Global T20 Canada
-
గ్లోబల్ టీ20 టోర్నీ విజేత టొరంటో నేషనల్స్
గ్లోబల్ టీ20 కెనడా టోర్నీ విజేతగా టొరంటో నేషనల్స్ అవతరించింది. నిన్న (ఆగస్ట్ 11) జరిగిన ఫైనల్స్‌లో టొరంటో టీమ్.. మాంట్రియాల్ టైగర్స్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మాంట్రియాల్ టైగర్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 96 పరుగులు మాత్రమే చేసింది. టైగర్స్ ఇన్నింగ్స్‌లో కోర్బిన్ బోష్ (35), జస్కరన్ సింగ్ (16), అనూప్ రవి (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. స్టార్ ఆటగాళ్లు క్రిస్ లిన్ (3), టిమ్ సీఫర్ట్ (0), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (1) నిరాశపరిచారు. టైగర్స్ ఇన్నింగ్స్‌ను జేసన్ బెహ్రెన్‌డార్ఫ్ (4-0-8-3) దారుణంగా దెబ్బకొట్టాడు. రొమారియో షెపర్డ్ 2, జునైద్ సిద్దిఖీ, మొహమ్మద్ నవాజ్, నిఖిల్ దత్తా, జతిందర్‌పాల్ తలో వికెట్ పడగొట్టారు.97 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నేషనల్స్.. ఆండ్రియస్ గౌస్ (58 నాటౌట్), డస్సెన్ (30 నాటౌట్) రాణించడంతో 15 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఓపెనర్లు కొలిన్ మున్రో (0), ఉన్ముక్త్ చంద్ (4) ఆదిలోనే ఔటైనప్పటికీ.. గౌస్, డస్సెన్ జోడీ నేషనల్స్‌ను విజయతీరాలకు చేర్చింది. టైగర్స్ బౌలర్లలో ఒమర్జాయ్, కోర్బిన్ బోష్ తలో వికెట్ పడగొట్టారు.గ్లోబల్ టీ20 కెనడా టోర్నీ నేపథ్యం..కెనడా వేదికగా జరిగే ఈ టోర్నీ 2018లో పురుడుపోసుకుంది. ఆరంభ ఎడిషన్‌లో వాంకోవర్ నైట్స్ విజేతగా నిలిచింది. అనంతరం 2019 ఎడిషన్‌లో వాన్నిపెగ్ హాక్స్ టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. ఆతర్వాత మూడేళ్లు టోర్నీకి బ్రేక్ పడింది. తిరిగి గతేడాది ఈ టోర్నీ ప్రారంభమైంది. గత ఎడిషన్‌లో మాంట్రియాల్ టైగర్స్ విజేతగా నిలిచింది. తాజాగా టొరంటో నేషనల్స్ ఛాంపియన్‌గా అవతరించింది. -
రాణించిన రొమారియో షెపర్డ్.. ఫైనల్లో టొరంటో నేషనల్స్
గ్లోబల్ టీ20 కెనడా టోర్నీలో టొరంటో నేషనల్స్ ఫైనల్స్‌కు చేరింది. నిన్న (ఆగస్ట్ 10) జరిగిన క్వాలిఫయర్-2లో ఆ జట్టు బ్రాంప్టన్ వోల్వ్స్‌పై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వోల్వ్స్.. నిక్ హాబ్సన్ (51 నాటౌట్) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. వోల్వ్స్ ఇన్నింగ్స్‌లో కోబ్ హెర్ఫ్ట్ 1, డేవిడ్ వార్నర్ 13, జాక్ జార్విస్ 20, వెబ్‌స్టర్ 8, మున్సే 26, అఖిల్ కుమార్ 7, ఆండ్రూ టౌ 6, హర్మన్దీప్ సింగ్ 0 పరుగులకు ఆలౌట్ కాగా.. థామస్ డ్రాకా 1 పరుగుతో అజేయంగా నిలిచాడు. టొరంటో బౌలర్లలో రొమారియో షెపర్డ్ 4 వికెట్లు తీసి వోల్వ్స్‌ను దారుణంగా దెబ్బకొట్టగా.. జతిందర్‌పాల్ 2, బెహ్రెన్‌డార్ఫ్, జునైద్ సిద్దిఖీ తలో వికెట్ పడగొట్టారు.142 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టొరంటో నేషనల్స్.. కొలిన్ మున్రో (36), మొహమ్మద్ నవాజ్ (24 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో 18.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఉన్ముక్త్ చంద్ 19, ఆండ్రియస్ గౌస్ 18, డస్సెన్ 14, అర్మాన్ కపూర్ 4 పరుగులు చేసి ఔట్ కాగా.. రొమారియో షెపర్డ్ 10 పరుగులతో అజేయంగా నిలిచాడు. వోల్వ్స్ బౌలర్లలో అఖిల్ కుమార్ 3 వికెట్లు పడగొట్టగా.. ఆండ్రూ టై, వెబ్‌స్టర్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఇవాళ రాత్రి (9:30 గంటలకు) జరిగే ఫైనల్లో టొరంటో నేషనల్స్.. మాంట్రియాల్ టైగర్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. -
డేవిడ్ వీస్ ఆల్‌రౌండ్ షో
గ్లోబల్ టీ20 కెనడా టోర్నీలో సర్రే జాగ్వర్స్పై బంగ్లా టైగర్స్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జాగ్వర్స్ 19.5 ఓవర్లలో 101 పరుగులకు ఆలౌటైంది. జాగ్వర్స్ జట్టులో విధ్వంసకర వీరులు ఉన్నా స్టోయినిస్ (36), వాన్ బీక్ (31) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. కైల్ మేయర్స్ (5), సునీల్ నరైన్ (0), మన్సబ్ గిల్ (2), శ్రేయస్ మొవ్వ (0), బ్రాండన్ మెక్‌ముల్లెన్ (7), మొహమ్మద్ నబీ (0), తారిఖ్ (1), హర్మీత్ సింగ్ (0) సింగిల్ డిజిట్ స్కోర్లకే ఔటయ్యారు. బంగ్లా టైగర్స్ బౌలర్లలో షొరీఫుల్ ఇస్లాం 3, డేవిడ్ వీస్, షకీబ్ అల్ హసన్ చెరో 2, కర్టిస్ క్యాంఫర్, అలీ ఖాన్, డిల్లన్ హేలైగర్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టైగర్స్.. 19 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. బంతితో రాణించిన డేవిడ్ వీస్ బ్యాటింగ్‌లోనూ (19 బంతుల్లో 27 నాటౌట్) సత్తా చాటి టైగర్స్ గెలుపులో కీలకపాత్ర పోషించాడు. టైగర్స్ ఇన్నింగ్స్‌లో రహ్మానుల్లా గుర్బాజ్ 4, ముహమ్మద్ వసీం 14, పర్గత్ సింగ్ 10, షకీబ్ అల్ హసన్ 1, ఇఫ్తికార్ అహ్మద్ 13, కర్టిస్ క్యాంఫర్ 10, డిల్లన్ హేలైగర్ 17 (నాటౌట్) పరుగులు చేశారు. జాగ్వర్స్ బౌలర్లలో సునీల్ నరైన్ 3, స్టోయినిస్, లొగన్ వాన్ బీక్, బెన్ లిస్టర్ తలో వికెట్ పడగొట్టారు.నిన్ననే జరిగిన మరో మ్యాచ్‌లో వాంకోవర్ నైట్స్‌పై బ్రాంప్టన్ వోల్వ్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వాంకోవర్ నైట్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేయగా.. బ్రాంప్టన్ వోల్వ్స్ మరో 11 బంతులు మిగిలుండగానే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. వెబ్‌స్టర్ (49), నిక్ హాబ్సన్ (37) వోల్వ్స్‌ను విజయతీరాలకు చేర్చారు. -
స్టోయినిస్ ఆల్‌రౌండ్ షో.. సునీల్ నరైన్ మాయాజాలం (3-0-3-3)
గ్లోబల్ టీ20 కెనడా టోర్నీలో ఆస్ట్రేలియా ఆటగాడు మార్కస్ స్టోయినిస్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. ఈ టోర్నీలో సర్రే జాగ్వర్స్కు ప్రాతనిథ్యం వహిస్తున్న స్టోయినిస్.. టోరంటో నేషనల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాట్‌తో ఆతర్వాత బంతితో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జాగ్వర్స్.. స్టోయినిస్ హాఫ్ సెంచరీతో (37 బంతుల్లో 57; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. జాగ్వర్స్ ఇన్నింగ్స్‌లో కైల్ మేయర్స్ (27), విరన్‌దీప్ సింగ్ (23 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. సునీల్ నరైన్ (2), బ్రాండన్ మెక్‌ముల్లెన్ (18), శ్రేయస్ మొవ్వ (4), మొహమ్మద్ నబీ (13) నిరాశపరిచారు. టోరంటో బౌలర్లలో రోహిద్ ఖాన్, జునైద్ సిద్దిఖీ తలో రెండు వికెట్లు, రొమారియో షెపర్డ్, జతిందర్‌పాల్ చెరో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టోరంటో.. స్టోయినిస్ (4-1-19-3), సునీల్ నరైన్ (3-0-3-3), మొహమ్మద్ నబీ (2-0-6-2), బెన్ లిస్టర్ (3-0-14-1), హర్మీత్ సింగ్ (2.1-0-18-1) దెబ్బకు 17.1 ఓవర్లలో 81 పరుగులకు ఆలౌటైంది. టోరంటో ఇన్నింగ్స్‌లో ఉన్ముక్త్ చంద్ (21), డస్సెన్ (15), కిర్టన్ (11), రోహిత్ పౌడెల్ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. భారీ హిట్టర్లు రోస్టన్ ఛేజ్ (8), కొలిన్ మున్రో (4), రొమారియో షెపర్డ్ దారుణంగా విఫలమయ్యారు.కాగా, గ్లోబల్ టీ20 కెనడా అనే టోర్నీ కెనడా వేదికగా జరిగే క్రికెట్ లీగ్. ఈ లీగ్‌లోనూ మిగతా లీగ్‌లలో లాగే ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రికెటర్లు పాల్గొంటారు. ఈ లీగ్‌లో మొత్తం ఆరు జట్లు (మాంట్రియాల్ టైగర్స్, టోరంటో నేషనల్స్, సర్రే జాగ్వర్స్, బ్రాంప్టన్ వోల్వ్స్, బంగ్లా టైగర్స్, వాంకోవర్ నైట్స్) పాల్గొంటాయి. లీగ్ మ్యాచ్‌ల అనంతరం తొలి నాలుగు స్థానాల్లో నిలిచే జట్లు సెమీఫైనల్‌కు చేరతాయి. ప్రస్తుత సీజన్ ఈనెల 25న మొదలైంది. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో మాంట్రియల్ టైగర్స్ టాప్‌లో ఉంది. ఈ లీగ్‌లో డేవిడ్ వార్నర్, మార్కస్ స్టోయినిస్, సునీల్ నరైన్, కార్లోస్ బ్రాత్‌వైట్, మొహమ్మద్ ఆమిర్, మొహమ్మద్ నబీ, కైల్ మేయర్స్, క్రిస్ లిన్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, టిమ్ సీఫర్ట్, నవీన్ ఉల్ హక్, షకీబ్ అల్ హసన్, రహ్మానుల్లా గుర్బాజ్, డస్సెన్, కొలిన్ మున్రో, రొమారియో షెపర్డ్ లాంటి టీ20 స్టార్లు పాల్గొంటున్నారు. -
డస్సెన్, మున్రో సిక్సర్ల వర్షం
గ్లోబల్ టీ20 కెనడా టోర్నీలో టొరంటో నేషనల్స్ బోణీ కొట్టింది. నిన్న (జులై 25) జరిగిన టోర్నీ ఓపెనర్‌లో వాంకోవర్ నైట్స్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వాంకోవర్.. జునైద్ సిద్దిఖీ (3.3-0-24-4), రోహిద్ ఖాన్ (4-0-29-2), సాద్ బిన్ జాఫర్ (4-0-11-2), బెహ్రెన్‌డార్ఫ్ (4-0-20-1) ధాటికి 19.3 ఓవర్లలో 110 పరుగులకు ఆలౌటైంది. వాంకోవర్ ఇన్నింగ్స్‌లో రీజా హెండ్రిక్స్ (23), మునీర్ అహ్మద్ (22) మాత్రమే అతి కష్టం మీద 20 పరుగుల మార్కును దాట గలిగారు. కెప్టెన్ ఉస్మాన్ ఖ్వాజా 3, హర్ష్ థాకెర్ 0, నితీశ్ కుమార్ 0, ప్రిటోరియస్ 16, రిప్పన్ 1, సందీప్ లామిచ్చేన్ 15, ఆమిర్ 0, వాన్ మీకెరెన్ 12 పరుగులు చేసి ఔటయ్యారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టొరొంటో.. కొలిన్ మున్రో (44; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), వాన్ డెర్ డస్సెన్ (31 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు) చెలరేగడంతో 14.4 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఉన్ముక్త్ చంద్ 23 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. వాంకోవర్ బౌలర్లలో వాన్ మీకెరెన్, సందీప్ లామిచ్చేన్ తలో వికెట్ పడగొట్టారు. ఇవాళ జరుగబోయే మ్యాచ్‌లో మాంట్రియల్ టైగర్స్, బంగ్లా టైగర్స్ పోటీ పడతాయి. -
ఇదెక్కడి అవార్డురా బాబు?.. మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా అర ఎకరం భూమి
కెనడా టీ20 లీగ్ 2023 విజేతగా మాంట్రియాల్ టైగర్స్ నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ లీగ్‌లో మ్యాన్ ఆఫ్‌ది సిరీస్‌గా నిలిచిన వెస్టిండీస్ ఆటగాడు షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్‌కు ఎవరూ ఊహించిన అవార్డు లభించింది. సాధరణంగా మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్‌ది సిరీస్‌కు ఓ ట్రోఫీతో పాటు క్యాష్ రివార్డు కూడా అందజేస్తారు. కొన్ని సార్లు మ్యాన్ ఆఫ్‌ది సిరీస్‌లకు ఖరీదైన బైక్స్, కార్లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ కెనడా గ్లోబల్ టీ20 లీగ్ నిర్వహకులు మాత్రం విన్నూతంగా ఆలోచించారు. మ్యాన్ ఆఫ్‌ది సిరీస్ రూథర్‌ఫోర్డ్‌కు అవార్డు రూపంలో విచిత్రంగా అర ఎకరం భూమి ఇచ్చారు. అది కూడా అగ్ర రాజ్యం అమెరికాలో కావడం గమనార్హం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై నెటిజన్లు విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. ఇదెక్కడి అవార్డురా బాబు.. ? ఇప్పటివరకు చూడలేదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. Montreal Tigers - Champions of GT20 Canada Season 3 🙌 The Montreal Tigers unleashed a loud Roar and clinched the Title 🏆#GT20Canada #GT20Season3 #GlobalT20 #CricketsNorth #GT20Finals #SJvMT pic.twitter.com/paLAtYBa1U — GT20 Canada (@GT20Canada) August 6, 2023 మరి కొంత మంది డబ్బులు కంటే భూమి విలువైనది అంటూ వారి అభ్రిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కాగా ఫైనల్ మ్యాచ్‌లో రుథర్ ఫర్డ్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. మాంట్రియాల్ టైగర్స్ చాంపియన్‌గా నిలవడంలో రూథర్‌ఫోర్డ్ కీలక పాత్ర పోషించాడు. 29 బంతుల్లో 38 పరుగులు చేసి తమ జట్టును విజయ తీరాలకు చేర్చాడు. It was a busy presentation ceremony for Sherfane Rutherford and deservingly so 🫶 Dean Jones - Most Valuable Player ✅ Finals Man of the Match ✅ Moment of the Match ✅#GT20Canada #GT20Season3 #GlobalT20 #CricketsNorth #GT20Finals #SJvMT pic.twitter.com/OCHQxU4IlT — GT20 Canada (@GT20Canada) August 7, 2023 చదవండి: IND vs WI: నికోలస్ పూరన్‌కు బిగ్‌షాకిచ్చిన ఐసీసీ.. భారీ జరిమానా! ఎందుకంటే? -
రెచ్చిపోయిన రసెల్, రూథర్‌ఫోర్డ్.. కెనడా టీ20 లీగ్ విజేత మాంట్రియాల్ టైగర్స్
కెనడా టీ20 లీగ్ 2023 ఎడిషన్ (మూడో ఎడిషన్.. 2018, 2019, 2023) విజేతగా మాంట్రియాల్ టైగర్స్ నిలిచింది. సర్రే జాగ్వార్స్‌తో నిన్న (ఆగస్ట్ 6) జరిగిన ఫైనల్లో మాంట్రియాల్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. రసవత్తరంగా సాగిన ఈ లో స్కోరింగ్ గేమ్‌లో షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (29 బంతుల్లో 38 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) కడ దాకా నిలిచి మాంట్రియాల్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఆఖర్లో ఆండ్రీ రసెల్ (6 బంతుల్లో 20 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో విజృంభించి మాంట్రియాల్‌ను గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సర్రే జాగ్వార్స్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 130 పరుగుల నామమాత్రపు స్కోర్ చేసింది. ఓపెనర్ జతిందర్ సింగ్ (57 బంతుల్లో 56 నాటౌట్; 3 ఫోర్లు) అజేయమైన అర్ధసెంచరీతో రాణించగా.. మరో ఓపెనర్ మహ్మద్ హరీస్ (22 బంతుల్లో 23; 2 ఫోర్లు, సిక్స్), అయాన్ ఖాన్ (15 బంతుల్లో 26; 2 సిక్సర్లు) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. మాంట్రియాల్ బౌలర్లలో అయాన్ అఫ్జల్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టగా.. కార్లోస్ బ్రాత్‌వైట్, అబ్బాస్ అఫ్రిది, ఆండ్రీ రసెల్ తలో వికెట్ దక్కించుకున్నారు. Montreal Tigers - Champions of GT20 Canada Season 3 🙌 The Montreal Tigers unleashed a loud Roar and clinched the Title 🏆#GT20Canada #GT20Season3 #GlobalT20 #CricketsNorth #GT20Finals #SJvMT pic.twitter.com/paLAtYBa1U — GT20 Canada (@GT20Canada) August 6, 2023 అనంతరం అతి సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మాంట్రియాల్ సున్నా పరుగులకే వికెట్ కోల్పోయి డిఫెన్స్‌లో పడింది. అయితే కెప్టెన్ క్రిస్ లిన్ (35 బంతుల్లో 31; 3 ఫోర్లు, సిక్స్).. స్రిమంత (15 బంతుల్లో 12; 2 ఫోర్లు), దిల్‌ప్రీత్ సింగ్ (15 బంతుల్లో 14; 2 ఫోర్లు) సాయంతో స్కోర్ బోర్డును నెమ్మదిగా కదిలించాడు. 60 పరుగుల వద్ద పరుగు వ్యవధిలో మాంట్రియాల్ 2 వికెట్లు కోల్పోవడంతో కష్టాల్లో పడింది. The Moment, the Feels, and the Celebrations ❤️#GT20Canada #GT20Season3 #GlobalT20 #CricketsNorth #GT20Finals pic.twitter.com/ONOQtgOKSK — GT20 Canada (@GT20Canada) August 7, 2023 ఈ దశలో వచ్చిన షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్.. దీపేంద్ర సింగ్ (16 రిటైర్డ్), ఆండ్రీ రసెల్‌ల సాయంతో మాంట్రియాల్‌ను విజయతీరాలకు చేర్చాడు. జాగ్వార్స్ బౌలర్లలో కెప్టెన్ ఇఫ్తికార్ అహ్మద్ (4-0-8-2) అద్భుతంగా బౌల్ చేయగా.. స్పెన్సర్ జాన్సన్, అయాన్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌తో పాటు సిరీస్ ఆధ్యాంతం రాణించిన రూథర్‌ఫోర్డ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుతో పాటు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది. It was a busy presentation ceremony for Sherfane Rutherford and deservingly so 🫶 Dean Jones - Most Valuable Player ✅ Finals Man of the Match ✅ Moment of the Match ✅#GT20Canada #GT20Season3 #GlobalT20 #CricketsNorth #GT20Finals #SJvMT pic.twitter.com/OCHQxU4IlT — GT20 Canada (@GT20Canada) August 7, 2023 -
హేయ్ పీటర్సన్.. సైలెంట్ అయ్యావే?: యువీ
న్యూఢిల్లీ: ‘హేయ్ పీటర్సన్.. సైలెంట్‌గా ఉన్నావేంటి. అంతా ఓకేనా?’ అంటూ ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్‌ను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్య ఇది. ఇది క్రికెట్ మ్యాచ్ కోసం కాదు.. ఒక ఫుట్‌బాల్ మ్యాచ్ కోసం పీటర్సన్‌కు ఇలా చురకలంటించాడు యువీ. ఆదివారం మాంచెస్టర్ యునైటెడ్- చెల్సీ జట్ల మధ్య ఫుట్‌బాల్ మ్యాచ్ జరిగింది. మాంచెస్టర్ యునైటెడ్ జట్టు 4-0 తేడాతో చెల్సీపై విజయం సాధించింది. దాంతో మాంచెస్టర్ జట్టుకు వీరాభిమాని అయిన యువీ చెల్సీ జట్టుకు అభిమాని అయిన కెవిన్ పీటర్సన్‌ను ఉద్దేశించి ట్వీట్ చేశాడు. ఇందుకు నవ్వుతున్న ఎమోజీని పోస్ట్ చేశాడు. ఫుట్‌బాల్ విషయంలో వీరిద్దరూ గతంలోనూ ట్విటర్లో మాటల యుద్ధం చేసుకున్నారు. ఈ ఏడాది ఆరంభంలో మాంచెస్టర్ యునైటెడ్ జట్టును ఉద్దేశించి పీటర్సన్ చేసిన ట్వీట్‌కు యువీ దీటుగానే స్పందించాడు. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన యువరాజ్ సింగ్.. గ్లోబల్ టీ20 కెనడా లీగ్‌లో పాల్గొన్నాడు. టోరంటో నేషనల్స్ జట్టుకు యువీ కెప్టెన్‌గా వ్యవహరించాడు. కెనడా లీగ్‌లో యువీ మెరుపులు మెరిపించి తన పాత ఆటను గుర్తు చేశాడు. Hey mr @KP24 very quiet today all ok 😄 @ManUtd — yuvraj singh (@YUVSTRONG12) August 12, 2019 -
విన్నీపెగ్ హాక్స్ ‘సూపర్’
ఒంటారియో: గ్లోబల్ టీ20 కెనడా లీగ్‌లో విన్నిపెగ్ హాక్స్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. వాంకోవర్ నైట్స్‌తో ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన టైటిల్ పోరులో విన్నీపెగ్ సూపర్ ఓవర్లో చాంపియన్‌గా నిలిచింది. ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్ ద్వారా విజేతను తేల్చారు. ఇక్కడ వాంకోవర్ నైట్స్ ముందుగా సూపర్ ఓవర్ ఆడి రెండు వికెట్ల నష్టానికి తొమ్మిది పరుగులు చేసింది. ఇందులో రసెల్ ఏడు పరుగులు సాధించాడు. కాగా, 10 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్‌కు దిగిన విన్నీపెగ్ ఇంకా రెండు బంతులు ఉండగానే విజయాన్ని అందుకుంది. క్రిస్ లిన్ ఐదు పరుగులు చేయగా, రహ్మాన్ పరుగు చేశాడు. కాగా, రసెల్ వేసిన సూపర్ ఓవర్ మూడో బంతికి నాలుగు పరుగులు బైస్ రూపంలో రావడంతో విన్నీపిగ్ విజయం సులభతరమైంది.ముందుగా బ్యాటింగ్ చేసిన విన్నీపెగ్ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. షైమన్ అన్వర్(90) రాణించాడు. అటు తర్వాత వాన్కూవర్ నైట్స్ కూడా 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 192 పరుగులే చేసింది. నైట్స్ కెప్టెన్ షోయబ్ మాలిక్(64) హాఫ్ సెంచరీ సాధించగా, రసెల్(46)లు చివరి వరకూ క్రీజ్‌లో ఉన్న జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయారు. మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్‌కు దారి తీసింది. ఇక్కడ విన్నీపెగ్ విజేతగా నిలిచింది. -
అద్దాలు పగలగొట్టిన సానియా భర్త
బ్రాంప్టన్: టెన్నిస్ స్టార్ సానియా మిర్జా భర్త షోయబ్ మాలిక్ అద్దం పగలగొట్టాడు. ఒకసారి కాదు రెండు సార్లు. వాళ్లేదో గొడవ పడ్డారని అపార్థం చేసుకోకండి. అతడు కొట్టిన బంతులు తగిలి గ్రౌండ్లో అద్దాలు పగిలిపోయాయి. బౌండరీ వెలుపలికి అతడు కొట్టిన రెండు బంతులు నేరుగా రెండు కిటికీల అద్దాలకు తగలడంతో అవి ధ్వంసమయ్యాయి. గ్లోబల్ టి20 కెనడా లీగ్‌లో అతడీ విన్యాసం చేశాడు. వాంకోవర్ నైట్స్ కెప్టెన్‌గా ఉన్న మాలిక్ గురువారం బ్రాంప్టన్ వోల్వ్స్తో జరిగిన మ్యాచ్‌లో చెలరేగి ఆడాడు. 26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 46 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడికి తోడుగా రసెల్(43), టీపీ వైసీ(40) విజృంభించడంతో వాంకోవర్ నైట్స్ 16 ఓవర్లలో 170 పరుగులు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 16 ఓవర్లకు కుదిరించారు. లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బ్రాంప్టన్ టీమ్ 13.4 ఓవర్లలో 103 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ మున్రో ఒక్కడే అర్ధ సెంచరీ(62)తో ఒంటరి పోరాటం చేశాడు. మిగతా ఆటగాళ్లెవరూ రెండంకెల స్కోరు చేయలేకపోవడంతో 77 పరుగులతో బ్రాంప్టన్ వోల్వ్స్ ఓటమిపాలైంది. ఈ విజయంతో వాంకోవర్ నైట్స్ నాకౌట్లో అడుగుపెట్టింది. In an unusual scenario, @realshoaibmalik literally hit two glass breaking sixes.#GT2019 #BWvsVK pic.twitter.com/5kuAQoQBbE — GT20 Canada (@GT20Canada) August 9, 2019 -
అక్తర్ ఫిక్సింగ్ చేయమన్నాడు!
ఒంటారియో: తమ దేశానికి చెందిన ఓ మాజీ క్రికెటర్ తనను ఫిక్సింగ్ చేయమన్నాడంటూ వివాదాస్పద పాకిస్తాన్ క్రికెటర్ ఉమర్ అక్మల్ మరో వివాదానికి తెరలేపాడు. గ్లోబల్ టీ20 కెనడా లీగ్‌లో భాగంగా విన్‌పిగ్ హాక్స్ తరఫున ఆడుతున్న అక్మల్‌ను ఆ జట్టు మేనేజ్మెంట్ కీలక పాత్ర పోషిస్తున్న మన్సూర్ అక్తర్ ఫిక్సింగ్ చేయమన్నాడట. ఈ విషయాన్ని కెనడా లీగ్ యాజమన్యంతో పాటు తమ అవినీతి నిరోధక విభాగానికి అక్మల్ తెలియజేనట్లు పీసీబీ వర్గాలు వెల్లడించాయి. ‘కొన్ని మ్యాచ్‌లు ఫిక్సింగ్ చేస్తావా’ అంటూ అక్తర్ ఆఫర్ చేసిన అక్మల్ తమ దృష్టికి తీసుకొచ్చాడని పాక్ క్రికెట్ బోర్డులోని ఒక అధికారి పేర్కొన్నారు. దీనిపై దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేయనున్నట్లు సదరు అధికారి తెలిపారు. 61 ఏళ్ల మన్సూర్ అక్తర్ 19 టెస్టులు, 41 వన్డేలు ఆడాడు. 1980 నుంచి 1990 వరకూ పాక్ తరఫున క్రికెట్ ఆడాడు. ప్రస్తుతం గ్లోబల్ ట20 కెనడా లీగ్ విన్పిక్ హాగ్స్ మేనేజ్మెంట్ విభాగంలో సేవలందిస్తున్నాడు. ఇదిలా ఉంచితే, ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో ఉమర్ అక్మల్‌కు చోటు దక్కలేదు. కోచ్ మికీ ఆర్థర్‌తో విభేదాల నేపథ్యంలో అక్మల్‌ను వరల్డ్‌కప్ జట్టులో ఎంపిక చేయలేదు. ఈ ఏడాది మార్చి-ఏప్రిల్‌లో ఆస్ట్రేలియా జరిగిన వన్డే సిరీస్‌లో అక్మల్ ఆకట్టుకున్నప్పటికీ అతనికి వరల్డ్‌కప్ జట్టులో చోటు కల్పించలేదు. -
‘ నా క్రికెట్ కెరీర్‌ను సంతృప్తిగా ముగిస్తున్నా’
వెల్లింగ్టన్: సుమారు మూడేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకున్న న్యూజిలాండ్ క్రికెటర్ బ్రెండన్ మెకల్లమ్.. తాజాగా కాంపిటేటివ్ క్రికెట్ కూడా గుడ్ బై చెబుతూ నిర్ణయం తీసుకున్నాడు. ఇక నుంచి ఏ ఫార్మాట్ క్రికెట్ ఆడబోనంటూ రిటైర్మెంట్ ప్రకటించాడు. 2016లో అంతర్జాతీయ క్రికెట్‌కు స్వస్తి పలికిన మెకల్లమ్.. విదేశీ టీ20 లీగ్‌లో ఆడుతున్నాడు. ప్రస్తుతం గ్లోబల్ టీ20 కెనడా లీగ్‌లో ఆడుతున్న మెకల్లమ్.. ఈ లీగ్ తర్వాత మొత్తం క్రికెట్‌కు దూరం కానున్నట్లు వెల్లడించాడు. ‘ నా క్రికెట్ జీవితాన్ని సంతృప్తిగా ముగిస్తున్నా. గ్లోబల్ టీ20 కెనడా తర్వాత ఇక క్రికెట్ మ్యాచ్‌లు ఆడను. నాకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు’ అని మెకల్లమ్ పేర్కొన్నాడు.తన టెస్టు కెరీర్లో 101 టెస్టులు ఆడిన 37 ఏళ్ల మెకల్లమ్ 12 సెంచరీలతో 6,453 పరుగులు చేశాడు. అందులో 302 అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు. ఇక 260 వన్డేల్లో 6,083 పరుగులు చేయగా, ఐదు సెంచరీలున్నాయి. 71 అంతర్జాతీయ టీ20ల్లో 2,140 పరుగులు చేశాడు. ఓవరాల్ టీ20(అన్ని లీగ్‌లతో కలిపి) కెరీర్లో 370 మ్యాచ్‌లు ఆడిన మెకల్లమ్ 9,922 పరుగులు చేశాడు. -
యువరాజ్ సింగ్ హైలైట్ క్యాచ్
-
యువరాజ్ స్టన్నింగ్ క్యాచ్ చూశారా?
ఒంటారియో: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పినా తనలో సత్తా తగ్గలేదని టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ నిరూపిస్తున్నాడు. గ్లోబల్ టీ20 కెనడాలో టోరంటో నేషనల్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న యువీ మైదానంలో తనదైన శైలిలో అలరిస్తున్నాడు. బ్రాంప్టాన్ వాల్స్వ్తో జరిగిన మ్యాచ్‌లో యువరాజ్ సింగ్ పట్టిన క్యాచ్ హైలైట్‌గా నిలిచింది. గార్డన్ బౌలింగ్‌లో సిమన్స్ ఇచ్చిన క్యాచ్‌ను మూడు సార్లు ప్రయత్నించి ఒడిసిపట్టాడు. స్టన్నింగ్ క్యాచ్ అంటూ ఈ వీడియోను గ్లోబల్ టీ20 కెనడా అధికార ట్విటర్ పేజీలో షేర్ చేశారు. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో రాణించి మునుపటి యువీన గుర్తు చేశాడు. ఈ మ్యాచ్‌లో టోరంటో నేషనల్స్ ఓడినప్పటికీ కెప్టెన్‌గా యువరాజ్ సత్తా చాటాడు. 22 బంతుల్లో 5 సిక్సర్లు, 3 ఫోర్లతో 51 పరుగులు సాధించాడు. రెండు ఓవర్లు వేసి ఒక వికెట్ పడగొట్టాడు. అంతేకాదు షాహిద్ ఆఫ్రిదిని రనౌట్ చేయడంలోనూ కీలకపాత్ర పోషించి తనలోని సిసలైన ఆల్‌రౌండర్‌ను మళ్లీ వెలుగులోకి తెచ్చాడు. (చదవండి: యువీ మళ్లీ చెలరేగాడు.. కానీ) -
యువరాజ్ రిటైర్డ్ హర్ట్
-
యువరాజ్ రిటైర్డ్ హర్ట్
ఒంటారియో: గ్లోబల్ టీ20 కెనడాలో టోరంటో నేషనల్స్ తరఫున ఆడుతున్న యువరాజ్ సింగ్.. ఆదివారం రాత్రి మోంట్రియల్ టైగర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్ చేరాడు. కేవలం రెండు బంతులు మాత్రమే ఆడిన యువరాజ్ తీవ్రమైన వెన్నునొప్పితో సతమతమయ్యాడు. దాంతో ఫిజియో వచ్చి ప్రాథమిక చికత్స చేసినా నొప్పి తీవ్రత ఎక్కువగా ఉండటంతో అర్థాంతరంగా ఫీల్డ్‌ను వీడాడు.టోరంటో నేషనల్స్ ఇన్నింగ్స్‌లో భాగంగా ఏడో ఓవర్ రెండో బంతికి హెన్రిచ్ క్లాసెన్ పెవిలియన్ చేరాడు. ఆ సమయంలో క్రీజ్‌లోకి వచ్చిన యువరాజ్ సింగ్ తొలి బంతికి పరుగులేమీ చేయలేదు. ఇక రెండో బంతిని స్వీప్ షాట్‌కు యత్నించి విఫలమయ్యాడు యువీ. ఆ క్రమంలో బ్యాట్ కూడా చేతి నుంచి జారిపోగా, వెన్నునొప్పితో బాధ పడ్డాడు. అది ఎంతకీ తగ్గక పోవడంతో యువీ పెవిలియన్‌కు చేరక తప్పలేదు. ఈ లీగ్‌లో యువీ దూకుడుగా ఆడుతున్నాడు. విన్నీపెగ్ హాక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 26 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 45పరుగులు చేసిన యువీ.. ఎడ్మాంటన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 21 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 35 పరుగులు చేశాడు. బ్రాంప్టాన్ వాల్వ్స్తో జరిగిన మ్యాచ్‌లో 22 బంతుల్లో 5 సిక్సర్లు, 3 ఫోర్లతో 51 పరుగులతో మెరిశాడు.ఈ మ్యాచ్‌లో టోరంటో నేషనల్స్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మోంట్రియల్ టైగర్స్ నిర్దేశించిన 137 పరుగుల లక్ష్యాన్ని 17.3 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. -
యువీ మళ్లీ చెలరేగాడు.. కానీ
ఒంటారియో: గ్లోబల్ టీ20 కెనడా లీగ్‌లో భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ మెరుపులు మెరిపిస్తున్నాడు. ఈ టీ20 లీగ్‌లో తనదైన శైలిలో స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తూ దూకుడు కొనసాగిస్తున్నాడు. కెనడా లీగ్‌లో టోరంటో నేషనల్స్ తరఫున ఆడుతున్న యువరాజ్.. బ్రాంప్టాన్ వాల్వ్స్తో జరిగిన మ్యాచ్‌లో మరోసారి బ్యాట్ ఝుళిపించాడు. 22 బంతుల్లో 5 సిక్సర్లు, 3 ఫోర్లతో 51 పరుగులు సాధించాడు. యువరాజ్ సింగ్ ధాటిగా బ్యాటింగ్ చేసినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు. బ్రాంప్టాన్ వాల్స్వ్ నిర్దేశించిన 223 పరుగుల భారీ టార్టెట్ ఛేదనలో టోరంటో నేషనల్స్ 75 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ తరుణంలో యువరాజ్ సమయోచితంగా ఆడుతూ జట్టు స్కోరును పరుగులు పెట్టించాడు. బౌండరీల మోత మోగిస్తూ జట్టును ముందుకు తీసుకెళ్లాడు. కాస్లెన్(35; 26 బంతుల్లో 3 ఫోర్లు, 2సిక్సర్లు)తో కలిసి స్కోరు బోర్డులో వేగం పెంచాడు. కాగా, నవాబ్ సింగ్ వేసిన 16వ ఓవర్లో తొలి రెండు బంతుల్ని సిక్సర్లుగా కొట్టిన యువీ.. మూడో బంతికి క్యాచ్ పెవిలియన్ చేరాడు. అటు తర్వాత మెక్లీన్గన్(19 నాటౌట్; 3 ఫోర్లు) బ్యాట్ ఝుళిపించినా టోరంటో నేషనల్స్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పయి 211 పరుగులు చేసి ఓటమి పాలైంది. అంతకుముందు విన్నీపెగ్ హాక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 26 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 45పరుగులు చేసిన యువీ.. ఎడ్మాంటన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 21 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 35 పరుగులు చేశాడు. -
క్రిస్ గేల్ మళ్లీ బాదేశాడు
ఒంటారియో: గ్లోబల్ టీ20 కెనడా లీగ్‌లో వెస్టిండీస్ స్టార్ ఆటగాడు క్రిస్ గేల్ తన జోరు కొనసాగిస్తున్నాడు. ఈ లీగ్‌లో వాన్కూవర్ తరఫున ప్రాతినిథ్య వహిస్తున్న గేల్.. ఎడ్మాంటన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. తనదైన బ్యాటింగ్ స్టైల్‌తో రెచ్చిపోయి బౌండరీల మోత మోగించాడు. 44 బంతుల్లో 9 సిక్సర్లు, 6 ఫోర్లతో 94 పరుగులు సాధించాడు. గేల్ విజృంభణతో వాన్కూవర్ జట్టు 16.3 ఓవర్లలో 166 పరుగుల టార్గెట్‌ను సునాయాసంగా సాధించింది.ముందుగా బ్యాటింగ్ చేసిన ఎడ్మాంటన్ రాయల్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. బెన్ కట్టంగ్(72), మహ్మద్ నవాజ్(40)లు మాత్రమే రాణించడంతో ఎడ్మాంటన్ రాయల్స్ సాధారణ స్కోరుకే పరిమితమైంది. అయితే లక్ష్య ఛేదనలో వాన్కూవర్ ఆదిలోనే వికెట్‌ను కోల్పోయింది. జట్టు స్కోరు రెండు పరుగుల వద్ద విసీ(1) పెవిలియన్ చేరాడు. ఆ తరుణంలో చాద్వక్ వాల్టన్‌తో కలిసి గేల్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఒకవైపు గేల్ దూకుడుగా ఆడితే వాల్టన్ నెమ్మదిగా ఆడాడు. రెండో వికెట్‌కు 56 పరుగులు జోడించిన తర్వాత వాల్టన్(17) పెవిలియన్ చేరాడు. అయినప్పటికీ గేల్ మాత్రం ధాటిగానే బ్యాటింగ్ చేసి మెరుపులు మెరిపించాడు. షోయబ్ మాలిక్(34 నాటౌట్)తో కలిసి మూడో వికెట్‌కు 82 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత గేల్ ఔటయ్యాడు. ఆ వెంటనే రసెల్ కూడా ఔటైనా, మాలిక్ సమయోచితంగా బ్యాటింగ్ చేసి జట్టుకు ఘన విజయం అందించాడు. అంతకుముందు మోంట్రియల్ టైగర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గేల్ 54 బంతుల్లో 12 సిక్సర్లు, 7 ఫోర్లతో అజేయంగా 122 పరుగులు సాధించిన సంగతి తెలిసిందే. ఒకే ఓవర్లో 32 పరుగులు.. క్రిస్ గేల్ దూకుడుకు షాదబ్ ఖాన్ బలైపోయాడు. షాదబ్ వేసిన ఒక ఓవర్లో గేల్ నాలుగు సిక్సర్లు, రెండు ఫోర్లు కొట్టాడు. తొలి రెండు బంతుల్ని సిక్సర్లుగా మలిచిన గేల్.. ఆపై మరో రెండు బంతుల్ని ఫోర్లు కొట్టాడు. ఒక చివరి రెండు బంతుల్ని బౌండరీలు దాటించాడు. మొత్తంగా షాదబ్ వేసిన ఆ ఓవర్లో గేల్ 32 పరుగుల్ని పిండుకున్నాడు. -
యువీ సరదా ప్రశ్న.. ‘మీ ఇద్దరి పెళ్లెప్పుడు’
యువరాజ్‌సింగ్ మైదానంలో పరుగుల కోసం ఎంత శ్రమిస్తాడో.. అంతే సరదాగా ఉంటాడు. 2011 ప్రపంచకప్‌లో కీలకపాత్ర పోషించిన యువీ ఇటీవల కాలంలో అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. బీసీసీఐ అనుమతితో కెనడాలో గ్లోబల్ టీ20 లీగ్ ఆడుతున్నాడు. ఎప్పుడూ మైదానంలో చిలిపిగా ఉండే.. తాజాగా జరిగిన మ్యాచ్ అనంతరం సహచర ఆటగాడు బెన్ కట్టింగ్‌ను (ఆస్ట్రేలియా) యాంకర్ ఎరిన్ హాలండ్‌ను ఇంటర్వ్యూ చేస్తున్నారు. అయితే, కాస్త దూరంలో ఉన్న యువీ.. వారిద్దరి సంభాషణ మధ్యలో దూరి.. ‘ఇంతకూ.. మీ ఇద్దరి వివాహం ఎప్పుడు’ అని సరదాగా ప్రశ్నించాడు. దీంతో వారిద్దరూ నవ్వుల్లో మునిగిపోయారు. అనంతరం ఇంటర్వ్యూ కొనసాగించారు. ఇక ఎరిన్ హాలండ్.. బెన్ కట్టింగ్ త్వరలో వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఎరిన్ ట్విటర్లో.. డోంట్ వర్రీ యువీ.. మా వివాహనికీ తప్పకుండా ఆహ్వానిస్తాం’ అని ట్వీట్ చేశారు. ఐపీఎల్-2016లో ఎస్ఆర్హెచ్, 2019లో ముంబై ఇండియన్స్ జట్లలో బెన్, యువ సహచర ఆటగాళ్లు కావడం గమనార్హం. -
యువరాజ్ దూకుడు
ఒంటారియో: ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన భారత క్రికెటర్ యువరాజ్ సింగ్.. గ్లోబల్ టీ20 కెనడా లీగ్‌లో దూకుడు కొనసాగిస్తున్నాడు. టోరంటో నేషనల్స్ తరఫున ఆడుతున్న యువరాజ్.. సోమవారం విన్నీపెగ్ హాక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మరోసారి మెరుపులు మెరిపించాడు. 26 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 45 పరుగులతో ఆకట్టకున్నాడు. అంతకుముందు ఎడ్మాంటన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యువరాజ్ 21 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో ధాటిగా ఆడి 35 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. అదే జోరును విన్నీ పెగ్‌తో జరిగిన మ్యాచ్‌లో కొనసాగించాడు యువీ. విన్నీపెగ్ హాక్స్‌తో మ్యాచ్‌లో యువీకి జతగా రోడ్రిగో థామస్(65), కీరోన్ పొలార్డ్(52)లు రాణించడంతో టోరంటో నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. కాగా, 217 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన విన్నీపెగ్ చివరి బంతికి విజయం సాధించింది. క్రిస్ లిన్(89), షమాన్ అన్వర్(43), సన్నీ సొహాల్(58)లు విన్నీ పెగ్ విజయంలో ముఖ్య పాత్ర పోషించారు.( ఇక్కడ చదవండి: యువీ.. వాటే సిక్స్) -
గేల్ మెరుపులు.. ఆకాశంలో ఉరుములు!
ఒంటారియో: టీ20 స్పెషలిస్ట్, యూనివర్శల్ బాస్ క్రిస్ గేల్ మళ్లీ గర్జించాడు. విదేశీ లీగ్‌ల్లో భాగంగా గ్లోబల్ టీ20 కెనడాలో వాన్కూవర్ నైట్స్ తరఫున ఆడుతున్న గేల్ విశ్వరూపం ప్రదర్శించాడు. సోమవారం మోంట్రియల్ టైగర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గేల్ బౌండరీల మోత మోగించాడు. 54 బంతుల్లో 12 సిక్సర్లు, 7 ఫోర్లతో అజేయంగా 122 పరుగులు సాధించాడు. మోంట్రియల్ బౌలర్లను ఊచకోత కోస్తూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. తొలి వికెట్‌కు విస్సే(51)తో కలిసి 63 పరుగులు జత చేసిన గేల్.. చెడ్విక్ వాల్టన్‌తో కలిసి మరో 67 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. తొలి వికెట్ భాగస్వామ్యం నెలకొల్పే క్రమంలో నెమ్మదిగా ఆడిన గేల్.. ఆపై రెచ్చిపోయి ఆడాడు. మూడో వికెట్‌కు వాన్ దెర్ డస్సెన్(56)తో కలిసి 139 పరుగుల భారీ భాగస్వామ్యం సాధించడంలో దోహదపడ్డాడు. దాంతో వాన్కూవర్ నైట్స్ నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 276 పరుగులు సాధించింది. ఇది టీ20 చరిత్రలో రెండో అత్యధిక స్కోరుగా నమోదైంది. టాప్ ప్లేస్‌లో అఫ్గానిస్తాన్ ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అఫ్గాన్ 278 పరుగులు చేసింది. ఫలితంగా టీ20ల్లో అత్యధిక స్కోరు రికార్డు అఫ్గాన్ పేరిట లిఖించబడింది. ఆ తర్వాత వాన్కూవర్ నైట్స్దే టీ20ల్లో అత్యధిక స్కోరు.కాగా, వాన్కూవర్ విధించిన భారీ లక్ష్యాన్ని ఛేదించే అవకాశం మోంట్రియల్ టైగర్స్‌కు రాలేదు. గేల్ గర్జన తర్వాత ఆకాశంలో ఉరుములు, మెరుపులు కారణంగా మ్యాచ్‌ను రద్దు చేశారు. దాంతో ఈ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. -
ఆఫ్రిది ఆగయా.. బౌలర్లకు చుక్కలు
-
ఆఫ్రిది ఆగయా.. బౌండరీ జాయేగా..
ఒంటారియో: షాహిద్ ఆఫ్రిది.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. నెమ్మదిగా సాగుతున్న వన్డే క్రికెట్లో టీ20 ఆటను ప్రదర్శించి ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు. మొన్నటివరకు వేగవంతమైన సెంచరీ కూడా ఆఫ్రిది(1996, 37 బంతుల్లో) పేరుమీదే ఉండేది. ఇక 2015లో వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించడంతో అతడి ఆట చూడటాన్ని అభిమానులు మిస్సవుతున్నారు. 2018 వరకు టీ20లు ఆడినా అంతగా మెప్పించలేదు. అయితే తనలో ఇంకా సత్తా తగ్గలేదని.. యువ హిట్టర్లతో తానేమీ తీసిపోనని మరోసారి నిరూపించాడు. గ్లోబల్ టీ20 కెనడా లీగ్‌లో మునపటి ఆఫ్రిదిని గుర్తుతెచ్చాడు. బౌలర్లకు చుక్కలు చూపిస్తూ చెలరేగిపోయాడు. బ్రాంప్టన్ వోల్వ్స్ తరుపున ప్రాతినిథ్యం వహిస్తున్న ఆఫ్రిది ఎడ్మాంటన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తన విశ్వరూపం ప్రదర్శించాడు. ఆఫ్రిది(81; 40 బంతుల్లో 10ఫోర్లు, 5 సిక్సర్లు) బౌండరీలతో హోరెత్తించాడు. ఎడ్మాంటన్ రాయల్స్ బౌలింగ్‌ను చిత్తుచిత్తు చేస్తూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఆఫ్రిదికి తోడుగా సిమ్మన్స్(59, 34 బంతుల్లో 5ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపులు మెరిపివ్వడంతో బ్రాంప్టన్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన ఎడ్మాంటన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 180 పరుగులే చేసి ఓటమి పాలైంది. బ్యాట్‌తో మెరిసిని ఆఫ్రిది బౌలింగ్‌లోనూ వికెట్ దక్కించుకున్నాడు. కీలక సమయంలో మహ్మద్ హఫీజ్‌ను ఔట్ చేశాడు. ఇక ఆఫ్రిది బ్యాటింగ్ మెరుపులను టీ20 కెనడా లీగ్ తన అధికారిక ట్విటర్లో షేర్ చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగహల్‌చల్ చేస్తోంది. ‘బుమ్ బుమ్ ఆఫ్రిది ఇజ్ బ్యాక్’, ‘ఆఫ్రిది ఆగయా.. బౌండరీ జాయేగా’ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. -
ప్రేమ జంట.. మధ్యలో యువీ!
ఒంటారియో: అంతర్జాతీయ క్రికెట్‌కు ఐపీఎల్‌కు ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత యువరాజ్ సింగ్ గ్లోబల్ టీ20 కెనడా లీగ్‌లో ఆడుతున్నాడు. ఈ లీగ్‌లో టోరంటో నేషనల్స్ తరఫున ఆడుతున్న యువీ..శనివారం ఎడ్మాంటన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చిలిపిగా ప్రవర్తించాడు. ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరిగే క్రమంలో వర్షం పడటంతో ఆటకు అంతరాయం ఏర్పడింది. దాంతో యువరాజ్‌తో సహా మిగతా ఆటగాళ్లంతా తమ తమ వార్మప్‌లో మునిగిపోయారు.(ఇక్కడ చదవండి: యువీ.. వాటే సిక్స్) ఈ సమయంలో ఎడ్మాంటన్ తరఫున ఆడుతున్న ఆసీస్ క్రికెటర్ బెన్ కట్టింగ్‌ను న్యూస్ ప్రెజంటర్ ఎరన్ హోలాండ్ ఇంటర్యూ చేస్తున్నారు. దీన్ని గమనించిన యువరాజ్.. ఆ ఇద్దరి మధ్యకు వచ్చి అంతరాయం కల్గించాడు. అంతటితో ఆగకుండా ‘ మీ పెళ్లి ఎప్పుడు?’ అంటూ వారిని కాస్త ఇబ్బంది పెట్టాడు. దీనికి ఒక్కసారిగా పగలబడి నవ్విన హోలాండ్ సమాధానం ఇచ్చే లోపే యువీ అక్కడ్నుంచి జారుకునే యత్నం చేశాడు. వీరిద్దరూ గత నాలుగేళ్లుగా డేటింగ్లో ఉండగా, ఇటీవల వీరి నిశ్చితార్థం జరిగింది. త్వరలో పెళ్లి చేసుకోబోతున్న ఈ జంటను యువీ ఆట పట్టేంచబోయాడు. ఏదో విరామం దొరికింది కదా అని ప్రేమ జంట ముచ్చటించుకుంటుండగా వారి మధ్యలో దూరి ‘కోతి’ వేషాలు వేశాడు యువీ. When @YUVSTRONG12 crashed an interview and asked the most important question to @Cuttsy31 and @erinvholland! 😂😂😂 HOWZZAT?#GT2019 #ERvsTN #YuvrajSingh #Canada #Brampton pic.twitter.com/l5rqONTki2 — GT20 Canada (@GT20Canada) July 27, 2019 -
యువీ.. వాటే సిక్స్
ఒంటారియో: ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన భారత క్రికెటర్ యువరాజ్ సింగ్.. గ్లోబల్ టీ20 కెనడా లీగ్‌లో ఆడుతున్నాడు. ఈ లీగ్‌లో టోరంటో నేషనల్స్ తరఫున ఆడుతున్న యువరాజ్ సింగ్ తనలోని సత్తా ఇంకా తగ్గలేదని నిరూపించాడు. శనివారం ఎడ్మాంటన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యువరాజ్ 21 బంతుల్లో మూడు సిక్సర్లు, మూడు ఫోర్లతో 35 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అందులో యువరాజ్ కొట్టిన ఒక సిక్స్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. ఎడ్మాంటన్ నిర్దేశించిన 192 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో నాల్గో స్థానంలో వచ్చిన యువరాజ్ తనదైన శైలిలో బ్యాట్ ఝుళిపించాడు. ఎడ్మాంటన్ తరఫున ఆడుతున్న పాకిస్తాన్ లెగ్ స్సిన్నర్ షాదబ్ ఖాన్ బౌలింగ్‌లో మిడ్ వికెట్‌గా మీదుగా ఫ్లాట్ సిక్స్ కొట్టి ఔరా అనిపించాడు. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో టోరంటో నేషనల్స్ రెండు వికెట్లు తేడాతో విజయం సాధించింది. 29 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన తరుణంలో హెన్రిచ్ క్లాసెన్-యువరాజ్ సింగ్‌లు ఆదుకున్నారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 56 పరుగులు జత చేసిన తర్వాత యువీ ఔటయ్యాడు. యువీ పెవిలియన్ చేరిన తర్వాత పరిస్థితి మళ్లీ మొదటకొచ్చింది. జట్టు స్కోరు 85 పరుగుల వద్ద యువీ ఔట్ కాగా, మరో మూడు పరుగుల వ్యవధిలో పొలార్డ్ పెవిలియన్ చేరాడు. అటు తర్వాత స్వల్ప విరామాల్లో టోరంటో వికెట్లు కోల్పోతూ వచ్చింది. 125 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ దశలో మన్‌ప్రీత్ గోనీ(33; 12 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు) బ్యాట్ ఝుళిపించాడు. చివర్లో మాంట్‌ఫోర్ట్- సల్మాన్ నజార్‌లు సమయోచితంగా ఆడటంతో టోరంటో 17.5 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది.