Shefane Rutherford Receives Half Acre Land In USA For Winning Player Of The Series Award In GT20 Canada - Sakshi
Sakshi News home page

Global T20 Canada: ఇదెక్కడి అవార్డురా బాబు?.. మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా అర ఎకరం భూమి

Published Tue, Aug 8 2023 8:27 AM | Last Updated on Tue, Aug 8 2023 10:40 AM

Shefane Rutherford Receives Half Acre Land in USA - Sakshi

కెనడా టీ20 లీగ్‌ 2023 విజేతగా మాంట్రియాల్‌ టైగర్స్‌ నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ లీగ్‌లో మ్యాన్‌ ఆఫ్‌ది సిరీస్‌గా నిలిచిన వెస్టిండీస్‌ ఆటగాడు షెర్ఫాన్‌ రూథర్‌ఫోర్డ్‌కు ఎవరూ ఊహించిన అవార్డు లభించింది. సాధరణంగా మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌, మ్యాన్‌ ఆఫ్‌ది సిరీస్‌కు ఓ ట్రోఫీతో పాటు క్యాష్ రివార్డు కూడా అందజేస్తారు. కొన్ని సార్లు మ్యాన్‌ ఆఫ్‌ది సిరీస్‌లకు ఖరీదైన బైక్స్‌, కార్లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి.

కానీ కెనడా గ్లోబల్‌ టీ20 లీగ్‌ నిర్వహకులు మాత్రం విన్నూతంగా ఆలోచించారు. మ్యాన్‌ ఆఫ్‌ది సిరీస్‌ రూథర్‌ఫోర్డ్‌కు అవార్డు రూపంలో విచిత్రంగా అర ఎకరం భూమి ఇచ్చారు. అది కూడా అగ్ర రాజ్యం అమెరికాలో కావడం గమనార్హం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై నెటిజన్లు విభిన్న రీతిలో స్పందిస్తున్నారు.  ఇదెక్కడి అవార్డురా బాబు.. ? ఇప్పటివరకు చూడలేదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మరి కొంత మంది డబ్బులు కంటే భూమి విలువైనది అంటూ వారి అభ్రిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కాగా ఫైనల్ మ్యాచ్‌లో రుథర్‌ ఫర్డ్‌ సంచలన ఇన్నింగ్స్‌ ఆడాడు. మాంట్రియాల్‌ టైగర్స్‌ చాంపియన్‌గా నిలవడంలో రూథర్‌ఫోర్డ్‌  కీలక పాత్ర పోషించాడు.  29 బంతుల్లో 38 పరుగులు చేసి తమ జట్టును విజయ తీరాలకు చేర్చాడు.


చదవండి: IND vs WI: నికోలస్‌ పూరన్‌కు బిగ్‌షాకిచ్చిన ఐసీసీ.. భారీ జరిమానా! ఎందుకంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement