
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో ఆతిథ్య పాకిస్తాన్ కథ దాదాపు ముగిసినట్లే. ఈ మెగా టోర్నీలో పాక్ వరుసగా రెండో ఓటమి చవిచూసింది. దుబాయ్ వేదికగా భారత్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో పాక్ ఓటమి పాలైంది. దీంతో తమ సెమీస్ అవకాశాలను పాక్ సంక్లిష్టం చేసుకుంది.
ఈ మ్యాచ్‌లో అన్ని విభాగాల్లోనూ పాక్ విఫలమైంది. తొలుత బ్యాటింగ్‌లో 241 పరుగులకు కుప్పకూలిన పాక్.. అనంతరం బౌలింగ్‌లోనూ తేలిపోయింది. 242 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 42.3 ఓవర్లలో ఊదిపడేసింది. భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లి అద్భుతమైన సెంచరీతో మెరిశాడు.
పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది రెండు వికెట్లు పడగొట్టగా.. అర్బర్ ఆహ్మద్, కుష్దిల్ షా తలా వికెట్ సాధించారు. మిగితా బౌలర్లంతా దారుణంగా విఫలమయ్యారు. బ్యాటింగ్‌లోనూ సౌద్ షకీల్, రిజ్వాన్, కుష్దీల్ షా మినహా మిగితా బ్యాటర్లంతా చేతులెత్తేశారు.
ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ స్పందించాడు. ఈ మ్యాచ్‌లో సెంచరీతో మెరిసిన విరాట్ కోహ్లిపై రిజ్వాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. విరాట్ కోహ్లి అద్బుత ఇన్నింగ్స్ ఇన్నింగ్స్ ఆడి తమ నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడని రిజ్వాన్ చెప్పుకొచ్చాడు.
"తొలుత విరాట్ కోహ్లి గురుంచి మాట్లాడాలి అనుకుంటున్నాను. అతడి హార్డ్ వర్క్ చూసి ఆశ్చర్యపోయాను. అతడు చాలా కష్టపడి ఈ స్దాయికి చేరుకున్నాడు. అతడు ఫామ్‌లో లేడని క్రికెట్ ప్రపంచం మొత్తం అనుకుంటుంది. కానీ ఇటువంటి పెద్ద మ్యాచ్‌లలో మాత్రం విరాట్ ఆటోమేటిక్‌గా ఫామ్‌లోకి వచ్చేస్తాడు.
అతడు ఈ మ్యాచ్‌లో ఎక్కడ కూడా ఇబ్బంది పడేట్లు కన్పించలేదు. చాలా సులువగా షాట్లు ఆడాడు. అతడు మేమి పరుగులు ఇవ్వకుండా కట్టడిచేయాలనకున్నాము. కానీ అతడు ఈజీగా పరుగులు సాధించాడు. అతడి ఫిట్‌నెస్ లెవల్స్‌తో పాటు హార్డ్ వర్క్‌ను ప్రశంసించాల్సిందే.
అతడు మా లాంటి క్రికెటరే. కానీ మా కంటే ఎంతో ఫిట్‌గా ఉన్నాడు. వికెట్ల మధ్య ఎంతో వేగంగా పరుగులు తీస్తున్నాడు. అతడిని ఔట్ చేయడానికి చాలా ప్రయత్నించాం. కానీ అతడు తన అద్బుతమైన ఆట తీరుతో మ్యాచ్‌ను మా నుంచి తీసుకుపోయాడు. ఇక మ్యాచ్‌లో మేము అన్ని విభాగాల్లో మేము నిరాశపరిచాం.
అందుకే ఓడిపోయాము. అర్బర్ ఆహ్మద్ మాత్రం అద్బుతంగా బౌలింగ్ చేశాడు. ఈ ఒక్కటి మినహా ఇంకా ఏమీ మాకు సానుకూళ అంశాలు లేవు. మా తప్పులను సరిదిద్దుకోవాల్సిన అవసరముంది" అని పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో రిజ్వాన్ పేర్కొన్నాడు.
చదవండి: ‘కావాలనే అలా చేశాడు.. లూజర్’.. ఆ కోరల నుంచి తప్పించుకుని ఇలా!
Comments
Please login to add a commentAdd a comment