పాకిస్తాన్ లెజెండరీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది(36) అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 21 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌ను ముగిస్తున్నట్లు అఫ్రిది ఆదివారం ప్రకటించాడు. టెస్ట్, వన్డే క్రికెట్ నుంచి గతంలోనే తప్పుకున్న ఈ క్రికెటర్.. తాజాగా టీ20 జట్టు నుంచి తప్పుకొని అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌ను ముగించాడు.