మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'దేవర' చిత్రం రిలీజ్ దగ్గరపడుతోంది. ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రమోషన్స్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ క్రమంలోనే ముంబై వేదికగా ట్రైలర్‌ను కూడా మేకర్స్ విడుదల చేశారు. ఆ కార్యక్రమంలో బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్, ఎన్టీఆర్, జాన్వీ కపూర్, కొరటాల శివ పాల్గొన్నారు. పాన్ ఇండియా రేంజ్‌లో ట్రైలర్‌కు మంచి మార్కులే పడుతున్నాయి. ఓవర్సీస్‌లో కూడా దేవర క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు.
ఇదీ చదవండి: భయంతోనే అలా చేయాల్సి వచ్చింది.. నన్ను క్షమించండి: రవీనా టాండన్
దేశ వాణిజ్య రాజధాని అయిన ముంబై నగరంలోని దాదర్ చౌపత్తి బీచ్ వద్ద ఎన్టీఆర్ కటౌట్స్ వెలిశాయి. ఆయన అభిమానులు వినూత్న రీతిలో వాటిని సముద్రంలో ఏర్పాటు చేశారు. దీంతో నెట్టింట అవి వైరల్ అవుతున్నాయి. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా గణేశ్ నిమజ్జనం దాదర్ చౌపత్తి బీచ్ వద్దే జరుగుతుంది. దేశంలోనే అత్యధిక సంఖ్యలో భక్తులు ఇక్కడ పాల్గొంటారు.
నిమజ్జనం రోజున సుమారు 10 లక్షల మంది అక్కడి బీచ్‌కు చేరుకుంటారని అంచనా ఉంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అదే బీచ్‌లో భారీగా దేవర పోస్టర్స్‌ను ఏర్పాటు చేశారు. సినిమాకు ఈ అంశం భారీగా కలిసొస్తుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. బాలీవుడ్‌లో దేవరను కరణ్ జోహార్ విడుదల చేస్తున్నారు. దీంతో ప్రమోషన్స్ కార్యక్రమాలను కూడా చాలా వ్యూహాత్మకంగా ప్లాన్ చేశారు.
సెప్టెంబర్ 27వ తేదీన దేవర విడుదల కానుంది. ఇప్పటికే సెన్సార్ కూడా పూర్తి అయింది. ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్ సెన్సార్ బోర్డు ఇచ్చింది. ఈ చిత్రం 2 గంటల 57 నిమిషాల 58 సెకన్ల (సుమారు 178 నిమిషాలు) రన్‍టైమ్‍తో రానుంది. అంటే దాదాపు మూడు గంటల నిడివి ఉండనుంది. దేవరలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‍గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఇందులో పవర్‌ఫుల్ విలన్ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించగా శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్, కలైయారాసన్, శృతి మరాఠే కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించాయి.
#Devara cutout is standing tall in the sea at Dadar Chowpatty in Mumbai ❤️#DevaraOnSep27th pic.twitter.com/fI0oKTlcap
— NTR Arts (@NTRArtsOfficial) September 14, 2024
Comments
Please login to add a commentAdd a comment