ఆంటిగ్వా: వెస్టిండీస్ ప్రపంచకప్ జట్టులో కీరోన్ పొలార్డ్, డ్వేన్ బ్రేవోలు స్టాండ్ బైగా ఎంపికయ్యారు. గతంలో ప్రకటించిన వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కని వీరిని రిజర్వ్ ఆటగాళ్లగా ఎంపిక చేస్తూ విండీస్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. మొత్తం 10 మందితో కూడిన రిజర్వ్ బెంచ్‌ని విండీస్ ప్రకటించగా, అందులో స్టార్ ఆల్ రౌండర్లు బ్రేవో, పొలార్డ్‌లు చోటు దక్కించుకున్నారు. వరల్డ్‌కప్ కోసం విండీస్ ముందుగా ప్రకటించిన 15 మంది జాబితాలో ఎవరైనా గాయపడిన పక్షంలో పొలార్డ్, బ్రేవోలకు అవకాశం దక్కుతుంది. కాగా, 2018లోనే బ్రేవో అంతర్జాతీయ క్రికెట్‌కు గుబ్ బె చెప్పినా, అతని అనుభవాన్ని ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతోనే విండీస్ బోర్డు తిరిగి డ్వేన్ బ్రేవోను రిజ్వర్ ఆటగాడిగా ఎంపిక చేసింది. ఇందుకు బ్రేవో అనుమతి తీసుకున్న తర్వాతే అతన్ని రిజర్వ్ ఆటగాడి జాబితాలో చేర్చినట్లు తెలుస్తోంది.
వరల్డ్‌కప్‌కు ముందు ఐసీసీ నిర్వహించే రెండు వార్మప్ మ్యాచ్‌ల్లో విండీస్ పాల్గొనుంది. మే 26వ తేదీన దక్షిణాఫ్రికాతో, మే 28వ తేదీన న్యూజిలాండ్‌తో విండీస్ వార్మప్ మ్యాచ్‌లు ఆడనుంది. ఆ తర్వాత మెగాటోర్నీలో భాగంగా వెస్టిండీస్ తన తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో తలపడనుంది. మే 31వ తేదీన ట్రెంట్‌బ్రిడ్జ్ వేదికగా విండీస్-పాక్‌ల మధ్య మ్యాచ్ జరుగనుంది.
వెస్టిండీస్ రిజర్వ్ ఆటగాళ్ల జాబితా
సునీల్ ఆంబ్రిస్, డ్వేన్ బ్రేవో, జాన్ క్యాంప్‌బెల్, జోనాథన్ కార్టర్, రోస్టన్ ఛేజ్, షేన్ డొవ్రిచ్, కీమో పాల్, ఖారీ పీరే, రేమాన్ రీఫర్, కీరోన్ పొలార్డ్
Comments
Please login to add a commentAdd a comment