యువరాజ్‌సింగ్ మైదానంలో పరుగుల కోసం ఎంత శ్రమిస్తాడో.. అంతే సరదాగా ఉంటాడు. 2011 ప్రపంచకప్‌లో కీలకపాత్ర పోషించిన యువీ ఇటీవల కాలంలో అన్ని ఫార్మాట్లకు రిటైర్‌మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. బీసీసీఐ అనుమతితో కెనడాలో గ్లోబల్ టీ20 లీగ్ ఆడుతున్నాడు. ఎప్పుడూ మైదానంలో చిలిపిగా ఉండే.. తాజాగా జరిగిన మ్యాచ్ అనంతరం సహచర ఆటగాడు బెన్ కట్టింగ్‌ను (ఆస్ట్రేలియా) యాంకర్ ఎరిన్ హాలండ్‌ను ఇంటర్వ్యూ చేస్తున్నారు.
అయితే, కాస్త దూరంలో ఉన్న యువీ.. వారిద్దరి సంభాషణ మధ్యలో దూరి.. ‘ఇంతకూ.. మీ ఇద్దరి వివాహం ఎప్పుడు’ అని సరదాగా ప్రశ్నించాడు. దీంతో వారిద్దరూ నవ్వుల్లో మునిగిపోయారు. అనంతరం ఇంటర్వ్యూ కొనసాగించారు. ఇక ఎరిన్ హాలండ్.. బెన్ కట్టింగ్ త్వరలో వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఎరిన్ ట్విటర్‌లో.. డోంట్ వర్రీ యువీ.. మా వివాహనికీ తప్పకుండా ఆహ్వానిస్తాం’ అని ట్వీట్ చేశారు. ఐపీఎల్-2016లో ఎస్‌ఆర్‌హెచ్, 2019లో ముంబై ఇండియన్స్ జట్లలో బెన్, యువ సహచర ఆటగాళ్లు కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment