సెయింట్ జాన్స్ (ఆంటిగ్వా): గత ఏడాది అక్టోబరులో వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రేవో తాను అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. 2016 సెప్టెంబర్‌లో అతను చివరిసారిగా విండీస్ తరఫున టి20ల్లో బరిలోకి దిగాడు. వన్డే ఆడి దాదాపు ఐదేళ్లవుతోంది. వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు అది గుర్తుందో లేదో కానీ 2019 ప్రపంచ కప్ కోసం ప్రకటించిన 10 మంది రిజర్వ్ ఆటగాళ్ల జాబితాలో డ్వేన్ బ్రేవోకు కూడా చోటు కల్పించింది. బ్రేవోలాగే ఐదేళ్ల క్రితం వన్డే బరిలోకి దిగిన విధ్వంసక ఆటగాడు కీరన్ పొలార్డ్‌ను కూడా రిజర్వ్ టీమ్‌లోకి బోర్డు ఎంపిక చేసింది.
‘మా జట్టు సమతూకంతో ఉందని, అత్యవసర పరిస్థితిలో అవసరమైతే కావాల్సిన ఆటగాళ్లు కూడా ఉన్నారని చెప్పేందుకే రిజర్వ్ జాబితాను ప్రకటించాం. ఇందులో కుర్రాళ్లతో పాటు అనుభవజ్ఞులు కూడా ఉండాలని భావించాం’ అని సెలక్షన్ కమిటీ చైర్మన్ రాబర్ట్ హేన్స్ వెల్లడించారు. ఈ ఇద్దరితో పాటు సునీల్ ఆంబ్రిస్, జాన్ క్యాంప్‌బెల్, జొనాథన్ కార్టర్, రోస్టన్ ఛేజ్, షేన్ డౌరిచ్, కీమో పాల్, ఖారీ పైర్, రేమన్ రీఫర్‌లను కూడా రిజర్వ్‌లుగా ఎంపిక చేశారు.
Comments
Please login to add a commentAdd a comment