ఎన్టీఆర్ బ్లాక్‌బస్టర్ సినిమా దేవర ఆఫ్ సెంచరీ కొట్టేసింది. ఈ మధ్య కాలంలో ఒక సినిమా పది రోజులు థియేటర్స్‌లో రన్ కావడమే గొప్ప విషయమని చెప్పవచ్చు. ఒక సినిమా హిట్ అయిందని చెప్పుకునేందుకు కలెక్షన్స్ కొలమానం అని చెప్పుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో ఒక సినిమా 100రోజులు, 50 రోజులు ఆడిందనే మాట వినిపించడమే లేదు. అయితే, దేవర ఆ లోటును పూర్తి చేసింది.
దేవర సినిమా 52 కేంద్రాల్లో 50 రోజుల పాటు ఆడిందని మేకర్స్ ఒక పోస్టర్ విడుదల చేశారు. చాలారోజుల తర్వాత ఇలా సెంటర్స్ లిస్ట్ చూడటం జరిగిందని నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు. నవంబర్ 15న దేవర 50 రోజుల వేడుక చేసుకుంటున్నాడు. దీంతో నేడు థియేటర్స్ అన్నీ మళ్లీ హౌస్‌ఫుల్ అవుతున్నాయి. అయితే, దేవర సినిమా ఇప్పటికే ఓటీటీలో విడుదలైంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది.
కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర సినిమాతో జాన్వీకపూర్ తొలిసారి తెలుగు తెరపై మెరిసింది. ఇందులో సైఫ్ అలీఖాన్, శ్రుతి మరాఠే, ప్రకాశ్‌రాజ్, శ్రీకాంత్ వంటి స్టార్స్ కీలకపాత్రల్లో నటించారు. సినిమాటోగ్రఫీతో పాటు సంగీతం ప్రేక్షకులను విశేషంగా మెప్పించాయి. దేవర పార్ట్2 కూడా ఉందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment