
Lendl Simmons picks his all time T20 XI,MS Dhoni to lead: వెస్టిండీస్ స్టార్ బ్యాటర్ లెండిల్ సిమన్స్ తన ఆల్ టైమ్ టీ20 ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంచుకున్నాడు. తను ప్రకటించిన జట్టుకు టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనిని కెప్టెన్‌గా ఎంచుకున్నాడు. అదే విధంగా.. యూనివర్స్‌ల్ బాస్ క్రిస్ గేల్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మకు ఓపెనర్లుగా అవకాశం ఇచ్చాడు. కింగ్ కోహ్లికి మూడో స్థానంలో, దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌కు నాలుగో స్థానంలో చోటు దక్కింది.
ధోనీని తన టీమ్‌కి వికెట్ కీపర్‌గా, కెప్టెన్‌గా సిమన్స్ ఎంపిక చేశాడు. ఆల్‌రౌండర్ కోటాలో డ్వేన్ బ్రావో, కీరాన్ పొలార్డ్‌కు చోటు కల్పించాడు. ఇక తన జట్టులో స్పెషలిస్ట్ స్పిన్నర్‌లుగా సునీల్ నరైన్‌ను, రషీద్ ఖాన్‌కు అవకాశం ఇచ్చాడు. ఇక ఫాస్ట్ బౌలర్ల కోటాలో భువనేశ్వర్ కుమార్, కగిసో రబడకు స్థానం కల్పించాడు. అయితే టీమిండియా స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బూమ్రాకు చోటు దక్కకపోవడం గమనార్హం.
సిమన్స్ టీ20 ప్లేయింగ్ ఎలెవన్: క్రిస్ గేల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఏబి డివిలియర్స్, కీరాన్ పొలార్డ్, మహేంద్ర సింగ్ ధోని (కెప్టెన్), డ్వేన్ బ్రావో, రషీద్ ఖాన్, సునీల్ నరైన్, భువనేశ్వర్ కుమార్, కగిసో రబడ.
చదవండి: Ind Vs Nz 3rd T20I: దీపక్ చాహర్‌కు సెల్యూట్ చేసిన రోహిత్ శర్మ.. వీడియో వైరల్