ఫ్లెచర్ స్థానంలో సిమ్మన్స్
భారత్‌తో గురువారం జరిగే సెమీఫైనల్‌కు ముందు వెస్టిండీస్ జట్టులో మార్పు జరిగింది. గాయం కారణంగా ఫ్లెచర్ వైదొలగడంతో అతడి స్థానంలో లెండిల్ సిమ్మన్స్ జట్టులోకి వచ్చాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ఆడే సిమ్మన్స్‌కు వాంఖడే పిచ్‌పై కీలక ఇన్నింగ్స్ ఆడిన అనుభవం ఉంది. నిజానికి టోర్నీ ఆరంభంలో సిమ్మన్స్ జట్టులో ఉన్నా గాయం కారణంగా భారత్ రాలేదు. అయితే అనుకోకుండా ఫ్లెచర్ గాయం కారణంగా సిమ్మన్స్ జట్టుతో చేరాడు.