ఒంటారియో: గ్లోబల్ టీ20 కెనడా లీగ్‌లో వెస్టిండీస్ స్టార్ ఆటగాడు క్రిస్ గేల్ తన జోరు కొనసాగిస్తున్నాడు. ఈ లీగ్‌లో వాన్‌కూవర్ తరఫున ప్రాతినిథ్య వహిస్తున్న గేల్.. ఎడ్మాంటన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. తనదైన బ్యాటింగ్ స్టైల్‌తో రెచ్చిపోయి బౌండరీల మోత మోగించాడు. 44 బంతుల్లో 9 సిక్సర్లు, 6 ఫోర్లతో 94 పరుగులు సాధించాడు. గేల్ విజృంభణతో వాన్‌కూవర్ జట్టు 16.3 ఓవర్లలో 166 పరుగుల టార్గెట్‌ను సునాయాసంగా సాధించింది.ముందుగా బ్యాటింగ్ చేసిన ఎడ్మాంటన్ రాయల్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. బెన్ కట్టంగ్(72), మహ్మద్ నవాజ్(40)లు మాత్రమే రాణించడంతో ఎడ్మాంటన్ రాయల్స్ సాధారణ స్కోరుకే పరిమితమైంది.
అయితే లక్ష్య ఛేదనలో వాన్‌కూవర్ ఆదిలోనే వికెట్‌ను కోల్పోయింది. జట్టు స్కోరు రెండు పరుగుల వద్ద విసీ(1) పెవిలియన్ చేరాడు. ఆ తరుణంలో చాద్వక్ వాల్టన్‌తో కలిసి గేల్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఒకవైపు గేల్ దూకుడుగా ఆడితే వాల్టన్ నెమ్మదిగా ఆడాడు. రెండో వికెట్‌కు 56 పరుగులు జోడించిన తర్వాత వాల్టన్(17) పెవిలియన్ చేరాడు. అయినప్పటికీ గేల్ మాత్రం ధాటిగానే బ్యాటింగ్ చేసి మెరుపులు మెరిపించాడు. షోయబ్ మాలిక్(34 నాటౌట్)తో కలిసి మూడో వికెట్‌కు 82 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత గేల్ ఔటయ్యాడు. ఆ వెంటనే రసెల్ కూడా ఔటైనా, మాలిక్ సమయోచితంగా బ్యాటింగ్ చేసి జట్టుకు ఘన విజయం అందించాడు. అంతకుముందు మోంట్రియల్ టైగర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గేల్ 54 బంతుల్లో 12 సిక్సర్లు, 7 ఫోర్లతో అజేయంగా 122 పరుగులు సాధించిన సంగతి తెలిసిందే.
ఒకే ఓవర్‌లో 32 పరుగులు..
క్రిస్ గేల్ దూకుడుకు షాదబ్ ఖాన్ బలైపోయాడు. షాదబ్ వేసిన ఒక ఓవర్‌లో గేల్ నాలుగు సిక్సర్లు, రెండు ఫోర్లు కొట్టాడు. తొలి రెండు బంతుల్ని సిక్సర్లుగా మలిచిన గేల్.. ఆపై మరో రెండు బంతుల్ని ఫోర్లు కొట్టాడు. ఒక చివరి రెండు బంతుల్ని బౌండరీలు దాటించాడు. మొత్తంగా షాదబ్ వేసిన ఆ ఓవర్‌లో గేల్ 32 పరుగుల్ని పిండుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment