మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'దేవర' నుంచి రెండో ట్రైలర్ విడుదలైంది. కొరటాల శివ డైరెక్షన్‌లో భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కింది. ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 27న విడుదల కానున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అశలు ఉన్నాయి. నేడు సెప్టెంబర్ 22న దేవర ప్రీ రిలీజ్ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో ఫ్యాన్స్ పాల్గొననున్నారు.
'దేవర' రిలీజ్ ట్రైలర్‌ను ఆదివారం ఉదయం 11.07 గంటలకు విడుదల చేస్తామని ముందుగా ప్రకటించినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల ట్రైలర్ విడుదల సమయంలో మార్పులు చేశారు. మధ్యాహ్నం 2:07 నిమిషాలకు దేవర రెండో ట్రైలర్ విడుదల చేశారు. తెలుగు,హిందీ,తమిళ్,కన్నడ,మలయాళం భాషలలో అందుబాటులో ఉంది.
దేవర చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నందమూరి కల్యాణ్‌రామ్ సమర్పకులు. ఎన్టీఆర్‌కు జోడీగా జాన్వీ కపూర్ నటిస్తుండగా సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటించారు. ప్రకాశ్‌రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, నరైన్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment