రాణించిన రొమారియో షెపర్డ్‌.. ఫైనల్లో టొరంటో నేషనల్స్‌ | Global T20 Canada 2024: Romario Shepherd Stars With Ball, As Toronto Nationals Entered Into Finals | Sakshi
Sakshi News home page

రాణించిన రొమారియో షెపర్డ్‌.. ఫైనల్లో టొరంటో నేషనల్స్‌

Published Sun, Aug 11 2024 3:22 PM | Last Updated on Sun, Aug 11 2024 4:40 PM

Global T20 Canada 2024: Romario Shepherd Stars With Ball, As Toronto Nationals Entered Into Finals

గ్లోబల్‌ టీ20 కెనడా టోర్నీలో టొరంటో నేషనల్స్‌ ఫైనల్స్‌కు చేరింది. నిన్న (ఆగస్ట్‌ 10) జరిగిన క్వాలిఫయర్‌-2లో ఆ జట్టు బ్రాంప్టన్‌ వోల్వ్స్‌పై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన వోల్వ్స్‌.. నిక్‌ హాబ్సన్‌ (51 నాటౌట్‌) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. 

వోల్వ్స్‌ ఇన్నింగ్స్‌లో కోబ్‌ హెర్ఫ్ట్‌ 1, డేవిడ్‌ వార్నర్‌ 13, జాక్‌ జార్విస్‌ 20, వెబ్‌స్టర్‌ 8, మున్సే 26, అఖిల్‌ కుమార్‌ 7, ఆండ్రూ టౌ 6, హర్మన్‌దీప్‌ సింగ్‌ 0 పరుగులకు ఆలౌట్‌ కాగా.. థామస్‌ డ్రాకా 1 పరుగుతో అజేయంగా నిలిచాడు. టొరంటో బౌలర్లలో రొమారియో షెపర్డ్‌ 4 వికెట్లు తీసి వోల్వ్స్‌ను దారుణంగా దెబ్బకొట్టగా.. జతిందర్‌పాల్‌ 2, బెహ్రెన్‌డార్ఫ్‌, జునైద్‌ సిద్దిఖీ తలో వికెట్‌ పడగొట్టారు.

142 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టొరంటో నేషనల్స్‌.. కొలిన్‌ మున్రో (36), మొహమ్మద్‌ నవాజ్‌ (24 నాటౌట్‌) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో 18.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. 

ఉన్ముక్త్‌ చంద్‌ 19, ఆండ్రియస్‌ గౌస్‌ 18, డస్సెన్‌ 14, అర్మాన్‌ కపూర్‌ 4 పరుగులు చేసి ఔట్‌ కాగా.. రొమారియో షెపర్డ్‌ 10 పరుగులతో అజేయంగా నిలిచాడు. వోల్వ్స్‌ బౌలర్లలో అఖిల్‌ కుమార్‌ 3 వికెట్లు పడగొట్టగా.. ఆండ్రూ టై, వెబ్‌స్టర్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు. ఇవాళ రాత్రి (9:30 గంటలకు) జరిగే ఫైనల్లో టొరంటో నేషనల్స్‌.. మాంట్రియాల్‌ టైగర్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement