వెస్టిండీస్ నుంచి ఎంతో మంది ఆటగాళ్లు క్రికెట్ ప్రపంచాన్ని జయించారు. అందులో ఒకడే దిగ్గజ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో ఒకడిగా పేరు గాంచాడు. టీ20ల్లో అత్యధిక వికెట్లు వీరుడుగా నిలిచాడు. తన విరోచిత పోరాటాలతో విండీస్‌కు రెండు వరల్డ్‌కప్‌లను అందిచాడు. తన ప్రదర్శనతో, డ్యాన్స్‌లతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అతడు కరేబియన్ అయినప్పటకి భారత్‌లో కూడా ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పరుచుకున్నాడు.
అయితే ఇకపై బ్రావో డ్యాన్స్‌లు మైదానంలో కన్పించవు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఈ వెస్టిండీస్ దిగ్గజం.. ఇప్పుడు ప్రొఫెషనల్ క్రికెట్‌కు కూడా గుడ్‌బై చెప్పేశాడు. ఎక్కడైతే తన కెరీర్ మొదలైందో అక్కడే ముగించనున్నాడు. సొంత ప్రజలముందే సగర్వంగా తనకు ఇష్టమైన ఆటనుంచి తప్పకోనున్నాడు. ఈ ఏడాది కరీబియన్ ప్రీమియర్ లీగ్‌తో అన్ని ఫార్మాట్‌ల క్రికెట్ నుంచి తప్పుకోనున్నట్లు బ్రావో వెల్లడించాడు. ఈ నేపథ్యంలో బ్రావో తన టీ20 క్రికెట్ జర్నీపై ఓ లుక్కే ద్దాం.
టీ20 స్పెషలిస్టు.. విండీస్ హీరో
బ్రావో ఒక టీ20 స్పెషలిస్టు. 2006లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన బ్రావో.. తన బౌలింగ్, బ్యాటింగ్‌తో విండీస్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు. మఖ్యంగా 2012, 2016 టీ20 ప్రపంచకప్‌లను వెస్టిండీస్ సొంతం చేసుకోవడంలో బ్రావోది కీలక పాత్ర. ఈ రెండు మెగా టోర్నీల్లో బ్రావో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు.
విండీస్‌కే కాకుండా ఫ్రాంచైజీ క్రికెట్‌లో సైతం తన మార్క్ చూపించాడు. ఐపీఎల్‌లో కూడా దుమ్ములేపాడు. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీలకు ఈ కరేబియన్ ధీరుడు ప్రాతినిథ్యం వహించాడు. సీఎస్‌కే తరపున అత్యధిక వికెట్లు పడగొట్టిన రికార్డు ఇప్పటకీ బ్రావో(154) పేరిటే ఉంది.
స్లోయర్ బాల్స్ స్పెషలిస్టు..
బ్రావో హార్డ్ హిట్టింగ్ స్కిల్స్‌తో పాటు అద్బుతమైన బౌలింగ్ నైపుణ్యాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా స్లోయర్ బాల్స్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లను బోల్తా కొట్టించడం బ్రావో స్పెషాలిటీ. అంతేకాకుండా డెత్ ఓవర్ స్పెషలిస్టుగా బ్రావో పేరు గాంచాడు. ఇవన్నీ అతడిని టీ20 క్రికెట్‌లో విలువైన ఆస్తిగా మార్చాయి.
2021లో గుడ్‌బై
బ్రావో తన కెరీర్‌లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ 2021 టీ20 వరల్డ్‌కప్ లో ఆస్ట్రేలియాపై ఆడాడు. అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలికాడు. తన చివరి సహచర ఆటగాళ్లు, ఆసీస్ క్రికెటర్ల నుంచి బ్రావో గార్డ్ ఆఫ్ ఆనర్ స్వీకరించాడు. తన ఇంటర్ననేషనల్ కెరీర్‌లో 295 మ్యాచ్‌ల్లో విండీస్‌కు బ్రావో ప్రాతినిథ్యం వహించాడు.
టీ20ల్లో రికార్డు అదుర్స్..
టీ20 క్రికెట్ చరిత్రలో బ్రావోకు ఘనమైన రికార్డులు ఉన్నాయి. అంతర్జాతీయ మ్యాచ్‌లు, లీగ్‌లు సహా మొత్తం 578 టీ20 మ్యాచ్‌లు ఆడిన అతడు ఏకంగా 630 వికెట్లు పడగొట్టాడు. టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు పడగొట్టిన జాబితాలో బ్రావో అగ్రస్ధానంలో కొనసాగుతున్నాడు. టీ20 క్రికెట్‌లో 630 వికెట్లతో పాటు అతడు 6,970 పరుగులు కూడా చేశాడు.
ఛాంపియన్ డ్యాన్స్..
బ్రావో "ఛాంపియన్ డ్యాన్స్ వరల్డ్ క్రికెట్‌లో ప్రత్యేక గుర్తింపు ఉంది. వికెట్ తీసినా ప్రతీసారి మైదానంలో డ్యాన్స్ చేస్తూ బ్రావో సెలబ్రేషన్స్ చేసుకుంటాడు. ఇది 2016 టీ20 వరల్డ్‌కప్ నుంచి బ్రావో ఈ విధంగా డ్యాన్స్ సెలబ్రేషన్స్ చేస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment