గ్లోబల్ టీ20 కెనడా టోర్నీలో సర్రే జాగ్వర్స్‌పై బంగ్లా టైగర్స్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జాగ్వర్స్ 19.5 ఓవర్లలో 101 పరుగులకు ఆలౌటైంది. జాగ్వర్స్ జట్టులో విధ్వంసకర వీరులు ఉన్నా స్టోయినిస్ (36), వాన్ బీక్ (31) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. కైల్ మేయర్స్ (5), సునీల్ నరైన్ (0), మన్సబ్ గిల్ (2), శ్రేయస్ మొవ్వ (0), బ్రాండన్ మెక్‌ముల్లెన్ (7), మొహమ్మద్ నబీ (0), తారిఖ్ (1), హర్మీత్ సింగ్ (0) సింగిల్ డిజిట్ స్కోర్లకే ఔటయ్యారు. బంగ్లా టైగర్స్ బౌలర్లలో షొరీఫుల్ ఇస్లాం 3, డేవిడ్ వీస్, షకీబ్ అల్ హసన్ చెరో 2, కర్టిస్ క్యాంఫర్, అలీ ఖాన్, డిల్లన్ హేలైగర్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టైగర్స్.. 19 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. బంతితో రాణించిన డేవిడ్ వీస్ బ్యాటింగ్‌లోనూ (19 బంతుల్లో 27 నాటౌట్) సత్తా చాటి టైగర్స్ గెలుపులో కీలకపాత్ర పోషించాడు. టైగర్స్ ఇన్నింగ్స్‌లో రహ్మానుల్లా గుర్బాజ్ 4, ముహమ్మద్ వసీం 14, పర్గత్ సింగ్ 10, షకీబ్ అల్ హసన్ 1, ఇఫ్తికార్ అహ్మద్ 13, కర్టిస్ క్యాంఫర్ 10, డిల్లన్ హేలైగర్ 17 (నాటౌట్) పరుగులు చేశారు. జాగ్వర్స్ బౌలర్లలో సునీల్ నరైన్ 3, స్టోయినిస్, లొగన్ వాన్ బీక్, బెన్ లిస్టర్ తలో వికెట్ పడగొట్టారు.
నిన్ననే జరిగిన మరో మ్యాచ్‌లో వాంకోవర్ నైట్స్‌పై బ్రాంప్టన్ వోల్వ్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వాంకోవర్ నైట్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేయగా.. బ్రాంప్టన్ వోల్వ్స్ మరో 11 బంతులు మిగిలుండగానే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. వెబ్‌స్టర్ (49), నిక్ హాబ్సన్ (37) వోల్వ్స్‌ను విజయతీరాలకు చేర్చారు.
Comments
Please login to add a commentAdd a comment