ఒంటారియో: తమ దేశానికి చెందిన ఓ మాజీ క్రికెటర్ తనను ఫిక్సింగ్ చేయమన్నాడంటూ వివాదాస్పద పాకిస్తాన్ క్రికెటర్ ఉమర్ అక్మల్ మరో వివాదానికి తెరలేపాడు. గ్లోబల్ టీ20 కెనడా లీగ్‌లో భాగంగా విన్‌పిగ్ హాక్స్ తరఫున ఆడుతున్న అక్మల్‌ను ఆ జట్టు మేనేజ్‌మెంట్ కీలక పాత్ర పోషిస్తున్న మన్సూర్ అక్తర్ ఫిక్సింగ్ చేయమన్నాడట. ఈ విషయాన్ని కెనడా లీగ్ యాజమన్యంతో పాటు తమ అవినీతి నిరోధక విభాగానికి అక్మల్ తెలియజేనట్లు పీసీబీ వర్గాలు వెల్లడించాయి.
‘కొన్ని మ్యాచ్‌లు ఫిక్సింగ్ చేస్తావా’ అంటూ అక్తర్ ఆఫర్ చేసిన అక్మల్ తమ దృష్టికి తీసుకొచ్చాడని పాక్ క్రికెట్ బోర్డులోని ఒక అధికారి పేర్కొన్నారు. దీనిపై దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేయనున్నట్లు సదరు అధికారి తెలిపారు. 61 ఏళ్ల మన్సూర్ అక్తర్ 19 టెస్టులు, 41 వన్డేలు ఆడాడు. 1980 నుంచి 1990 వరకూ పాక్ తరఫున క్రికెట్ ఆడాడు. ప్రస్తుతం గ్లోబల్ ట20 కెనడా లీగ్ విన్‌పిక్ హాగ్స్ మేనేజ్‌మెంట్ విభాగంలో సేవలందిస్తున్నాడు. ఇదిలా ఉంచితే, ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో ఉమర్ అక్మల్‌కు చోటు దక్కలేదు. కోచ్ మికీ ఆర్థర్‌తో విభేదాల నేపథ్యంలో అక్మల్‌ను వరల్డ్‌కప్ జట్టులో ఎంపిక చేయలేదు. ఈ ఏడాది మార్చి-ఏప్రిల్‌లో ఆస్ట్రేలియా జరిగిన వన్డే సిరీస్‌లో అక్మల్ ఆకట్టుకున్నప్పటికీ అతనికి వరల్డ్‌కప్ జట్టులో చోటు కల్పించలేదు.
Comments
Please login to add a commentAdd a comment