
కరాచీ: అవినీతి ఆరోపణలపై ఇటీవల మూడేళ్ల పాటు నిషేధానికి గురైన పాకిస్తాన్ క్రికెటర్ ఉమర్ అక్మల్‌పై పీసీబీ మాజీ చైర్మన్ నజామ్ సేథీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమర్ ఒక మూర్చ రోగి అంటూ మరో కొత్త వివాదానికి తెరలేపారు. తాను పీసీబీ చైర్మన్‌గా,ఎగ్జిక్యూటివ్ కమిటీ హెడ్‌గా ఉన్నసమయంలో తాను ఎదుర్కొన్న తొలి సమస్య ఉమర్‌దేనని పేర్కొన్నారు. ఉమర్‌కు మూర్చ ఉన్నట్లు అప‍్పటి మెడికల్ రిపోర్ట్‌ల్లో వెల్లడైందని, కానీ దానిని సెలక్షన్ కమిటీ సీరియస్‌గా తీసుకోలేదన్నారు. అతనికి మూర్చ ఉండటం వల్లే వింత వింతగా ప్రవర్తిస్తూ ఉంటాడని సేథీ తెలిపారు. అయితే తనకు మూర్చ రోగిననే విషయాన్ని అంగీకరించడానికి ఉమర్ సిద్ధంగా లేడనే విషయాన్ని కూడా ఆయన తేల్చిచెప్పారు. గత తన పీసీబీకి చేసిన సేవల్లో ఉమర్‌తో పెద్ద సమస్యగా ఉండేదన్నారు. దాంతోనే రెండు నెలల పాటు అతన్ని క్రికెట్‌కు దూరంగా పెట్టానని, ఆ తర్వాత సెలక్షన్ కమిటీ లైట్‌గా తీసుకోవడంతో క్రికెట్‌ను తిరిగి కొనసాగించడన్నాడు. సెలక్షన్ కమిటీ విషయాల్లో తలదూర్చకూడదనే ఉద్దేశంతోనే తాను అప్పుడు మౌనంగా ఉండిపోయానన్నాడు. (తమ్ముడూ... సచిన్, ధోని, కోహ్లిలను చూసి నేర్చుకో)
ఇప్పుడు ఉమర్‌పై మూడేళ్ల నిషేధం పడటంతో అతని కెరీర్ గిసిపోయినట్లేనని సేథీ తెలిపారు. తాను ఎప్పుడూ ఉమర్ కెరీర్ గురించి ఆందోళన చెందుతూనే ఉండేవాడినని, నియమావళిని అతిక్రమించడంతో అతని కెరీర్‌ను నాశనం చేసుకున్నాడన్నాడు. ఉమర్‌పై విధించిన మూడేళ్ల నిషేధంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకునే ప్రసక్తే లేదని సేథీ అభిప్రాయపడ్డారు. కొన్ని రోజుల క్రితం ఉమర్ అక్మల్‌పై పీసీబీ మూడేళ్ల నిషేధాన్ని విధించింది. బోర్డు నియమావళిలోని ఆర్టికల్ 2.4.4ను అతిక్రమించినట్లు దర్యాప్తులో తేలడంతో అతనిపై వేటు వేశారు. రెండు నెలలపాటు విచారించిన తర్వాత ఉమర్‌పై నిషేధమే సబబుగా భావించి పీసీబీ నిర్ణయం తీసుకుంది. పీఎస్‌ఎల్‌లో ఒక బుకీ తనను సంప్రదించాడనే విషయాన్ని దాచి పెట్టడంతోనే ఉమర్‌పై వేటుకు కారణమైంది.మరొకవైపు ఫిట్‌నెస్ టెస్టుకు హాజరైన క‍్రమంలో ట్రైనర్‌తో ఉమర్ దూకుడుగా వ్యవహరించాడనే అపవాదు కూడా ఉంది. అంతుకుముందు మికీ ఆర్థర్ కోచ్‌గా ఉన్న సమయంలో కూడా ఉమర్ ప్రవర్తన విసుగు తెప్పించేంది. ఆర్థర్‌పై పలు మార్లు బహిరంగ విమర్శలు చేసి వార్తల్లోకెక్కాడు ఉమర్. తన అంతర్జాతీయ కెరీర్‌లో 16 టెస్టులు, 121 వన్డేలు, 84 టి20లను ఉమర్ ఆడాడు. (అక్తర్‌పై ‘పీసీబీ’ పరువు నష్టం కేసు)