Lendl Simmons
-
మళ్లీ మొదలెట్టిన క్రిస్ గేల్.. అవకాశం వచ్చినా సెంచరీ చేయలేకపోయిన సిమన్స్
విండీస్ విధ్వంసకర యోధుడు, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ చాలాకాలం తర్వాత మళ్లీ బ్యాట్ ఝులిపించాడు. లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2023 సీజన్లో భాగంగా భిల్వారా కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మెరుపు హాఫ్ సెంచరీ చేశాడు. ఈ టోర్నీలో గుజరాత్ జెయింట్స్‌కు ఆడుతున్న గేల్.. భిల్వారా కింగ్స్‌తో నిన్న (నవంబర్ 22) జరిగిన మ్యాచ్‌లో 27 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 52 పరుగులు చేశాడు. ఫలితంగా గుజరాత్ జెయింట్స్ తొలుత బ్యాటింగ్ చేస్తూ 6 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. జెయింట్స్ ఇన్నింగ్స్‌లో రిచర్డ్ లెవి (28), అభిషేక్ ఝున్‌ఝున్‌వాలా (24), ఖురానా (24 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. జాక్ కలిస్ (14), కెవిన్ ఓబ్రెయిన్ (11), కెప్టెన్ పార్థివ్ పటేల్ (8) తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు. భిల్వారా బౌలర్లలో రాహుల్ శర్మ, జెసల్ కరియా తలో 2 వికెట్లు పడగొట్టగా.. బార్న్‌వెల్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఒక్క పరుగుతో సెంచరీ మిస్.. గుజరాత్ నిర్ధేశించిన 173 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కింగ్స్.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 169 పరుగులకే పరిమితమై 3 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కింగ్స్ ఇన్నింగ్స్‌లో లెండిల్ సిమన్స్ (61 బంతుల్లో 99 నాటౌట్; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒక్కడే రాణించాడు. కింగ్స్ గెలవాలంటే ఆఖరి బంతికి ఐదు పరుగులు చేయాల్సి ఉండగా సిమన్స్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేయగలిగాడు. కనీసం రెండు పరుగులు చేయగలిగినా సిమన్స్ సెంచరీ పూర్తి చేసుకునే వాడు. కింగ్స్ ఇన్నింగ్స్‌లో తిలకరత్నే దిల్షన్ (1), యూసఫ్ పఠాన్ (5), కెప్టెన్ ఇర్ఫాన్ పఠాన్ (1) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. జెయింట్స్ బౌలర్లలో రయాద్ ఎమ్రిట్, ఈశ్వర్ చౌదరీ చెరో 2 వికెట్లు, శ్రీశాంత్, లడ్డా, రజత్ భాటియా తలో వికెట్ దక్కించుకున్నారు. టోర్నీలో భాగంగా ఇవాళ (నవంబర్ 23) ఇండియా క్యాపిటల్స్, అర్బన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. -
అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన వెస్టిండీస్ ఓపెనర్..!
వెస్టిండీస్ విధ్వంసకర ఓపెనర్ లెండిల్ సిమన్స్ అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలికాడు. సిమన్స్ తన నిర్ణయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా సోమవారం ప్రకటించాడు. కాగా సిమన్స్ గత ఏడాది టీ20 ప్రపంచకప్‌లో చివరిసారిగా విండీస్ తరపున ఆడాడు. 2006లో పాకిస్తాన్‌తో జరగిన వన్డేలో విండీస్ తరపున సిమన్స్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అయితే అరంగేట్ర మ్యాచ్‌లోనే డకౌట్ అయ్యి నిరాశ పరిచాడు. ఇక సిమన్స్ వన్డేలు,టెస్టుల్లో కాకుండా.. టీ20ల్లో విండీస్‌కు స్పెషలిస్టు బ్యాటర్‌గా మారాడు. రెండు సార్లు టీ20 ప్రపంచకప్ గెలిచిన విండీస్ జట్టులో సిమన్స్ భాగంగా ఉన్నాడు. 2016 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో భారత్‌పై 82 పరుగులతో సిమన్స్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇక ఓవరాల్‌గా తన అంతర్జాతీయ కెరీర్లో 144 మ్యాచ్‌లు ఆడిన సిమన్స్.. 3763 పరుగులు సాధించాడు. ఇక విధ్వంసకర ఆటగాడిగా పేరు తెచ్చుకున్న సిమన్స్ పలు ప్రాంఛైజీ టోర్నీల్లో కూడా ఆడాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించిన అతడు.. 2015 సీజన్లో 540 పరుగులతో ఆ జట్టు టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చదవండి: WI vs IND: భారత్‌తో వన్డే సిరీస్.. జట్టును ప్రకటించిన వెస్టిండీస్.. స్టార్ ఆల్‌రౌండర్ వచ్చేశాడు! View this post on Instagram A post shared by 124NotOut Sports Agency (@124notout) -
ఒకే జట్టులో ధోని, కోహ్లి.. కెప్టెన్‌గా ఎవరంటే..?
Lendl Simmons picks his all time T20 XI,MS Dhoni to lead: వెస్టిండీస్ స్టార్ బ్యాటర్ లెండిల్ సిమన్స్ తన ఆల్ టైమ్ టీ20 ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంచుకున్నాడు. తను ప్రకటించిన జట్టుకు టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనిని కెప్టెన్‌గా ఎంచుకున్నాడు. అదే విధంగా.. యూనివర్స్‌ల్ బాస్ క్రిస్ గేల్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మకు ఓపెనర్లుగా అవకాశం ఇచ్చాడు. కింగ్ కోహ్లికి మూడో స్థానంలో, దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌కు నాలుగో స్థానంలో చోటు దక్కింది. ధోనీని తన టీమ్‌కి వికెట్ కీపర్‌గా, కెప్టెన్‌గా సిమన్స్ ఎంపిక చేశాడు. ఆల్‌రౌండర్ కోటాలో డ్వేన్ బ్రావో, కీరాన్ పొలార్డ్‌కు చోటు కల్పించాడు. ఇక తన జట్టులో స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా సునీల్ నరైన్‌ను, రషీద్ ఖాన్‌కు అవకాశం ఇచ్చాడు. ఇక ఫాస్ట్ బౌలర్ల కోటాలో భువనేశ్వర్ కుమార్, కగిసో రబడకు స్థానం కల్పించాడు. అయితే టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బూమ్రాకు చోటు దక్కకపోవడం గమనార్హం. సిమన్స్ టీ20 ప్లేయింగ్ ఎలెవన్: క్రిస్ గేల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఏబి డివిలియర్స్, కీరాన్ పొలార్డ్, మహేంద్ర సింగ్ ధోని (కెప్టెన్), డ్వేన్ బ్రావో, రషీద్ ఖాన్, సునీల్ నరైన్, భువనేశ్వర్ కుమార్, కగిసో రబడ. చదవండి: Ind Vs Nz 3rd T20I: దీపక్ చాహర్‌కు సెల్యూట్ చేసిన రోహిత్ శర్మ.. వీడియో వైరల్ -
విండీస్ బ్యాటర్ చెత్త రికార్డు.. 35 బంతుల్లో..!
Lendl Simmons Equals Bangladesh Alok kapali Record: టీ20 ప్రపంచకప్-2021 సూపర్ 12లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో విండీస్ ఓపెనర్ లెండిల్ సిమన్స్ చెత్త రికార్డు నెలకొల్పాడు. పొట్టి ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక బంతులను ఎదుర్కొని బౌండరీ సాధించని ఆటగాడిగా బంగ్లా ఆటగాడు అలోక్ కపాలి రికార్డును సమం చేశాడు. 2007 ప్రపంచకప్‌లో కపాలి 35 బంతులను ఎదుర్కొని ఒక్క బౌండరీ కుడా సాధించకుండా కేవలం 14 మాత్రమే చేయగా.. ఈ మ్యాచ్‌లో సిమన్స్ అదే 35 బంతులను ఎదుర్కొని బౌండరీ లేకుండా 16 పరుగులు చేశాడు. ఇదే ప్రపంచకప్‌లో ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్ ఆటగాడు మాట్ క్రాస్ 35 బంతుల్లో బౌండరీ లేకుండా 26 పరుగులతో నాటౌట్‌గా నిలిచి వీరిద్దరితో సమంగా నిలిచాడు. ఇదిలా ఉంటే, సఫారీలతో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్.. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. ఎవిన్ లూయిస్(35 బంతుల్లో 56; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చదవండి: Mohammad Shami: పాక్ అభిమానికి స్ట్రాంగ్ వార్నింగ్..! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
సిమ్మన్స్ సిక్సర్ల మోత..
సెయింట్‌కిట్స్: వెస్టిండీస్-ఐర్లాండ్ జట్ల మధ్య జరిగిన మూడు టీ20ల సిరీస్ టైగా ముగిసింది. ఆదివారం జరిగిన చివరి టీ20లో వెస్టిండీస్ ఘన విజయం సాధించి సిరీస్‌ను టై చేసుకుంది. తొలి టీ20లో ఐర్లాండ్ విజయం సాధించగా, రెండో టీ20 వర్షం కారణంగా రద్దయ్యింది. మూడో టీ20లో వెస్టిండీస్ 9 వికెట్ల తేడాతో ఐర్లాండ్‌ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 19.1 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌట్ అయ్యింది. కెవిన్ ఒబ్రెయిన్(36), ఆండ్రూ బాల్బిర్మి(28)లు మినహా ఎవరూ ఆకట్టుకోలేకపోవడంతో ఐర్లాండ్ సాధారణ స్కోరుకే పరిమితమైంది.(ఇక్కడ చదవండి: ఐర్లాండ్ ‘పవర్ ప్లే’ రికార్డు) విండీస్ బౌలర్లు సమష్టిగా రాణించి ఐర్లాండ్‌ను కట్టడి చేశారు. కీరోన్ పొలార్డ్, డ్వేన్ బ్రేవోలు తలో మూడు వికెట్లతో రాణించగా, రూథర్‌ఫర్డ్, రొమారియో షెపర్డ్‌లు చెరో వికెట్ తీశారు.ఆపై 139 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన వెస్టిండీస్ వికెట్ మాత్రమే నష్టపోయి విజయం సాధించింది. ఎవిన్ లూయిస్(46; 25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) బ్యాట్ ఝుళిపించగా, లెండిల్ సిమ్మన్స్(91 నాటౌట్; 40 బంతుల్లో 5 ఫోర్లు, 10 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సిక్సర్ల మోత మోగించి ఐర్లాండ్ బౌలర్లను చితక్కొట్టాడు. సిమ్మన్స్ సాధించిన పరుగుల్లో 80 పరుగులు ఫోర్లు, సిక్సర్ల రూపంలోనే రావడం విశేషం. దాంతో విండీస్ 11 ఓవర్లలోనే టార్గెట్‌ను ఛేదించింది. -
గెలిచి సమం చేశారు..
తిరువనంతపురం: టీమిండియాతో జరిగిన రెండో టీ20లో వెస్టిండీస్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను విండీస్ 1-1తో సమం చేసింది. టీమిండియా నిర్దేశించిన 171 పరుగుల లక్ష్యాన్ని కేవలం రెండు వికెట్లు కోల్పోయి ఛేధించింది. లక్ష్య ఛేదనలో ఓపెనర్ సిమ్మన్స్(67 నాటౌట్; 45 బంతుల్లో 4ఫోర్లు, 4 సిక్సర్లు) భీభత్సం సృష్టించగా.. మరో ఓపెనర్ ఎవిన్ లూయిస్ (40; 35 బంతుల్లో 3ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించాడు. వీరికి తోడు హెట్‌మైర్(23;14 బంతుల్లో 3 సిక్సర్లు), నికోలస్ పూరన్(38 నాటౌట్; 18 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో విండీస్ విజయం సునాయసమైంది. విండీస్ బ్యాట్స్‌మెన్ జోరుకు తోడు ఆటగాళ్ల చెత్త ఫీల్డింగ్ టీమిండియా పరాజయానికి బాటలు వేసింది. భారత బౌలర్లలో సుందర్, జడేజాలు తలో వికెట్ దక్కించుకున్నారు. టీమిండియా నిర్దేశించిన 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్‌కు ఓపెనర్లు చక్కటి శుభారంభాన్ని అందించారు. ముఖ్యంగా లూయిస్ భారత బౌలర్లపై విరుచుకపడ్డాడు. అయితే ఆరంభంలోనే లూయిస్ క్యాచ్‌ను రిషభ్ పంత్ మిస్ చేయగా.. సిమ్మన్స్ క్యాచ్‌ను వాషింగ్టన్ సుందర్ నేలపాలు చేశాడు. ఈ రెండు క్యాచ్‌లు భువనేశ్వర్ బౌలింగ్ వేసిన ఓకే ఓవర్లో కావడం గమనార్హం. ఇక అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఓపెనర్లు మరింత దాటిగా ఆడారు. ఇదే ఊపులో లూయిస్ భారీ షాట్‌కు యత్నించి సుందర్ బౌలింగ్‌లో స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. అనంతరం సిమ్మన్స్ గేర్ మార్చి దూకుడుగా ఆడటం ప్రారంభించాడు. దీంతో విండీస్ విజయం దిశగా పయనించింది. ఇదే క్రమంలో హెట్‌మైర్, పూరన్‌లు కూడా తలో చేయి వేయడంతో 18.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తిచేసింది. ఇక నిర్ణయాత్మకమైన మూడో టీ20 బుధవారం ముంబై వాంఖడే స్టేడియంలో జరగనుంది. చదవండి: వెస్టిండీస్ లక్ష్యం 171 -
ఆఫ్రిది ఆగయా.. బౌలర్లకు చుక్కలు
-
ఆఫ్రిది ఆగయా.. బౌండరీ జాయేగా..
ఒంటారియో: షాహిద్ ఆఫ్రిది.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. నెమ్మదిగా సాగుతున్న వన్డే క్రికెట్లో టీ20 ఆటను ప్రదర్శించి ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు. మొన్నటివరకు వేగవంతమైన సెంచరీ కూడా ఆఫ్రిది(1996, 37 బంతుల్లో) పేరుమీదే ఉండేది. ఇక 2015లో వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించడంతో అతడి ఆట చూడటాన్ని అభిమానులు మిస్సవుతున్నారు. 2018 వరకు టీ20లు ఆడినా అంతగా మెప్పించలేదు. అయితే తనలో ఇంకా సత్తా తగ్గలేదని.. యువ హిట్టర్లతో తానేమీ తీసిపోనని మరోసారి నిరూపించాడు. గ్లోబల్ టీ20 కెనడా లీగ్‌లో మునపటి ఆఫ్రిదిని గుర్తుతెచ్చాడు. బౌలర్లకు చుక్కలు చూపిస్తూ చెలరేగిపోయాడు. బ్రాంప్టన్ వోల్వ్స్ తరుపున ప్రాతినిథ్యం వహిస్తున్న ఆఫ్రిది ఎడ్మాంటన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తన విశ్వరూపం ప్రదర్శించాడు. ఆఫ్రిది(81; 40 బంతుల్లో 10ఫోర్లు, 5 సిక్సర్లు) బౌండరీలతో హోరెత్తించాడు. ఎడ్మాంటన్ రాయల్స్ బౌలింగ్‌ను చిత్తుచిత్తు చేస్తూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఆఫ్రిదికి తోడుగా సిమ్మన్స్(59, 34 బంతుల్లో 5ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపులు మెరిపివ్వడంతో బ్రాంప్టన్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన ఎడ్మాంటన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 180 పరుగులే చేసి ఓటమి పాలైంది. బ్యాట్‌తో మెరిసిని ఆఫ్రిది బౌలింగ్‌లోనూ వికెట్ దక్కించుకున్నాడు. కీలక సమయంలో మహ్మద్ హఫీజ్‌ను ఔట్ చేశాడు. ఇక ఆఫ్రిది బ్యాటింగ్ మెరుపులను టీ20 కెనడా లీగ్ తన అధికారిక ట్విటర్లో షేర్ చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగహల్‌చల్ చేస్తోంది. ‘బుమ్ బుమ్ ఆఫ్రిది ఇజ్ బ్యాక్’, ‘ఆఫ్రిది ఆగయా.. బౌండరీ జాయేగా’ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. -
బ్యాట్స్‌మన్ సాహసం
-
బ్యాట్స్‌మన్ సాహసం
ట్రినిడాడ్: వెస్టిండీస్ బ్యాట్స్‌మన్ లెండిల్ సిమన్స్ సాహసం చేశాడు. ఒక కాలికి మాత్రమే ప్యాడ్ కట్టుకుని బ్యాటింగ్ చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అంతేకాదు అర్ధసెంచరీ బాది ఔరా అనిపించాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లో అతడీ ఫీట్ చేశాడు. గయానా అమెజాన్ వారియర్స్ తో జరిగిన మ్యాచ్ లో సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పాట్రియట్స్ తరపున బరిలోకి దిగిన సిమన్స్ సింగిల్ ప్యాడ్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇన్నింగ్స్ 12 ఓవర్ లో బ్యాటింగ్ వచ్చిన సిమన్స్ 60 బంతుల్లో 50 పరుగులు సాధించాడు. టీ20 మ్యాచుల్లో నెమ్మదిగా(ఎక్కువ బంతుల్లో) సాధించిన అర్ధసెంచరీ ఇదే కావడం మరో విశేషం. బ్యాట్స్‌మన్ ఒక కాలికి ప్యాడ్ కట్టుకుని బ్యాటింగ్ చేయడం తాను ఎక్కడా చూడలేదని కామెంటేటర్ ఇయాన్ బిషప్ వ్యాఖ్యానించాడు. టీమిండియాతో కొద్ది నెలల కిత్రం జరిగిన టీ20 వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్ లో సిమన్స్ ఆడిన అద్భుత ఇన్నింగ్స్ క్రికెట్ అభిమానులకు గుర్తుండే ఉంటుంది. -
'భారత్ ఓటమికి కోహ్లీనే కారణం'
టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్స్ మ్యాచ్ లో భారత్ ఓటమిపై వెస్టిండీస్ స్టార్ ప్లేయర్ లెండిల్ సిమ్మన్స్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ మ్యాచ్ లో భారత్ ఓటమికి స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీనే కారణమని పేర్కొన్నాడు. అతని ప్రవర్తన కారణంగానే తాను అలాంటి గొప్ప ఇన్నింగ్స్ ఆడి సమాధానం చెప్పానని అభిప్రాయపడ్డాడు. ఆండ్రీ ఫ్లెచర్ స్థానంలో తనకు దక్కిన అవకాశం వినియోగించుకుని జట్టుకు విజయాన్ని అందించానని సిమ్మన్స్ పేర్కొన్నాడు. వాంఖడేలో జరిగిన ఆ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. విరాట్ 47 బంతుల్లో 89 పరుగులు చేసి భారీ స్కోరులో మరోసారి భాగస్వామి అయ్యాడు. అనంతరం చేజింగ్ కు దిగిన వెస్టిండీస్ ఏడు వికెట్ల తేడాతో భారత్ పై విజయాన్ని సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ ను ఓడించి టీ20 ప్రపంచకప్ ను రెండోసారి కైవసం చేసుకుంది. తాను బ్యాటింగ్ చేస్తుండగా.. కోహ్లీ తనపై నోరు పారేసుకున్నాడని సిమ్మన్స్ పేర్కొన్నాడు. తన బ్యాటుతోనే అతడికి సమాధానం చెప్పి, విరాట్ ఒక్కడు మాత్రమే బెస్ట్ బ్యాట్స్ మన్ కాదని నిరూపించాలని భావించినట్లు వెల్లడించాడు. విరాట్ ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు చాలా ఆవేశంగా, దురుసుగా ప్రవర్తిసాడని, బ్యాటింగ్ మాత్రం గుడ్ అని చెప్పుకొచ్చాడు. భారత్ కు అభిమానుల మద్ధతు చూసి తాను షాక్ తిన్నానని, తన కెరీర్ లో ఈ ఇన్నింగ్స్ హైలెట్ గా నిలుస్తుందన్నాడు. నిజానికి ఆ మ్యాచ్ లో సిమ్మన్స్ రెండుసార్లు క్యాచ్ ఔట్ కాగా, ఆ బంతులు నోబాల్స్ కావడంతో ఊపిరి పీల్చుకున్న విషయం తెలిసిందే. -
ఫ్లెచర్ స్థానంలో సిమ్మన్స్
భారత్‌తో గురువారం జరిగే సెమీఫైనల్‌కు ముందు వెస్టిండీస్ జట్టులో మార్పు జరిగింది. గాయం కారణంగా ఫ్లెచర్ వైదొలగడంతో అతడి స్థానంలో లెండిల్ సిమ్మన్స్ జట్టులోకి వచ్చాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు ఆడే సిమ్మన్స్‌కు వాంఖడే పిచ్‌పై కీలక ఇన్నింగ్స్ ఆడిన అనుభవం ఉంది. నిజానికి టోర్నీ ఆరంభంలో సిమ్మన్స్ జట్టులో ఉన్నా గాయం కారణంగా భారత్ రాలేదు. అయితే అనుకోకుండా ఫ్లెచర్ గాయం కారణంగా సిమ్మన్స్ జట్టుతో చేరాడు. -
ముంబై జట్టులో సిమ్మన్స్
జలజ్ సక్సేనా స్థానంలో తీసుకున్న ఫ్రాంచైజీ దుబాయ్: వరుస ఓటములతో కుదేలైన ముంబై ఇండియన్స్ జట్టు ఓ కీలక మార్పు చేసింది. వెస్టిండీస్ టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ లెండిల్ సిమ్మన్స్‌ను జట్టులోకి తీసుకుంది. జలజ్ సక్సేనా స్థానంలో సిమ్మన్స్‌ను తీసుకోవడానికి ఐపీఎల్ కౌన్సిల్ అనుమతి ఇచ్చింది. అయితే జలజ్‌ను ఎందుకు తీశారనే విషయంలో స్పష్టత ఇవ్వలేదు. ఫిబ్రవరిలో జరిగిన వేలంలో మధ్యప్రదేశ్ క్రికెటర్ జలజ్ సక్సేనాను రూ.90 లక్షలకు ముంబై కొనుక్కుంది. కానీ సీజన్లో ఇప్పటివరకూ ఒక్క మ్యాచ్ కూడా ఆడించలేదు. మరోవైపు వెస్టిండీస్ క్రికెటర్ సిమ్మన్స్ ఇప్పటివరకూ ఎప్పుడూ ఐపీఎల్లో ఆడలేదు.