Fletcher
-
9 బంతుల్లో 44 పరుగులు.. 30 నిమిషాల్లో మ్యాచ్‌ను ముగించాడు!
సూపర్ స్మాష్ లీగ్‌లో న్యూజిలాండ్ ఆటగాడు క్యామ్ ఫ్లెచర్ విద్వంసం సృష్టించాడు. సూపర్ స్మాష్‌లో భాగంగా ఆదివారం (డిసెంబర్19) వెల్లింగ్టన్ వర్సెస్ కాంట్రబరీ మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెల్లింగ్టన్ నిర్ణీత 20 ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. కాంట్రబరీ బౌలర్లలో మాట్ హెన్రీ, నట్టల్ చెరో మూడు వికెట్లు సాధించారు. అనంతరం 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కాంట్రబరీ ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. ఇక ఐదో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన క్యామ్ ఫ్లెచర్ ఫోర్లు, సిక్సర్లతో ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకు పడ్డాడు. 28 బంతులు ఎదుర్కొని అజేయంగా 52 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. అయితే అతడు ఆడిన ఇన్నింగ్స్‌లో కేవలం 9 బంతుల్లోనే బౌండరీల రూపంలో 44 పరుగులు చేశాడు. కాగా అతడు క్రీజులోకి వచ్చాక మ్యాచ్‌ను కేవలం 30 నిమిషాల్లోనే ముగించడం గమనర్హం. ఓపెనర్ చాడ్ బోడ్జ్ 41 బంతుల్లో 62 పరుగులు చేశాడు. ఇక ఫ్లెచర్ సుడిగాలి ఇన్నింగ్స్ ఫలితంగా కాంట్రబరీ 4 వికెట్లు కోల్పోయి 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చదవండి: SA Vs IND: భారత్ పర్యటన.. ఆ మ్యాచ్‌లను వాయిదా వేసిన దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు! -
ఫ్లెచర్ స్థానంలో సిమ్మన్స్
భారత్‌తో గురువారం జరిగే సెమీఫైనల్‌కు ముందు వెస్టిండీస్ జట్టులో మార్పు జరిగింది. గాయం కారణంగా ఫ్లెచర్ వైదొలగడంతో అతడి స్థానంలో లెండిల్ సిమ్మన్స్ జట్టులోకి వచ్చాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు ఆడే సిమ్మన్స్‌కు వాంఖడే పిచ్‌పై కీలక ఇన్నింగ్స్ ఆడిన అనుభవం ఉంది. నిజానికి టోర్నీ ఆరంభంలో సిమ్మన్స్ జట్టులో ఉన్నా గాయం కారణంగా భారత్ రాలేదు. అయితే అనుకోకుండా ఫ్లెచర్ గాయం కారణంగా సిమ్మన్స్ జట్టుతో చేరాడు. -
ఆ టెక్నిక్ ను టీ20లో చూపించాడు
ఇన్నాళ్లూ ఐపీఎల్ మెరుపులతో భారత అభిమానులకు దగ్గరైన వెస్టిండీస్ క్రికెటర్లు... ఈసారి టి20 ప్రపంచకప్‌లో అద్భుతంగా ఆడుతూ భారత అభిమానులకు వినోదాన్ని పంచుతున్నారు. టోర్నీలో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ అద్భుత విజయం సాధించారు. మొదటి మ్యాచ్‌లో క్రిస్ గేల్ విజృంభింస్తే, రెండో మ్యాచ్‌లో ఫ్లెచర్ (64 బంతుల్లో 84 నాటౌట్; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగి ఆడాడు. అయితే ఆ మ్యాచ్‌లో ఫ్లెచర్ తనకున్న ఫుట్ బాల్ నైపుణ్యాన్ని కూడా ఆ ప్రదర్శించి ఔట్ నుంచి తెలివిగా తప్పించుకున్నాడు. శ్రీలంక విసిరిన 123 పరుగుల విజయలక్ష్యాన్ని చేధించే క్రమంలో 16వ ఓవర్లో బౌలర్ వేసిన బంతిని ప్లెచర్ బౌండరీకి తరలించే యత్నం చేశాడు. అయితే బాల్ ఎడ్జ్ అవ్వడంతో పైకి ఎగిరి వికెట్ల వైపు దూసుకుపోతోంది. దీన్ని గమనించిన ప్లెచర్ సమయోచితంగా వెంటనే కాలుతో బంతిని పక్కకు తన్నేశాడు. కొద్దిగా ఆలస్యం అయినా బంతి వికెట్లపై పడి ఔటయ్యే వాడు. తృటిలో ఔట్ నుంచి తప్పించుకున్న ప్లెచర్ పరుగుల వరద పారించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా పొందాడు. సదరు వీడియో చూసిన తర్వాత, ఫ్లెచర్ సరదాగా ఆడే ఫుట్ బాల్ ఆట క్రికెట్లో ఈ విధంగా ఉపయోగపడిందనుకుంటా.. అని సోషల్ మీడియాలో కామెంట్ల మీద కామెంట్లు వస్తున్నాయి. -
ఇదైనా జరుగుతుందా?
క్రికెట్ జరిగితే సహజంగానే వివాదాలు వెనక్కుపోతాయి. ఆట లేకపోతే ఏదో ఒక అంశం గురించి చర్చ సాగుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు భారత జట్టు తక్షణమే ఓ మ్యాచ్ ఆడాలి. లేదంటే ధోని వ్యాఖ్యల వివాదంపై మరింత చర్చ జరిగే అవకాశం ఉంది. తొలి వన్డేకి అడ్డుపడ్డ వరుణుడు... రెండో వన్డేలోనూ ప్రభావం చూపే అవకాశం ఉంది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం మ్యాచ్ పూర్తిగా జరగకపోవచ్చు. కార్డిఫ్‌లోనూ వాన గండం గెలుపు కోసం భారత్ ఎదురుచూపు నేడు ఇంగ్లండ్‌తో రెండో వన్డే కార్డిఫ్: ఇంగ్లండ్‌తో రెండో వన్డేకు ముందు మంగళ వారం భారత జట్టు మొత్తం తీవ్రంగా సాధన చేసింది. రవిశాస్త్రి, ఫ్లెచర్ సంయుక్త పర్యవేక్షణలో ఆటగాళ్లంతా చురుగ్గా ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. టెస్టులను మరచి ఎలాగైనా వన్డే సిరీస్ దక్కించుకోవాలనే పట్టుదల వారిలో కనిపించింది. తొలి వన్డేలో వరుణుడి కారణంగా ఎవరి సత్తా ఏమిటో బయటపడలేదు. దాంతో ఇప్పుడు మరో పోరాటం కోసం ఆటగాళ్లు సన్నద్ధమయ్యారు. నేడు (బుధవారం) ఇక్కడి సోఫియా గార్డెన్స్‌లో జరిగే రెండో వన్డేలో భారత్, ఇంగ్లండ్ తలపడనున్నాయి. సిరీస్‌లో శుభారంభం చేయాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ప్రయోగాలు ఉండకపోవచ్చు రాబోయే ప్రపంచ కప్‌కు ముందు కొన్ని మ్యాచ్‌లు గెలిస్తే జట్టు కూర్పుపై స్పష్టత వస్తుందని మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ సూచించారు. అయితే కనీసం ఇంగ్లండ్‌తో బుధవారం మ్యాచ్‌లో మాత్రం ఇప్పటికే స్థిరంగా ఉన్న లైనప్‌నే కొనసాగించవచ్చు. ఓపెనర్లుగా రోహిత్, ధావన్‌లు ఆ తర్వాత కోహ్లి, రహానే, రైనాలు టాప్-5లో ఆడతారు. ధోని ఆరో స్థానంలో, ఆ తర్వాత ఇద్దరు ఆల్‌రౌండర్లు, ముగ్గురు పేసర్లతోనే జట్టు ఉంటుంది. ప్రాక్టీస్ సెషన్లో సుదీర్ఘ సమయం పాటు బ్యాటింగ్, బౌలింగ్ చేసి కరణ్ శర్మ ఆకట్టుకున్నా... ఇప్పటికిప్పుడు అతనికి మ్యాచ్ ఆడే అవకాశం రాకపోవచ్చు. రాయుడుకి కూడా అవకాశం రావడం కష్టమే. అదే విధంగా ధోని అనూహ్య రీతిలో తప్పుకుంటే తప్ప సంజు శామ్సన్ కూడా ఇంగ్లండ్ టూర్‌కు పర్యాటకుడిగానే మిగిలిపోతాడు. అగ్రశ్రేణి ఆటగాళ్లు విఫలమైతే సిరీస్ తదుపరి దశలో కొత్త ఆటగాళ్లకు చోటు ఇవ్వాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. ఇంగ్లండ్ ఏం చేయనుంది? ‘కుక్, బెల్, బ్యాలెన్స్లాంటి ఆటగాళ్లు వన్డేలకు పనికి రారు. వీరితో మా జట్టు ప్రపంచ కప్ గెలవలేదు. కుక్ అయితే వన్డే కెప్టెన్ కూడా కాదు’... భారత్‌తో కీలకమైన వన్డే సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ మాజీ ఆటగాళ్లు వాన్, స్వాన్ ఇలా తమ సొంత జట్టును విమర్శించడం ఒక్కసారిగా ఆ జట్టును ఇబ్బందుల్లో పడేసింది. ఈ ముగ్గురు ఆటగాళ్లు ప్రస్తుతం టీమ్‌లో ఉన్నారు. అయితే లార్డ్స్ పరాజయం తర్వాత ఇలా విమర్శించిన అందరికీ సమాధానం చెప్పిన తరహాలోనే వన్డేల్లోనూ నెగ్గి చూపించాలని కుక్ పట్టుదలగా ఉన్నాడు. అందు కోసం అతను తన జట్టులోని వన్డే స్పెషలిస్ట్లపై ఆధార పడ్డాడు. హేల్స్, మోర్గాన్, బట్లర్, గర్నీలాంటి ఆటగాళ్లకు ఇంగ్లండ్‌ను గెలిపించగల సామర్థ్యం ఉంది. జట్లు (అంచనా): భారత్: ధోని (కెప్టెన్), ధావన్, రోహిత్, కోహ్లి, రహానే, రైనా, జడేజా/బిన్నీ, అశ్విన్, భువనేశ్వర్, షమీ, ఉమేశ్. ఇంగ్లండ్: కుక్ (కెప్టెన్), హేల్స్, బెల్, మోర్గాన్, రూట్, బట్లర్, స్టోక్స్, అండర్సన్, జోర్డాన్, గర్నీ, ట్రెడ్‌వెల్. పిచ్, వాతావరణం సాధారణ బ్యాటింగ్ వికెట్. గత ఏడాది చాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా ఈ మైదానంలో ఆడిన రెండు వన్డేల్లోనూ భారత్ విజయం సాధించింది. వాతావరణ శాఖ సూచన ప్రకారం బుధవారం కార్డిఫ్‌లో ఉదయం, మధ్యాహ్నం తర్వాత వర్షం పడే అవకాశం ఉంది. కాబట్టి పూర్తిగా కాకపోయినా, మ్యాచ్‌కు ఏదో ఒక దశలో అంతరాయం కలగవచ్చు. -
దిద్దు‘బాట’లో బీసీసీఐ
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో ఘోర పరాభవం... భారత జట్టు ప్రదర్శనపై ఇంటా బయటా తీవ్ర విమర్శలు... కోచ్ ఫ్లెచర్‌పై వేటు వేయాలని, ధోనీని టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పించాలనే డిమాండ్లు... వెరసి ఉక్కిరిబిక్కిరవుతున్న బీసీసీఐ ఎట్టకేలకు దిద్దుబాటు చర్యలు చేపట్టింది. చీఫ్ కోచ్ డంకన్ ఫ్లెచర్‌ను పొమ్మనలేక పొగబెట్టింది. ఆయన అధికారాలపై కోత విధించి ఉద్వాసన పలికినంత పనిచేసింది. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు భారత మాజీ కెప్టెన్ రవిశాస్త్రిని భారత జట్టుకు డెరైక్టర్‌గా నియమించింది. అలాగే బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్‌లను ఈ సిరీస్‌కు తప్పించింది. భారత జట్టు డెరైక్టర్‌గా రవిశాస్త్రి ►ఫ్లెచర్ అధికారాలకు కత్తెర ►ఫీల్డింగ్ కోచ్‌గా ఆర్. శ్రీధర్ ►సహాయక కోచ్‌లుగా బంగర్, అరుణ్ న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో ధోనీసేన దారుణ వైఫల్యంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కాస్త ఆలస్యంగానైనా స్పందించింది. వన్డే సిరీస్‌ను దృష్టిలో పెట్టుకుని దిద్దుబాటు చర్యలు తీసుకుంది. కోచ్‌గా ఫ్లెచర్ అధికారాలను కత్తిరిస్తూ మాజీ కెప్టెన్ రవిశాస్త్రిని భారత జట్టుకు డెరైక్టర్‌గా నియమించింది. బౌలింగ్ కోచ్ జో డేవిస్, ఫీల్డింగ్ కోచ్ ట్రెవర్ పెన్నీలకు విరామమిస్తూ వీరి స్థానంలో భారత మాజీ ఆటగాళ్లు సంజయ్ బంగర్, భరత్ అరుణ్‌లను సహాయ కోచ్‌లుగా ఎంపిక చేసింది. ఫీల్డింగ్ కోచ్‌గా హైదరాబాద్ రంజీ మాజీ క్రికెటర్ ఆర్. శ్రీధర్‌ను నియమించింది. జట్టు మేనేజ్మెంట్లో చేపట్టిన ఈ ప్రక్షాళన తక్షణమే అమల్లోకి వచ్చింది. టీమిండియా చీఫ్ కోచ్‌గా ఫ్లెచర్ కొనసాగనున్నా ఇకపై ఆయన పాత్ర నామమాత్రమే. ఈ నెల 25 నుంచి మొదలయ్యే ఐదు వన్డేల సిరీస్‌కు భారత జట్టు సాధన రవిశాస్త్రి ఆధ్వర్యంలోనే కొనసాగుతుంది. రవిశాస్త్రి మరోసారి దిద్దుబాటు చర్యల్లో భాగంగా భారత జట్టుకు డెరైక్టర్‌గా కానీ, క్రికెట్ మేనేజర్‌గా కానీ ఎంపికవడం రవిశాస్త్రికిది రెండోసారి. 2007 వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు తొలి దశలోనే ఇంటిదారి పట్టిన తర్వాత అప్పటి కోచ్ గ్రెగ్ చాపెల్‌పై వేటు పడింది. ప్రపంచకప్ తర్వాత పాల్గొన్న బంగ్లా పర్యటనలో భారత జట్టుకు క్రికెట్ మేనేజర్‌గా శాస్త్రిని నియమించారు. ఇప్పుడు ధోని సేన వైఫల్యాల నేపథ్యంలో క్రికెట్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ఇంగ్లండ్‌లోనే ఉన్న రవిశాస్త్రితో బీసీసీఐ పెద్దలు గత రెండు వారాలుగా సంప్రదింపులు జరిపారు. క్లిష్ట సమయంలో డెరైక్టర్‌గా కొనసాగేందుకు రవిశాస్త్రి అంగీకరించడంతో కెప్టెన్ ధోని, కోచ్ ఫ్లెచర్‌లను సంప్రదించిన తర్వాత జట్టు మేనేజ్మెంట్ను ప్రక్షాళన చేసినట్లు బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ వెల్లడించారు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు అసిస్టెంట్ కోచ్‌లుగా వ్యవహరించనున్న సంజయ్ బం గర్, భరత్ అరుణ్‌లు భారత మాజీ ఆటగాళ్లు. ఆల్‌రౌండర్‌గా సంజయ్ బంగర్ అందరికీ సుపరిచితమే. ఐపీఎల్-7లో అతను పంజాబ్‌కు ప్రధాన కోచ్‌గా వ్యవహరించాడు. ఫ్లెచర్‌పై వేటు తప్పదు! భారత క్రికెట్ జట్టుకు డెరైక్టర్‌గా రవిశాస్త్రి నియమించడంతో చీఫ్ కోచ్ డంకన్ ఫ్లెచర్‌పై ఇక వేటు దాదాపుగా ఖాయంగానే కనిపిస్తోంది. శాస్త్రి నియామకం ఒక రకంగా ఫ్లెచర్‌కు పొమ్మనలేక పొగబెట్టినట్లే. నిజానికి 2015 వన్డే ప్రపంచకప్ వరకు ఫ్లెచర్‌తో బీసీసీఐ ఒప్పందం చేసుకుంది. కానీ ఇంగ్లండ్ పర్యటన ముగిసిన వెంటనే ఈ విదేశీ కోచ్‌ను సాగనంపనున్నట్లు తెలుస్తోంది. స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగే సిరీస్‌లో కోచ్‌గా ఫ్లెచర్ ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగే అవకాశాలు లేవని బోర్డు వర్గాలు చెబుతున్నాయి. అతని అధికారాలకు కోత విధించడంలో బీసీసీఐ ఉద్దేశం కూడా అదే. ఒకవేళ ఫ్లెచర్ ఇంగ్లండ్ పర్యటన ముగిసిన తర్వాత తన పదవికి రాజీనామా చేసినా బీసీసీఐ ఆపబోదని బోర్డు వర్గాల సమాచారం. -
గౌరవంగా తప్పుకోండి
ధోని, ఫ్లెచర్ లపై మాజీల ధ్వజం ముంబై: ఇంగ్లండ్‌లో భారత జట్టు చెత్త ప్రదర్శనను సగటు అభిమానితో పాటు మాజీ క్రికెటర్లు, సారథులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. కెప్టెన్ ధోని చెత్త సారథ్యం, కోచ్ ఫ్లెచర్ చేతకానితనంతో పాటు జట్టు సహాయక సిబ్బంది పూర్తిగా నామమాత్రంగా మారారనే విమర్శలు వచ్చాయి. బోర్డు చొరవ తీసుకుని వీళ్లందరినీ తప్పించేకంటే ముందే... వీళ్లే గౌరవంగా తప్పుకుంటే బాగుంటుందనే అభిప్రాయాన్ని పలువురు వెలిబుచ్చారు. ‘తుది జట్టు ఎంపిక, మైదానంలో వ్యూహాలు, ఫీల్డర్ల మోహరింపు... ఇలా ధోని అన్ని చోట్లా తప్పులు చేశాడు. ఇక ఫ్లెచర్ గురించి మాట్లాడకపోవడమే ఉత్తమం. కోచ్‌తో పాటు సహాయక సిబ్బంది కూడా వెంటనే తప్పుకుంటే గౌరవంగా ఉంటుంది’ -వెంగ్‌సర్కార్. ‘భారత ఆటగాళ్లలో కొందరికి ఏమాత్రం కష్టపడే తత్వం లేదు. అసలు తమ లోపాలను సరిదిద్దుకునేందుకు నెట్స్‌లో కాస్త ఎక్కువ సమయం గడపాలనే ఆలోచన కూడా వారికి ఉండదు. ప్రత్యర్థి జట్టు పట్టిష్టమైన దైనా మన ఆటగాళ్లు కనీసం పోరాడాలి కదా. టెస్టుఆడే దమ్ములేని వారు తప్పుకోవడమే ఉత్తమం’ - సునీల్ గవాస్కర్ ‘లార్డ్స్‌లో విజయం తర్వాత ఫ్లెచర్ చేసిందేమిటి. ఆధిక్యం కొనసాగించాలంటే ఏం చేయాలనే ఆలోచన కూడా ఆయనకు లేదు. కచ్చితంగా ఫ్లెచర్‌ను తప్పించాల్సిందే. ఇక ధోని బ్యాట్స్‌మన్‌గా ఫర్వాలేదనిపించినా... కెప్టెన్‌గా ఘోరంగా విఫలమయ్యాడు’ - అజిత్ వాడేకర్ ‘ధోని తన ప్రయత్నాలు ఏమీ చేయకుండా ఏదో అద్భుతం జరుగుతుందని వేచి చూశాడు. కానీ మైదానంలో ప్రతిసారీ అద్భుతాలు జరగవని తెలుసుకోవాలి. టెస్టు కెప్టెన్‌గా ధోని సమయం ముగిసిందనే అనుకుంటున్నాను’ - గుండప్ప విశ్వనాథ్ ‘ఇప్పటివరకూ ఫ్లెచర్ భారత జట్టుకు చేసిన మేలు ఏమీ లేదు. ఇంకా తనని కొనసాగించడం వల్ల సమయం వృథానే. బోర్డు తప్పిస్తుందో... లేక అతనే గౌరవంగా రాజీనామా చేస్తారో చూడాలి’ - శ్రీకాంత్ ‘బీసీసీఐ అధికారిగానే కాకుండా లక్షలాది అభిమానుల్లో ఒకడిగా ఇంగ్లండ్ పర్యటనలో భారత ఆటతీరుకు బాధపడుతున్నాను. విజయాల దారి పట్టేందుకు కొంత ఆత్మపరిశీలన అవసరమని నా అభిప్రాయం. విదేశాల్లో బాగా రాణించిన మాజీ ఆటగాళ్లున్నారు. వారిలో ఒకరు కోచ్‌తో కలిసి పనిచేస్తే ఫలితం ఉండొచ్చు. తను కోచ్‌కు ఆటగాళ్లకు మధ్య వారధిలా పనిచేయగలడు’ - అనురాగ్ ఠాకూర్ (బీసీసీఐ సంయుక్త కార్యదర్శి) ...కారణాలు అనేకం ఇంగ్లండ్‌లో భారత్ ఓటమిని విశ్లేషించడం అంటే గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరడంలాంటిదే! ఒకటా... రెండా... ఓటమికి కారణాలు చెప్పడం అంతులేని కథ! మూడేళ్ల క్రితం 0-4తో ఓడినప్పుడు కూడా ఇంత ఘోరంగా ఆడలేదు. నాడు ఒక్కసారి మాత్రమే జట్టు 200 లోపు పరుగులు చేసింది. ఈ సిరీస్‌లో ఆ చెడ్డ ఘనత ఐదు సార్లు సాధించింది. ఈ సారి మన యువ తరంగాల నుంచి అద్భుతాలు ఆశించకపోయినా...పోరాటతత్వం ప్రదర్శిస్తారని, భారత టెస్టు భవిష్యత్తుకు దిక్సూచీ అవుతారని అనుకున్నాం. మరో వైపు ఇంగ్లండ్ బలహీనంగా కనిపించింది. కానీ భారత ఆటగాళ్లంతా సమష్టి వైఫల్యంతో అభిమానుల ఆశను వమ్ము చేశారు. కర్ణుడి చావుకు కారణాలనేకం అన్నట్లు...ఈ ఘోర వైఫల్యానికి కూడా అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో మచ్చుకు తొమ్మిది కారణాలను పరిశీలిస్తే... - సాక్షి క్రీడావిభాగం 1 కుక్ క్యాచ్ వదిలేసిన జడేజా: సరిగ్గా చెప్పాలంటే సిరీస్‌కు ఇదే టర్నింగ్ పాయింట్‌గా చెప్పవచ్చు. చాలా కాలంగా ఫామ్‌లో లేకుండా ఇబ్బంది పడుతూ, తప్పుకోవాలంటూ విమర్శలు ఎదుర్కొంటున్న ఇంగ్లండ్ కెప్టెన్ కుక్కు మూడో టెస్టులో 15 పరుగుల వద్ద స్లిప్స్‌లో జడేజా ప్రాణదానం చేశాడు. ఫలితంగా ఈ ఇన్నింగ్స్‌లో చేసిన 95 పరుగులతో ఆత్మవిశ్వాసం పెరిగిన కుక్, సిరీస్ ఆసాంతం దానిని కొనసాగించాడు. 2 జడేజా-అండర్సన్ గొడవ: తిట్టాడా...తోసేశాడా తర్వాతి సంగతి! అండర్సన్‌దే తప్పు అని కచ్చితంగా నిర్ధారించుకున్న ధోని సేన జడేజాకు మద్దతు పలికే క్రమంలో ఈ ఘటనపై తీవ్రంగా దృష్టి పెట్టింది. ఆటను వదిలి అనవసరపు అంశంపై ఎక్కువగా రాద్ధాంతం చేసింది. ఫలితంగా జట్టుపై దీని ప్రభావం కనిపించగా, చివరకు తీర్పు కూడా వ్యతిరేకంగా వచ్చింది. ధోని ఏం మాట్లాడినా అందులో 75 శాతం ఈ వివాదం గురించే చెప్పాడు. ఈ కేసుపై పెట్టిన శ్రద్ధ క్రికెట్‌పై పెడితే మూడో టెస్టు ఓడకపోయేవారని విమర్శ ఎదుర్కోవాల్సి వచ్చింది. 3 రెండో ఓపెనర్: ఆరంభం సరిగ్గా లేకుండా టెస్టుల్లో ఏ జట్టూ మ్యాచ్ గెలవటం అంత సులువు కాదు. అయితే భారత్‌కు ఓపెనింగ్ భాగస్వామ్యం పెద్ద సమస్యగా మారింది. విజయ్ ఫర్వాలేదనిపించినా...ధావన్ ఘోరంగా విఫలమయ్యాడు. ఆ తర్వాత గంభీర్‌కు రెండు మ్యాచుల్లో అవకాశాలు ఇచ్చినా ఉపయోగపడింది లేదు. 4 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఎక్కడ?: టెస్టుకు ముందు వార్మప్ గేమ్‌లు ఆడినంత మాత్రాన టెస్టులకు ఆ ప్రాక్టీస్ సరిపోదు. ఐదు రోజుల మ్యాచ్ ఆడాలంటే శారీరకంగా, మానసికంగా కూడా ఆటగాళ్లకు సన్నద్ధత అవసరం. మన ఆటగాళ్లు దేశవాళీలోనూ ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడేది చాలా తక్కువ. నిర్ణీత సమయపు బ్యాటింగ్ లేదా బౌలింగ్‌కే పరిమితమయ్యే అలవాటు ఎప్పటినుంచో ఉంది. అందుకే విజయ్, భువనేశ్వర్, రహానే లాంటి ఆటగాళ్లకు ఐదు టెస్టులు భారంగా అనిపించాయి. ఆరంభంలో జోష్‌లో కనిపించిన వీరు ఆ తర్వాత సత్తువ కోల్పోయారు. 5 మిడిలార్డర్ మిథ్య: అసలు భారత టెస్టు జట్టుకు మిడిలార్డర్ ఉందా అనిపించే విధంగా మన ప్రదర్శన సాగింది. సుదీర్ఘ ఫార్మాట్లో సూపర్ అనుకున్న పుజారా, ఇక మరో సచిన్‌గా భావించిన కోహ్లిల ఘోర వైఫల్యంతో జట్టు ఇన్నింగ్స్‌కు వెన్నెముక లేకుండా పోయింది. లార్డ్స్ టెస్టు మినహా రహానే కనీసం పోరాటం కూడా చేయలేకపోయాడు. 6 స్లిప్ ఫీల్డింగ్: భారత వైఫల్యంలో స్లిప్ ఫీల్డర్లు కూడా పెద్ద పాత్రే పోషించారు! పట్టిన క్యాచ్లకంటే వదిలి పెట్టినవే ఎక్కువగా ఉన్నాయి. వారు వీరనే తేడా లేకుండా అంతా అక్కడ విఫలమయ్యారు. విజయ్, రహానే, కోహ్లి, ధావన్, అశ్విన్, జడేజా...ఎవరిని నిలబెట్టినా అంతా క్యాచ్‌లు వదిలారు. 7 స్పష్టత లేని బాధ్యత: ఐదుగురు బ్యాట్స్‌మెన్‌లా...ఆరుగురు బ్యాట్స్‌మెన్‌లా...ఇద్దరు స్పిన్నర్లా...ఇలాంటి సంశయం జట్టు మేనేజ్మెంట్లో సిరీస్ మొత్తం కొనసాగింది. ముఖ్యంగా జడేజా, అశ్విన్‌లను సమర్థంగా ఉపయోగించుకోవడంలో అంతా గందరగోళంగా కనిపించింది. అన్నింటికి మించి జట్టులో స్టువర్ట్ బిన్నీ ఎందుకున్నాడో ఎవరికీ అర్థం కాలేదు. 8 క్రమశిక్షణ లేని బౌలింగ్: సిరీస్‌లో చివరి మూడు టెస్టుల్లో భారత్‌కు పట్టు దొరికే అవకాశం లభించినా మన బౌలర్లు కనీస స్థాయిలో కూడా రాణించలేకపోయారు. ఫలితంగా ఇంగ్లండ్‌ను రూట్లాంటి ఆటగాళ్లు పట్టుదలతో ఆడి గట్టెక్కించారు. భువనేశ్వర్ ఆరంభంలో చూపిన జోరు ఆ తర్వాత తగ్గింది. పంకజ్ సింగ్, షమీ, జడేజా విఫలం కాగా... ఇషాంత్ ప్రభావం చూపలేకపోయాడు. 9 ధోని తలపై బరువు: సమకాలీన క్రికెట్లో కెప్టెన్‌గా, వికెట్‌కీపర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ బ్యాటింగ్‌లో రాణించిన ఆటగాళ్లు చాలా తక్కువ మంది. కానీ ధోని చాలా వరకు తన బాధ్యతను సమర్థంగా నిర్వర్తిస్తున్నాడు. టెస్టు క్రికెట్‌కు కావాల్సిన టెక్నిక్ లేదనే విమర్శ ఉన్నా ఈ సిరీస్‌లో నాలుగు అర్ధ సెంచరీలు చేశాడు. అయితే అతనిపై భారం ఎక్కువైనట్లు కనిపించింది. ఎందుకంటే సాంప్రదాయ వ్యూహాలతో పాటు కొత్తగా, భిన్నంగా ప్రయత్నిస్తూ విజయవంతం అయిన ధోనికి ఏదీ కలిసి రాలేదు. దేవుళ్లూ రక్షించలేదు మనం కాస్త ప్రయత్నం చేస్తే భగవంతుడు కొంత అనుగ్రహం ప్రసాదిస్తాడేమో. కానీ భారత క్రికెట్ జట్టు ఆటను చూశాక దేవుడు కూడా సాయం చేయడు. ఓవల్ టెస్టుకు ముందు భారత జట్టు మసాజర్ రమేశ్ మానే... డ్రెస్సింగ్ రూమ్‌లో దేవుళ్ల ఫొటోలు పెట్టాడు. అలాగే గోడకు హనుమాన్ చాలీసాతో పాటు... భగవంతుడి గురించి మాటలు ఉన్న బోర్డులు తగిలించాడు. భారత క్రికెట్లో ఇలాంటి ప్రయత్నం గతంలో ఎప్పుడూ జరగలేదు. కానీ ఏం చేస్తాం..? ఇలాంటి ఆట ఆడితే భగవంతుడు మాత్రం ఎలా కరుణిస్తాడు..? భారత జట్టుకు జరిమానా అసలే ఘోర ఓటమితో తీవ్ర అవమానభారంతో ఉన్న భారత క్రికెట్ జట్టుకు ఆర్థికంగా కూడా దెబ్బతగిలింది. ఓవల్ టెస్టులో స్లో ఓవర్ రేట్ కారణంగా కెప్టెన్ ధోని మ్యాచ్ ఫీజులో 60 శాతం, మిగిలిన భారత క్రికెటర్ల మ్యాచ్ ఫీజులో 30 శాతం ఐసీసీ జరిమానా విధించింది. మరోసారి ధోని గనక రానున్న ఏడాది కాలంలో టెస్టుల్లో స్లో ఓవర్ రేట్ నమోదు చేస్తే... అతడిపై ఒక మ్యాచ్ నిషేధం పడే ప్రమాదం కూడా ఉంది. ఐదో ర్యాంక్‌కు... దుబాయ్: ఓవల్ టెస్టులో ఘోర పరాజయంతో భారత్ ఐసీసీ ర్యాంకుల్లో నాలుగు నుంచి ఐదో స్థానానికి పడిపోయింది. సిరీస్ సొంతం చేసుకున్న ఇంగ్లండ్ ఈ జాబితాలో మూడో స్థానానికి ఎగబాకింది. పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించిన శ్రీలంక 4వ స్థానంలో నిలిచింది. దక్షిణాఫ్రికా టాప్ ర్యాంక్‌లో ఉంది. వాన్ ఓవర్ యాక్షన్! లండన్: భారత జట్టు ఘోర పరాజయంపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ ఓవర్ యాక్షన్ చేశాడు. భారత్ కొత్త జెండా అంటూ ‘తెల్లజెండా’ను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. అంతేకాకుండా భారత అభిమానులనూ రెచ్చగొట్టాడు. ‘మీ జట్టు బాగా ఆడలేదు. వాళ్లకు ఇంగ్లండ్‌లో గెలిచే సీన్ లేదని అంగీకరించండి’ అంటూ అభిమానులను ఉద్దేశించి ట్వీట్ చేశాడు. అయితే తన విమర్శలు ఎలా ఉన్నా... సిరీస్ ఆరంభానికి ముందే ఇంగ్లండ్ 3-1తో గెలుస్తుందని వాన్ జోస్యం చెప్పాడు. అటు ఇంగ్లండ్ మీడియా కూడా ధోనిసేన ఆటతీరుపై దుమ్మెత్తిపోసింది.