ఒంటారియో: గ్లోబల్ టీ20 కెనడాలో టోరంటో నేషనల్స్ తరఫున ఆడుతున్న యువరాజ్ సింగ్.. ఆదివారం రాత్రి మోంట్రియల్ టైగర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్ చేరాడు. కేవలం రెండు బంతులు మాత్రమే ఆడిన యువరాజ్ తీవ్రమైన వెన్నునొప్పితో సతమతమయ్యాడు. దాంతో ఫిజియో వచ్చి ప్రాథమిక చికత్స చేసినా నొప్పి తీవ్రత ఎక్కువగా ఉండటంతో అర్థాంతరంగా ఫీల్డ్‌ను వీడాడు.టోరంటో నేషనల్స్ ఇన్నింగ్స్‌లో భాగంగా ఏడో ఓవర్ రెండో బంతికి హెన్రిచ్ క్లాసెన్ పెవిలియన్ చేరాడు. ఆ సమయంలో క్రీజ్‌లోకి వచ్చిన యువరాజ్ సింగ్ తొలి బంతికి పరుగులేమీ చేయలేదు. ఇక రెండో బంతిని స్వీప్ షాట్‌కు యత్నించి విఫలమయ్యాడు యువీ. ఆ క్రమంలో బ్యాట్ కూడా చేతి నుంచి జారిపోగా, వెన్నునొప్పితో బాధ పడ్డాడు. అది ఎంతకీ తగ్గక పోవడంతో యువీ పెవిలియన్‌కు చేరక తప్పలేదు.
ఈ లీగ్‌లో యువీ దూకుడుగా ఆడుతున్నాడు. విన్నీపెగ్ హాక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 26 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 45పరుగులు చేసిన యువీ.. ఎడ్మాంటన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 21 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 35 పరుగులు చేశాడు. బ్రాంప్టాన్ వాల్వ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 22 బంతుల్లో 5 సిక్సర్లు, 3 ఫోర్లతో 51 పరుగులతో మెరిశాడు.ఈ మ్యాచ్‌లో టోరంటో నేషనల్స్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మోంట్రియల్ టైగర్స్ నిర్దేశించిన 137 పరుగుల లక్ష్యాన్ని 17.3 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది.
Comments
Please login to add a commentAdd a comment