ఆఫ్ఘనిస్తాన్ స్టార్ ఆటగాడు, వరల్డ్ నంబర్ వన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ చరిత్రపుటల్లోకెక్కాడు. టీ20 ఫార్మాట్‌లో 600 వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. హండ్రెడ్ లీగ్ 2024లో భాగంగా మాంచెస్టర్ ఒరిజినల్స్‌తో నిన్న (జులై 29 జరిగిన మ్యాచ్‌లో రషీద్ 600 వికెట్ల క్లబ్‌లో చేరాడు. ఒరిజినల్స్ బ్యాటర్ పాల్ వాల్టర్ వికెట్ తీయడంతో 600 వికెట్ల మైలురాయిని తాకడు.
టీ20ల్లో రషీద్‌కు ముందు విండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో మాత్రమే 600 వికెట్లు తీశాడు. బ్రావో 578 మ్యాచ్‌ల్లో 630 వికెట్లు పడగొట్టగా.. రషీద్ కేవలం 441 మ్యాచ్‌ల్లో 600 వికెట్ల ఘనత సాధించాడు. టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో బ్రావో, రషీద్ తర్వాత సునీల్ నరైన్ (557), ఇమ్రాన్ తాహిర్ (502), షకీబ్ అల్ హసన్ (492), ఆండ్రీ రసెల్ (462) ఉన్నారు. భారత్ నుంచి అత్యధిక టీ20 వికెట్లు తీసిన బౌలర్‌గా చహల్ ఉన్నాడు. చహల్ 305 మ్యాచ్‌ల్లో 354 వికెట్లు పడగొట్టాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. హండ్రెడ్ లీగ్‌లో ట్రెంట్ రాకెట్స్‌కు ఆడుతున్న రషీద్ ఈ మ్యాచ్‌లో రెండు వికెట్లు తీశాడు. రషీద్‌తో పాటు ఇమాద్ వసీం (2/21), సామ్ కుక్ (2/37) రాణించడంతో రసవత్తర పోరులో ఒరిజినల్స్‌పై రాకెట్స్ పరుగు తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాకెట్స్ నిర్ణీత 100 బంతుల్లో 7 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. టామ్ బాంటన్ (45), రోవ్‌మన్ పావెల్ (27), రషీద్ ఖాన్ (15 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. మాంచెస్టర్ బౌలర్లలో టామ్ హార్ట్లీ 3, సికందర్ రజా 2, పాల్ వాల్టర్ ఓ వికెట్ పడగొట్టారు.
అనంతరం ఛేదనలో మాంచెస్టర్ 100 బంతుల్లో 8 వికెట్లు కోల్పోయి 144 పరుగులకు పరిమితమైంది. ఫలితంగా రాకెట్స్ పరుగు తేడాతో విజయం సాధించింది. మాంచెస్టర్ ఇన్నింగ్స్‌లో హెల్డన్ (40) టాప్ స్కోరర్‌గా కాగా.. మ్యాడ్‌సన్ (28), వాల్టర్ (29), సికందర్ రజా (21) ఓ మోస్తరు పరుగులు చేశారు. రాకెట్స్ బౌలర్లలో ఇమాద్ వసీం, రషీద్ ఖాన్, సామ్ కుక్ తలో 2 వికెట్లు, థాంప్సన్ ఓ వికెట్ పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment