టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్‌లో ఒకరైన కొరటాల శివ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ఫిలింనగర్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. అదేంటంటే త్వరలో కొరటాల రిటైర్మెంట్ తీసుకోనున్నారట. దర్శకుడిగా తాను కేవలం 10 సినిమాలు మాత్రమే తెరకెక్కించాలని నిర్ణయించుకుని ఇండస్ట్రీకి వచ్చినట్లు కొందరి సన్నిహితుల దగ్గర చెప్పినట్లు సమాచారం. దర్శకుడిగా ప్రయాణాన్ని ప్రారంభించకముందే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు.. ఇదే విషయాన్ని పలువురు నిర్మాతలకు సైతం చెప్పినట్లు తెలుస్తోంది. తన దగ్గరున్న 10 కథలు మాత్రమే డైరెక్ట్ చేసి.. ఆ తర్వాత ఇండస్ట్రీలో కొనసాగినా కూడా దర్శకత్వం వైపు మాత్రం వెళ్లనని, నిర్మాతగా సినిమాలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కొత్త దర్శకులకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే కొరటాల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. (కొబ్బరిబొండాం చికెన్ రైస్ తింటారా.. )
2013లో మిర్చి సినిమా ద్వారా దర్శకుడిగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన కొరటాల.. ఆ తరువాత శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను చిత్రాల ద్వారా వరుసగా నాలుగు హిట్లను తన ఖాతాలో వేసుకున్నారు. అంతేకాదు దర్శకుడిగా ఆయనకు ప్రత్యేక స్టైల్ ఉంటుంది. తన ప్రతి సినిమాలో ఏదో ఒక సామాజిక అంశాన్ని ప్రధానంగా చూపించే ఆయన.. ప్రేక్షకుల్లో అవేర్‌నెస్ తీసుకొస్తుంటారు. ఇక ప్రస్తుతం కొరటాల, మెగాస్టార్ చిరంజీవితో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆచార్య అనే టైటిల్‌తో తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాదిన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. (విద్యార్థులూ.. ‘లాక్‌డౌన్’లో ఇలా ప్రిపేర్ అవ్వండి! )
కాగా మరో టాప్ దర్శకుడు సుకుమార్ సైతం.. నాన్నకు ప్రేమతో సినిమా తరువాత తాను ఇంకో రెండు, మూడు సినిమాలు తీసి రిటైర్మెంట్ తీసుకుంటానని అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. టాలీవుడ్‌లోని పలువురు ప్రముఖులు సైతం సుకుమార్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ అప్పట్లో తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచిన విషయం తెలిసిందే. (మహమ్మారి నీడన దక్షిణ కొరియాలో పోలింగ్ )
Comments
Please login to add a commentAdd a comment