూహ్యంగా ఆటకు విరామం ఇస్తున్నట్లు ప్రకటించింది. ‘చిన్నప్పటి నుంచే ఆడుతున్న నేను ఇంత ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నాను. ఒక సాధారణ టీనేజర్‌గా నా జీవితం గడపాలని ఉంది’ అంటూ దాదాపు 18 నెలలు టెన్నిస్ నుంచి తప్పుకుంది. ఇదే సమయంలో క్రికెట్‌పై దృష్టి పెట్టింది. ప్రాథమిక స్థాయిలో ఎలాంటి శిక్షణ లేకపోయినా కొద్ది రోజుల్లోనే ఆటపై పట్టు సాధించి ఏకంగా ‘మహిళల బిగ్‌బాష్ లీగ్’లో బ్రిస్బేన్ హీట్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. ఆ తర్వాత 2016 ఫిబ్రవరిలో మళ్లీ టెన్నిస్‌లోకి వచ్చిన యాష్లే బార్టీకి వెనక్కి తిరిగి చూసే అవసరం రాలేదు. -
రైతు కుటుంబం నుంచి అంచెలంచెలుగా ఎదిగి..
చిత్తూరు కలెక్టరేట్ : పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అనంతసాగర్ మండలం వరికుంటపాడులో రైతు కుటుంబానికి చెందిన పెంచలయ్య, కొండమ్మ దంపతులకు నరసింహారెడ్డి జన్మించారు. ఒకటో తరగతి నుంచి పీహెచ్డీ వరకు ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే చదివారు. సెకండరీ గ్రేడ్ టీచర్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన ఆయన డీఈవో స్థాయికి ఎదిగారు. నెల్లూరు డైట్ కళాశాల లెక్చరర్‌గా, బీఈడీ కళాశాల లెక్చరర్‌గా, ఎస్సీఈఆర్టీ ఐఈడీ కోఆర్డినేటర్‌గా, సహిత విద్య కోఆర్డినేటర్‌గా, రాష్ట్ర స్థాయి లీడర్షిప్ ట్రైనింగ్ కోఆర్డినేటర్‌గా, పాఠ్యపుస్తకాల రచయితగా అనేక హోదాల్లో పనిచేశారు. విధుల పట్ల నిబద్ధత, అంకితభావంతో పనిచేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. శిథిలావస్థకు చేరిన డీఈవో కార్యాలయం రూపురేఖలను మార్చడంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. సొంత నిధులతో మరమ్మతులు చేయించారు. టీచర్ల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించారు. ఈ–ఆఫీస్‌ను పకడ్బందీగా నిర్వహించి ఫైళ్లు పెండింగ్ లేకుండా చర్యలు తీసుకున్నారు. ప్రశంసలు ప్రభుత్వం చిత్తూరు నుంచి ప్రారంభించిన అమ్మఒడి పథకం విజయవంతానికి కృషి చేశారు. కేజీబీవీ బాలికలు నాసా కార్యక్రమానికి వెళ్లడంలో ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఇన్‌స్పైర్‌లో రాష్ట్రస్థాయిలో జిల్లాను మొదటి స్థానంలో నిలిపారు. ఉయ్ లవ్ రీడింగ్‌ను పకడ్బందీగా అమలు చేసి కమిషనర్ చినవీరభద్రుడు నుంచి ప్రశంసలు పొందారు. బయోమెట్రిక్ అమలులో జిల్లా మొదటి స్థానంలో నిలిచేలా కృషి చేశారు. నాడు– నేడు అమలులో మంచి పురోగతి చూపించి ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్ నుంచి ప్రశంసలు పొందారు. చదవండి: రేపటి నుంచి స్కూళ్లకు ఉపాధ్యాయులు -
Barbora Strycova: టెన్నిస్‌కు స్ట్రికోవా గుడ్‌బై
ప్రాగ్ (చెక్ రిపబ్లిక్): మహిళల టెన్నిస్ డబుల్స్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ బార్బరా స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్) కెరీర్‌కు వీడ్కోలు పలికింది. 35 ఏళ్ల స్ట్రికోవా తల్లి కాబోతున్నట్లు గత మార్చిలో ప్రకటించింది. 2019 వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో స్ట్రికోవా చైనీస్ తైపీకి చెందిన సు వె సెయితో కలిసి మహిళల డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. అదే ఏడాది సింగిల్స్ విభాగంలో సెమీఫైనల్‌కు చేరుకుంది. ‘నా అంతర్జాతీయ టెన్నిస్ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నాను. ప్రసవం జరిగాక పునరాగమనం చేస్తానని చెప్పడంలేదు. అయితే చివరిసారి అభిమానులతో మ్యాచ్ ఆడాలని ఉంది’ అని 2016 రియో ఒలింపిక్స్‌లో తన దేశానికే చెందిన లూసీ సఫరోవాతో కలిసి మహిళల డబుల్స్‌లో కాంస్య పతకాన్ని సాధించిన స్ట్రికోవా తెలిపింది. చివరిసారి ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఆడిన స్ట్రికోవా సింగిల్స్ విభాగంలో కెరీర్ బెస్ట్ 16వ ర్యాంక్ చేరుకోవడంతోపాటు రెండు టైటిల్స్‌ను గెలిచింది. డబుల్స్‌లో స్ట్రికోవా వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలువడంతోపాటు 31 టైటిల్స్‌ను సొంతం చేసుకుంది. ఈ 31 టైటిల్స్‌లో రెండింటిలో (2016–సిన్సినాటి, టోక్యో ఓపెన్) భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా భాగస్వామిగా ఉంది. -
ప్రతీ ఉద్యోగికి రుణపడి ఉంటా..
సాక్షి, హన్మకొండ: చిరుద్యోగిగా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించిన ఓరుగల్లు బిడ్డ కారం రవీందర్‌రెడ్డి సోమవారం ఉద్యోగ విరమణ చేయనున్నారు. సుమారు ఎని మిదేళ్ల పాటు టీన్జీవోస్ కేంద్ర సంఘంలో కార్యదర్శిగా, అధ్యక్షుడిగా, ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర చైర్మన్‌గా, అఖిలభారత రాష్ట్ర ప్రభభుత్వ ఉద్యోగుల కేంద్ర సంఘం ఉపాధ్యక్షులుగా ఉద్యోగ లోకానికి ఆయన సేవలందించారు. ప్రసుత్తం డిప్యూటీ తహసీల్దార్ హోదాలో ఉద్యోగ విరమణ చేయనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఉద్యమకాలం నుంచి సాన్నిహిత్యం కలిగి ఉన్నా అది ఉద్యోగుల సమస్యలు పరిష్కారం, పీఆర్సీ సాధనకు ఉపయోగపడలేదని కొంత అసంతృప్తి వెలిబుచ్చేవారు. దీనికితోడు మరికొంత కాలం ఆయన సర్వీస్ పొడిగిస్తారని చివరి నిమిషం వరకు ప్రచారం సాగినా, అది జరగలేదు. టైపిస్టు నుంచి రాష్ట్ర అధ్యక్షుడి వరకు.. కారం రవీందర్‌రెడ్డి స్వస్థలం ప్రస్తుతం మండల కేంద్రంగా ఉన్న వేలేరు. ఆయనకు భార్య జ్యోతి, ఇద్దరు కుమారులు ఉండగా, రవీందర్‌రెడ్డి ఉద్యోగ ప్రస్థానం ఉమ్మడి జిల్లాలోని మంగపేట మండలం కమలాపూర్ ఏపీ రేయాన్స్‌లో టైపిస్ట్‌గా 1984లో ప్రారంభభమైంది. ఆ తర్వాత 1985 నుంచి వరంగల్ కలెక్టరేట్లోని ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తూ 1987 మే నెలలో డీఎస్సీ ద్వారా రెవెన్యూశాఖకు ఎంపికయ్యారు. ఉద్యోగ సంఘాల జేఏసీ నేతగా ఉన్న సురేందర్‌రెడ్డి స్ఫూర్తితో ఈయన కూడా చురుగ్గా పనిచేస్తూ కలెక్టరేట్ రెవెన్యూ ఉద్యోగుల సంఘానికి నాయకత్వం వహించారు. 2007లో టీఎన్జీవోస్ జిల్లా అ«ధ్యక్షుడుగా ఎన్నికైన ఆయన రెండో సారి కూడా ఎన్నికయ్యాక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అవకాశం దక్కింది. తెలంగాణ ఉద్యమ చుక్కాని తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో జిల్లాలోని ఉద్యోగులను సంఘటితం చేసిన వారిలో రవీందర్‌రెడ్డి ముందు వరుసలో ఉంటారు. 18రోజుల పాటు పెన్‌డౌన్, 55రోజుల పాటు సాగిన సకలజనుల సమ్మె, లక్ష గొంతులు... లక్ష గళాలు తదితర కార్యక్రమాల్లో జిల్లా ఉద్యోగులు చురుగ్గా పాల్గొనేలా ఆయన కృషి చేశారు. కాగా టీఎన్జీవోస్ కేంద్ర సంఘానికి కారం రవీందర్‌రెడ్డి మూడు సార్లు వరుసగా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ ఘనత సాధించిన మొదటి వ్యక్తి ఈయనే. డీటీ నుంచి సీనియర్ అసిస్టెంట్‌గా... టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న సమయంలో రవీందర్‌రెడ్డి డిప్యూటీ తహసీల్దార్ హోదాలో ఉన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన సమయంలో కూడా అదే హోదా ఉంది. ప్రభుత్వం డీటీలను గెజి టెడ్ అధికారులుగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఆయన వరంగల్ ఆర్డీఓ కార్యాలయంలో సీని యర్ అసిస్టెంట్‌గా పోస్టింగ్ పొందారు. అయితే, చివరి నిమిషంలో ఉద్యోగ విరమణకు ఒకరోజు ముందు ఆది వారం జిల్లాకు వచ్చిన ఆయన వరంగల్ అర్బన్ కలెక్టరే ట్లో డీటీగా పదోన్నతి ఉత్తర్వులు అందుకున్నారు. అంతృప్తితోనే.. ఉద్యోగ విరమణ వయస్సు పెంపు విషయంలో ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తుందని ఉద్యోగ సంఘాల నాయకులు భావించారు. ఇదే క్రమంలో తెలంగాణ ఏర్పడినా సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ పెద్దల నుంచి ఆశించిన సహకారం అందలేదని అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. రాష్ట్ర అధ్యక్షుడిగా తాను ఉన్న సమయంలో కనీసం ఒక్క పీఆర్సీ అయినా సాధించాలనుకున్నా సాధ్యం కాలేదు. ఉద్యోగుల మిగతా కీలక సమస్యల సాధన విషయంలో రవీందర్‌రెడ్డి కొంత నిరాశతో ఉన్నట్లు సమాచారం. అయినా, రవీందర్‌రెడ్డి ఎక్కడ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకపోవడం కొంత విమర్శలకు దారితీసింది. ప్రతీ ఉద్యోగికి రుణపడి ఉంటా.. సుమారు 33ఏళ్ల ఉద్యోగ ప్రస్థానంలో నా వెన్నంటి నిలిచిన ప్రతీ ఉద్యోగికి రుణపడి ఉంటా. అందరి సహకారంతోనే ఈ స్థాయికి ఎదిగా. ఉద్యోగం, ఉద్యమం జీవితంలో ప్రతీ అంకం ఎంతో కీలకమైనదే. ఇక ముందు కూడా ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో నా వంతు పాత్ర పోషిస్తూనే ఉంటా. – కారం రవీందర్‌రెడ్డి టీఎన్జీవోస్ కేంద్ర సంఘం అధ్యక్షుడు -
ఉద్యోగుల పదవీ విరమణ @ 60
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల పదవీ విరమణ వయసును రెండేళ్లు పొడిగించడానికే రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. పదవీ విరమణ విషయంలో వివిధ రాష్ట్రాలు అవలంబిస్తున్న విధానాలను అధ్యయనం చేసిన సర్కారు.. ఇక్కడ కూడా అదే పద్ధతిని అమలు చేసే దిశగా ఆలోచన చేస్తోంది. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, యూపీ, ఛత్తీస్‌గఢ్, బిహార్, గుజరాత్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 ఏళ్లుగా ఉంది. కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఇదే విధానం అమలులో ఉన్నందున.. ఇక్కడ కూడా రిటైర్మెంట్ను 60 ఏళ్లకు పొడిగించాలని భావిస్తోంది. అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచుతామని గత ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్ఎస్ హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రిటైర్మెం ట్‌కు దగ్గరగా ఉన్న ఉద్యోగులు ప్రభుత్వ నిర్ణ యం కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. 60 ఏళ్ల రిటైర్మెంట్‌కే పీఆర్సీ మొగ్గు! వేతన సవరణ సంఘం (పీఆర్సీ) కూడా ఉద్యో గుల పదవీ విరమణ వయసు పొడిగించాలని ప్రభుత్వానికి సిఫారసు చేయనున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఆనేక రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం కూడా రిటైర్మెంట్ వయసును 60 ఏళ్లు చేసినం దున.. తెలంగాణలోనూ పొడిగించే అంశాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి నివేదించనుందని సమాచారం. ఉద్యోగుల వయోపరిమితిని గణ నీయంగా సడలించినందున.. సర్వీసులో చేరిన కొన్నేళ్లకే పదవీ విరమణ చేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో సదరు ఉద్యోగిపై ఆధారపడ్డ కుటుం బానికి ఆర్థిక సమస్యలు ఎదురవుతున్నాయని, వాటిని పరిగణనలోకి తీసుకొని మరో రెండేళ్లు పొడిగిస్తే బాగుంటుందని పీఆర్సీ తన నివేదికలో అభిప్రాయపడ్డట్లు తెలిసింది. మరోవైపు రాబోయే రెండు, మూడేళ్లలో సర్కారు కొలు వులు భారీగా ఖాళీ కానున్నాయి. ఇప్ప టికే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంది. ఈ సంవత్సరంలో 8,600 మంది, 2021లో8,200, 2022లో9,200 మంది ఉద్యోగులు రిటైర్ కానున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నా యి. వీటిని ఇప్పటికిప్పుడు భర్తీ చేసే పరిస్థితి కూడా కనిపించ నందున పొడిగింపు అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. రూ. 3,500 కోట్లు ఆదా! ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అయితే సగటున రూ. 50 లక్షల నుంచి రూ. కోటి వరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందుతాయి. ఈ నేపథ్యంలో రిటైరైన ఉద్యోగులకు ఏడాదికి రూ. 3,500 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. కరోనా మహమ్మారి పంజా విసరడంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడుదొడుకులను ఎదుర్కొంటోంది. వైరస్ పీడ ఇప్పట్లో విరుగుడయ్యే సూచనలు కనిపించడంలేదు. దీంతో గత మూడు నెలలుగా సగం జీతం కోత పెడుతున్న సర్కారుకు పదవీ విరమణ ప్రయోజనాలు చెల్లించడం గుదిబండగా మారనుంది. ఇప్పట్లో రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడే అవకాశాల్లేవు. వచ్చే ఆర్థిక సంవత్సరం వరకు కరోనా ప్రభావం ఎంతోకొంత ఉంటుందని ఆర్థిక వర్గాలు అంచనా వేస్తున్నాయి. పదవీ విరమణ వయసు పొడిగిస్తే తాత్కాలికంగా రూ. 3,500 కోట్లు పొదుపు అవుతాయని, ఇదే క్రమం కొనసాగుతుంది కనుక ఈ రూ.3,500 కోట్ల ఆదా శాశ్వతంగా ప్రభుత్వానికి ఉపశమనం కలిగిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 నుంచి 60 ఏళ్లకు పెంచే అవకాశాలున్నాయనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో జరుగుతోంది. సర్వీసు వివాదాలకు చెక్ పెట్టేందుకు కమిషన్ ప్రభుత్వ శాఖల్లో పెరుగుతున్న లిటిగేషన్ సమస్యను పరిష్కరించేందుకు, ఉద్యోగుల సర్వీసు వ్యవహారాలను చూసుకునేందుకు ప్రత్యామ్నాయ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సాగునీటి శాఖలో రిటైరైన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లను సుప్రీంకోర్టు ఉత్తర్వుల ఆధారంగా సూపరింటెండెంట్ ఇంజనీర్లుగా పరిగణించాల్సి రావడం, ఈ కేసు తేలడానికి 20 ఏళ్లకుపైగా పట్టిన నేపథ్యంలో ప్రభుత్వ శాఖల్లో సర్వీసు వ్యవహారాలపై వచ్చే లిటిగేషన్లను పరిష్కరించడానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలనుకుంటోంది. ఇందుకోసం గ్రీవెన్స్ రీడ్రెసల్ కమిషన్ (జీఆర్సీ) తరహాలో ఇద్దరు లేదా ముగ్గురు సీనియర్ అధికారులతో ఓ వ్యవస్థ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. ప్రభుత్వం తీసుకొనే సర్వీసు నిర్ణయాల్లో ఎలాంటి అభ్యంతరాలున్నా వాటిని సంబంధిత శాఖ పరిష్కరించనుంది. అలా పరిష్కారం కాని పక్షంలో ఆ కేసులను కమిషన్‌కు సిఫారసు చేసే వెసులుబాటు ఉంటుంది. అప్పుడు కమిషన్ ఆ కేసును స్వీకరించి భేదాభిప్రాయాలున్న ఉద్యోగులు, ఉద్యోగ సమూహాలు లేదా ప్రభుత్వ ప్రతినిధులతో చర్చించి రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది. ఈ నిర్ణయం అందరికీ ఆమోదయోగ్యం కాకపోతే మళ్లీ తిరిగి దాన్ని కమిషన్‌కు పంపవచ్చు. అప్పుడు మళ్లీ కమిషన్ ఈ కేసును పరిశీలించి అదే నిర్ణయాన్ని పునరుద్ఘాటిస్తే అందరూ కమిషన్ నిర్ణయానికి కట్టుబడాల్సిందే. -
డీఎల్ఎఫ్ చైర్మన్ బాధ్యతలకు సింగ్ వీడ్కోలు
న్యూఢిల్లీ: ఓ సాధారణ రియల్టీ కంపెనీని దేశంలోనే దిగ్గజ సంస్థగా నిలిపిన డీఎల్ఎఫ్ చైర్మన్ కుషాల్‌పాల్ సింగ్ గురువారం తన పదవీ బాధ్యతలకు విరమణ చెప్పారు. 90 ఏళ్ల సింగ్ 60 ఏళ్ల పాటు డీఎల్ఎఫ్ కోసమే కష్టపడ్డారు. ఢిల్లీ ల్యాండ్ అండ్ ఫైనాన్స్ లిమిటెడ్ (డీఎల్ఎఫ్) అనే కంపెనీని 1946లో కుషాల్‌పాల్ సింగ్ మామయ్య స్థాపించారు. 1961లో ఆర్మీలో ఉద్యోగ బాధ్యతలకు స్వస్తి చెప్పిన కుషాల్‌పాల్ సింగ్ డీఎల్ఎఫ్లో చేరి కంపెనీ భవిష్యత్తును కొత్తపుంతలు తొక్కించారు. గురువారం జరిగిన డీఎల్ఎఫ్ బోర్డు సమావేశంలో.. కుషాల్‌పాల్ సింగ్‌ను గౌరవ చైర్మన్‌గా, ఆయన కుమారుడు రాజీవ్‌ను నూతన చైర్మన్‌గా నియమిస్తూ నిర్ణయాలు తీసుకున్నారు. గురుగ్రామ్ అభివృద్ధికి ఆద్యుడు: దేశంలో గురుగ్రామ్ ప్రముఖ పట్టణమని తెలిసిందే. ఢిల్లీకి సమీపంలోనే ఉండే ఈ ప్రాంతానికి చక్కని భవిష్యత్తు ఉందని కుషాల్పాల్సింగ్ 1979లోనే ప్రణాళికలు వేసుకున్నారు. అప్పట్లో చిన్న గ్రామంగా ఉన్న గురుగ్రామ్‌ను సింగపూర్ మాదిరిగా ఢిల్లీకి శాటిలైట్ టౌన్‌షిప్‌గా అభివృద్ధి చేసి అంతర్జాతీయ కంపెనీలను రప్పించాలన్న ప్రణాళిక ఆయనకు ఉండేది. కానీ, దురదృష్టవశాత్తూ దీన్ని సాకారం చేయలేకపోయినట్టు సింగ్ ఓ వార్తా సంస్థతో చెప్పారు. తాను ఊహించినట్టుగా గురుగ్రామ్‌ను అభివృద్ధి చేయలేకపోయినట్టు పేర్కొన్నారు. డీఎల్ఎఫ్ నష్టాలు రూ.1,857 కోట్లు డీఎల్ఎఫ్కు గత ఆర్థిక సంవత్సరం (2019–20) మార్చి క్వార్టర్లో రూ.1,858 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. డిఫర్డ్ ట్యాక్స్ అసెట్స్ (డీటీఏ) రివర్సల్ కారణంగా ఈ స్థాయిలో నష్టాలు వచ్చాయి. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2018–19) ఇదే క్వార్టర్లో రూ.437 కోట్ల నికర లాభం వచ్చిందని డీఎల్ఎఫ్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.2,661 కోట్ల నుంచి రూ.1,874 కోట్లకు తగ్గిందని పేర్కొంది. పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2018–19లో రూ.1,319 కోట్ల నికర లాభం రాగా గత ఆర్థిక సంవత్సరంలో రూ.583 కోట్ల నికర నష్టాలు వచ్చాయని తెలిపింది. మొత్తం ఆదాయం రూ.9,029 కోట్ల నుంచి రూ.6,884 కోట్లకు తగ్గిందని పేర్కొంది. -
త్వరలోనే రిటైర్మెంట్ : కొరటాల శివ
టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్‌లో ఒకరైన కొరటాల శివ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ఫిలింనగర్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. అదేంటంటే త్వరలో కొరటాల రిటైర్మెంట్ తీసుకోనున్నారట. దర్శకుడిగా తాను కేవలం 10 సినిమాలు మాత్రమే తెరకెక్కించాలని నిర్ణయించుకుని ఇండస్ట్రీకి వచ్చినట్లు కొందరి సన్నిహితుల దగ్గర చెప్పినట్లు సమాచారం. దర్శకుడిగా ప్రయాణాన్ని ప్రారంభించకముందే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు.. ఇదే విషయాన్ని పలువురు నిర్మాతలకు సైతం చెప్పినట్లు తెలుస్తోంది. తన దగ్గరున్న 10 కథలు మాత్రమే డైరెక్ట్ చేసి.. ఆ తర్వాత ఇండస్ట్రీలో కొనసాగినా కూడా దర్శకత్వం వైపు మాత్రం వెళ్లనని, నిర్మాతగా సినిమాలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కొత్త దర్శకులకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే కొరటాల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. (కొబ్బరిబొండాం చికెన్ రైస్ తింటారా.. ) 2013లో మిర్చి సినిమా ద్వారా దర్శకుడిగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన కొరటాల.. ఆ తరువాత శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను చిత్రాల ద్వారా వరుసగా నాలుగు హిట్లను తన ఖాతాలో వేసుకున్నారు. అంతేకాదు దర్శకుడిగా ఆయనకు ప్రత్యేక స్టైల్ ఉంటుంది. తన ప్రతి సినిమాలో ఏదో ఒక సామాజిక అంశాన్ని ప్రధానంగా చూపించే ఆయన.. ప్రేక్షకుల్లో అవేర్నెస్ తీసుకొస్తుంటారు. ఇక ప్రస్తుతం కొరటాల, మెగాస్టార్ చిరంజీవితో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆచార్య అనే టైటిల్‌తో తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాదిన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. (విద్యార్థులూ.. ‘లాక్డౌన్’లో ఇలా ప్రిపేర్ అవ్వండి! ) కాగా మరో టాప్ దర్శకుడు సుకుమార్ సైతం.. నాన్నకు ప్రేమతో సినిమా తరువాత తాను ఇంకో రెండు, మూడు సినిమాలు తీసి రిటైర్మెంట్ తీసుకుంటానని అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. టాలీవుడ్‌లోని పలువురు ప్రముఖులు సైతం సుకుమార్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ అప్పట్లో తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచిన విషయం తెలిసిందే. (మహమ్మారి నీడన దక్షిణ కొరియాలో పోలింగ్ ) -
విండీస్ 240/7
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: కరీబియన్ పర్యటనలో టి20 సిరీస్ నుంచి వెంటాడుతున్న వరుణుడు ఆఖరి వన్డేకూ అడ్డు తగిలాడు. బుధవారం ఇక్కడ ప్రారంభమైన మూడో వన్డేలో భారత్, వెస్టిండీస్ పరస్పరం పై చేయికి ప్రయత్నిస్తున్న సమయంలో నేనున్నానంటూ వర్షం పలుకరించింది. మొత్తంమీద మూడు గంటలకుపైగా అంతరాయం కలిగించింది. దాంతో మ్యాచ్‌ను 35 ఓవర్లకు కుదించారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 22 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 158/2తో ఉండగా వాన ఆటను నిలిపివేసింది. విధ్వంసక ఓపెనర్ క్రిస్ గేల్ (41 బంతుల్లో 72; 8 ఫోర్లు, 5 సిక్స్‌లు)కు తోడు మరో ఓపెనర్ లూయిస్ (29 బంతుల్లో 43; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగి ఆతిథ్య జట్టు భారీ స్కోరుకు బాటలు వేశారు. వీరిద్దరు స్వల్ప వ్యవధిలో ఔటైనప్పటికీ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్ కూడా దూకుడుగా ఆడారు. దాంతో విండీస్ 35 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం భారత లక్ష్యాన్ని 35 ఓవర్లలో 255 పరుగులుగా నిర్ణయించారు. వాన... పరుగుల ఉప్పెన భువనేశ్వర్ మెయిడిన్‌తో ప్రారంభమైంది విండీస్ ఇన్నింగ్స్. రెండో ఓవర్లో నోబాల్ సహా నాలుగు బంతులు పడ్డాయో లేదో వర్షం ప్రారంభమైంది. దాదాపు పది నిమిషాల అనంతరం తెరపినివ్వడంతో ఆటగాళ్లు మళ్లీ మైదానంలోకి వచ్చారు. మూడో ఓవర్లో భువీ ఒక్క పరుగే ఇవ్వడం, తర్వాత షమీ మెయిడిన్‌తో మ్యాచ్ నిస్సారంగా సాగేలా కనిపించింది. కానీ, వానను మించిన పరుగుల ఉప్పెన ఐదో ఓవర్ నుంచి మొదలైంది. భువీ బౌలింగ్‌లో లూయిస్ రెండు ఫోర్లు, సిక్స్ కొట్టడంతో ఏకంగా 16 పరుగులు వచ్చాయి. అవతలి ఎండ్‌లో గేల్... షమీని ఆరేశాడు. మధ్యలో ఖలీల్‌పై లూయిస్ ప్రతాపం చూపాడు. 5 నుంచి 10వ ఓవర్ మధ్య విండీస్ ఓపెనర్లు ఏకంగా 101 పరుగులు పిండుకున్నారు. వరద గేట్లెత్తిన తరహాలో వరుసగా 16, 20, 14, 16, 18, 17 చొప్పున పరుగులు వచ్చాయి. నాలుగో ఓవర్ ముగిసే సరికి 3.25తో ఉన్న కరీబియన్ల రన్‌రేట్ పదో ఓవర్ తర్వాత 11.40గా మారడం గమనార్హం. ఈ క్రమంలో 114/0తో 2015 ప్రపంచ కప్ తర్వాత పవర్ ప్లేలో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా విండీస్ నిలిచింది. అయితే, చహల్ వస్తూనే లూయిస్‌ను ఔట్ చేయడం, గేల్ ఔటవడంతో ప్రత్యర్థికి కళ్లెం పడింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో హోప్, హెట్‌మైర్ 11 నుంచి 22వ ఓవర్ మధ్య 44 పరుగులే చేయగలిగారు. విండీస్ 158/2 వద్ద ఉండగా వర్షం 2 గంటలపైగా అడ్డంకిగా నిలిచింది. పలుసార్లు తగ్గినట్టే తగ్గినా తిరిగి ప్రారంభమైంది. గేల్ వీడ్కోలు... ఘనంగా... ఉద్వేగంగా: ఆటలో, ఆహార్యంలో, ప్రవర్తనలో దేనిలో చూసినా క్రిస్ గేల్ అంటేనే ప్రత్యేకత. అందుకే అతడు యూనివర్సల్ బాస్‌గా ప్రసిద్ధుడయ్యాడు. అలాంటి గేల్ చివరి వన్డే ఆడేశాడు. అది కూడా కాస్త ఘనంగానే...! కొంతకాలంగా పరుగులకు ఇబ్బందిపడుతున్న అతడు ఓ చక్కటి ఇన్నింగ్స్‌తో కెరీర్‌కు ముగింపు పలికాడు. బుధవారం 301వ వన్డే ఆడిన గేల్... ప్రతీకాత్మకంగా అదే నంబరు జెర్సీతో మైదానంలో దిగాడు. ఇక మూడో వన్డేలో ఇన్నింగ్స్ 8వ బంతికి వచ్చిన నోబాల్ ఫ్రీ హిట్‌ను డీప్ మిడ్ వికెట్‌లోకి సిక్స్ కొట్టడంతో గేల్ ప్రతాపం మొదలైంది. షమీ వేసిన ఆరో ఓవర్లో సిక్స్, మూడు ఫోర్లు సహా 20 పరుగులు పిండుకుని పూర్వపు విశ్వరూపాన్ని చూపాడు. మధ్యలో భువీని ఫోర్, సిక్స్‌తో సత్కరించిన గేల్ అనంతరం కుర్ర ఖలీల్ అహ్మద్‌కు రెండు సిక్స్‌లు, ఫోర్‌తో దడ పుట్టించాడు. సిక్స్‌తోనే అర్ధసెంచరీ (30 బంతుల్లో) అందుకున్నాడు. ఖలీల్ బౌలింగ్‌లో ఫోర్‌తో 70ల్లోకి వెళ్లిన గేల్ దూకుడు చూస్తే సెంచరీ చేయడం ఖాయంగా కనిపించింది. అయితే, ఆ వెంటనే భారీ షాట్ ఆడబోయి కోహ్లికి మిడాఫ్‌లో క్యాచ్ ఇచ్చి వెనుదిగిరాడు. భారత ఆటగాళ్ల నుంచి వీడ్కోలు అభినందనలు అందుకుంటూ, ప్రేక్షకుల కరతాళ ధ్వనులకు ప్రతిగా అభివాదం చేస్తూ, తనదైన శైలిలో హెల్మెట్‌ను బ్యాట్ హ్యాండిల్‌కు తగిలించి పైకెత్తి చూపుతూ మైదానాన్ని వీడాడు. ఈ సందర్భంగా గేల్–కోహ్లి ప్రత్యేక రీతిలో అభివాదం చేసుకోవడం విశేషం. 20 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో ప్రపంచవ్యాప్తంగా 23 జట్లకు ప్రాతినిధ్యం వహించిన ఘనత గేల్ సొంతం. వీటిలో ఎక్కువగా టి20 జట్లు ఉన్నప్పటికీ మరే క్రికెటర్‌కూ ఇది సాధ్యం కానిదే. భారత్‌తో తలపడే విండీస్ టెస్టు జట్టులో గేల్‌కు చోటు దక్కలేదు. టి20ల నుంచి తప్పుకోవడంపై అతడు స్పష్టమైన ప్రకటన చేయాల్సి ఉంది. స్కోరు వివరాలు వెస్టిండీస్ ఇన్నింగ్స్: గేల్ (సి) కోహ్లి (బి) ఖలీల్ అహ్మద్ 72; లూయిస్ (సి) ధావన్ (బి) చహల్ 43; షై హోప్ (బి) జడేజా 24; హెట్‌మైర్ (బి) షమీ 25; పూరన్ (సి) మనీశ్ పాండే (సబ్) (బి) షమీ 30; హోల్డర్ (సి) కోహ్లి (బి) ఖలీల్ అహ్మద్ 14; బ్రాత్‌వైట్ (సి) పంత్ (బి) ఖలీల్ అహ్మద్ 16; అలెన్ (నాటౌట్) 6; కీమో పాల్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (35 ఓవర్లలో ఏడు వికెట్లకు) 240 వికెట్ల పతనం: 1–115, 2–121, 3–171, 4–171, 5–211, 6–221, 7–236. బౌలింగ్: భువనేశ్వర్ 5–1–48–0, షమీ 7–1–50–2, ఖలీల్ 7–0–68–3, చహల్ 7–0–32–1, కేదార్ జాదవ్ 4–0–13–0, జడేజా 5–0–26–1. -
ఈడీ కొత్త చీఫ్‌గా ఎస్కే మిశ్రా
న్యూఢిల్లీ: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కొత్త అధిపతిగా సంజయ్‌కుమార్ మిశ్రా నియమితులయ్యారు. ప్రస్తుతం ఢిల్లీలో ఆదాయపు పన్ను శాఖ ప్రధాన కమిషనర్‌గా ఉన్న మిశ్రా ప్రిన్సిపల్ స్పెషల్ డైరెక్టర్ హోదాలో మూడు నెలలపాటు లేదా మరొకరు నియమితులయ్యే వరకు ఈడీ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తారని కేంద్రప్రభుత్వం తెలిపింది. ఈడీ ప్రస్తుత డైరెక్టర్ కర్నాల్ సింగ్ పదవీ కాలం నేటితో ముగియనున్నందున ప్రధాని మోదీ అధ్యక్షతన ఉన్న కేబినెట్ నియామకాల కమిటీ శనివారం ఈ నిర్ణయం తీసుకుంది. 1984 ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్(ఐఆర్ఎస్) ఆదాయ పన్ను(ఐటీ) కేడర్ అధికారి అయిన మిశ్రాకు పలు కీలక కేసుల బాధ్యతలు చూశారు. పీఎన్బీని వేల కోట్ల మేరకు మోసం చేసిన నీరవ్ మోదీ, లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం, ఆయన కొడుకు కార్తీల మనీ లాండరింగ్ కేసుల విచారణలో మిశ్రా కీలకంగా ఉన్నారు. నల్లధనం చెలామణీని అరికట్టే మనీలాండరింగ్ చట్టం(పీఎంఎల్ఏ), విదేశీ మారక ద్రవ్యం నిర్వహణ చట్టం(ఫెమా)ల అమలును పర్యవేక్షించడం ఈడీ ముఖ్య బాధ్యత. మూడేళ్లలో 33వేల కోట్ల ఆస్తుల అటాచ్ గడిచిన మూడేళ్లలో కేసుల విచారణ, ఆస్తుల అటాచ్మెంట్ వంటి విషయాల్లో ఈడీ గణనీయ పురోగతి కనబరిచింది. 2015లో ఈడీ డైరెక్టర్‌గా కర్నాల్ బాధ్యతలు చేపట్టిన తర్వాత అటాచ్ చేసిన ఆస్తుల విలువ రూ.33,500 కోట్లు కాగా మనీలాండరింగ్ కేసుల్లో 390 చార్జిషీట్లను దాఖలు చేసింది. కర్నాల్æ పదవీకాలం నేటితో ముగియనున్న నేపథ్యంలో ఈడీ ఈ వివరాలు వెల్లడించింది. ఈడీ పనితీరు మెరుగు పరిచేందుకు కర్నాల్ సంస్కరణలు తెచ్చారు. ప్రతిభ కనబరిచిన సిబ్బందికి ప్రోత్సాహకాలను అందజేసే విధానం తెచ్చారు. మనీలాండరింగ్, విదేశీ మారక ద్రవ్య చట్టం ఉల్లంఘనలు, అవినీతికి సంబంధించిన పలు కీలక కేసుల విచారణను కర్నాల్ పర్యవేక్షించారు. వీటిల్లో వీవీఐపీ హెలికాప్టర్ల కేసు,చిదంబరం, కార్తీపై మనీ లాండరింగ్ కేసులు, స్టెర్లింగ్ బయోటెక్, బ్యాంకు రుణాల ఎగవేతకు సంబంధించి మాల్యా, నీరవ్, చోక్సీ, 2జీ స్పెక్ట్రమ్ కేసు ముఖ్యమైనవి. 2015కు ముందు పదేళ్లలో 2,620 ఫెమా కేసుల విచారణను ఈడీ పూర్తి చేయగా ఒక్క కర్నాల్‌సింగ్ హయాంలోనే 5,495 కేసుల దర్యాప్తును పూర్తి చేసింది. -
ఆ ఇద్దరి వల్లే ఈ స్థాయికి చేరుకున్నా: డీజీపీ నండూరి
సాక్షి, అమరావతి : తాను ఈ స్థాయికి రావడానికి తనకు చదువు చెప్పిన ఉపాధ్యాయులు బాలకృష్ణ మూర్తి, రామకృష్ణా రావుల కృషి ఎంతో ఉందని ఏపీ డీజీపీ నండూరి సాంబశివరావు అన్నారు. ఏడవ తరగతిలో తమ ఉపాధ్యాయుడు రామకృష్ణా రావు చెప్పిన పాఠం తనకు యూపీఎస్సీ పరీక్షలో ప్రశ్నగా వచ్చిందన్నారు. వీడ్కోలు సభలో మాట్లాడుతూ నుండూరి సాంబశివరావు ఉద్వేగానికి లోనయ్యారు. 1984లో సివిల్ డిఫెన్స్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకున్నట్లు వెల్లడించారు. బెల్లంపల్లిలో 1987లో ఏఎస్పీగా బాధ్యతలు తీసుకున్నట్లు తెలిపారు. ఎంతో మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయి శాంతిని నెలకొల్పారని వ్యాఖ్యానించారు. ఏపీ పోలీసులకు దేశంలోనే ఒక ప్రత్యేక స్థానం ఉందని, రాష్ట్ర పోలీసులు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా పని చేయగలరనే ప్రత్యేకతను చాటుకున్నారని చెప్పారు. తన కుటుంబ సభ్యులు, భార్య పిల్లలు ఎంతగానో సహకరించారని, తనకు పదవి ఎప్పుడూ అలంకారం కాదని అన్నారు. ఆర్టీసీ ఎండీగా ఉన్నప్పుడు కొన్ని కొత్త నిర్ణయాలు, మార్పులు తీసుకురావడానికి ప్రయత్నించానని తెలిపారు. సుదీర్ఘ ప్రయాణంలో ఎవరినైనా మాటలతో నొప్పించాను కానీ రాతలతో ఎప్పుడూ ఎవరినీ బాధించలేదని చెప్పారు. సాంబశివరావు నుంచి డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన మాల కొండయ్య మాట్లాడుతూ.. నండూరి సాంబశివ రావు తనకు ఒక అన్న లాంటి వారని వ్యాఖ్యానించారు. తాను వివిధ శాఖల్లో పనిచేసేటప్పుడు అయిదు సార్లు ఆయన నుంచి బాధ్యతలు తీసుకున్నానని తెలిపారు. తామిద్దరం కాకినాడలో ఒకే ఎస్పీ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నామని వెల్లడించారు. నండూరి సాంబశివరావు ఇచ్చిన స్ఫూర్తితో పని చేస్తానని చెప్పారు. సాంబశివరావు పరిపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. -
అంతర్జాతీయ క్రికెట్‌కు అఫ్రిది వీడ్కోలు
-
అంతర్జాతీయ క్రికెట్‌కు అఫ్రిది వీడ్కోలు
ఇస్లామాబాద్: పాకిస్తాన్ లెజెండరీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది(36) అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 21 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌ను ముగిస్తున్నట్లు అఫ్రిది ఆదివారం ప్రకటించాడు. టెస్ట్, వన్డే క్రికెట్ నుంచి గతంలోనే తప్పుకున్న ఈ క్రికెటర్.. తాజాగా టీ20 జట్టు నుంచి తప్పుకొని అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌ను ముగించాడు. 1996లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన అఫ్రిది.. తానాడిన రెండో వన్డెలోనే శ్రీలంకపై కేవలం 37 బంతుల్లో సెంచరీ సాధించి ఒక్కసారిగా ప్రకంపనలు సృష్టించాడు. టెస్ట్ కెరీర్లో 27 మ్యాచ్‌ల్లో 1,176 పరుగులతో పాటు, 48 వికెట్లు సాధించిన అఫ్రిది.. వన్డేల్లో 398 మ్యాచ్‌ల్లో 8,064 పరుగులు, 395 వికెట్లు సాధించాడు. ఇక టీ20 పార్మాట్లో 98 మ్యాచ్‌లు ఆడి 1,405 పరుగులు, 97 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.