West Indies Star Batter Announces Retirement From International Cricket | Lendl Simmons - Sakshi
Sakshi News home page

Lendl Simmons: అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన వెస్టిండీస్‌ ఓపెనర్‌..!

Jul 19 2022 7:39 AM | Updated on Jul 19 2022 9:47 AM

Lendl Simmons announces retirement from international cricket - Sakshi

వెస్టిండీస్‌ విధ్వంసకర ఓపెనర్‌ లెండిల్ సిమన్స్ అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలికాడు. సిమన్స్‌ తన నిర్ణయాన్ని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా సోమవారం ప్రకటించాడు. కాగా సిమన్స్‌ గత ఏడాది టీ20 ప్రపంచకప్‌లో చివరిసారిగా విండీస్‌ తరపున ఆడాడు. 2006లో పాకిస్తాన్‌తో జరగిన వన్డేలో విండీస్‌ తరపున సిమన్స్‌ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అయితే అరంగేట్ర మ్యాచ్‌లోనే డకౌట్‌ అయ్యి నిరాశ పరిచాడు. ఇక సిమన్స్‌ వన్డేలు,టెస్టుల్లో కాకుండా.. టీ20ల్లో విండీస్‌కు స్పెషలిస్టు బ్యాటర్‌గా మారాడు.

రెండు సార్లు టీ20 ప్రపంచకప్‌ గెలిచిన విండీస్‌ జట్టులో సిమన్స్‌ భాగంగా ఉన్నాడు. 2016 టీ20 ప్రపంచకప్‌ సెమీఫైనల్లో భారత్‌పై 82 పరుగులతో సిమన్స్‌ అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. ఇక ఓవరాల్‌గా తన అంతర్జాతీయ కెరీర్‌లో 144 మ్యాచ్‌లు ఆడిన సిమన్స్‌.. 3763 పరుగులు సాధించాడు. ఇక విధ్వంసకర ఆటగాడిగా పేరు తెచ్చుకున్న సిమన్స్‌ పలు ప్రాంఛైజీ టోర్నీల్లో కూడా ఆడాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించిన అతడు.. 2015 సీజన్‌లో 540 పరుగులతో ఆ జట్టు టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.
చదవండి: WI vs IND: భారత్‌తో వన్డే సిరీస్‌.. జట్టును ప్రకటించిన వెస్టిండీస్‌.. స్టార్‌ ఆల్‌రౌండర్‌ వచ్చేశాడు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement