షాహిద్ ఆఫ్రిది.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. నెమ్మదిగా సాగుతున్న వన్డే క్రికెట్‌లో టీ20 ఆటను ప్రదర్శించి ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు. మొన్నటివరకు వేగవంతమైన సెంచరీ కూడా ఆఫ్రిది(1996, 37 బంతుల్లో) పేరుమీదే ఉండేది. ఇక 2015లో వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించడంతో అతడి ఆట చూడటాన్ని అభిమానులు మిస్సవుతున్నారు. 2018 వరకు టీ20లు ఆడినా అంతగా మెప్పించలేదు. అయితే తనలో ఇంకా సత్తా తగ్గలేదని.. యువ హిట్టర్లతో తానేమీ తీసిపోనని మరోసారి నిరూపించాడు.