విండీస్ దిగ్గజ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో ప్రొఫెషనల్ టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం జరుగుతున్న కరీబియన్ ప్రీమియర్ లీగ్ ప్రొఫెషనల్ క్రికెట్‌లో తనకు చివరి టోర్నీ అని ఇన్‌స్టా వేదికగా వెల్లడించాడు. 40 ఏళ్ల బ్రావో ఇదివరకే అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
బ్రావో సీపీఎల్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. బ్రావో టీ20ల్లో అత్యధిక వికెట్ల వీరుడిగా కొనసాగుతున్నాడు. 2006 నుంచి ప్రొఫెషనల్ టీ20లు ఆడుతున్న బ్రావో తన కెరీర్‌లో మొత్తం 579 మ్యాచ్‌లు ఆడి 630 వికెట్లు పడగొట్టాడు. పొట్టి క్రికెట్ చరిత్రలో బ్రావోతో పాటు రషీద్ ఖాన్ మాత్రమే 600 వికెట్ల మైలురాయిని దాటాడు.
బ్రావో తన రిటైర్మెంట్ సందేశంలో ఇలా రాసుకొచ్చాడు. "ఇది ఓ గొప్ప ప్రయాణం. ఈ రోజు నేను కరీబియన్ ప్రీమియర్ లీగ్ నుండి రిటైర్‌మెంట్‌ను ప్రకటించాలనుకుంటున్నాను. ఈ సీజన్ నా చివరిది. కరీబియన్ ప్రజల ముందు నా చివరి ప్రొఫెషనల్ టోర్నమెంట్ ఆడేందుకు ఎదురు చూస్తున్నాను. ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌ను ఉద్దేశిస్తూ.. ఎక్కడైతే మొదలు పెట్టానో, అక్కడే ముగించాలని కోరుకుంటున్నాను.
కాగా, ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా అన్ని క్రికెట్ లీగ్‌ల్లో పాల్గొన్న బ్రావో.. వెస్టిండీస్ తరఫున 40 టెస్ట్‌లు, 164 వన్డేలు, 91 టీ20లు ఆడాడు. ఇందులో దాదాపు 6500 పరుగులు చేసి 363 వికెట్లు తీశాడు. బ్రావో ఖాతాలో 5 సెంచరీలు, 27 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బ్రావో అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లోనూ సత్తా చాటాడు. అతను వివిధ ఫ్రాంచైజీల తరఫున 161 మ్యాచ్‌లు ఆడి 1560 పరుగులు చేసి, 183 వికెట్లు తీశాడు.
Comments
Please login to add a commentAdd a comment